
కర్నూలు: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో భారీగా బంగారు నగలు, వజ్రాలు పట్టుబడ్డాయి. కర్నూలు మండలం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఈబీ సీఐ మంజుల, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌నాయక్ నేతృత్వంలో సిబ్బంది సోమవారం వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేయగా.. రాజస్తాన్‌లోని జున్జును పట్టణానికి చెందిన కపిల్ అనే యువకుడి బ్యాగులో 840 గ్రాముల బంగారు ఆభరణాలు, 57 వజ్రాలు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు రూ.39.28 లక్షలుంటుందని అధికారులు అంచనా వేశారు. బిల్లులు, జీఎస్టీ ట్యాగ్‌లు లేకపోవడంతో.. కపిల్‌ను విచారణ నిమిత్తం కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment