ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దహనకాండ | Engine of evacuated train derails after Naxals uproot tracks in Chhattisgarh | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దహనకాండ

Published Fri, Aug 10 2018 3:16 AM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

Engine of evacuated train derails after Naxals uproot tracks in Chhattisgarh - Sakshi

పర్ణశాల: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిజాపూర్, సుక్మా జిల్లాల్లో భారీ ఎన్‌కౌంటర్లలో తమ సహచరులను కోల్పోయిన మావోయిస్టులు ప్రతీకారేచ్ఛతో విధ్వంసాలకు పాల్పడుతున్నారు. బుధవారం దంతెవాడ జిల్లా భన్సీ పోలీసుస్టేషన్‌ పరిధిలో బెచ్చిలీ నుంచి రాయ్‌పూర్‌కు వెళ్తున్న ఒక ప్రైవేట్‌ బస్సుతోపాటు రెండు లారీలపై కాల్పులు జరిపారు. తర్వాత ఆ వాహనాల నుంచి ప్రయాణికులను దింపేశారు. అయితే, బస్సులో చిక్కుకున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి సజీవ దహనమైనట్లు స్థానికులు చెప్పారు. ఘటనా స్థలంలో మావోయిస్టులు వాల్‌పోస్టర్లు, కరపత్రాలను వదిలివెళ్లారు. మరో ఘటనలో కమలూర్, దంతెవాడ మధ్యలో కిరండల్‌ ప్యాసింజర్‌ రైలును టార్గెట్‌ చేసిన మావోయిస్టులు రైల్వే ట్రాక్‌కు నష్టం కలిగించారు. ఆ సమయంలో రైలు నెమ్మదిగా వెళ్తుండడంతో ప్రమాదం తప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement