private bus
-
ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడే బాదుడు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం/నెల్లూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన తొలి సంక్రాంతికి ‘ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నాం.. ప్రైవేట్ సర్వీసులు కూడా ఆర్టీసీతో సమానంగా టికెట్ రేట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం..’ ఇది సాక్షాత్తు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పదే పదే మీడియాలో చెబుతున్న మాట.. కానీ, వాస్తవం ఏమిటంటే.. ప్రైవేట్ బస్సుల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండాపోయింది. ఆన్లైన్లో ధరలను మూడు, నాలుగింతలు పెంచేసి నిలువు దోపిడీ చేసేస్తున్నారు. పైగా.. టికెట్లను బ్లాక్‌చేసి కృత్రిమ కొరత సృష్టించి రూ.వందల కోట్ల భారీ దోపిడీకి స్కెచ్ వేశారు.ఎందుకంటే పండుగ రద్దీకి తగ్గట్లుగా ఆర్డీసీ బస్సు సర్వీసుల్లేవు. దీంతో మధ్యతరగతి, పేద వర్గాలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే దిక్కయ్యాయి. ఇదే అదనుగా రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్ ప్రజల ఉత్సాహాన్ని నీరుగార్చేస్తోంది. చార్జీలను ఏకంగా మూడు నాలుగు రెట్లు పెంచేసి ఎడాపెడా దోచేస్తోంది. అయినా ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తోంది. ఎందుకంటే రవాణా శాఖలో ఓ కీలక నేతకు ఈ సిండికేట్ ముందుగానే రూ.50 కోట్లకు పైగా ముడుపులు అందించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా.. ప్రైవేట్ ట్రావెల్స్‌లో ఆఫ్‌లైన్‌లో టికెట్ల అమ్మకం తక్కువ. ఒకవేళ ఉన్నా వారు డబ్బులు తీసుకుని టికెట్ బుక్చేసినట్లు మెసేజ్ ఇస్తున్నారు. అందులో వ్యూహాత్మకంగా టికెట్ ధర పేర్కొనడంలేదు. కానీ, ఆన్లైన్లో మాత్రం పెంచిన ధరలను ప్రదర్శిస్తున్నారు. మూడు, నాలుగురెట్లు అధికంగా చార్జీలు..ఏటా సంక్రాంతికి దాదాపు 75 లక్షల మంది సొంతూళ్లకు వెళ్తారని అంచనా. వీరిలో సొంత వాహనాలు, రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 35 లక్షల మంది ప్రయాణిస్తారు. మిగిలిన దాదాపు 40 లక్షల మందికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే దిక్కు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్ది ఆడింది ఆట.. పాడింది పాటగా సాగుతోంది. ఈ నేపథ్యంలో.. తమ సర్వీసుల్లో జనవరి 11 నుంచి 18 వరకు రానూపోనూ టికెట్లను జనవరి 1 నాటికే బ్లాక్ చేసేశాయి. ఆ తర్వాత చార్జీలను ఏకంగా మూడు నాలుగు రెట్లు పెంచేశాయి. ఉదా.. ⇒ సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి విశాఖపట్నానికి నాన్ ఏసీ బస్సు రూ.750, ఏసీ బస్సు రూ.1,200, స్లీపర్ బస్సు రూ.1,500 టికెట్ వసూలుచేసేవారు. కానీ, ఈ పండుగ సీజన్లో నాన్ ఏసీ బస్సు రూ.2 వేలు, ఏసీ బస్సు రూ.3 వేలు, ఏసీ స్లీపర్ బస్సు రూ.5 వేలు వరకు అమాంతంగా పెంచేశారు. ఇక విజయనగరం, శ్రీకాకుళం వెళ్లేందుకైతే మరో రూ.500 వరకు అదనంగా చెల్లించాలి. ⇒ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు సాధారణ రోజుల్లో ఏసీ బస్సులో రూ.వెయ్యి వసూలుచేసేవారు. ఇప్పుడు దానిని రూ.2,500కు పెంచేశారు. ⇒ విజయవాడ నుంచి రాయలసీమలోని కడప, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాలకు సాధారణ రోజుల్లో ఏసీ బస్సు రూ.1,200 చార్జీ ఉండగా, ప్రస్తుతం రూ.3,500 నుంచి రూ.4వేల వరకు పెంచేయడం గమనార్హం. ⇒ కాకినాడ, రాజమహేంద్రవరం తదితర జిల్లా కేంద్రాలకు కూడా చార్జీలను ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్ భారీగా పెంచేసింది. ⇒ ఇక సాధారణ రోజుల్లో హైదరాబాదు నుంచి నెల్లూరుకు ఏసీ స్లీపర్ 1,500 ఉంటే ఇప్పుడు రూ.3వేల వరకు ఉంది. నాన్–ఏసీ స్లీపర్ ధర రూ.1,000 నుంచి రూ.2,500కు పెరిగింది. అదే నాన్–ఏసీ బస్సు అయితే రూ.850 ఉన్న దానిని రూ.2 వేల వరకు పెంచారు. ⇒ బెంగుళూరు నుంచి నెల్లూరుకు ఏసీ స్లీపర్ సాధారణ రోజుల్లో రూ.1,000 ఉంటే ప్రస్తుతం రూ.2,500 వరకు ఉంది. అదే నాన్–ఏసీ స్లీపర్‌కు రూ.900 నుంచి రూ.2వేలు, నాన్–ఏసీకి రూ.800 నుంచి రూ.1,700 వరకు పెంచారు.⇒ గుంటూరు నుంచి హైదరాబాద్‌కు మామూలు రోజుల్లో నాన్ ఏసీ బస్సుకు రూ.450, ఏసీ బస్సుకు రూ.500, స్లీపర్ ఏసీ బస్సుకు రూ.650–750, హైదరాబాద్ నుంచి గుంటూరుకు నాన్ఏసీ రూ.500, ఏసీ రూ.550, స్లీపర్ ఏసీ రూ.600–రూ.700 రూపాయలు.. కానీ, పండుగ సీజన్‌తో ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.1,000 నుంచి రూ.2,000 వరకు రేటును పెంచేశారు. ⇒ అదే బెంగళూరుకు ఆర్టీసీలో రూ.900 నుంచి రూ.18 వందల వరకూ ధర ఉండగా, ప్రైవేట్ ట్రావెల్స్ రూ.2 వేల నుంచి రూ.2 వేల వరకూ వసూలుచేస్తున్నారు. ఈ రేట్లను అధికారికంగా వెబ్సైట్లలో పెట్టి మరీ అమ్ముతున్నారు. రూ.1,200 కోట్ల దోపిడీ..దాదాపు 40 లక్షల మంది ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారానే ప్రయాణించనుండటం సిండికేట్ దోపిడీకి మార్గం సుగమమైంది. సగటున ఒక్కో టికెట్‌పై సరాసరిన రూ.1,500 వరకు అదనపు బాదుడుకు పాల్పడుతోంది. ఇలా 40 లక్షల మంది రానూపోనూ ప్రయాణం అంటే 80 లక్షల మంది ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోనే ప్రయాణించాలి. ఆ ప్రకారం రూ.1,200 కోట్లు దోపిడీకి ప్రైవేట్ బస్సుల ముఠా పాల్పడుతోంది.⇒ ఈమె పేరు బొత్స పద్మప్రియ. శ్రీకాకుళానికి చెందిన విద్యార్థిని. హైదరాబాద్‌లో ఓ పరీక్ష రాసేందుకు వెళ్లాల్సి వచ్చింది. ఇటువైపు నుంచి రైలు టికెట్ దొరికింది. కానీ, తిరుగు ప్రయాణానికి దొరకలేదు. దీంతో.. 20 రోజుల ముందే ప్రైవేట్ ట్రావెల్స్‌లో టికెట్ బుక్ చేసుకుంది. అయినా ఆ ట్రావెల్స్ ఆపరేటర్ సంక్రాంతి సీజన్ పేరుతో రూ.4,220.95 చార్జీ అని, జీఎస్టీ పేరుతో మరో రూ.780 వసూలుచేశారు. విచిత్రమేమిటంటే టికెట్లో జీఎస్టీ కోసం మినహాయించిన మొత్తాన్ని చూపించలేదు. ముందు బుక్ చేయకపోతే నా పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేదో అని పద్మప్రియ వాపోయింది.కీలక నేతకు ముడుపుల మేత?ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్ అమాంతంగా చార్జీలు పెంచేసి దోపిడీకి పాల్పడుతున్నా రవాణా శాఖ యంత్రాంగం ఎందుకు పట్టించుకోవడంలేదన్నది అందరి అనుమానం. కానీ, అసలు విషయం ఏమిటంటే.. ప్రైవేట్ ట్రావెల్స్ దందాకు రాయలసీమకు చెందిన రవాణా శాఖ కీలక నేతే పచ్చజెండా ఊపారు. ఎందుకంటే.. ట్రావెల్స్ సిండికేట్ ముందుగానే ఆయనతో డీల్ కుదుర్చుకుంది. విజయవాడలోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఓ కీలక అధికారి, ఆ కీలక నేత పేషీలోని ఓ ముఖ్య ఉద్యోగే ఈ డీల్‌లో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. అందుకే.. వీటివైపు కన్నెత్తి చూడడంలేదు.చార్జీలను అమాంతంగా పెంచేశారు..సంక్రాంతి పేరుతో ప్రైవేట్ బస్సుల్లో చార్జీలను అమాంతంగా పెంచేశారు. కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి సొంతూరు వచ్చి వెళ్లాలంటే చార్జీలకు రూ.25 వేలు అవుతోంది. సరిపడా బస్సులను ప్రభుత్వం ఏర్పాటుచేయకపోవడం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెంచిన చార్జీలను వెబ్సైట్లో పెడుతున్నా, ప్రభుత్వం స్పందించడంలేదు. – కార్తీక్ రామిరెడ్డి, నెల్లూరువిమాన టికెట్ ధరలకూ రెక్కలు..గన్నవరం: సంక్రాంతి సందర్భంగా విమాన టికెట్ల ధరలకూ రెక్కాలొచ్చాయి. సాధారణ రోజులతో పోల్చితే ఈనెల 11, 12, 13 తేదీల్లో ఈ ధరలు మూడు నుంచి నాలుగు రెట్లు భారీగా పెరిగాయి. ప్రయాణికుల రద్దీ అత్యంత ఎక్కువగా ఉండే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చే విమానాల్లో ధరల దరువు ఎక్కువగా ఉంది. రైళ్లు, బస్సులు టికెట్లు దొరక్కపోవడంతో పండక్కి స్వగ్రామాలకు వచ్చే ప్రజలు ప్రత్యామ్నాయంగా విమాన ప్రయాణంపై మొగ్గు చూపుతున్నారు. దీంతో విమాన టికెట్ ధరలు కొండెక్కాయి.ముఖ్యంగా.. బెంగళూరు నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో రూ.3,500 నుంచి రూ.3,750 ఉండే విమాన టికెట్ ధరలు ఈ మూడు రోజులు రూ.13,350 నుంచి రూ.16,058 వరకు పలుకుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే విమానాల టికెట్ ధరలు సాధారణ రోజుల్లో రూ.3 వేల లోపు ఉండగా ప్రస్తుతం రూ.11,615 నుంచి రూ.16,716 వరకు పెరిగాయి. ఇక న్యూఢిల్లీ–విజయవాడ మధ్య టికెట్ ధర రూ.6,500 నుంచి రూ. 20,986కు చేరుకోవడం గమనర్హం. అలాగే, చెన్నై నుంచి విజయవాడకు టికెట్ ధర నాలుగు రేట్లు పెరిగి రూ. 13,407కు, ముంబై నుంచి విజయవాడకు రూ.4 వేలులోపు ఉండే టికెట్ ధర రూ. 11,975కు చేరింది. పండుగ తర్వాత కూడా ఈ ధరలు దాదాపు ఇలాగే ఉండే అవకాశముందని ఎయిర్పోర్ట్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ప్రైవేట్ బస్సులో గంజాయి చాక్లెట్ల కలకలం
-
శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ
-
ఆటోను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు: నలుగురి దుర్మరణం
సాక్షి, అన్నమయ్య జిల్లా: ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. అన్నమయ్య జిల్లా కలికిరి మండలం సొరకాయలపేటకు చెందిన హేసానుల్లా, దిల్షాద్, వల్లి, సదుం మండలం, నెల్లిమంద గ్రామానికి చెందిన బుజ్జమ్మ, పకీర్, ఖాదర్‌వల్లిలు రాయచోటిలో వారి బంధువు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.అనంతరం తిరుగు ప్రయాణంలో ఆటోలో స్వగ్రామానికి వస్తుండగా.. చిత్తూరు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో వల్లి, బుజ్జమ్మ, పకీర్, ఖాదర్‌వల్లిలు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ హేసానుల్లా, దిల్షాద్, సారాలను పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. బస్సు డ్రైవర్ పరార్ కాగా, ప్రమాదస్థలాన్ని రాయచోటి డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు పరిశీలించారు. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిదిమంది మృతి
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షికార్పూర్-బులంద్‌షహర్ రోడ్డులో పికప్ వ్యాన్, ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 21 మంది గాయపడ్డారు. మృతులంతా అలీఘర్ జిల్లాలోని అత్రౌలీ తహసీల్‌లోని రాయ్‌పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందినవారు. గాయపడినవారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్‌పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందిన 40 మంది పికప్ వ్యాన్‌లో ఘజియాబాద్ నుంచి అలీగఢ్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు బులంద్‌షహర్ రోడ్డులో ఉన్న ఒక ఫుడ్ కంపెనీలో పనిచేస్తుంటారు. ఆదివారం ఉదయం వీరంతా పికప్ వ్యాన్‌లో ఘజియాబాద్ నుంచి తమ ఇళ్లకు బయలుదేరారు. సేలంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురుగా వస్తున్న ఒక ప్రైవేట్ బస్సు వీరు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్‌ను ఢీకొంది.ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, జిల్లా ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ అంబులెన్స్ ఘటనాస్థలికి చేరుకుంది. దానిలోని సిబ్బంది క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా మెజిస్ట్రేట్ చంద్రప్రకాష్ సింగ్, ఎస్ఎస్పీ శ్లోక్‌కుమార్ జిల్లా ఆస్పత్రికి చేరుకుని, క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రైవేటు బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు
కృత్తివెన్ను (పెడన) : ప్రైవేటు బస్సు, కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న 21 మంది, కారులో ఉన్న నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండల పరిధిలోని 216 జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగింది. కృత్తివెన్ను ఎస్ఐ కె. నాగరాజు తెలిపిన వివరాల మేరకు.. పశి్చమ గోదావరి జిల్లా మొగల్తూరు నుంచి ఓ ప్రైవేటు బస్సు బుధవారం హైదరాబాద్‌కు బయల్దేరింది.రాత్రి 8.30 గంటల సమయంలో కృత్తివెన్ను మండలం యండపల్లి–మునిపెడ గ్రామాల మధ్య విజయవాడ నుంచి రావులపాలెం వెళ్తున్న కారు, ఈ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బస్సు రోడ్డు మార్జిన్లో పలీ్టకొట్టింది. కారు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద సమయంలో బస్సులో 19 మంది ప్రయాణికులు, బస్సు డ్రైవరు, క్లీనరు ఉండగా వారిలో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక కారులో ఉన్న నలుగురూ గాయపడ్డారు. వీరిని మచిలీపట్నం సర్వజనాసుపత్రికి తరలించారు. బస్సు ప్రయాణికులు స్వస్థలాలకు వెళ్లిపోయారు. -
ప్రైవేటు బస్సు బోల్తా.. ఇద్దరు మృతి
మార్కాపురం: రహదారిపై గేదెలు అడ్డురావడంతో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడి ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతగుంట్ల, తిప్పాయపాలెం గ్రామాల మధ్య అమరావతి–అనంతపురం హైవేపై శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడ నుంచి అనంతపురం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 30మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు చింతగుంట్ల–తిప్పాయపాలెం గ్రామాల మధ్యకు రాగానే ఆకస్మికంగా గేదెలు అడ్డువచ్చాయి. వాటిని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించే క్రమంలో బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన గజ్జల శివయ్య(45)కు తీవ్ర గాయాలుకావడంతో ఘటనాస్థలంలోనే మృతిచెందారు. విజయవాడ నుంచి అనంతపురం వెళుతున్న పెద్దారవీడు మండలం కలనూతల గ్రామానికి చెందిన కె.విజయలక్ష్మీబాయి(40)కి తీవ్రగాయాలయ్యాయి. ఆమెకు మార్కాపురం జీజీహెచ్‌లో ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలిస్తుండగా, మార్గమధ్యంలో నరసరావుపేట వద్ద మృతిచెందారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో హరినాథ్, రాజీబీ, నాగమయ్య నాయక్, ఢమరుకానందరెడ్డి, మునీందర్‌రెడ్డి, అప్సన్, మోహిత్, దస్తగిరి అనే ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరికి మార్కాపురం జీజీహెచ్‌లో చికిత్స అందించారు. గజ్జల శివయ్యకు భార్య సువర్ణ, ఒక కుమారుడు, కుమార్తె, విజయలక్ష్మీబాయికి భర్త కాశీనాయక్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ప్రైవేట్ బస్సు బోల్తా.. ఇద్దరు బాలికల మృతి
కోడుమూరు రూరల్: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సు బోల్తా పడింది. ఇద్దరు బాలికలు మృతిచెందారు. మరో 21మంది గాయపడ్డారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు... ఆదోనిలోని బిస్మిల్లా ట్రావెల్స్‌కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు బుధవారం రాత్రి ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి ఆదోనికి బయలుదేరింది. కోడుమూరు వద్ద లారీని ఓవర్టేక్ చేసేందుకు డ్రైవర్ అతివేగంగా వెళ్లే క్రమంలో బస్సు బోల్తా పడింది. బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులు తమను రక్షించాలని హాహాకారాలు చేశారు.కోడుమూరు సీఐ మన్సురుద్దీన్, ఎస్ఐ బాలనరసింహులు తమ సిబ్బందితో వచ్చి స్థానికుల సాయంతో బస్సు అద్దాలను పగులగొట్టి గాయపడినవారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మైదుకూరుకు చెందిన వెంకటేశ్వర్లు కుమార్తె ధనలక్ష్మి (13), సురేష్ కుమార్తె గోవర్దనీ(9) మరణించారు. వరుసకు అక్కాచెల్లెళ్లు అయిన వీరిద్దరూ తమ మేనత్త కృష్ణవేణితో కలిసి ఆదోనికి బస్సులో వెళుతూ గాఢ నిద్రలోనే కన్నుమూశారు. హైదరాబాద్, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరులకు చెందిన కృష్ణవేణి, పుష్పావతి, మౌనిక, అశోక్, భారతి, గౌస్‌మొహిద్దీన్, పినిశెట్టి లక్ష్మి, వెంకటరెడ్డితోపాటు మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.బోయ శకుంతల, శివరాముడు, లక్ష్మి, గణేష్, అశోక్‌కుమార్‌లతోపాటు మరో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని పోలీసులు 108 అంబులెన్స్‌లలో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 29మంది ప్రయాణికులు, డ్రైవర్, ఇద్దరు క్లీనర్లు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్లు పరారైనట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, కర్నూలు డీఎస్పీ విజయశేఖర్‌లు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
బస్సు వెళ్తుండగా విడిపోయిన చక్రాలు
తమిళనాడు: సేలం సమీపంలో రోడ్డుపై వెళ్తున్న బస్సు వెనుక చక్రాలు లేకుండా పరుగులు తీయడంతో కలకలం రేపింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సేలం ఎడప్పాడి సమీపంలోని వెల్లండి వలసకు చెందిన విజయన్ ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను గురువారం సాయంత్రం సేలం కొత్త బస్ స్టేషన్ నుంచి ఎడప్పాడికి ప్రయాణికులను తీసుకెళ్తుండగా బస్సులో కండక్టర్ కదిర్తో సహా చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు అరియలూర్ సమీపంలో ప్రయాణిస్తున్నప్పుడు, బస్సు ముందు భాగం ఒక్కసారిగా పేలిపోవడంతో బస్సు అదుపుతప్పి పరుగెత్తింది. ఈ పరిస్థితిలో క్షణాల్లోనే బస్సు వెనుక యాక్సిల్ విరిగిపోవడంతో వెనుక చక్రాలు బస్సు నుంచి విడిపోవడంతో వెనుక టైర్లు లేకుండానే బస్సు కొద్ది దూరం వెళ్లింది. భయంకరమైన శబ్ధం చేస్తూ బస్సు వేగంగా రోడ్డుపైకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై కేకలు పెట్టారు. వెంటనే డ్రైవర్ చాకచక్యంగా బస్సును నిలిపివేశాడు. దీంతో ప్రయాణీకులు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
గంజాయి తీసుకుంటున్న యువకులు.. పట్టుకున్న పోలీసులు..!
సూర్యాపేట క్రైం: గంజాయి తరలిస్తున్న ముగ్గురిని కోదాడ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ రాహుల్ హెగ్డే విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున పోలీసు వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో రూ.12.50లక్షల విలువైన 50 కేజీల గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. బస్సులో అనుమానాస్పదంగా కనిపించిన మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాకు చెందిన పండ్ల వ్యాపారి అవదేశ్ చంద్రశేఖర్వర్మతో పాటు అదే ప్రాంతానికి చెందిన గృహిణులు శైల ప్రదీప్ దండకర్, సారిక విలాస్ మోహితెను అరెస్టు చేసి విచారించారు. పట్టుబడిన ముగ్గురు ఈ నెల 3వ తేదీన మహారాష్ట్ర నుంచి రైలులో విశాఖపట్నం వెళ్లి శివారు ప్రాంతాల్లో 50కేజీల గంజాయిని లక్ష రూపాయలకు కొనుగోలు చేసి దానిని 12 ప్యాకెట్లుగా కట్టి నాలుగు లగేజ్ బ్యాగులలో నింపి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్‌కు తరలిస్తూ పట్టుబడినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రూ.30వేలు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన కోదాడ డీఎస్పీ బి. ప్రకాష్, సీఐ డి. రామకృష్ణారెడ్డి, రూరల్ ఎస్ఐ సాయిప్రశాంత్, హెడ్ కానిస్టేబుల్ షేక్ అబ్దుల్ సమద్‌ను ఎస్పీ అభినందించారు. గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువకులు గంజాయి విక్రయించడంతో పాటు సేవిస్తున్న యువకులను సూర్యాపేట పట్టణ పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ జి. రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం. సూర్యాపేట పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ వద్దకు సోమవారం పెట్రోలింగ్‌లో భాగంగా పోలీసులు వెళ్లగా 10 మంది యువకులు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని వెంబడించి పట్టుకొని విచారించగా.. నకిరేకల్‌కు చెందిన ఆకారపు నందు దగ్గర గంజాయి కొనుగోలు చేసి సూర్యాపేటలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో సూర్యాపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన షేక్ షరీఫ్, తిరుపతి మదన్, తాళ్లగడ్డకు చెందిన అబ్బగోని శ్రీమాన్, 60 ఫీట్ల రోడ్డుకు చెందిన దున్న విక్రమ్‌తో పాటు రత్నాల శంకర్, సూర్యాపేట మండలం కాసరబాద్ గ్రామానికి చెందిన మల్లెబోయిన సాయి, నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన పాలడుగు నరేందర్, పడిదెల మనోహర్ కుమార్, కట్టంగూర్కు చెందిన మేడి పవన్, రామన్నగూడెం గ్రామానికి చెందిన గూగులోత్ అరుణ్ ఉన్నట్లు సీఐ తెలిపారు. వీరి నుంచి ఒక కేజీ 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పది మందిపై కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు సీఐ తెలిపారు. దామరచర్లలో ఇద్దరి అరెస్ట్.. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు దామరచర్ల మండంలోని తాళ్లవీరప్పగూడెంలో పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ మహేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన మనోరంజన్ సర్కార్, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ షకీల్ బైక్‌పై దామరచర్ల మండలంలోని తాళ్లవీరప్పగూడెం గుండా వెళ్తుండగా వాహనాల తనిఖీల్లో భాగంగా ఎక్సైజ్ అధికారులు వారి వద్ద ఉన్న సంచుల్లో ఐదు కిలోల ఎండు గంజాయిని గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా నల్లగొండలో వారు అద్దెకు ఉంటున్న ఇంట్లో మరో 4.250 కిలోల ఎండు గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 9.250కిలోల గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లు, బైక్ సీజ్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్ఐలు రామకృష్ణ, పర్వీన్, లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు. చివ్వెంల మండలంలో ఇద్దరు.. గంజాయి విక్రయించేందుకు వెళ్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ వై. అశోక్ రెడ్డి, ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం కుడకుడ గ్రామానికి చెందిన కంచుగొమ్ముల శివ, గాదె టోనీ, సూర్యాపేట పట్టణం తాళ్లగడ్డకు చెందిన గట్టు తరుణ్ కలిసి గంజాయి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శివ, టోనీ మున్యానాయక్ తండాకు చెందిన మహేష్ ద్వారా పెన్‌పహాడ్ మండలానికి చెందిన దినేష్ వద్ద 400గ్రాముల గంజాయి కొనుగోలు చేశారు. ఆ గంజాయిని తీసుకొని సోమవారం తాళ్లగడ్డలో ఉంటున్న తరుణ్ వద్దకు స్కూటర్‌పై వెళ్తుండగా కుడకుడ గ్రామం వద్ద పోలీసులు వారిని పట్టుకొని తనిఖీ చేయగా 20 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. శివ, టోనీని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మిగతా ముగ్గురి కోసం వెతుకుతున్నామని పేర్కొన్నారు. -
మామూలు రోజులు, ఇప్పుడు చార్జీలు ఇలా
శివాజీనగర: గౌరీ గణేశ పండుగ, వరుసగా సెలవులు రావడంతో బెంగళూరు నుంచి ఇతర నగరాలకు, అలాగే తెలుగు రాష్ట్రాలకు వేలాది మంది తరలివెళ్తున్నారు. సొంతూరిలో బంధుమిత్రుల మధ్య సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఆశ ప్రైవేటు బస్సు యజమానులకు వరమైంది. టికెట్ల ధరలను రెండు రెట్లు పెంచి దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. టికెట్‌పై రూ.వెయ్యి వరకూ శనివారం నుంచి సోమవారం వరకూ ప్రైవేట్, ప్రభుత్వ బస్సుల సీట్లు భర్తీ అయ్యాయి. బెంగళూరు నుంచి రాష్ట్రం, ఇతర రాష్ట్రాలకు సంచరించే అనేక ప్రైవేట్ బస్సుల ప్రయాణం ధరలు రెండింతలయ్యాయి. పండుగ సమయంలో ఇది సహజం, దూరపు ప్రాంతాలకు బస్సుల టికెట్ ధరను రూ.800 నుండి రూ.1000 వరకూ పెంచినట్లు ప్రైవేటు ట్రావెల్స్ సిబ్బంది తెలిపారు. అవసరం కాబట్టి.. సొంతూళ్లకు వెళ్లేవారు అనివార్యంగా అడిగినంత సొమ్ము ఇచ్చి ప్రయాణం చేస్తారు. ఈ సమయంలో టికెట్ ఎంతపెంచినా కొంటారనేది బస్సు యజమానులకు తెలుసు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే అలాంటివారిపై బస్సు సిబ్బంది దౌర్జన్యంతో నోరు మూయిస్తారని కొందరు ప్రయాణికులు వాపోయారు. ఎక్కువ చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వ హెచ్చరికలకు సైతం విలువ లేకుండా పోయింది. టికెట్ ధరల బాదుడుపై పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలోనూ ఆవేదన వెళ్లగక్కారు. దూర ప్రాంతాలకు రెట్టింపు ధరలు పండుగ, వరుస సెలవులను సొమ్ము చేసుకుంటున్న వైనం బస్టాండ్లు కిటకిట బెంగళూరు–మంగళూరు: 700 నుండి రూ. 800; ప్రస్తుతం రూ.1300 బెంగళూరు–ఉడుపి: రూ.880–1050; ప్రస్తుతం రూ.1500 నుండి 2500 బెంగళూరు–బళ్లారి : రూ.900 –రూ.1050; ప్రస్తుతం రూ.1000 నుండి 1500 బెంగళూరు–బెళగావి: రూ.900 నుండి రూ.1050; ప్రస్తుతం రూ.1600 నుండి 3000 బెంగళూరు–రాయచూరు: రూ.850 నుండి రూ.1110; ఇప్పుడు రూ.850 నుండి 1500 బెంగళూరు నుంచి తెలుగు రాష్ట్రాలకు ధరలు ఇదేమాదిరిగా పెరిగాయి శుక్రవారం సాయంత్రం నుంచి బెంగళూరులో ఆర్టీసీ, ప్రైవేటు బస్టాండు రద్దీగా మారాయి. కుటుంబాలతో సహా ఊళ్లకు వెళ్లేవారు కార్లు, రైళ్లు దొరకనివారు బస్సుల బాట పట్టారు. అయితే లగ్జరీ బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో అప్పటికే రిజర్వేషన్లు కావడంతో సాధారణ ప్రయాణికులకు సీట్లు దొరకడం గగనమైంది. ఉచిత ప్రయాణం వల్ల మహిళల రద్దీ పెరిగింది. -
ప్రైవేటు బస్సుపై ఏనుగు దాడి
కొమరాడ(పార్వతీపురం మన్యం జిల్లా): ఇటీవల ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగు (హరి) పార్వతీపురం నుంచి రాయగడ వెళ్లే అంతర్ రాష్ట్ర రహదారిపై సోమవారం బీభత్సం సృష్టించింది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గదబవలస నుంచి ఆర్తాం గ్రామం వైపు ఒంటరి ఏనుగు వస్తుండగా జనం కేకలు వేశారు. దీంతో ఆంధ్రా–ఒడిశా అంతర్ రాష్ట్ర రహదారిలో వస్తున్న ప్రైవేటు బస్సును డ్రైవర్ నిలిపివేశారు. ఏనుగు ఒక్కసారిగా ఆ బస్సుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసింది. రోడ్డుపై కాసేపు హల్చల్ చేసి పంట పొలాల్లోకి వెళ్లిపోయింది. చదవండి: కోనసీమ: పిడుగు పాటుతో కుంగిన భూమి -
సెలవులతో చార్జీలకు రెక్కలు
సాక్షి, చైన్నె: శనివారం నుంచి వరుసగా సెలవులు రావడంతో చైన్నెలోని వివిధ పనులు, ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లు స్వస్థలాలకు బయలుదేరారు. దీంతో ఆమ్నీ ప్రైవేటు బస్సు చార్జీలు 30 శాతం పెంచేశారు. ఇక విమానచార్జీలు 40 శాతం పెరిగాయి. రాష్ట్రంలోని వివిధ నగరాలు, జిల్లాలకు చెందిన వారు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అధికంగా ఉద్యోగాలు, వివిధ పనులు చేసుకుంటున్నారు. అలాగే, విద్యాసంస్థల్లో వివిధ కోర్సులను అభ్యసిస్తున్న వాళ్లు మరీ ఎక్కువే. వీరంతా సెలవులు దొరికితే చాలు తమ స్వస్థలాలకు వెళ్లిపోవడం జరుగుతోంది. ఈ పరిస్థితులలో శని, ఆదివారం సెలవు దినాలు, సోమవారం ఒక్క రోజు సెలవు పెట్టుకుంటే చాలు మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం సెలవు కలిసి వచ్చినట్టైంది. దీంతో వరుసగా నాలుగు రోజులు సెలవు తీసుకుని తమ స్వస్థలాలకు బయలుదేరిన వాళ్లే ఎక్కువ. పెరిగిన చార్జీలు శుక్రవారం సాయంత్రం నుంచి చైన్నెలోని కోయంబేడు ప్రభుత్వ బస్టాండ్ రద్దీ మయంగా మారింది. దక్షిణ తమిళనాడు వైపు వెళ్లే రైళ్లు కిక్కిరిశాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వైపుగా వెళ్లే వారికి కోసం మెట్రో రైలు సేవలను సైతం పెంచారు. విమానాశ్రయం మార్గంలో సైతం ట్రాఫిక్ రద్దీ పెరిగింది. చైన్నె నుంచి పలు రాష్ట్రాల రాజధానులు, ప్రధాన నగరాలకు వెళ్లే స్వదేశీ విమాన చార్జీలకు రయ్యు మంటూ టేకాఫ్ తీసుకున్నాయి. చైన్నె నుంచి తమిళనాడులోని ఇతర నగరాలకు చార్జీలు, ఇతర రాష్ట్రాలకు చార్జీలు రూ. 2 వేల నుంచి 5 వేలు పెరగడం గమనార్హం. 40 శాతం మేరకు విమానచార్జీలు పెరి గాయి. ఇక, ప్రభుత్వ బస్సులు కిక్కిరిసి వెళ్లడం, రైళ్లలో రిజర్వేషన్లు దొరక్కపోవడంతో ఆమ్మీ ప్రైవేటు బస్సులను ఆశ్రయించిన వాళ్లు మరీ ఎక్కువ. దీంతో ఆమ్నీ బస్సుల చార్జీలు అమాంతంగా పెంచేశారు. 30 శాతం మేరకు చార్జీలను ఆమ్నీ యాజమాన్యం పెంచడంతో గత్యంతరం లేని పరిస్థితులలో స్వస్థలాలకు వెళ్లేందుకు జనం భారమైనా పయనం చేయక తప్పలేదు. ఈ రద్దీని పరిగణించిన ప్రభుత్వం ఆగమేఘాలపై 500 ప్రత్యేక బస్సు లను రోడ్డెక్కించింది. ఇదిలా ఉండగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్రం పిలుపునిచ్చిన నేపథ్యంలో తిరుప్పూర్‌లో జాతీయ జెండాల తయారీ వేగం పుంజుకుంది. -
డ్రైవర్ కాదు.. ఓనర్ షర్మిల
సాక్షి, చైన్నె : డ్రైవర్‌గానే కాకుండా, పదిమంది యువతులకు ఉద్యోగాలు ఇచ్చే ఓనర్ స్థాయికి షర్మిల ఎదగాలని కాంక్షిస్తూ మక్కల్ నీది మయ్యం నేత, విశ్వనటుడు కమల హాసన్ ఆమెకు ఒక కారును బహుమతిగా ఇచ్చారు. ఆయన సోమవారం షర్మిలకు డాక్యుమెంట్లు అందజేశారు. కోయంబత్తూరులో తొలి ప్రైవేటు బస్సు మహిళా డ్రైవర్‌గా షర్మిల(24) సుపరిచితురాలు. గతవారం ఆమె నడుపుతున్న బస్సులో డీఎంకే ఎంపీ కనిమొళి ఎక్కారు. ఆమెను అభినందించారు. బహుమతిగా చేతి గడియారం ఇచ్చారు. తర్వాత ఆమె డ్రైవర్ ఉద్యోగం ఊడింది. షర్మిల ఇటీవల కాలంగా సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీ కావడంతో ఆమె ప్రచారం కోసం పాకులాడుతున్నట్టుందని ఆ బస్సు యజమాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో బస్సును గాంధీపురం బస్టాప్‌లో వదలి పెట్టి ఆమె వెళ్లి పోయారు. దీనిపై ఎంపీ కనిమొళి స్పందించారు. తాను ఆటో నడుపుకుంటానని షర్మిల చెప్పడంతో నగదు సాయంతోపాటు బ్యాంకు ద్వారా రుణ సాయం చేస్తానని కనిమొళి హామీ ఇచ్చారు. తక్షణం స్పందించిన కమల్‌హాసన్ షర్మిలకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్ తక్షణం స్పందించారు. ఆమెను డ్రైవర్‌గానే పరిమితం చేయకుండా ఓనర్ స్థాయికి ఎదగాలని కాంక్షిస్తూ ఏకంగా ఒక కారును బహుమతిగా ఇస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం షర్మిలను చైన్నెకి పిలిపించి కారుకు సంబందించిన పత్రాలను కమల్ అందజేశారు. ఆమె కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ తొలి ప్రభుత్వ బస్సు డ్రైవర్ వసంత కుమారి, తొలి అంబులెన్స్ డ్రైవర్ వీరలక్ష్మీ అని గుర్తు చేశారు. తొలి ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా షర్మిల పేరుగడించారని గుర్తు చేశారు. డ్రైవర్ కావాలన్న తన కలను సాకారం చేసుకున్న షర్మిల భవిష్యత్తులో తనలాంటి యువతులకు ఆదర్శంగా ఉండటమే కాకుండా, పది మందికి ఉద్యోగాలు కల్పించే యజమాని స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. -
కనిమొళి అభినందన.. ఆమె ఉద్యోగం పోయింది?
సాక్షి, చైన్నె: కోయంబత్తూరు నగర ప్రైవేటు బస్సులో తొలి మహిళా డ్రైవర్‌గా అందరి మన్ననలు పొందుతున్న ఎం షర్మిల(24) శుక్రవారం రోడ్డున పడ్డారు. ఆమె నడిపిన బస్సులో ఎంపీ కనిమొళి ప్రయాణం చేసిన కొన్ని గంటల్లో ఆ బస్సు డ్రైవర్ ఉద్యోగాన్ని షర్మిల కోల్పోవాల్సి వచ్చింది. కోయంబత్తూరులో బస్సు డ్రైవర్ షర్మిల ఇటీవల సెలబ్రటీ అయ్యారు. ఆమె ఓ ప్రైవేటు బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఓ యువతిగా ఆమె బస్సు నడిపే విధానం సామాజిక మాధ్యమాలలో, మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో తమకు షర్మిల ఆదర్శం అంటూ అనేక మంది యువతులు అనేక మంది మీడియా ముందుకొచ్చారు. తాము సైతం డ్రైవింగ్ నేర్చుకుని బస్సులను నడిపేందుకు సిద్ధమయ్యారు. సెలబ్రటీగా మారిన షర్మిలను అభినందించేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడే వాళ్లు మరీ ఎక్కువే. డ్రైవర్‌గా ఆమె పనితీరును పరిశీలించేందుకు డీఎంకే ఎంపీ కనిమొళి శుక్రవారం కోయంత్తూరుకు వచ్చారు. కండక్టర్ తీరుతో.. షర్మిల నడిపే బస్సులో ఇదివరకు ఉన్న మగ కండక్టర్‌ను తొలగించి శుక్రవారం నుంచి కొత్తగా లేడీ కండక్టర్‌ను ఆ ట్రావెల్స్ యాజమాన్యం నిర్ణయించింది. అయితే, ఆ లేడీ కండక్టర్ రూపంలో షర్మిలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తన బస్సులోకి హఠాత్తుగా కనిమొళి ఆమెతో పాటు మరికొందరు ఎక్కడంతో షర్మిల ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆమె పనితీరున స్వయంగా కనిమొళి వీక్షించి, అభినందించారు. అయితే, ఆ లేడీ కండక్టర్ టికెట్టుకు చిల్లర ఇవ్వాల్సిందేనని కనిమొళితో పాటు ఆమెతో వచ్చిన వారిపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. జాబ్ పోలేదు? తనకోసం కనిమొళి రావడంతో ఆ కండక్టర్‌ను షర్మిల వారించారు. అయితే, ఆ కండక్టర్ మరింత దూకుడుగా వ్యవహరించడంతో తదుపరి స్టాప్‌లో కనిమొళితో పాటుగా మిగిలిన వారు బస్సు దిగి వెళ్లిపోయారు. అయితే.. ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమోగానీ గాంధీపురం స్టాప్‌లో బస్సును ఆపేసి షర్మిల దిగి వెళ్లిపోయారు. పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతున్నానని తన యజమాని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఆమె ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. ఎంపీ కనిమొళి పట్ల మహిళా కండక్టర్ ప్రవర్తన సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇక ఆ బస్సు నడపనని షర్మిల స్పష్టం చేశారు. ఏదేమైనా తన కలల కొలువుకు దూరమైనట్టు బాధపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే బస్సు యజమాని దురై కన్నా మాత్రం మరోలా స్పందించారు. వ్యక్తిగత పబ్లిసిటీ షర్మిలకు పెరిగిందని, అయినా, తాము భరిస్తున్నామని, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించలేదని బస్సు యాజమాని దురై కన్న పేర్కొన్నారు. ఈ వ్యవహారం కనిమొళి దృష్టికి చేరడంతో షర్మిలతో ఆమె వ్యక్తిగత సహాయకులు మాట్లాడినట్టు సమాచారం. -
బస్సు నుంచి రూ. 80 లక్షలు చోరీ
డిచ్పల్లి: ఓ ప్రైవేటు బస్సులో వెళ్తున్న ప్రయాణికుడు తన వద్దనున్న రూ.80 లక్షలు చోరీకి గురయ్యాయంటూ హైరానా సృష్టించారు. చివరికి చోరీకి గురైన ఆధారాలు లభ్యంకాకపోవడంతో పోలీసులు ఏమీ చేయలేక పంపించివేశారు. డిచ్పల్లి పోలీసుల కథనం ప్రకారం.. చత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయకూర్ నుంచి హైదరాబాద్ కు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (నెంబరు సీజీ 04 ఎన్‌హెచ్ 5535) లో నాందేడ్ కు చెందిన ఓ ప్రయాణికుడు గురువారం తనవద్ద ఉన్న రూ.80లక్షలు చోరీకి గురైనట్లు మేడ్చల్ వద్ద గుర్తించాడు. వెంటనే బస్సుతో సహా మేడ్చల్ పోలీస్‌స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా వారు డబ్బులు ఎక్కడ పోయా యని ప్రశ్నించారు. ఇందల్వాయి వద్ద పో యి ఉంటాయని చెప్పడంతో అక్కడికే వెళ్లి ఫిర్యాదు చేయాలని పంపించారు. ప్రయాణికులతో పాటు బస్సును ఇందల్వాయి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రయాణికులతో సహా లగేజీలను క్షుణ్ణంగా తనిఖీలు చేయగా డబ్బులు లభించలేదు. డిచ్పల్లి సర్కిల్ ఇనస్పెక్టర్ సూచన మేరకు బస్సును డిచ్పల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ విచారణ చేపట్టగా సుద్దపల్లి శివారులోని కంచెట్టి దాబా వద్ద టీ తాగామని అక్కడే డబ్బులు ఉన్న బ్యాగు చోరీ అయి ఉండవచ్చని బాధితుడు తెలిపాడు. పోలీసులు వెంటనే హోటల్‌కి చేరుకుని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. కానీ అక్కడ బస్సులోని కొందరు ప్రయాణికులు కిందకు దిగారని, బాధితుడు అసలు బస్సు నుంచి కిందకు దిగలేదని తేలింది. తెలంగాణ– మహారాష్ట్ర బోర్డర్ లోని ఓ హోటల్ వద్ద భోజనం కోసం ఆగామని ఆ సమయంలో ఒకరితో గొడవ జరిగినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. దీంతో అక్కడికే వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించిన డిచ్పల్లి పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకుండానే వెనక్కు పంపించి వేశారు. -
కేసారం బ్రిడ్జ్ కింద నీటిలో మునిగిన పెళ్లిబస్సు!
హైదరాబాద్: ఓ పెళ్లి బస్సు నీటిలో చిక్కుకుంది. కేసారం రైల్వే బ్రిడ్జి కింద నీటిలో పెళ్లిబస్సు చిక్కుకుపోయింది. సోమవారం బోరబండ నుంచి కోటపల్లి వెళ్తుండగా రైల్వే బ్రిడ్జి కింది వర్షపు నీటిలో బస్సు చిక్కుకుంది. నీటిలో బస్సు ఆగిపోవడంతో పెళ్లి బృందం దిగిపోయింది. బస్సు మునగక ముందే బస్సులో ఉన్న వారు దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. కాగా, తెల్లారేసరికి ఆ బస్సు దాదాపు మునిగిపోయింది.ఆ బస్సును నీటి నుంచి తీయడానికి చర్యలు చేపట్టారు. ఆ బ్రిడ్జి కింద ఇక నుంచి నీళ్లు ఆగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
కేసారం రైల్వే బ్రిడ్జ్ కింద నీటిలో చిక్కుకున్న పెళ్లి బస్సు
-
గుట్టుచప్పుడు కాకుండా రూ. కోట్ల నగదు, బంగారం తరలింపు
జగ్గంపేట: రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను తుంగలోకి తొక్కి, పన్నులను ఎగ్గొడుతూ రూ.కోట్ల నగదు, బంగారాన్ని ప్రైవేటు బస్సులలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న ఘటనలపై కస్టమ్స్, జీఎస్టీ, ఆదాయ పన్ను శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేట్ వద్ద శుక్రవారం పోలీసు అధికారుల తనిఖీలో ఈ దందా వెలుగు చూసిన సంగతి విదితమే. దీనిపై కస్టమ్స్, జీఎస్టీ, ఐటీ అధికారులు జగ్గంపేట సీఐ సూర్యఅప్పారావును శనివారం కలిసి వివరాలు సేకరించారు. అనంతరం 10 కేజీల బంగారాన్ని విజయవాడ నుంచి విశాఖ తరలిస్తున్న పద్మావతి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ వెంకటేశ్వరరావును, టెక్కలి నుంచి విజయవాడ వైపు రూ.5.65 కోట్ల నగదు తరలింపులో పట్టుబడిన బస్సు డ్రైవర్ సుదర్శనరావును విచారించారు. విజయవాడలో రామవరప్పాడు వద్ద బంగారం ఎవరిచ్చారు, విశాఖలో ఎవరికి అందజేయమన్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా బంగారం, నగదు అక్రమ రవాణా పద్మావతి ట్రావెల్స్‌లోనే జరుగుతోందా, ఇతర ప్రైవేటు ట్రావెల్స్‌లో కూడా జరుగుతోందా అనే అంశంపైనా దృష్టి సారించారు. కాగా, కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద పట్టుబడిన రూ.5.65 కోట్ల నగదు, సుమారు 10 కేజీల బంగారాన్ని రాజమహేంద్రవరంలోని ట్రెజరీలో జమ చేసినట్లు సీఐ చెప్పారు. (చదవండి: సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులోని నిందితుడికి హార్ట్ఎటాక్) -
బంగారం, వజ్రాలు పట్టివేత
కర్నూలు: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో భారీగా బంగారు నగలు, వజ్రాలు పట్టుబడ్డాయి. కర్నూలు మండలం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఎస్ఈబీ సీఐ మంజుల, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌నాయక్ నేతృత్వంలో సిబ్బంది సోమవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేయగా.. రాజస్తాన్‌లోని జున్జును పట్టణానికి చెందిన కపిల్ అనే యువకుడి బ్యాగులో 840 గ్రాముల బంగారు ఆభరణాలు, 57 వజ్రాలు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు రూ.39.28 లక్షలుంటుందని అధికారులు అంచనా వేశారు. బిల్లులు, జీఎస్టీ ట్యాగ్లు లేకపోవడంతో.. కపిల్‌ను విచారణ నిమిత్తం కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులకు అప్పగించారు. -
ఘోర ప్రమాదం: 12 మంది సజీవ దహనం
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయివేటు బస్సు, ఆయిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో 12 మంది సజీవ దహనమై పోయారు. బార్మర్-జోధ్‌పూర్ హైవేపై బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న జిల్లా అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలం నుంచి ఇప్పటివరకు పది మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. మిగిలిన ప్రయాణీకుల ఆచూకీపై ఆందోళనవ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
Nalgonda: ఘోర రోడ్డు ప్రమాదం
నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం తెల్లవారు జామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం గ్రామ శివారులో ఒక ప్రైవేటు బస్సును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. కాగా, బస్సు క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్‌ను స్థానికులు బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు,స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాగా, బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ట్రావెల్ బస్సుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
Hyderabad: రెండు కేజీల బంగారు నగల బ్యాగు మిస్సింగ్
హైదరాబాద్: నగరంలో భారీ ఎత్తున్న బంగారం అదృశ్యమైన కేసు నమోదు అయ్యింది. ముంబై నుంచి తీసుకొస్తున్న రెండు కేజీల బంగారు నగల బ్యాగ్ మాయమైంది. దీంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. ముంబై బోరివాలి(ముంబై) నుంచి ఆభరణాలు ఉన్న బ్యాగుతో సోమవారం ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్ బస్సులో బయలుదేరారు. అమీర్‌పేట్ వచ్చేసరికి మెలుకువ రావడంతో చూడగా.. బ్యాగ్ కనిపించలేదు. దీంతో విషయాన్ని ముంబైలోని నగలవ్యాపారికి తెలియజేశారు. అతను సైఫాబాద్ పోలీసులను ఆశ్రయించగా.. కేసును పంజగుట్ట పోలీసులకు బదలాయించారు. కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కే నాగయ్య.. బృందాలుగా విడిపోయిన పోలీసులు బోరివాలి-హైదరాబాద్ మధ్య సీసీటీవీఫుటేజీల ఆధారంగా కేసును చేధించే పనిలో నిమగ్నమయ్యారు. -
బస్సాపండంకుల్ ప్లీజ్..!
ర్యాంకులు, గ్రేడ్లు, పర్సెంటైల్స్ ఏవో ఉంటాయి.. అవన్నీ ధైర్యంగా ఇంట్లోంచి బయటికి వెళ్లి చదివొచ్చినందుకు అనిపిస్తుంది ఫలితాలు వెల్లడైన రోజు తల్లిదండ్రులకు. వాళ్లనింకా పిల్లలనే అనాలి. ఇంటర్లోకి అడ్మిషన్ తీసుకున్నారు కనుక ఫస్ట్ డే, ఫస్ట్ బెల్తోనే పెప్పర్ స్ప్రేని పట్టుకోవడం చేతనౌతుందా! ఇన్నాళ్లూ ఇంటి దగ్గరి స్కూలు. ఇప్పుడు ఊరికి దూరంగా ఉండే కాలేజి. భద్రంగా వెళ్లి రావాలన్నది ఇంట్లో ఫస్ట్ లెసన్. బయట కుదురుగా ఉండాలనేది నాన్–డీటెయిల్డ్. అమ్మ చెబుతుంది ఒంటి మీది బట్టలు సరిచేస్తూ.. డీటెయిల్స్ అవసరం లేని పాఠం. పిల్లలకూ అర్థం కానిదేం కాదు. లోకంలో జరిగేవి వింటూనే, చూస్తూనే కదా రోజూ ధైర్యంగా స్కూల్‌కి వెళ్లొస్తున్నారు, టెన్త్ పూర్తి చేస్తున్నారు, ధైర్యంగా ఇంటర్లో జాయిన్ అవుతున్నారు, ధైర్యంగా కాలేజ్‌కి వెళ్లొస్తున్నారు. ధైర్యం కావాలిప్పుడు ఆడపిల్లలకు సర్టిఫికెట్ చేతిలోకి రావడానికి. ర్యాంకులు, గ్రేడ్లు, పర్సెంటైల్స్ ఏవో ఉంటాయి.. అవన్నీ ధైర్యంగా ఇంట్లోంచి బయటికి వెళ్లి చదివొచ్చినందుకు అనిపిస్తుంది ఫలితాలు వెల్లడైన రోజు తల్లిదండ్రులకు. గ్రేటర్ నోయిడాలో ఇద్దరు పిల్లలు కాలేజ్‌కి వెళ్లేందుకు బస్సెక్కారు. ప్రైవేటు బస్సు. రోజూ వెళ్లొచ్చే రూట్లోనే చేతికి అందిన బస్సు. బస్సులో వీళ్లిద్దరు ఉన్నారు. వీళ్ల ముందు సీట్లలో నలుగురు అబ్బాయిలు ఉన్నారు. ఆ అబ్బాయిలు ఈ ఇద్దరు అమ్మాయిల కన్నా వయసులో కొంచెం పెద్దవాళ్లు. కాలేజ్‌మేట్స్ కాదు. ఎవరో. బస్సు ఎక్కినప్పట్నుంచీ ఆపకుండా వీళ్లపై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ‘చిక్కావు చేతిలో చిలకమ్మా..’ టైప్ కామెంట్స్. అమ్మాయిలకు భయం వేసింది. చూసి చూసి ఇక ధైర్యంగా ఉండలేక బస్సు ఆపమని డ్రైవర్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేశారు. ‘ఎక్కడపడితే అక్కడ ఆగదమ్మా..’ అన్నాడు డ్రైవర్. కనీసం బీరంపూర్ బస్టాప్లోౖనైనా బస్సును ఆపాలి. ఆ స్టాప్‌లో బస్ ఎక్కడం కోసం ఈ ఇద్దరమ్మాయిల క్లాస్మేట్స్ నిలబడి ఉన్నారు. ‘అంకుల్ ఆపండి ప్లీజ్..’ అన్నారు వీళ్లు. అక్కడా ఆపలేదు. ఆ స్టాప్ దాటితే బులంద్‌షహర్ స్టాప్. వీళ్లు దిగాల్సింది బులంద్ షహరే. ఇంకా కొంత దూరం ఉంది. బస్సు పోతూనే ఉంది. బస్సు ఆపమని వీళ్లు అడుగుతుండడం, డ్రైవర్ ఆపకపోవడం చూసి అబ్బాయిలకు ఉత్సాహం వచ్చేసింది. ‘ఈరోజు బస్సు ఆగదు’ (‘ఆజ్ తో నహీ రుకేగీ బస్’) అని ఒక అబ్బాయి అన్నాడు. అప్పుడు మొదలైంది ఈ పిల్లలకు వణుకు. ఆగని బస్సుల్లో ఏం జరిగే ప్రమాదం ఉంటుందో వాళ్ల ఊహకు వచ్చి ఉండాలి. ‘అంకుల్.. బస్ ఆపండి’ అని పెద్దగా అరిచారు. బస్సు ఆగలేదు. వేగం తగ్గలేదు. ఆ వేగంలోనే బస్ డోర్ నెట్టుకుని ఒకరి వెనుక ఒకరు బయటికి దూకేశారు! వాళ్లలో ఒకమ్మాయి తలకు, నడుముకు బలమైన దెబ్బలు తగిలాయి. పాదం, మణికట్టు నలిగిపోయాయి. ఇంకో అమ్మాయి కాలు, చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయి. అదృష్టం.. వీళ్లు కిందపడ్డ క్షణంలో వెనుక నుంచి వాహనాలేమీ రాలేదు. పెద్దవాళ్లొచ్చి పిల్లల్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పిల్లల్ని ఏడిపించిన అబ్బాయిలు దొరకలేదు. బస్సు ఆపని డ్రైవర్ మీద ఎఫ్.ఐ.ఆర్. రిజిస్టర్ అయింది. ఐపీసీ లోని ఓ మూడు సెక్షన్ల కింద కేసు పెట్టారు. బండిని వేగంగా నడపడం, తీవ్ర గాయాలకు కారణమవడం, వ్యక్తులకు దెబ్బలు తగిలించడం.. సెక్షన్ 279, 338, 337. కామెంట్స్ చేసిన ఆ మగపిల్లలపై కేసులు వద్దనుకున్నారు ఆడపిల్లల పేరెంట్స్. మళ్లీ ఆ దారిలోనే కదా పిల్లలు రోజూ వెళ్లిరావాలి! లోకంలోకి అప్పుడప్పుడే అడుగు పెడుతున్న ఇద్దరు ఆడపిల్లలు ఏ కారణంగానో భయపడి బస్సును ఆపమని బతిమాలినా ఆపకుండా బస్సును పోనిచ్చినందుకు అంటూ డ్రైవర్‌పై పెట్టడానికి ఐపీసీలో ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఉండదు. ఉన్న సెక్షన్లలోనే కాస్త దగ్గరగా ఉన్న వాటిని చూసి ఆ సెక్షన్ల కింద డ్రైవర్‌ను అరెస్టు చేస్తారు. నోయిడా పోలీసులూ అంతవరకే చేయగలిగారు. అసలైతే డ్రైవర్‌పై ‘నిర్భయ’ కేసు పెట్టాలి. ఎనిమిదేళ్ల క్రితం ఢిల్లీలో రాత్రి 10 గంటలకు బస్సులో జరిగిన ఆ ఘటనకు, వారం క్రితం నోయిడాలో పగలు 10 గంటలకు బస్సులో జరిగిన ఈ ఘటనకు తేడా ఏం లేదు. ‘ఈరోజు బస్సు ఆగదు’ అన్నాక, ఆ మగపిల్లల్లో ఇంకొకరు ‘మజాగా ఉంటుందిక’ (‘మజా ఆగయా’) అనడం విని డ్రైవర్‌కి కూడా మజా వచ్చి ఉంటే బస్సు ఏ ఒంటరి ప్రదేశం లోనికో మలుపు తిరిగి ఉండేది. మహిళల రక్షణకు, భద్రతకు చట్టం గట్టి కాపలాల్నే పెట్టింది. బయటే కాదు, సొంత ఇంట్లోనైనా ఆమెపై ఏదైనా జరగబోతుంటే ఒక్క కాల్‌తో పోలీసులు వచ్చేస్తారు. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇచ్చేలా అబ్బాయిల్ని పెంచే తల్లిదండ్రుల ‘న్యూ ఎరా’ ఒకటి కూడా ఆల్రెడీ గర్ల్స్‌కి బాయ్స్ చేత నమస్తే పెట్టిస్తోంది. మరింకేంటి?! గట్టి చట్టం, బుద్ధి కలిగిన బాయ్స్. హ్యాపీనే కదా. కాదు! స్టీరింగ్ గర్ల్స్ చేతుల్లో ఉండాలి. లెజిస్లేచర్, జుడీషియరీ, ఎగ్జిక్యూటివ్, ప్రెస్ అనే ఫోర్–వీలర్ స్టీరింగ్‌ని గర్ల్స్ తమ చేతుల్లోకి తీసుకోవాలి. నోయిడాలో ఆ బస్సు స్టీరింగ్ ఒక మహిళ చేతిలో ఉండి ఉంటే ఏం జరిగి ఉండేదో ఊహించండి. అమ్మాయిల్ని వేధించినందుకు.. ‘బస్ ఆపండి ఆంటీ ప్లీజ్.. దిగిపోతాం’ అని అబ్బాయిలు ప్రాధేయపడుతుండేవాళ్లు.. బస్సు పోలీస్ స్టేషన్ వైపు మలుపు తిరుగుతుంటే. – మాధవ్ శింగరాజు -
ప్రయాణికులపై 'ప్రైవేట్' బాదుడు
సాక్షి, అమరావతి: ఎప్పటిలాగే ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఈ పండుగ సీజన్లోనూ దోపిడీకి తెగబడ్డారు. సంక్రాంతికి సొంతూరుకు వెళ్దామనుకునే వారికి రెండ్రోజులుగా చార్జీలు పెంచి చుక్కలు చూపిస్తున్నారు. డిమాండ్ ఉన్న తేదీల్లో అయితే మరీ బాదేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఆర్టీసీ టికెట్ ధర రూ.900 ఉంటే, ప్రైవేటు ట్రావెల్స్‌లో మాత్రం రూ.1,500 వరకు వసూలుచేస్తున్నారు. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో హైదరాబాద్‌నుంచి గుంటూరుకు రెగ్యులర్ సర్వీసుల్లో రూ.530 వరకు ఉంది. అదే స్పెషల్ బస్సు అయితే రూ.795 వసూలుచేస్తున్నారు. కానీ, ప్రైవేటు బస్సులో ఏకంగా రూ.1,130–1,200 వరకు తీసుకుంటున్నట్లు ఆన్లైన్లో ఉంచారు. నాన్ ఏసీ ఆర్టీసీ బస్సుల్లో ఇదే మార్గంలో రెగ్యులర్ సర్వీసులకు రూ.418 అయితే, స్పెషల్ బస్సుల్లో రూ.568 వసూలుచేస్తున్నారు. ప్రైవేటు బస్సుల్లో నాన్ ఏసీ టికెట్ల ధరలు రూ.850–రూ.950 వరకు ఉన్నాయి. ప్రయాణికుల్ని ఇబ్బంది పెడితే ఊరుకోం టికెట్ రిజర్వేషన్లు చేసే రెడ్‌బస్, అభీబస్‌ల నిర్వాహకులతో ఇప్పటికే మాట్లాడాం. ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టినా.. అధిక రేట్లకు విక్రయించినా.. ట్రావెల్స్ నిర్వాహకులపైనే కాదు.. బస్ టికెట్ కంపెనీలపై కూడా కేసులు నమోదు చెయ్యొచ్చు. నేటి నుంచి తనిఖీలు ముమ్మరం చేస్తాం. ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు తమ బస్సుల్లో ‘రవాణా అధికారులు ఎక్కడైనా తనిఖీలు చేస్తారు.. వారికి సహకరించాలి’ అని బోర్డులు పెట్టుకోవాలి. – ప్రసాదరావు, రవాణా శాఖ అదనపు కమిషనర్ ప్రైవేట్ దోపిడీపై రవాణా శాఖ కన్ను ఇలా ప్రయాణికుల్ని దోచుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్, టికెట్ బుకింగ్ వెబ్సైట్లపై రవాణా అధికారులు దృష్టిసారించారు. మోటారు వెహికల్ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేయనున్నారు. అంతేకాక.. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందితే భారీ జరిమానాలు విధించనున్నారు. సంక్రాంతి పండుగ సీజన్ మొదలుకావడంతో రాష్ట్ర సరిహద్దుల్లోనే ప్రైవేటు బస్సులను తనిఖీలు చేసేందుకు జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటుచేశారు. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించినా తీరు మార్చుకోకపోతే వాటిని సీజ్ చేయనున్నారు. అలాంటి ట్రావెల్స్ నిర్వాహకులకు రూ.25 వేల వరకు జరిమానాలు విధించనున్నారు. కేసులు నమోదు చేసిన ట్రావెల్స్ వివరాలను అన్ని చెక్‌పోస్టులకు పంపించాలని కమిషనరేట్ అధికారులు సూచించారు. ఇతర రాష్ట్రాల బస్సులకు సైతం కేసుల నమోదు విషయంలో మినహాయింపులేదని రవాణా శాఖాధికారులు స్పష్టంచేశారు. మరోవైపు.. టికెట్ల ధరలు తగ్గిస్తామని రవాణా శాఖ మంత్రి పేర్ని నానికి ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు గతేడాది హామీ ఇచ్చినప్పటికీ ఈ ఏడాది కూడా అధికంగానే వసూలుచేయడం గమనార్హం. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మదనపల్లి సమీపంలోని బండకిందపల్లి వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను మదనపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన వారిని సోమశేఖర్, మల్లికార్జున, గంగుల్లప్పగా గుర్తించారు. (కర్నూలు జిల్లాలో నలుగురు ఆత్మహత్య) -
ఆ బస్సు హైజాక్ కాలేదు : పోలీసులు
ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ బస్సు హైజాక్ కథ సుఖాంతమైంది. బస్సును అపహరించలేదని, బస్సుపై రుణం తీసుకున్న యజమాని ఈఎంఐని సకాలంలో చెల్లించకోవడంతో బస్సును తీసుకెళ్లినట్లు ఓ ఫైనాన్స్ కంపెనీ వెల్లడించింది. ప్రయాణికులను సురక్షితంగా వారి ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది. దీంతో ఆగ్రా పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఏం జరిగిందంటే.. ఆగ్రాలోని న్యూ సదరన్ బైపాస్ సమీపంలో బుధవారం వేకువజామున ఓ ప్రైవేట్ బస్సును గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బైపాస్ రోడ్ వద్ద బస్సుని ఆపిన దుండగులు మొదట బస్సు డ్రైవర్, హెల్పర్‌ను కిందకు దించేసి, ఆ తర్వాత బస్సును హైజాక్ చేసినట్లు తెలిసింది. ఆ బస్సు హర్యానాలోని గురుగ్రామ్ నుంచి మధ్యప్రదేశ్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దుండగులు మొదటగా తాము ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగులమని చెప్పి బస్సు ఎక్కారని, తర్వాత డ్రైవర్, సహాయకుడిని బెదిరించి బస్సును అపహరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, అసలు విషయం బయటపడింది. బస్సుపై రుణం తీసుకున్న యజమాని ఈఎంఐలు చెల్లించకపోవడంతో బస్సును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, ఫైనాన్స్ కంపెనీపై కేసులు నమోదు చేసినట్టు చెప్పిన పోలీసులు బస్సును ఝాన్సీకి తరలించారు. -
బస్సులో మంటలు : ఐదుగురు సజీవ దహనం
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విజయపుర నుండి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకోవడంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు. చిత్రదుర్గ జిల్లాలో హిరియూర్ తాలూకాలోని కెఆర్ హళ్లి వద్ద జాతీయ రహదారిపై అకస్మాత్తుగా బస్సులో మంటలు చెలరేగడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. 32 మంది ప్రయాణికులతో వస్తున్న ఈ బస్సులో ఇంజీన్ సమస్య కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఒక మహిళ ఉన్నారు. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హిరియూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న హిరియూర్ ఎస్పీ రాధిక సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. Karnataka: Five people, including a baby, charred to death and 27 injured, last night in Hiriyur near Chitradurga district, after their bus caught fire on National Highway 4. The injured have been shifted to hospital. pic.twitter.com/Je1PxEbTv4 — ANI (@ANI) August 12, 2020 -
కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మరో నిర్భయ ఉదంతం వెలుగు చూసింది. కదులుతున్న బస్సులో మహిళ అత్యాచారానికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 25 ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లలను తీసుకుని బుధవారం ప్రతాప్‌ఘర్ నుంచి నోయిడా వెళ్లేందుకు ప్రైవేటు బస్సు ఎక్కింది. ఈ క్రమంలో ఆమెపై కన్నేసిన ఇద్దరు బస్సు డ్రైవర్లు ఆమెను వెనక సీటులో కూర్చోమన్నారు. అనంతరం మహిళను చంపుతామని బెదిరిస్తూ కదులుతున్న బస్సులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నోయిడాలో బస్సు దిగిన వెంటనే ఆమె భర్త సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. (‘నిర్భయ’దోషులకు ఉరి) ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 376, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దారుణానికి పాల్పడ్డ నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అనంతరం బస్సును స్వాధీనం చేసుకున్నారు. లక్నో- మధుర మధ్య మహిళపై లైంగిక దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. (అక్రమ దత్తత: బాలుడి దీనగాద) -
నదిలో పడ్డ బస్సు.. రాజస్తాన్‌లో 24 మంది మృతి
కోటా: రాజస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 24 మంది మృతిచెందారు. మృతుల్లో 11 మంది మహిళలు సహా ముగ్గురు చిన్నారులు ఉన్నారు. రాజస్తాన్‌లోని బుండి జిల్లా కోటా–దౌసా జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సవాయి మాధోపూర్ నగరంలో జరగనున్న వివాహ వేడుకకు హాజరయ్యేందుకు 29 మంది బుధవారం ఉదయం కోటా నుంచి బస్సులో బయల్దేరారు. పాన్డీ గ్రామం సమీపంలోని బ్రిడ్జి వద్దకు రాగానే డ్రైవర్ బస్సును నియంత్రించలేకపోయాడు. ఈ బ్రిడ్జికి గోడ కానీ రెయిలింగ్ కానీ లేకపోవడంతో దాదాపు 20–25 అడుగుల ఎత్తు నుంచి బస్సు మెజ్ నదిలో పడిపోయింది. -
భరోసా కల్పించిన దిశ యాప్..
-
6 నిమిషాల్లో..ఆకతాయి ప్రొఫెసర్ ఆటకట్టు
తెల్లవారుజాము 4.21 గంటల సమయం.. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సు..ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్‌ప్లాజా..ప్రయాణికులంతా నిద్రమత్తులో ఉన్నారు... ఓ పోకిరిలో మాత్రం కామ పిశాచి నిద్ర లేచింది..!ఉన్నతమైన అధ్యాపక వృత్తిలో ఉన్నా వివేకం నశించడంతో అసభ్య చేష్టలకు దిగాడు..ధైర్యాన్ని కూడదీసుకున్న బాధిత మహిళ ‘దిశ యాప్’ ద్వారా సమాచారం ఇచ్చారు...ఫిర్యాదు అందిన 6 నిమిషాల్లోనే అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళను క్షేమంగా గమ్య స్థానానికి పంపించారు. సాక్షి, అమరావతి, విశాఖపట్నం/ ఏలూరు టౌన్ : ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారుల రక్షణ కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన ‘దిశ’ యాప్ సత్ఫలితాన్నిచ్చింది.. వేళకాని వేళ మహిళపై వేధింపులకు దిగిన ఓ పోకిరీ భరతం పట్టింది.. తక్షణ రక్షణ తథ్యం.. అని నిరూపించింది.. కేవలం ఆరు నిమిషాల్లో పోలీసులను బాధితురాలి వద్దకు చేర్చి అభయమిచ్చింది.. తద్వారా అక్కచెల్లెమ్మల జోలికొస్తే ఖబడ్దార్.. అని హెచ్చరించింది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 8న దిశ యాప్ ప్రారంభమైన నేపథ్యంలో తొలిసారి ఓ మహిళకు అండగా నిలిచింది. భరోసా కల్పించిన దిశ యాప్.. ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఒకరు సోమవారం రాత్రి విశాఖ నుంచి విజయవాడకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. ఇదే బస్సులో ప్రయాణిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన కాలోతు బసవయ్య నాయక్ విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలో కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. బస్సులో సీట్లు ఖాళీగా ఉండడంతో తెల్లవారుజామున మహిళా అధికారి సీటు వద్దకు చేరుకుని పోకిరీ చేష్టలతో వేధింపులకు గురిచేశాడు. ముఖ్యమంత్రి జగన్ తాజాగా ప్రారంభించిన దిశ యాప్ గుర్తుకురావటంతో బాధితురాలు 4.21 గంటల సమయంలో తన మొబైల్ ఫోన్‌ను ఐదు పర్యాయాలు అటుఇటు కదిలించారు. యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్‌ను నొక్కటంతో ఆపదలో ఉన్నట్లు సమాచారం అందుకున్న దిశ కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాధిత మహిళ ఏలూరు సమీపంలో ఉన్నట్లు గుర్తించి పశ్చిమ గోదావరి ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్‌కు సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాలతో ఏలూరు త్రీ టౌన్ పోలీసులు వెంటనే బయలుదేరి తెల్లవారుజామున 4.27 గంటలకు(కాల్ వచ్చిన 6 నిమిషాల్లో) బస్సు వద్దకు చేరుకున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళకు ధైర్యం చెప్పి ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి రిమాండ్ విధించిన కోర్టు బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఏయూ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ కె.బసవయ్య నాయక్‌పై ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదైనట్లు సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ తెలిపారు. అనంతరం పెదపాడు పోలీస్ స్టేషన్‌కు రిఫర్ చేయడంతో క్రైమ్ నెంబర్ 52/2020 సెక్షన్ 354, 354(ఏ) కింద కేసు నమోదు చేశారు. బసవయ్య నాయక్‌ను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు పోలీసులు తెలిపారు. ఏలూరు రూరల్ సీఐ శ్రీనివాసరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు. వర్సిటీలో ఇనార్గానిక్, అనలిటికల్ విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్న బసవయ్యపై చర్యలు తీసుకుంటామని ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు వచ్చినప్పటి నుంచి ఆకతాయి ప్రొఫెసర్ అరెస్టు వరకు దిశ ప్రత్యేకాధికారి దీపిక పాటిల్ పర్యవేక్షించారు. పోలీసులకు సీఎం జగన్ అభినందనలు దిశ యాప్ ద్వారా అందిన తొలి ఫిర్యాదుపై పోలీసులు స్పందించిన తీరు పట్ల ముఖ్యమంత్రి జగన్ అభినందనలు తెలిపారు. పోలీసులు అతి తక్కువ సమయంలో స్పందించి ఆపదలో ఉన్న మహిళకు అండగా నిలిచారని ప్రశంసించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పోలీసులను కోరారు. ఘటన వివరాలను డీజీపీ గౌతమ్ సవాంగ్ సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఆరు నిమిషాల్లో ఆరు కి.మీ – బాధితురాలు ఆపదలో ఉన్నట్లు దిశ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందుకున్న ఏలూరు త్రీటౌన్ కానిస్టేబుల్ నాగదాసి రవి ఆరు కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఆరు నిమిషాల్లో చేరుకున్నాడు. – త్రీటౌన్ ఎస్ఐ బీఎస్‌డీఆర్ ప్రసాద్, మరో కానిస్టేబుల్ టి.సతీష్ కూడా స్వల్ప వ్యవధిలోనే అక్కడకు చేరుకుని నిందితుడిని బస్సులో నుంచి అదుపులోకి తీసుకున్నారు. – బాధిత అధికారి 4.10 గంటల సమయంలో తొలుత విశాఖ మహిళా పోలీస్‌స్టేషన్ ఏసీపీ ప్రేమ్కాజల్కి ఫోన్ చేయగా డయల్–100కి కాల్ చేయాలని సూచించారు. ఆ వెంటనే బాధితురాలు దిశ యాప్‌ను వినియోగించడంతో అతి వేగంగా సాయం అందింది. -
హైటెక్ మోసం
అమలాపురం టౌన్: అది ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని గోరక్‌పూర్ కేసీ జైన్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు హైటెక్ బస్సు.. అయితే ఇదే బస్సు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో నకిలీ నంబరుతో మన రాష్ట్రంలో పన్ను ఎగవేస్తూ అక్రమ ట్రాన్స్పోర్ట్ చేస్తోంది. ఎదుర్లంక–హైదరాబాద్ మధ్య ట్రావెల్స్ నిర్వహిస్తోంది. అమలాపురం కలశం సెంటరులో గురువారం రాత్రి 9 గంటలకు ఈ నకిలీ నంబరుతో ఉన్న హైటెక్ బస్సు రోడ్డుపై నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న సమయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కేవీ శివప్రసాద్ తన సిబ్బందితో ఆకస్మిక దాడి చేసి ఆ బస్సు రికార్డులను తనిఖీ చేశారు. బస్సు వాస్తవ రికార్డుల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రిజి్రస్టేషన్ నంబర్ యూపీ 53 ఎఫ్టీ 3509గా ఆయన గుర్తించారు. అయితే ఇదే బస్సు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబరు ఏపీ07 టీజీ 0222ను పెట్టుకుని అక్రమ సర్వీస్ చేస్తున్నట్లు గమనించారు. ఏపీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఇదే నంబరు గల హైటెక్ బస్సు కాకినాడ నుంచి రిజిస్ట్రేషన్ అయినట్లు కూడా శివప్రసాద్ గుర్తించారు. అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బస్సు మన రాష్ట్రానికి చెందిన వేరే హైటెక్ బస్సు నంబర్‌ను పెట్టుకుని కోనసీమలోని ఎదుర్లంక నుంచి హైదరాబాద్‌కు సర్వీసు నడుపుతోంది. ఎంవీఐ శివప్రసాద్ అమలాపురంలో బస్సును తనిఖీ చేసేసరికి అందులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వేరే నంబరుతో అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆధారాలతో గుర్తించిన ఆయన బస్సును తక్షణమే సీజ్ చేశారు. అంతే గాకుండా ఆ బస్సుకు చెందిన ఇద్దరు డ్రైవర్లను బైండోవర్ చేశారు. రికార్డులను స్వాదీ నం చేసుకున్నారు. అయితే ఏపీ నంబర్‌తో తిరుగుతున్నప్పటికీ ఎక్కడా టాక్స్ చెల్లించిన దాఖలాలు లేకపోవడంతో గవర్నమెంట్ టాక్స్ ఎగవేతకు ఉద్ధేశపూర్వకంగానే అనుమ తి లేకుండా సర్వీసు నడుతున్నట్లు అంచనాకు వచ్చారు. సీజ్ చేసిన హైటెట్ బస్సును స్థానిక ఆర్టీసీ డిపోకు తరలించారు. బస్సు డ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో ఆ బస్సు యాజమాని పై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆర్టీసీలో ‘ప్రైవేట్’ పరుగులు!
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాలో సింహభాగంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్లో సమూలమార్పులు చోటుచేసుకోనున్నాయా? ఆర్టీసీ ముఖచిత్రం మారనుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకవైపు కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం ప్రైవేట్ దిశగా అడుగులు వేస్తూనే ఉంది. ఇప్పటికే అద్దె బస్సులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రైవేట్ బస్సుల అనుమతులపైనా కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ ప్రతిపాదనలు ఆచరణలోకి వస్తే ఆర్టీసీలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. అద్దె బస్సులు, ప్రైవేట్ బస్సుల సంఖ్య పెరిగి ఆర్టీసీ బస్సుల సంఖ్య చాలా వరకు తగ్గిపోనుంది. ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా 50 శాతం ఆర్టీసీ బస్సులు ఉంటే మిగతా 30 శాతం అద్దె బస్సులు, మరో 20 శాతం ప్రైవేట్ బస్సులు ప్రజారవాణా రంగంలోకి ప్రవేశిస్తాయి. కానీ ఆర్టీసీలో కొత్త బస్సులు కొనలేని స్థితి. చాలా వరకు డొక్కు బస్సులే ఉన్నాయి. దశలవారీగా ఈ డొక్కు బస్సులను తొలగిస్తే ఆర్టీసీలో 1000 బస్సులు కూడా మిగలకపోవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 3,550 బస్సులతో ప్రతి రోజు 32 లక్షల మందికి రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ చాలా వరకు తగ్గనుంది. అద్దె బస్సులకు ఆహ్వానం.. నగరంలో ప్రస్తుతం 375 అద్దె బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు ఆర్టీసీలో భాగంగానే కొనసాగుతున్నాయి. కిలోమీటర్‌కు కొంత మొత్తాన్ని అద్దె రూపంలో చెల్లిస్తూ ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసేందుకు ఆర్టీసీ అద్దె బస్సులను వినియోగిస్తోంది. వీటి సంఖ్యను 375 నుంచి 1133కు పెంచేందుకు కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటి వరకు 60 బస్సులకు దరఖాస్తులు వచ్చాయి. నిర్దేశించిన 1133 అద్దె బస్సులను క్రమంగా భర్తీ చేసేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. దీంతో ప్రస్తుతం కొన్ని రూట్లకే పరిమితమైన అద్దె బస్సులు నగరంలోని మరిన్ని రూట్లకు విస్తరించనున్నాయి. ఈ బస్సుల నిర్వహణ పూర్తిగా ఆర్టీసీ పరిధిలోనే ఉంటుంది. అద్దె బస్సులకు డ్రైవర్లను వాటి యజమానులు ఏర్పాటు చేస్తే కండక్టర్లను మాత్రం ఆర్టీసీయే ఏర్పాటు చేస్తుంది. శివార్లకు ప్రైవేట్ సేవలు... నగరంలోని ప్రధాన ప్రాంతాలకు ఆర్టీసీ సొంత బస్సులతో పాటు, అద్దె బస్సులను నడుపుతూ నగర శివారుల్లోని కాలనీలు, గ్రామాలకు మాత్రం ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. 20 శాతం చొప్పున 752 ప్రైవేట్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఒకవైపు కార్మికుల సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతోంది. మరోవైపు ప్రభుత్వం ప్రైవేట్ బస్సుల ఏర్పాటు దిశగా కార్యాచరణ చేపట్టింది. ప్రైవేట్ బస్సులు తప్పనిసరైతే ప్రస్తుతం ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్న 32 లక్షల మంది ప్రయాణికుల్లో సుమారు 10 లక్షల మందికి పైగా ప్రైవేట్ బస్సులపైన ఆధారపడాల్సివస్తోంది. ఆర్టీసీలోని అన్ని రకాల బస్‌పాస్‌లన ు ప్రైవేట్ బస్సుల్లోనూ అనుమతించనున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో ఎలాంటి విధానాలు అమలవుతాయో తెలియదు. మరికొంత కాలంవేచి చూడాల్సిందే. -
ప్రయాణికుడి కాలుపైకి ఎక్కిన బస్సు..
-
కుక్కేశారు..
గచ్చిబౌలి: ఆ బస్సు కెపాసిటీ 45, అంతకు మించి మహా అయితే పదో, 15 మందిని తరలించవచ్చు. అయితే ఓ ప్రైవేట్ బస్సులో ఏకంగా 104 మంది కూలీలు వెళ్లడం ఐటీ కారిడార్‌లో సోమవారం వెలుగు చూసింది. షాపూర్జీ పల్లంజి కంపెనీలో పని చేసే కూలీలు నానక్‌రాంగూడలోని లేబర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. నానక్‌రాంగూడ నుంచి మాదాపూర్ వైపు సోమవారం ఉదయం కూలీలతో వెళుతున్న ప్రైవేట్ బస్సును గచ్చిబౌలి జంక్షన్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ ఆపారు. కూలీలను కిందికు దించి లెక్కించగా ఏకంగా 104 మంది కూలీలు ఉన్నారు. దీంతో అవాక్కైన ఎస్ఐ బస్సును సీజ్ చేసి ఆర్టీఏ అధికారులకు అప్పగించారు. -
చర్లపల్లి బైపాస్ వద్ద ప్రైవేట్ బస్సు బీభత్సం
-
వేసవి సీజన్.. భద్రత మరిచెన్!
సాక్షి, సిటీబ్యూరో: వేసవి రద్దీని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేట్ బస్సులు నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి. రహదారి భద్రతకు విరుద్ధంగా పరుగులు తీస్తున్నాయి. ప్రయాణికుల భద్రతను గాలికొదిలేస్తున్నాయి. తరచూ ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ యాజమన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కేవలం అధిక ఆదాయమే లక్ష్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌తో పాటు బెంగళూర్, మైసూర్, చెన్నై, ముంబై, షిర్డీ, నాగపూర్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న వందలాది బస్సులు రోడ్డు భద్రతా నిబంధనలను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల అక్రమ రవాణాపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. గత నెల రోజులుగా దాదాపు 300 బస్సులను తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని ప్రధాన మార్గాల్లో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు నియమించారు. ఈ తనిఖీల్లో 100 బస్సులపై కేసులు నమోదు చేసిన అధికారులు... మరో 30 బస్సులను జప్తు చేశారు. ఈ బస్సుల్లో కొన్ని పర్మిట్ ఫీజు చెల్లించకుండా తిరుగుతున్నట్లు గుర్తించారు. రెండో డ్రైవర్ ఎక్కడ? నగరంలోని బీహెచ్ఈఎల్, మియాపూర్, కూకట్పల్లి, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, లక్డీకాపూల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి విజయవాడ, విశాఖ, కాకినాడ, చిత్తూరు, తిరుపతి, అమలాపురం, రాజమండ్రి, బెంగళూర్ తదితర నగరాలకు ప్రతిరోజు సుమారు 950 బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో రెండు రాష్ట్రాల పర్మిట్లపై తిరిగేవి కొన్నయితే, జాతీయ పర్మిట్లపై తిరిగే బస్సులు మరికొన్ని ఉన్నాయి. దూరప్రాంతాలకు వెళ్లే ప్రతి బస్సులో కచ్చితంగా రెండో డ్రైవర్ ఉండాలి. ప్రతి 8గంటలకు ఒకసారి డ్రైవర్లు మారాలి. కానీ ప్రైవేట్ బస్సుల్లో ఒక్క డ్రైవరే రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తున్నాడు. దీంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు ఆర్టీఏ అధికారులు గుర్తించారు. వేసవి కావడంతో పగటి పూట త్వరగా అలసిపోవడం సాధారణమే. ఆ అలసటతోనే తిరిగి బస్సులు నడపడం వల్ల రాత్రి వేళల్లో, తెల్లవారుజామున నిద్రమత్తు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇద్దరు డ్రైవర్లు పరస్పరం విధులు మార్చుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. గతంలో జరిగిన అనేక ప్రమాదాల్లో రెండో డ్రైవర్ లేకపోవడాన్ని రవాణాశాఖ ప్రధాన తప్పిదంగా పరిగణించింది. తరచూ ప్రమాదాలు జరిగిన సమయంలో ఇద్దరు డ్రైవర్లను ఏర్పాటు చేస్తున్న ప్రైవేట్ ఆపరేటర్లు... ఆ తర్వాత ఉపసంహరించుకుంటున్నారని, ప్రయాణికుల రద్దీ కారణంగా ఎక్కువ ట్రిప్పులు నడిపేందుకు డ్రైవర్లపై ఒత్తిడి పెంచుతున్నారని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇటీవల తాము నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఎక్కు వ శాతం ఇలాంటి బస్సులే ఉన్నట్లు పేర్కొన్నారు. అదనపు సీట్లు.. సరకు రవాణా మరోవైపు అక్రమార్జన కోసం కొందరు ఆపరేటర్లు సీట్ల మధ్య అదనంగా మరిన్ని ఏర్పాటు చేసి భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. బస్సు సామర్థ్యానికి అనుగుణంగా 38–45 సీట్ల వరకు ఉంటాయి. కానీ సీట్ల మధ్యలో మరిన్ని అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు కొన్ని బస్సులు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు బట్టలు, ఐరన్ తదితర వస్తువులను రవాణా చేయడమే లక్ష్యంగా నడుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున సరకు రవాణాకు చేస్తున్నాయి. ఇలాంటి బస్సుల్లో ఓవర్‌లోడ్ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని బస్సుల్లో టన్నుల కొద్దీ సరకు రవాణా చేస్తున్న ఉదంతాలు తరచూ అధికారుల తనిఖీల్లో బయటపడడం గమనార్హం. అగ్నిమాపక యంత్రాల్లేవ్.. అనూహ్యమైన పరిస్థితుల్లో బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు నియంత్రించేందుకు అవసరమైన అగ్నిమాపక పరికరాలను కూడా అమర్చడం లేదు. ఓవైపు ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అగ్నిప్రమాదాలకు అవకాశం ఉంటుంది. మరోవైపు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో కూడా ప్రమాదాలు జరగవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ప్రాణనష్టం చోటుచేసుకోకుండా డ్రైవర్లు, బస్సు సిబ్బంది అప్పటికప్పుడు అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు ఈ యంత్రాలను వినియోగించాలి. కానీ కొన్ని బస్సులు అగ్నిమాపక యంత్రాలను వినియోగించడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు ఈ పరికరాలను ఎలా వినియోగించాలనే విషయంలోనూ డ్రైవర్లకు ఎలాంటి శిక్షణను ఇవ్వడం లేదు. మంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించి అగ్నిమాపక యంత్రాల ద్వారా వాటిని ఆర్పేందుకు చర్యలు తీసుకోవాలి. విదేశాల్లో ఇందుకోసం డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. కానీ మన దగ్గర ప్రైవేట్ బస్సులే కాకుండా ఆర్టీసీ బస్సుల్లోనూ ఇలాంటి శిక్షణను ఇవ్వడం లేదని రహదారి భద్రతా నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీశైలం సమీపంలో లోయలోకి దూసుకెళ్లిన బస్సు
సాక్షి, కర్నూలు : జిల్లాలోని శ్రీశైలం సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం దగ్గరలోని చిన్నారుట్ల వద్ద ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఘాట్ రోడ్డులో బస్సు ప్రహరీగోడను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ చాకచక్యం వల్ల ఈ ప్రమాదం నుంచి ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెప్పారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణీకులను సురక్షితంగా బస్సులోనుంచి కిందకు దించారు. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ మహారాష్ట్రకు చెందినవారని పోలీసులు వెల్లడించారు. -
ట్రెండింగ్ వీడియో.. వరదల్లో బస్సు
మనాలి: ప్రకృతి విపత్తుకు ఎంతటివారైనా తలవంచాల్సిందే. అందుకు తాజా రుజువు ఈ వీడియో. నది ఒడ్డున నిలిపివుంచిన ఓ ప్రైవేటు లగ్జరీ బస్సు వరద ప్రవాహం ఉధృతికి కాగితం పడవలా కొట్టుకుపోయింది. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో ఆదివారం చోటు చేసుకుంది. బియాస్ నది ఒడ్డున నిలిపివుంచిన బస్సు వరద ధాటికి నీటిలో కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడం ప్రాణనష్టం తప్పింది. వరద ముప్పు గురించి ముందే హెచ్చరించినా బస్సు సిబ్బంది పెడచెవిన పెట్టారని స్థానికులు వెల్లడించారు. కాగా, శనివారం నుంచి కురుస్తున్న వర్షాలతో హిమాచల్ వాసులు కష్టాలు పడుతున్నారు. బియాస్ నదికి భారీగా వరద పోటెత్తడంతో భారీ సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. వర్షాల తీవ్రత దృష్ట్యా మంగళవారం కూడా 9 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాల పాలకులు సూచించారు. -
వరదల్లో కొట్టుకుపోయిన బస్సు
-
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దహనకాండ
పర్ణశాల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్, సుక్మా జిల్లాల్లో భారీ ఎన్కౌంటర్లలో తమ సహచరులను కోల్పోయిన మావోయిస్టులు ప్రతీకారేచ్ఛతో విధ్వంసాలకు పాల్పడుతున్నారు. బుధవారం దంతెవాడ జిల్లా భన్సీ పోలీసుస్టేషన్ పరిధిలో బెచ్చిలీ నుంచి రాయ్‌పూర్‌కు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సుతోపాటు రెండు లారీలపై కాల్పులు జరిపారు. తర్వాత ఆ వాహనాల నుంచి ప్రయాణికులను దింపేశారు. అయితే, బస్సులో చిక్కుకున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి సజీవ దహనమైనట్లు స్థానికులు చెప్పారు. ఘటనా స్థలంలో మావోయిస్టులు వాల్‌పోస్టర్లు, కరపత్రాలను వదిలివెళ్లారు. మరో ఘటనలో కమలూర్, దంతెవాడ మధ్యలో కిరండల్ ప్యాసింజర్ రైలును టార్గెట్ చేసిన మావోయిస్టులు రైల్వే ట్రాక్‌కు నష్టం కలిగించారు. ఆ సమయంలో రైలు నెమ్మదిగా వెళ్తుండడంతో ప్రమాదం తప్పింది. -
బోల్తాకొట్టిన ప్రైవేటు బస్సు.. తప్పిన పెనుప్రమాదం!
సాక్షి, నకిరేకల్: వేగంగా వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. అయితే, ఈ ఘటనలో త్రుటిలో పెనుప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామశివారులో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ సాయికృష్ణ కంపెనీకి చెందిన బస్సు హైదరాబాద్ నుంచి తెనాలి వెళ్తుండగా మార్గమధ్యంలో రోడ్డుప్రక్కన ఇనుప రైలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. అయితే, బస్సు స్లీపర్ కోచ్ కావడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే బస్సును రోడ్డు ప్రక్కన ఉన్న రైలింగ్‌ను ఢీకొట్టినట్టు తెలుస్తోంది. రైలింగ్‌ను ఢీకొట్టడం వల్ల కొంతమేరకు బస్సు వేగం తగ్గి.. బస్సు రోడ్డుదిగి ఎడమవైపు ఒరిగి.. బస్సు పల్టీ కొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ పరారయ్యాడు. హైదరాబాద్ బీహెచ్ఈఎల్ నుంచి ఆదివారం అర్ధరాత్రి రాత్రి 12: 30 గంటలకు బయలుదేరిన బస్సు తెల్లవారుజామున సుమారు రెండుగంటల ప్రాతంలో ప్రమాదానికి గురైంది. బస్సులోని ప్రయాణికులు వెనుక భాగం, ముందుభాగం అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చారు. ప్రయాణికుల్లో చిన్నారులు, మహిళలు అధికంగా ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. 108 వాహనాల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సురక్షితంగా ఉన్న ప్రయాణికులను విజయవాడ బస్సుల్లో పంపారు. -
48 మందిని బలిగొన్న బస్సు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పౌడీ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు 200 మీటర్ల లోతున్న లోయలో పడి 48 మంది ప్రయాణికులు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. పౌడీ జిల్లాలోని ధూమకోట్ ప్రాంతం సమీపంలో ఉన్న గ్వీన్ అనే గ్రామం దగ్గర్లో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పౌడీ ఎస్పీ జగత్ రామ్ చెప్పారు. ప్రమాదానికి కచ్చితమైన కారణం ఏంటో ఇంకా నిర్ధారించలేదనీ, రాం నగర్ వెళ్తున్న ఈ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారనేది మాత్రం స్పష్టమవుతోందని ఆయన తెలిపారు. 28 సీట్లున్న ఈ బస్సులో ప్రమాదం జరిగినప్పుడు 58 మంది ప్రయాణిస్తున్నారనీ, ఘటనా స్థలంలోనే 45 మంది మరణించగా, ధూమకోట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తుండగా మరో ముగ్గురు చనిపోయారని ఎస్పీ వెల్లడించారు. గాయపడ్డ పది మందిలోనూ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని రాం నగర్‌లోని వైద్యశాలకు తరలించారు. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ప్రమాద స్థలిని పరిశీలించారు. దుర్ఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరపాల్సిందిగా ఆయన ఆదేశించారు. మృతుల బంధువులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించారు. రావత్‌తో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ ఫోన్లో మాట్లాడి, కేంద్రం నుంచి అన్ని రకాల సాయం అందిస్తామని చెప్పారు. నీటిగుంటే ప్రమాదానికి కారణమా? ప్రాథమిక సమాచారం ప్రకారం రోడ్డు మధ్యలో ఉన్న పెద్ద నీటి గుంటను డ్రైవర్ తప్పించే క్రమంలో ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. బస్సు 200 మీటర్ల లోతుకి దొర్లుకుంటూ వెళ్లిన అనంతరం వాగులోకి పడిందని పోలీసులు పేర్కొన్నారు. రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారనీ, మృత దేహాలనన్నింటినీ బస్సులో నుంచి బయటకు తీశామని ఎస్పీ చెప్పారు. ప్రముఖుల సంతాపం ప్రమాదంలో మృతి చెందిన వారికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీలు సంతాపం తెలిపారు. ‘ప్రమాదం విచారకరం. మృతుల కటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ కోవింద్ ట్వీట్ చేశారు. మోదీ ట్వీట్ చేస్తూ ‘తీవ్రంగా కలత చెందాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’ అని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ గవర్నర్ క్రిష్ణకాంత్ పాల్ కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ సానుభూతి తెలిపారు. -
కారును ఢీకొట్టిన బస్సు,ముగ్గురు మృతి
-
వైఎస్సార్ జిల్లాలో ఘోర ప్రమాదం
సాక్షి, వైఎస్సార్: జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బ్రహ్మంగారిమఠం మండటం నందిపల్లి వద్ద చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతులను తెనాలి వాసులుగా గుర్తించారు. -
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, నెల్లూరు : జిల్లాలోని ముసునూరు జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరు నుంచి విజయవాడకి వెళ్తున్నన్న సమయంలో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ మృతిచెందగా, పది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానకి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. -
మృత్యు చక్రం
అనంతపురం – బళ్లారి రహదారిపై వేగంగా వెళుతున్న ప్రైవేట్ బస్సు ముందుచక్రం ఉన్నట్టుండి ఊడి ద్విచక్రవాహనం మీదుగా దూసుకెళ్లింది. బైక్‌పై నుంచి కిందపడ్డ ఉపాధి హామీ ఏపీఓ నాగమణిపై టైరు భారీ కుదుపుతో వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందింది. గాయపడ్డ ఫీల్డ్ అసిస్టెంట్ ఎర్రిస్వామి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అనంతపురం, కూడేరు: అనంతపురంలో నివాసం ఉంటున్న నాగమణి (40) కూడేరు మండల ఉపాధి హామీ పథకం ఏపీఓగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం యథావిధిగా విధులకు హాజరయ్యారు. సాయంత్రం మూడున్నర తర్వాత అరవకూరులో ఫీల్డ్ వెరిఫికేషన్ ఉండటంతో కూడేరు ఫీల్డ్ అసిస్టెంట్ ఎర్రిస్వామి(28)ని వెంటబెట్టుకుని అతని ద్విచక్రవాహనంలో బయల్దేరారు. ఇదే సమయంలో అనంతపురం నుంచి టీబీ డ్యాంకు ఎస్ఎన్ఎస్ఎంఎస్ ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో వెళుతోంది. సరిగ్గా అరవకూరు వద్దకు రాగానే బస్సు కుడివైపున గల ముందు చక్రం ఊడి వేగంగా ద్విచక్రవాహనానికి తగిలింది. కిందపడ్డ ఏపీఓ నాగమణిపై బలంగా టైరు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ నడుపుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ ఎర్రిస్వామి ఎగిరి అల్లంత దూరానపడటంతో తల, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. చక్రం ఊడిన బస్సు దాదాపు 200 అడుగుల దూరం అదే వేగంతో వెళ్లి ఆగిపోయింది. రోడ్డు పక్కనున్న చెట్లను గానీ, ఎదురుగా వస్తున్న వాహనాలను కానీ ఢీకొట్టి ఉంటే ప్రయాణికులతోపాటు ఎదుటి వ్యక్తులకు కూడా ప్రాణాపాయం జరిగేది. అనంతరం ఫీల్డ్ అసిస్టెంట్‌ను అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే ఏపీఓ భర్త, కుమారుడు సంఘటన స్థలానికి చేరుకుని దేవుడా ఎంత పనిచేశావయ్యా అంటూ భోరున విలపించారు. ఫీల్డ్ అసిస్టెంట్‌కు భార్య (గర్భిణి), కూతురు ఉన్నారు. మండల అధికారులు, ఉపాధి సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కంటతడి పెట్టారు. ఎస్ఐ రాజు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజనాస్పత్రికి తరలించారు. ఏపీఓ మృతి బాధాకరం కూడేరు ఏపీఓ నాగమణి, ఫీల్డ్ అసిస్టెంట్ ఎర్రిస్వామిలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని డ్వామా పీడీ జ్యోతిబసు పేర్కొన్నారు. సర్వజనాస్పత్రిలో ఏపీఓ మృతదేహాన్ని ఆయన సందర్శించి నివాళులర్పించారు. నాగమణి విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసేవారని గుర్తు చేసుకున్నారు. నేత్ర దానం చేసిన ఏపీఓ అనంతపురం టౌన్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏపీఓ నాగమణి కళ్లను కుటుంబ సభ్యులు దానం చేశారు. సాయి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వాస్పత్రిలో నాగమణి నేత్రాలను సేకరించారు. అనంతరం ప్రశంసాపత్రాన్ని డ్వామా పీడీ జ్యోతిబసు చేతుల మీదుగా మృతురాలి భర్తకు అందజేశారు. కార్యక్రమంలో సాయి సంస్థ నిర్వహకులు విజయ్‌సాయి, కిరణ్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
రూ.2.98 కోట్ల నగదు పట్టివేత
తుమకూరు : నగరంలోని క్యాత్సంద్ర జాస్ టోల్గేట్ వద్ద ఆదివారం రాత్రి పోలీసులు ఓ ప్రైవేట్ బస్సు నుంచి రూ. 2 కోట్ల 98 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు తేదీ సమీపిస్తుండటంతో అధికారులు టోల్‌గేట్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. బెంగళూరు నుంచి శివమొగ్గ–సొరబ మార్గంలో శిరసికి వెళ్తున్న గజానన అనే స్లీపర్ కోచ్ బస్సు రాత్రి 10 గంటల సమయంలో బెంగళూరు బయలుదేరింది. తుమకూరు సమీపంలోకి రాగానే టోల్‌ప్లాజా వద్ద సెక్టర్ సర్వేలెన్స్ అధికారి గంగాధర్, ఫ్లైయింగ్ టీం అధికారి ప్రశాంత్, ఇతర అధికారుల బృందం అర్ధరాత్రి బస్సును నిలిపి తనిఖీ చేశారు. రెండు బ్యాగుల్లో సోదాలు చేయగా ఒక బ్యాగ్‌లో రూ. 2000 నోట్లు 97 బండిల్స్, రూ. 500 నోట్లు 209 బండిల్స్ బయటపడ్డాయి. మొత్తం రూ. 2.98 కోట్లు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్పీ దివ్యా గోపీనాథ్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేశారు. అయితే నగదుకు సంబంధించిన వారు ఎవరూ బస్సులో లేరు. దీంతో ఎస్పీ దివ్యా, డీఎస్పీ నాగరాజు, ఐటీ అధికారి భువనేశ్వరి నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులను సిద్దగంగ మఠానికి తరలించారు. సోమవారం మధ్యాహ్నం ప్రయాణికులకు మరోబస్సు ఏర్పాటు చేసి వారి ప్రాంతాలకు పంపించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఏసీ..దోచేసి!
నగరంలోని బోరబండకు చెందిన చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అన్నవరంలోని బంధువుల పెళ్లికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఏసీ బస్సులో వెళ్లాలని భావించి టికెట్లు ఆన్లైన్లో బుక్ చేయాలనుకున్నాడు. గతంలో సిటీ నుంచి అన్నవరం వరకు ఏసీ టికెట్ ధర రూ.975 ఉంటే ఇప్పుడు రూ.2000కు చేరింది. అంటే నలుగురు సభ్యులు కలిసి అన్నవరం వెళ్లి రావాలంటే బస్సు చార్జీలకు ఏకంగా రూ.16,000 చెల్లించాలి. ఇది చంద్రశేఖర్ సమస్య మాత్రమే కాదు.. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు సీట్లు లభించక, రైళ్లలో బెర్తులు దొరక్క ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్న ప్రతిప్రయాణికుడి వ్యధ. ఇలాంటి వారంతా ట్రావెల్స్ ఆపరేటర్ల దోపిడీకి గురవుతున్నారు. పైగా ఒక్కో ఏజెన్సీ ఒక్కోలా చార్జీ వసూలు చేస్తూ దోచుకుంటున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: సగటు ప్రయాణికుడిని ప్రైవేట్ బస్సులు కూల్‌గా దోచేస్తున్నాయి. వేసవి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ధరలను అమాంతం పెంచేసి జేబులు లూఠీ చేస్తున్నాయి. సాధారణ చార్జీలను రెట్టింపు చేసి మరీ దోపిడీకి పాల్పడుతున్నాయి. ఒకవైపు వేసవి సెలవులు, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో నగరం నుంచి ఇతర రాష్ట్రాలు, నగరాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎలాంటి అదనపు బస్సులను ఏర్పాట్లు చేయలేదు. దక్షిణమధ్య రైల్వే 150కి పైగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి ప్రయాణికుల డిమాండ్‌ను భర్తీ చేయలేకపోతున్నాయి. దీంతో గత్యంతరం లేక ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్న నగర ప్రయాణికులను ట్రావెల్స్ సంస్థలు దోచుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు ఏసీ స్లీపర్ క్లాస్ బస్సు చార్జీ గతంలో రూ.650 ఉంటే ప్రస్తుతం రూ.1574కు పెరిగింది. వైజాగ్‌కు ఏసీ బస్సు చార్జీ గతంలో రూ.950 ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.1984కి పెంచారు. ప్రత్యామ్నాయ రవాణా సదుపాయం లేక, గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో చార్జీల రూపేణా రూ.వేలల్లో సమర్పించుకోవలసి వస్తోందంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సగటు ప్రయాణికుడే బాధితుడు.. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, చిత్తూరు, కర్నూలు, కడప, తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాలకు ప్రతిరోజు 650 నుంచి 700 ప్రైవేట్ బస్సులు నడుస్తుంటాయి. నగరంలోని బీహెచ్ఈఎల్, మియాపూర్, కూకట్పల్లి, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట్, లకిడీకాపూల్, కాచిగూడ తదితర సెంటర్ల నుంచి ప్రయాణికుల పాయిట్లు ఉన్నాయి. రాష్ట్రస్థాయి కాంట్రాక్ట్ క్యారేజీలుగా గుర్తింపు పొందిన ట్రావెల్స్ బస్సులన్నీ స్టేజీ క్యారేజీలుగా తిరుగుతూ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నాయి. దోపిడీని నియంత్రించేదెవరు..? ప్రైవేట్ బస్సు చార్జీలపైన ఎలాంటి అధికారిక నియంత్రణ లేదు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మోటారు వాహన నిబంధనల ఉల్లంఘన నెపంతో అప్పుడప్పుడూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేసే రవాణాశాఖ.. చార్జీల నియంత్రణ తమ పరిధి కాదని చేతులెత్తేస్తుంది. పర్మిట్లు లేకుండా తిరిగే బస్సులపైన, అదనపు సీట్లు ఏర్పాటు చేసే బస్సులపైనా కేసులు నమోదు చేస్తారు. సరుకు రవాణాకు పాల్పడినా తరచుగా కేసులు పెట్టి జరిమానాలు విధిస్తుంటారు. కానీ ఇలా వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ వంటి ప్రత్యేక సందర్భాల్లో సాధారణ చార్జీలను రెండు రెట్లు పెంచినా రవాణా అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్రైవేట్ బస్సుల చార్జీలను నియంత్రించే ఏ వ్యవస్థా ప్రభుత్వంలో లేకపోవడం గమనార్హం. ప్రైవేట్ బస్సుల చార్జీలతో పోలిస్తే కొన్ని సందర్భాల్లో విమాన చార్జీలే నయమనుకొనే పరిస్థితి నెలకొంది. వేసవి సెలవుల్లో టూర్లకు వెళ్లేవారు, తిరుపతి, షిరిడీ, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు కనీసం నెల రోజులు ముందుగా ఫ్లైట్ బుక్ చేసుకుంటే ప్రైవేట్ బస్సులకు వెచ్చించే రెట్టింపు చార్జీల ధరల్లోనే హాయిగా విమానయానం చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. -
ఛీ.. బస్సులో పాడుపని
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థినితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని(20) నగరంలోని శంకర్‌పల్లిలో ఎంబీఏ చదువుతోంది. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన మన్నె రవిచంద్ర గచ్చిబౌలిలో ఉంటూ ప్రైవేటు హాస్టల్ నిర్వహిస్తున్నాడు. 23వ తేదీన 11 గంటల సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు మార్నింగ్‌స్టార్ ట్రావెల్స్ బస్సులో రవిచంద్ర, అతని భార్య సీటు బుక్ చేసుకున్నారు. అదే బస్సులో ఎంబీఏ విద్యార్థిని తనకు కాబోయే భర్తతో అదే బస్సులో ప్రయాణిస్తున్నారు. రవిచంద్ర భార్యకు సీటు దొరకగా అతనికి సీటు దొరకకపోవడంతో బస్సు డ్రైవర్ వెనుకాల కూర్చున్నాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో వెనకకు వెళ్లిన రవిచంద్ర ఎంబీఏ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అప్రమత్తమైన విద్యార్థిని పక్కనే ఉన్న కాబోయే భర్తకు విషయం చెప్పింది. అప్పటికే బస్సు హయత్‌నగర్ చేరుకోవడంతో బాధిత విద్యార్థిని హయత్‌నగర్, షీటీమ్ పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవిచంద్రను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో షీటీమ్ రాచకొండ అడిషనల్ డీసీపీ సలీమా, ఎస్ఐ రమన్‌గౌడ్ పాల్గొన్నారు. -
ఘోర ప్రమాదం : బస్సు - టిప్పర్ ఢీ
సాక్షి, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలోని ఆల్గోల్ బైపాస్ క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముంబయి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఆల్గోల్ బైపాస్ క్రాస్ రోడ్డు టిప్పర్ లారీని ఢీకొట్టింది. బైపాస్‌రోడ్డులోని అల్గోల్ కూడలిలో ముంబయి నుంచి హైదరాబాద్ వెళుతున్న ట్రావెల్స్ బస్సు రోడ్డు దాటుతున్న టిప్పర్‌ను అదుపుతప్పి ఢీకొట్టింది. అనంతరం బస్సు విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా బస్సులోని ఇద్దరు డ్రైవర్లతో సహా మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని జహీరాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ, ప్రైవేట్ బస్సు ఢీ: ఒకరు మృతి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగరంలో రెండు బస్సులు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతిచెందాడు. స్థానిక అయ్యప్ప గుడి వద్ద ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా అతడిని నాయుడుపేటకు చెందిన కాశి గురుప్రసాద్‌గా గుర్తించారు. పదిమందికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి తిరుపతి వెళ్తోంది. -
'ఢీ'వాకర్!
నాలుగేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జబ్బార్ ట్రావెల్స్, కృష్ణా జిల్లా ముండ్లపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ నిర్లక్ష్యం ఎంతమంది ప్రాణాలను పొట్టనపెట్టుకుందో తెలిసిందే. అనుభవం లేని డ్రైవర్లు.. విశ్రాంతి లేని డ్యూటీలు.. కండీషన్ లేని బస్సులు.. వీటన్నింటికీ మించి అధికారుల బాధ్యతారాహిత్యం.. వెరసి ప్రైవేటు జర్నీ ‘డేంజర్ హారన్’ మోగిస్తోంది. గతంలో పాలెం, ముండ్లపాడు వద్ద జరిగిన రెండు బస్సులతో పాటు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలకు సంబంధించిన ట్రావెల్స్ బస్సులు ‘అనంతపురం’ జిల్లాకు చెందినవి కావడం.. అందునా ఒకే ప్రైవేటు ట్రావెల్స్‌వి కావడం కలకలం రేపుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో 28 మంది ఆపరేటర్లు ప్రైవేటు బస్సులు నడుపుతున్నారు. వీరంతా అనంతపురంతో పాటు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, చెన్నై తదితర కేంద్రాల్లో బస్సులను రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. అనంతపురంలో 28 బస్సులకు స్టేట్, 8 బస్సులకు ఆల్ ఇండియా పర్మిట్ ఉంది. ఇవి కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన బస్సులతో కలిపి 230 వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు రూట్లలో ప్రధానంగా ఈ బస్సులు వెళ్తున్నాయి. నిత్యం వందలాది మంది ప్రయాణిస్తున్నారు. బస్సుల్లో చాలా వరకు అనుభవం కలిగిన డ్రైవర్లు లేరు. చాలా ట్రావెల్స్ ఒకే డ్రైవరుతో సర్వీసులను తిప్పుతున్నారు. రవాణాశాఖ నిబంధనలు పాటించకుండా తిప్పే సర్వీసులు చాలా ఉన్నాయి. అక్కడక్కడా ప్రమాదాలు జరిగినా, కొన్ని సందర్భాల్లో గమ్యం చేరకుండా మధ్యలోనే బస్సులు మెరాయించినా, అధిక ధరలకు టిక్కెట్లు విక్రయిస్తున్నా ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్న దాఖలాల్లేవు. దీనికి కారణం ట్రావెల్స్ యజమానులకు, ఆర్టీఏ అధికారులకు ఉన్న సత్ససంబంధాలే. తనిఖీలు లేకపోవడంతో ఇష్టారాజ్యం జిల్లాలోని చాలా ట్రావెల్స్‌లో బస్సులకు కిటికీలు లేవు. పూర్తిగా అద్దంతో క్లోజ్ చేశారు. ప్రస్తుతం ఉన్న హైటెక్ బస్సులలో ఏదైనా ప్రమాదం జరిగితే డోర్‌లాక్ అయిపోతుంది. ప్రయాణికులు బస్సులో నుంచి బయట పడే మార్గమే ఉండట్లేదు. కనీసం అత్యవసర పరిస్థితుల్లో ఏ అద్దాన్నైనా పగులగొట్టవచ్చనే సూచీలు ఎక్కడా లేవు. అద్దాలు పగులకొట్టినా పగిలే పరిస్థితి లేదు. కనీసం ఎమర్జెన్సీ విండోస్ కూడా అమర్చలేదు. స్లీపర్ కోచ్‌లలో అయితే పరిస్థితి మరీ దారుణం. చాలా ట్రావెల్స్‌లో స్మోక్ అలారమ్‌లు లేవు. బస్సులో ఏదైనా రిపేరు వచ్చినా, ప్రమాదవశాత్తు పొగవస్తే వెంటనే అలారమ్ మోగుతుంది. దీంతో ప్రమాద తీవ్రత పెరిగే లోపు ప్రయాణికులు బస్సు దిగే అవకాశం ఉంది. ఈ అలారమ్‌లు ఎక్కడా కనిపించవు. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు సర్వీసులు ఒకే డ్రైవర్ నడిపే పరిస్థితి. ఆర్టీసీ బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. ఈ నిబంధనను ట్రావెల్స్ పట్టించుకోవడం లేదు. దీనిపై ఆర్టీఏ తనిఖీలు లేవు. చర్యలు అసలే ఉండవు. బస్సు టాప్‌పై స్థాయికి మించి లగేజీని తీసుకెళ్తున్నా ఎవరూ ప్రశ్నించారు. చాలా ప్రైవేటు ట్రావెల్స్‌లలో బస్సులు నడిపే వారు లారీ డ్రైవర్లు అని తెలుస్తోంది. వీరు ఒకసారి డ్యూటీకి వెళితే 10–15రోజుల వరకూ ఇళ్లకు రారని సమాచారం. విశ్రాంతి లేకుండా డ్యూటీలు చేయడం కూడా ప్రమాదానికి కారణమే. ప్రమాదాలు అత్యధికంగా చోటు చేసుకుంటున్న ట్రావెల్స్‌లో ఒకటి టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే జేసీ బ్రదర్స్‌ది కావడంతో ఏ ప్రమాదం జరిగినా.. ఎలా నడిచినా అడిగే నాథుడే కరువయ్యాడు. ఆర్టీసీ బస్‌స్టాప్‌ల వద్దే స్టాపింగ్‌లు ప్రైవేటు ట్రావెల్స్ ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ఆపి ప్రయాణికులను ఎక్కించడం, దింపడం చేయకూడదు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం బస్టాప్‌లకు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఆపాలి. కానీ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని బస్టాప్‌ల వద్దే ప్రైవేటు బస్సులు ఆపుతున్నారు. ఆర్టీసీ అధికారులు కూడా దీన్ని అరికట్టలేకపోవడం గమనార్హం. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి గతంలో జబ్బార్ ట్రావెల్స్ బస్సు ఆగ్నికి ఆహుతై 45మంది దుర్మరణం చెందారు. అప్పట్లో కలెక్టర్ ఆదేశాలతో తనిఖీలు చేసి భారీగా బస్సులను నిలిపేశారు. బస్సులు ప్రమాదానికి గురికాకుండా సురక్షితంగా గమ్యం చేరుస్తామని అప్పట్లో లెటర్లు తీసుకుని బస్సులను అనుమతించారు. నిజానికి లెటర్లో చూపినట్లు ట్రావెల్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ తర్వాత అధికారులు కూడా ట్రావెల్స్‌ను తనిఖీ చేద్దాం? నిబంధనల మేరకు నడుస్తున్నాయా? లేదా? అనే దిశగా ఆలోచించని పరిస్థితి. ఈ కారణంగా ‘డేంజర్ జర్నీ’ తరచూ ప్రాణాలను బలితీసుకుంటోంది. తనిఖీలు చేస్తున్నాం ప్రయాణం 8 గంటలు దాటితే కచ్చితంగా రెండో డ్రైవర్ ఉండాల్సిందే. డ్రైవర్లకు హెవీలైసెన్స్ తప్పనిసరి. బస్సు 80–100 కిలోమీటర్ల వేగంతోనే నడపాలి. ఇప్పుడు చాలా బస్సులకు జీపీఎస్‌లు కూడా ఏర్పాటు చేశారు. బస్సు ఎంత స్పీడ్‌తో వెళ్తుందో వివరాలు ఎప్పటికప్పుడు ట్రావెల్స్ హెడ్ ఆఫీసుకు తెలిసిపోతుంది. ప్రైవేటు ట్రావెల్స్‌ను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. – సుందర్, డీటీసీ -
ప్రైవేట్ బస్సుకు ప్రమాదం
అనకాపల్లి: విశాఖపట్నం జిల్లా అమీన్‌సాహెబ్‌పేట కూడలి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. హైవే పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి విశాఖపట్నం వైపు వేగంగా వెళుతున్న వి.వి.వినాయక్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు అమీన్‌సాహెబ్‌పేట కూడలి వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి అదే మార్గంలో ముందు వెళుతున్న లారీని ఢీకొంది. సుమారు 50 అడుగుల ముందుకు వచ్చి డివైడర్‌ను ఢీకొని ఆగింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన పసుపులేటి అనిత బస్సు నుంచి తూలి రోడ్డు మీద పడి తీవ్రంగా గాయపడింది. బస్సులో ప్రయాణిస్తున్న పి.సుప్రియ, కె.పూర్ణిమ, సీహెచ్. త్రిమూర్తుల రాజు, బి.సంపత్‌కుమార్, పి.తిరుపతిరావు, జి.హరి, బి.సుధీర్, పి.కల్యాణ్, అయినంపూడి సత్యవతి గాయపడ్డారు. వీరిని 108 వాహనాల్లో హైవే పోలీసులు అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులున్నారు. సంక్రాంతి సెలవులకు బంధువుల ఇళ్లకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగదు, సెల్‌ఫోన్ గల్లంతు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనిత గుంటూరు జిల్లా చిలకలూరి పేట నుంచి స్నేహితురాలితో కలిసి బస్సులో వస్తోంది. ఆమె చేతితో పట్టుకున్న రూ.3,700 ఉన్న పర్సు, సెల్‌ఫోన్ ప్రమాదంలో గల్లంతయ్యాయి. గాలించినా దొరకలేదు. తమ గ్రామం పాతపట్నం చేరడానికి నగదు లేకపోవడంతో ఎలా ఇంటికి చేరాలో తెలియక ఆమె ఆందోళనకు గురైంది. తోటి ప్రయాణికుల సాయంతో గమ్యస్థానానికి చేరాల్సి వచ్చింది. మిగిలిన వారు కూడా ఏదోలా నానా యాతన పడి వారి ఇళ్లకు చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్సును అతి వేగంగా నడపడం వల్ల ప్రమాదం జరిగిందని హైవే పోలీసులు తెలిపారు. -
రక్తమోడిన రహదారులు..
బి.కొత్తకోట/పెద్దతిప్పసముద్రం/నెల్లూరు (మినీ బైపాస్)/పెదకాకాని (గుంటూరు): భోగి పండుగ రోజైన ఆదివారం రాష్ట్రంలోని పలుచోట్ల రోడ్లు రక్తసిక్తమయ్యాయి. చిత్తూరు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం పదిమంది దుర్మరణం చెందారు. చిత్తూరులో ముగ్గురు, నెల్లూరులో ఐదుగురు, గుంటూరులో ఇద్దరు మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లాలో కాలినడకన తిరుమలకు బయలుదేరిన బృందాన్ని వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పెద్దతిప్పసముద్రం (పీటీఎం) మండలం ఎంపార్లపల్లి మిట్టపై జరిగింది. పీటీఎం మండలం వరికసువుపల్లికి చెందిన బయ్యమ్మ, యు.బయ్యారెడ్డి, లక్ష్మి, లలితమ్మ, చెన్నకేశవ, ఈశ్వరమ్మ, టి.బయ్యారెడ్డి ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కాలినడకన బూర్లపల్లెకు బయలుదేరారు. సోమవారం ఉదయం అక్కడి గ్రామస్తులతో కలిసి నడక మార్గంలో తిరుమలకు వెళ్లాల్సి ఉంది. వీరు పోతుపేట సమీపంలోని ఎంపార్లపల్లె మిట్ట దిగుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనాలు వీరిని ఢీకొన్నాయి. దీంతో బయమ్మ(48), యు.బయ్యారెడ్డి (45) అక్కడికక్కడే మరణించారు. కర్ణాటకలోని ఉప్పకుంటపల్లికి చెందిన మోటార్‌సైక్లిస్ట్ అనిల్‌కుమార్ (23)ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. కాలినడకన వస్తున్న వారిలో భార్యాభర్తలు ఈశ్వరమ్మ(38), చెన్నకేశవులు (40), టి.బయ్యారెడ్డి (55), ద్విచక్ర వాహనాల్లో వస్తున్న రాంకుమార్(30), లోకేష్ (28)కు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో రాంకుమార్ పరిస్థితి విషమంగా ఉంది. వీరిని 108, ప్రైవేట్ వాహనాల్లో మదనపల్లెకు తరలించారు. నెల్లూరులో ప్రాణాలు తీసిన పొగమంచు నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున పొగమంచు కారణంగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన ముత్యాల మల్లికార్జున, సర్పంచ్ నరసమ్మ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి రెండు కార్లలో తమిళనాడులోని నాగపట్నానికి బయల్దేరారు. ఒక కారులో డ్రైవర్ జాఫర్, మల్లికార్జున, నరసమ్మ, ముత్యాల అశోక్, ముత్యాల ప్రేమసాగర్, ముత్యాల అనిల్, పామంజి మంజులమ్మ, పామంజి పోలమ్మ ప్రయాణిస్తున్నారు. వారికి ముందు రెండు లారీలు, ఓ కంటైనర్ వెళ్తున్నాయి. పొగమంచు కారణంగా కంటైనర్ డ్రైవర్ వేగాన్ని తగ్గించడంతో వెనకనున్న సిమెంట్ లారీ కంటైనర్‌ను ఢీకొంది. దీంతో సిమెంట్ లారీ వెనకే వస్తున్న మరో లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో జాఫర్ నడుపుతున్న కారు లారీని ఢీకొట్టింది. కారులోని జాఫర్, నరసమ్మ, మంజులమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. ముత్యాల మల్లికార్జున, ముత్యాల అనిల్, పామంజి పోలమ్మకు తీవ్రగాయాలయ్యాయి. ప్రైవేట్ బస్సు ఢీకొని మరో ఇద్దరు.. మరో ఘటనలో.. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో వారిలో ఇద్దరు మృతిచెందారు. నెల్లూరు ప్రశాంతినగర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామునే ఈ దుర్ఘటనా చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నెల్లూరుకు చెందిన ఎం.సుబ్రహ్మణ్యం (40), పి.వెంకటేష్ (28) మృతిచెందారు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రమాదానికి కారణమైన బస్సును తగులబెట్టారు. గుంటూరు జిల్లాలో లారీ అదుపుతప్పి.. గుంటూరు జిల్లా పెదకాకాని మండల శివారులోని మద్దిరాల రాజేశ్వరరావు కాలనీ వద్ద ఆదివారం తెల్లవారుజామున ముగ్గురు యువకులు బైక్‌పై గుంటూరు నుంచి ఆటోనగర్ వైపు వెళ్తున్నారు. అదే సమయంలో గుంటూరు వైపు నుంచి వస్తున్న ఓ లారీని మరో లారీ ఓవర్టేక్ క్రమంలో బైక్ పైకి దూసుకెళ్లింది. ఆ తర్వాత పాదచారి షేక్ ఇర్ఫాన్‌ను కూడా ఢీకొంది. ఈ ఘటనలో మనోజ్‌కుమార్(20), షేక్ ఇర్ఫాన్ (27) అక్కడికక్కడే మరణించారు. -
సొంత ఊళ్లకు 15 లక్షల మంది పయనం
-
బస్సులో మంటలు : తప్పిన పెను ప్రమాదం
-
‘ప్రైవేటు’ పోటు.. మళ్లీ నష్టాల రూటు!
సాక్షి, హైదరాబాద్: లాభాల మాట ఎన్నడో మరిచిపోయిన ఆర్టీసీ.. దాదాపు దశాబ్దం తర్వాత భారీ రాబడితో గాడిన పడినట్టు కనిపించింది. హైదరాబాద్ సిటీ జోన్ మినహా మిగతా రెండు జోన్లు ఒకేసారి లాభాలు సాధించి సంస్థలో కొత్త జోష్‌ను నింపాయి. కానీ ‘వరి గడ్డి మంట’ చందంగా ఆ సం తోషం ఎక్కువ రోజులు నిలవలేదు. స్వయం గా ప్రభుత్వ నిర్లక్ష్యమే లాభాల బాట పట్టిన ఆర్టీసీని మళ్లీ నష్టాలు చవిచూసేలా చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వందల సంఖ్యలో ప్రైవేటు అక్రమ సర్వీసులకు బ్రేకులు పడగా.. ఇప్పుడు ప్రభుత్వం చూసీ చూడనితనంతో అవి రోడ్డె క్కి బుకింగ్స్‌తో దూసుకెళ్తున్నాయి. దీంతో ఆర్టీసీ రూ.72 కోట్ల నష్టాలు చవి చూసింది. అంతకు ముందు నెలకంటే దాదాపు రూ.40 కోట్లు అధికం కావటం గమనార్హం. పైన పటారం.. ప్రైవేటు బస్సుల అక్రమ సర్వీసులతో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతోందన్నది ప్రభుత్వానికి తెలియని విషయమేమీ కాదు. ప్రైవేటు బస్సులను నియంత్రిస్తే ఆర్టీసీ దాదాపు రూ.వేయి కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తుందని నిపుణులు కూడా గతంలో నివేదికలు అందజేశారు. గతేడాది సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆర్టీసీపై జరిపిన సమీక్షలోనూ దీనిపై ప్రధానంగా చర్చ జరిగింది. దీంతో ఆర్టీసీ, రవాణా శాఖలు కలసి ప్రైవేటు అక్రమ సర్వీసుల విషయంలో చర్యలు తీసుకునేలా ఆయన ఆదేశాలు జారీ చేశారు. నాటి సంయుక్త రవాణా కమిషనర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక వ్యవ స్థను కూడా ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థ ప్రైవేటు అక్రమ సర్వీసులను నియంత్రించేం దుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పేరు కు చర్యలు గంభీరంగానే ఉన్నా.. వాస్తవంగా జరుగుతోంది మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. మళ్లీ పెరిగిన నష్టాలు.. రవాణా చట్టాలు ఎంతగా అపహాస్యమవుతున్నాయో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తన చర్యల ద్వారా ఇటీవల బహిర్గతం చేసింది. ఆ రాష్ట్రంలో పర్మిట్లు పొంది వేరే రాష్ట్రాలు కేంద్రంగా అక్రమంగా వేల సంఖ్యలో బస్సులు తిరుగుతున్న తీరును బయటపెట్టింది. ఇందులో తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా దాదాపు వెయ్యి వరకు బస్సులున్నట్టు తేలింది. వాటిలో తెలంగాణ వాటా దాదాపు 400. ఈ నేపథ్యంలో ఆ బస్సులను నిషేధించింది. ఇదే సమయంలో ఆర్టీసీ దూర ప్రాంతాలకు దాదాపు 150 సర్వీసులు ప్రారంభించింది. ఈ రెండు చర్యల కారణంగా ఒక్కసారిగా ఆర్టీసీకి గణనీయ సంఖ్యలో రాబడి పెరిగి నష్టాలు బాగా తగ్గాయి. రెండు జోన్లు లాభాల్లోకి రావటంతో.. నష్టాలు గణనీయంగా తగ్గాయి. ప్రతినెలా రూ.వంద కోట్లకుపైగా నష్టాలు వస్తుండగా, ఆ మొత్తం రూ.40 కోట్లకు తగ్గింది. దీంతో ఆర్టీసీ దూర ప్రాంతాల సర్వీసుల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. మరో నెలరెండు నెలల్లో ఆ మాత్రం నష్టాలు కూడా ఉండవన్న సంకేతాలిచ్చింది. కానీ ఉన్నట్టుండి సీన్ రివర్స్ అయింది. నెల క్రితం రూ.40 కోట్లకే పరిమితమైన నష్టాలు తాజాగా రూ.72 కోట్లకు చేరుకున్నాయి. కారణాలను విశ్లేషించిన ఆర్టీసీ అధికారులు మళ్లీ ప్రైవేటు అక్రమ సర్వీసులు రోడ్డెక్కడమే ప్రధాన కారణమని తేల్చారు. పట్టించుకోవద్దని ఆదేశాలు ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న బస్సులు మళ్లీ రోడ్డెక్కి పరుగు ప్రారంభించాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఆర్టీసీ అధికారులు ఇప్పటికే పలుమార్లు రవాణా శాఖ దృష్టికి తెచ్చారు. కానీ రవాణా శాఖ అధికారులు వాటిపై చర్యలు తీసుకోలేకపోయారు. ఆ బస్సుల విషయంలో చూసీచూడనట్టు ఉండాలన్న బడా నేతల ఆదేశాలే దీనికి కారణమన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులు కూడా ధ్రువీకరిస్తున్నారు. ‘దాదాపు 3 నెలలుగా దూరప్రాంత సర్వీసులు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. కొత్త బస్సులెన్ని తెచ్చిపెట్టినా నిండుగా వెళ్తున్నాయి. దీంతో లాభాలు వస్తున్నాయి. కానీ నెల రోజులుగా తీరు మారింది. కొన్ని బస్సులు రద్దు చేసుకోవాల్సి వస్తోంది. రద్దయిన ప్రైవేటు బస్సులు యథాప్రకారం తిరగటమే ఇందుకు కారణం’ అని ఓ ఆర్టీసీ డిపో మేనేజర్ పేర్కొన్నారు. బాహాటంగా మాట్లాడ్డానికి జంకుతున్నా.. ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం ఆ ప్రైవేటు బస్సులను నియంత్రిస్తే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందని పేర్కొంటున్నారు. -
ప్రైవేటు బస్సు బోల్తా
-
ప్రైవేటు బస్సు.. చట్టాలన్నీ తుస్సు
రిజిస్ట్రేషన్, పర్మిట్లు ఓ రాష్ట్రంలో.. సర్వీసులు మరో రాష్ట్రంలో అవకతవకలకు పాల్పడుతున్న ప్రైవేటు ఆపరేటర్లు కేంద్ర, రాష్ట్ర నిబంధనల ఉల్లంఘన.. అరుణాచల్ ఉదంతంతో మళ్లీ తెరపైకి.. సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ ప్రైవేటు బస్సుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. అటు ఆర్టీసీ ఆదాయానికి గండికొడుతూ.. ఇటు ప్రయాణికులపైనా చార్జీల మోత మోగిస్తూ.. దండుకుంటున్నాయి. బస్సుల స్వరూపం నుంచి పర్మిట్ల వరకూ అన్నీ అక్రమాలు, అవకతవకలే. ఏదో ఓ రాష్ట్రంలో రిజిస్టరై, పర్మిట్లు పొందడం.. ఇక్కడ స్టేజీ క్యారియర్లుగా తిరగడం సాధారణమైపోయింది. ఇలా అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్టరై, పర్మిట్లు పొంది తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న బస్సులపై అరుణాచల్ అధికారులు కొరడా ఝలిపించడంతో ఇప్పుడీ అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రైవేటు ట్రావెల్స్‌ను నియంత్రించాలని, అలాగైతేనే ఆర్టీసీ బాగుపడుతుందనే డిమాండ్లు వస్తున్నాయి. క్షుణ్నంగా గమనిస్తే ఈ వ్యవహారంలో ఎన్నో ఉల్లంఘనలు, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తాయి. బెర్తులుగా మారిపోతున్న సీట్లు! కేంద్ర మోటారు వాహనాల చట్టం 1989 నిబంధన 128 (10) ప్రకారం.. జాతీయ పర్మిట్ ఉన్న రవాణా వాహనాల్లో కేవలం కూర్చోవటానికి సీట్లు మాత్రమే ఉండాలి. బెర్తులు ఏర్పాటు చేసి స్లీపర్ బస్సులుగా తిప్పొద్దు. కానీ పర్మిట్లతో సంబంధం లేకుండా యథేచ్ఛగా బెర్తులు ఏర్పాటు చేసి స్లీపర్ బస్సులుగా తిప్పుతున్నారు. పుదుచ్చేరితో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని, అక్కడి నుంచి పర్మిట్లు పొందుతున్నారు. పరిధి దాటుతున్నాయ్.. కేంద్ర మోటారు వాహనాల చట్టం నిబంధన 125 సి (4) ప్రకారం.. ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థలు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పర్మిట్లు పొందిన ప్రైవేటు బస్సులు మాత్రమే వాటి పర్మిట్ పరిధిలో బెర్తులుండే బస్సులను తిప్పవచ్చు. కానీ తెలంగాణ పర్మిట్, ఏపీ పర్మిట్ ఉన్న బస్సులు యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు స్లీపర్ బస్సులు నడుపుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రాంతాలకు, బెంగళూరు, చెన్నై, ముంబైలకు తిప్పుతున్నాయి. రిజిస్ట్రేషన్, పర్మిట్ ఒక చోట.. తిరిగేది మరోచోట కేంద్ర మోటారు వాహనాల చట్టం నిబంధన 85 (3) ప్రకా రం.. ఒక రాష్ట్రం నుంచి పర్మిట్ పొందిన బస్సు తన ట్రిప్పు ను ఆ రాష్ట్రం నుంచే ప్రారంభించి.. తిరిగి ఆ రాష్ట్రంలోనే ము గించాలి. ఉదాహరణకు తెలంగాణలో పర్మిట్ పొందిన బస్సు బెంగళూరుకు కాంట్రాక్టు క్యారేజీగా వెళితే.. బుక్ చేసుకున్నవారిని తెలంగాణలో ఎక్కించుకుని బెంగళూరు తీసుకెళ్లి దింపేయాలి, లేదా మళ్లీ వారితోనే తిరిగి రావాలి. ఇతర ప్రయాణికులను ఎక్కించుకురావటం చట్టవిరుద్ధం. కానీ అరుణాచల్‌ప్రదేశ్ సహా ఇతర ప్రాంతాల్లో బస్సులను రిజిస్టర్ చేసి, పర్మిట్ పొంది.. ఆ రాష్ట్రంతో సంబంధం లేకుండా వేరే ప్రాంతాల్లో తిప్పుతున్నారు. అలాంటి దాదాపు వెయ్యి బస్సులు తెలుగు రాష్ట్రాలు కేంద్రాలుగా హైదరాబాద్ నుంచి ఏపీ, కర్ణాటక, తమిళనాడు, గోవా, ముంబైలకు తిరుగుతున్నాయి. బోర్డు పెట్టి.. టికెట్లు అమ్మి మరీ.. ఏపీ, తెలంగాణ మోటారు వాహనాల చట్టం నిబంధన 297(ఎ) ప్రకారం... ఆర్టీసీ మినహా మరే సంస్థలు కూడా రవాణా బస్సులను స్టేజీ క్యారియర్లుగా తిప్పడానికి వీలు లేదు. వాటికి కేవలం టూరిస్టు పర్మిట్ మాత్రమే ఇస్తారు. చాలా సంస్థలు టూరిస్ట్ పర్మిట్ పొంది స్టేజి క్యారియర్లుగా తిప్పుతున్నాయి. దర్జాగా బోర్డులు ఏర్పాటు చేసి మరీ ప్రయాణికులకు టికెట్లు అమ్ముతున్నాయి. ఆన్‌లైన్‌లోనూ టికెట్ల దందా నిర్వహిస్తున్నాయి. తెల్లరంగు... నీలం చారలు.. మోటారు వాహనాల చట్టం నిబంధన 128 ప్రకారం.. ప్రైవేటు బస్సులు తెలుపు రంగులో ఉండాలి. కేవలం నీలం రంగు చార ఉండాలి. కానీ ప్రస్తుతం ఏ సంస్థ బస్సు చూసినా రంగులు, డిజైన్లతో ఉంటాయి. వాస్తవానికి నిర్ధారిత రంగు ఉంటేనే అధికారులు పర్మిట్ ఇవ్వాలి. కానీ మామూళ్లు తీసుకుని అనుమతులిచ్చేస్తున్నారు. ఆర్టీసీకి ఆ సామర్థ్యం ఉందా..? ఉన్నట్లుండి ప్రైవేటు బస్సులను నిలిపివేస్తే ఆ మేర ప్రయాణికులను తరలించే సామర్థ్యం ఆర్టీసీకి లేదు. కొత్తగా కనీసం వెయ్యికిపైగా బస్సులు సమకూర్చుకోవాల్సిందే. కానీ సిబ్బంది జీతాలకే కిందా మీదా పడుతున్న ఆర్టీసీకి కొత్త బస్సులు కొనే శక్తి లేదు. ప్రభుత్వం నిధులిస్తేనే సాధ్యం. పొడవు, ఎత్తు పెరిగితే ప్రమాదమే ప్రయాణికుల రవాణా బస్సులు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు వాటి పొడవు, ఎత్తుకు సంబంధించి కేంద్ర మోటారు వాహనాల చట్టం నిబంధన 93 కింద పరిమితులను విధించారు. కానీ ప్రైవేటు సంస్థలు అత్యాశతో బస్సు పొడవు, ఎత్తును అక్రమంగా పెంచుతూ.. అదనంగా సీట్లు ఏర్పాటు చేయించుకుంటున్నాయి. స్లీపర్ బస్సులో ఉండాల్సిన బెర్తులు 24 36 ప్రైవేటు బస్సుల్లో ఉంటున్న బెర్తులు -
రద్దయినా ‘రైట్’ రాయల్‌గా..
- తెలుగు రాష్ట్రాల మధ్య ఆగని ‘అరుణాచల్’ బస్సుల పరుగులు - ఒక్క ప్రైవేట్ బస్సును కూడా నిలువరించని రవాణా శాఖ - ఏ రిజిస్ట్రేషన్లు రద్దు చేశారంటూ అరుణాచల్‌కు మొక్కుబడి లేఖ సాక్షి, హైదరాబాద్: ‘‘అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్టరై, ఇక్కడ పర్మిట్లు పొంది, నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్న టూరిస్టు బస్సుల రిజిస్ట్రేషన్లు రద్దు చేయండి. ఆ బస్సులను స్థానిక పోలీస్స్టేషన్లకు తరలించి రిపోర్టు చేయాల్సిందిగా వాటి యజమానులకు సూచించండి’’ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సీరం జూన్ 6న స్థానిక జిల్లా రవాణాశాఖ అధికారుల (డీటీఓ)కు జారీ చేసిన ఆదేశాల సారాంశమిది. అరుణాచల్‌లో రిజిస్టరై తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న సుమారు వెయ్యి బస్సులకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. కాబట్టి అవి రోడ్డెక్కడం చట్టరీత్యా నేరం. అయినా సరే, ఆ బస్సులన్నీ యథావిధిగా రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలూ ఎప్పట్లాగే తమ కార్యాలయాల ముందు బోర్డులు పెట్టి మరీ ఈ బస్సులకు టికెట్లు అమ్ముకుంటున్నాయి. ఆన్లైన్ బుకింగులూ చేసు కుంటున్నాయి. అయినా తెలంగాణ రవాణా శాఖ అధికారులు మాత్రం ఒక్క బస్సునూ ఆపే ప్రయ త్నం చేయడం లేదు. అదేమంటే, ‘‘అరుణాచల్ ఆదేశాలు అందలేదు. అలాంటప్పుడు వాటిపై చర్య లెలా తీసుకుంటాం? ఎందుకాపారని రేపు కోర్టులు ప్రశ్నిస్తే ఏం బదులిస్తాం?’ అంటూ ప్రశ్నిస్తున్నారు!! ఒకవైపు అరుణాచల్ రవాణా శాఖ కమిషనరేమో తమ రాష్ట్రంలో రిజిస్టరై, పర్మిట్లు పొందిన బస్సులు నిర్ధారిత కాలంలో తమ భూభాగంలో తిరగాలన్న నిబంధనను పట్టించుకోకపోవడాన్ని ప్రశ్నిస్తున్నా రు. బస్సులను భౌతికంగా తనిఖీ చేయకుండా పర్మి ట్లను ఎలా రెన్యువల్ చేస్తారన్న ప్రశ్ననూ ఆయన లేవనెత్తారు. తెలుగు రాష్ట్రాల అధికార గణం ఈమా త్రం హేతుబద్ధంగా కూడా ఆలోచించకపోగా, ప్రైవేట్ ట్రావెల్స్‌కు లబ్ధి చేకూరేలా నిబంధనలను బేఖాతరు చేస్తుండటం విస్తుగొలుపుతోంది. ‘సాక్షి’ కథనంతో హడావుడిగా లేఖ అరుణాచల్ ఆదేశం తమకు అందనందున ఏమీ చేయలేమన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తుండ టాన్ని ప్రశ్నిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించే అవకాశమున్నా చర్యలు తీసుకోవటం లేదని పేర్కొంటూ సోమవారం ‘సాక్షి’లో కథనం రావడంతో రవాణా శాఖ హడావుడిగా దిద్దుబాటు చర్యలకు దిగింది. ఏయే ట్రావెల్స్‌కు చెందిన ఏయే బస్సులపై చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ అరుణాచల్ ప్రభుత్వానికి తెలంగాణ రవాణా శాఖ సోమవారం లేఖ రాసింది. ఇదే పని వారం క్రితమే చేసి ఉంటే ఈ పాటికి వివరాలందడమే గాక, చర్యలు కూడా తీసుకునే అవకాశముండేది. ఇక్కడ రిజిస్టర్ చేస్తే ఉద్యమమే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీల్లో 600 దాకా ఏసీ బస్సులున్నాయి. అవి 70% లోపే నిండుతున్నాయి. ప్రైవేటు బస్సులూ సాధారణ రోజుల్లో 30% ఖాళీగానే తిరుగుతున్నాయి. పైగా రెండు ఆర్టీసీలు ఇటీవలే వంద కొత్త బస్సులు కొన్నాయి. అంటే అరుణాచల్ నిర్ణయం ఫలితంగా 1,000 ప్రైవేటు బస్సులు ఆగిపోయినా ఇబ్బందేమీ లేదు. అయినా ప్రభుత్వాలు మాత్రం ఆర్టీసీలను కాదని ప్రైవేటు ట్రావెల్స్‌కే తాము సానుకూలమనే రీతిలోనే వ్యవహరిస్తున్నాయి. దీన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు తప్పుబడుతున్నాయి. అరుణాచల్ రద్దు చేసిన బస్సులను తెలుగు రాష్ట్రాల్లో రిజిస్టర్ చేయించుకునేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని, అదే జరిగితే తాము ఉద్యమిస్తామని పలు సంఘాలు హెచ్చరి స్తున్నాయి. ఆ ప్రైవేటు బస్సులను కొను గోలు చేసి ఆర్టీసీలకు అప్పగించి నడిపిం చాలంటూ ఇరు ప్రభుత్వాలకు వినతిపత్రాలు కూడా సమర్పించాయి. -
తమిళనాడులో మరో ‘నిర్భయ’
♦ ప్రైవేట్ బస్సులో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ♦ గంటకు పైగా బస్సు నడుపుతూ రాక్షసత్వం ♦ ఇద్దరు డ్రైవర్లు, కండక్టర్ అరెస్టు సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ ‘నిర్భయ’ ఘటన తాజాగా తమిళనాడులో నూ పునరావృతమైంది. ముగ్గురు మృగాళ్లు చిన్నారి అనే కనికరం కూడా చూపకుండా నిర్దాక్షిణ్యంగా కాటువేశా రు. నడుస్తున్న బస్సులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సభ్యసమాజం తలదించుకునే ఈ దుర్మార్గం తమిళనాడులోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది. సేలం నుంచి శివార్లలోని కరుప్పూరు ఇంజనీరింగ్ కళాశాలకు ప్రైవేట్ బస్సులు తిరుగుతుంటాయి. కిచ్చిపాళయంకు చెందిన 15 ఏళ్ల బాలిక వలసయ్యూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. సోమవారం రాత్రి 8.30 గంటలకు తల్లిదండ్రులతో గొడవపెట్టుకుని ఇల్లు వదిలి వచ్చేసింది. ఎక్కడికి వెళ్లాలో తెలియక సేలం పాత బస్టాండ్‌కు చేరకుంది. కరుప్పూరు వెళ్లే ప్రైవేట్ బస్సు కనిపించడంతో అందులో ఎక్కి టికెట్ తీసుకుంది. కరుప్పూరు ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ప్రయాణికులంతా దిగిపోగా బాలిక మాత్రం ఒంటరిగా మిగిలింది. సేలం సన్యాసిగుండుకు చెందిన మణివణ్ణన్ (33) బస్సు నడుపుతుండగా, అతడితోపాటు అధికారిపట్టికి చెందిన మురుగన్ (35) రెండో డ్రైవర్‌గా ఉన్నాడు. వాళప్పాడి ముత్తంపట్టికి చెందిన పెరుమాళ్ (22) కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బాలిక ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లు గమనించిన ఈ ముగ్గురు నెమ్మదిగా మాటకలిపి రాత్రి 10 గంటల సమయంలో కరుప్పూరులో దించకుండా నారాయణపాళయం వైపు బస్సును మళ్లించారు. దీంతో కంగారుపడిన బాలిక కేకలు వేయగా ఆమె నోట్లో గుడ్డలు కుక్కి మురుగన్, పెరుమాళ్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత మురుగన్ బస్సు నడుపుతుండగా మణివణ్ణన్ లైంగికదాడికి పాల్పడ్డాడు. బస్సును సుమారు గంటకు పైగా వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ బాలికపై ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బస్సు నుంచి పారిపోలేక, మృగాళ్ల బారి నుంచి తప్పించుకోలేక బాలిక బిగ్గరగా రోదించడంతో కొందరు స్థానికులు గమనించి అర్ధరాత్రి బస్సును అడ్డగించి నిలిపివేశారు. బస్సులోని ముగ్గురు దుర్మార్గులను పట్టుకుని దేహశుద్ధి చేసి బాలికతో పాటు పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. బాధితురాలికి చికిత్స చేసి ఓమలూరు మహిళా పోలీస్‌స్టేషన్ రక్షణలో ఉంచారు. ముగ్గురు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. నిర్భయ కేసు నిందితులకు ఉరిశిక్ష ఇంకా అమలు కాక ముందే తమిళనాడులో అదే తరహా దారుణం చోటుచేసుకోవడం శోచనీయం. -
బాదుడే బాదుడు
►తిరుపతిలో ప్రయివేటు ట్రావెల్స్ దోపిడీ ►శని, ఆదివారాల్లో రెట్టింపు చార్జీల వసూలు ►పొరుగు రాష్ట్రాల ప్రయాణాలపై భారీ బాదుడు ►పనిచేయని పుష్బ్యాక్ సీట్లు, ఏసీలతో అవస్థలు తిరుపతి: తిరుపతిలో ప్రయివేటు బస్సుల దోపిడీ ఎక్కువైంది. టికెట్ ధరలను అమాంతం పెంచేశారు. వేసవి సెలవుల్లో సాధారణ రోజుల్లో వసూలు చేసే చార్జీల కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారు. ప్రధానంగా శని, ఆదివారాల్లో ఈ దోపిడీ ఎక్కువైంది. ప్రయివేటు బస్సుల్లో ప్రయాణాలకు అలవాటు పడ్డ ప్రయాణికులు గత్యంతరం లేక ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రయివేటు బస్సుల దందాను పసిగట్టి చర్యలు తీసుకోవాల్సిన రవాణా శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం వల్లే తిరుపతిలో ప్రయివేటు దందా ఎక్కువైందని తెలుస్తోంది. రోజూ తిరుపతి నుంచి 80 వేల మందికి పైగా దూర ప్రయాణాలు చేస్తుంటారు. వీరంతా ఆర్టీసీ బస్సుల్లో, ప్రయివేటు ట్రావెల్ బస్సుల్లోనూ, మిగతా వాళ్లు రైళ్లల్లోనూ వెళ్తుంటారు. గడచిన నెల రోజుల నుంచి భక్తులతో తిరుమల కొండపై రద్దీ పెరిగింది. రోజూ తిరుమల వచ్చి వెళ్లే భక్తుల సంఖ్య లక్షకు చేరింది. తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తున్నారు. సుమారు 30 వేల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనూ, మరో 40 మంది దాకా రైళ్లల్లోనూ గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఇకపోతే హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, నల్గొండ, గుంటూరు, అమలాపురం, కాకినాడ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్రయివేటు ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చి తిరుగు ప్రయాణంలో మార్పులు జరిగిన సందర్భాల్లోనే ఎక్కువ మంది ప్రయివేటు ట్రావెల్స్ బస్సులపై ఆధారపడుతున్నారు. దీనికితోడు వేసవి కాలం కావడంతో ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారంతా విధిగా ప్రయివేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రయివేటు ట్రావెల్స్ చార్జీల రేట్లు పెంచేశాయి. ఉదాహరణకు రోజూ రాత్రి 9.30 గంటలకు తిరుపతి నుంచి విజయవాడకు వెళ్లే మార్నింగ్‌స్టార్ సర్వీసుకు గతంలో రూ.440లు తీసుకునేవారు. శనివారం రాత్రి ఏకంగా «రూ.740లు తీసుకున్నారు. అవేవిధంగా హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులపై రూ.400 అదనంగా బాదేశారు. ఒక్క మార్నింగ్‌స్టార్ మాత్రమే కాకుండా తిరుపతి నుంచి బయలుదేరే అన్ని బస్సులూ రేట్లు పెంచేశాయి. శ్రీనివాస, శ్రీకృష్ణ, వెంకట రమణ, కాళేశ్వరి బస్సులన్నీ వీకెండ్ బాదుడు మొదలు పెట్టాయి. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఆర్టీసీ ఆదాయానికి గండి ప్రయివేటు బస్సులన్నీ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా నుంచే బయలుదేరుతున్నాయి. రోజూ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఈ బస్సులు అంబేడ్కర్ సర్కిల్, ఈస్ట్‌పోలీస్ స్టేషన్ల మధ్య ప్రయాణికుల్ని ఎక్కించుకుంటున్నాయి. రోజూ 80 సర్వీసులు ఇక్కడి నుంచి బయలుదేరతాయి. సుమారు రూ.2 లక్షల ఆర్టీసీ ఆదాయాన్ని లాగేసుకుంటున్నాయి. పైగా చాలా బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. రూట్ పర్మిట్లు లేనివి కొన్నయితే, దాదాపు సగానికి సగం స్టేజీ క్యారియర్లుగా నడుస్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్, టికెట్ల జారీ పద్ధతిలో ప్రయాణికులను దోచుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ల నేతలు ప్రయివేటు బస్సుల విషయాన్ని లేవనెత్తారు. ఆర్టీసీ బస్టాండ్‌కు ఎదురుగా కాకుండా కిలోమీటరు దూరాన బస్సులను ఆపుకుని ప్రయాణికులను ఎక్కించుకోవాలని ఆర్టీసీ కోరింది. ఎస్పీ జయలక్ష్మి జోక్యంతో కొన్ని రోజుల పాటు అలా జరిగినా తర్వాత మళ్లీ బస్టాండ్ దగ్గరే ఆపుతున్నారు. -
నల్గొండ జిల్లాలో బస్సు బోల్తా
-
ప్రైవేట్ బస్సులపై కొరడా
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సులపై కొరడా ఝుళిపించారు. శంషాబాద్ మండలం తొండుపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం పలు బస్సులను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించని 6 బస్సులను సీజ్ చేశారు. మరో 23 బస్సులపై కేసులు నమోదు చేశారు. -
బస్సు–వ్యాన్ ఢీకొని ఆరుగురి మృతి
తిరువణ్ణామలై: తిరువణ్ణామలై జిల్లాలో మినీ వ్యాన్, ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో మినీ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సెయ్యారుకు చెందిన ఒక కుటుంబ సభ్యులు కళశపాక్కం సమీపంలోని పయంకోయిల్ గ్రామంలో జరిగే నిశ్చితార్థ కార్యక్రమానికి 22 మందితో మినీ వ్యాన్‌లో బుధవారం ఉదయం బయల్దేరారు. పోలూరులో నిశ్చితార్థం ముగించుకొని మధ్యాహ్నం 3 గంటల సమయంలో మినీ వ్యాన్ బయల్దేరింది. మినీ వ్యాన్ ఆరణి రోడ్డులోని ఎట్టివాడి కూట్‌రోడ్డు వద్ద వెలుతున్న సమయంలో వేలూరు నుంచి తిరువణ్ణామలై వైపు ప్రయాణికులను ఎక్కించుకొని వెళుతున్న ప్రవే టు బస్సు అతి వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నా యి. ఈ ప్రమాదంలో సెయ్యారుకు చెందిన మణి(55),సరోజ(48),తిరునావుక్కరసు(55), సెల్వరాజ్(60), తిమిరికి చెందిన కమల(70) అక్కడికక్కడే మృతి చెందారు. అదే విధంగా ప్రమాదంలో మరో 12 మందికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గమనించి, పోలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరు అడుక్కంబరైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో మరో మహిళ మృతి చెందింది. అయితే మృతి చెందిన మహిళ ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరో 11 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ప్రమాద స్థలాన్ని తిరువణ్ణామలై ఎస్పీ పొన్ని నేరుగా వెళ్లి పరిశీలించారు. ప్రమాదంతో సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. -
ఘోరం..!
ప్రైవేట్ బస్సు ప్రమాదంలో పది మంది దుర్మరణం ⇒ మరో 32 మందికి గాయాలు.. ప్రైవేట్ ఆసుపత్రులకు తరలింపు ⇒ దుర్ఘటన స్థలాన్ని పరిశీలించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ⇒ బాధిత కుటుంబాలకు పరామర్శ... ధైర్యం కోల్పోవద్దని ఓదార్పు.. ⇒ మృతదేహాలను పోస్టుమార్టం చేయకుండానే మూట కట్టటంపై ఆగ్రహం మృత్యువు మింగేసింది..... నిద్ర మత్తులోనే కర్కశంగా కబళించింది... వేకువ వెలుగుకు ముందే ప్రాణాల్ని తోడేసింది.... నెత్తుటి ముద్దల్ని మిగిల్చింది... మృతదేహాల్ని మూటగట్టింది... ఆశల్ని, ఆశయాల్ని, బతుకుల్ని, బంగారు కలల్ని చిదిమేసింది... కన్నవారికి, కట్టుకున్న వారికి, తోబుట్టువులకు, బంధువులకు విషాదాన్ని మిగిల్చింది... ప్రైవేట్ బస్సురూపంలో దూసుకొచ్చిన మృత్యువు కల్వర్టులో కాపు కాసి 10 మందిని బలిగొంది..మరో 32 మందిని గాయపరిచింది... భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు మంగళవారం తెల్లవారు జామున 5.45 గంటలకు పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. సాక్షి, అమరావతి బ్యూరో : ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం..అధికారుల అలసత్వం వెరసి పది మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. మరో 32మంది గాయాలపాలయ్యారు. కొన్ని గంటల్లో గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన సమయంలో ఆ పది మంది అయినవారి చూపునకు శాశ్వతంగా దూరమయ్యారు. పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు వద్ద మంగళవారం తెల్లవారు జామున బందరు–ముంబై జాతీయ రహదారిపై దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టి కల్వర్టులోకి దూసుకెళ్లింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా దుర్ఘటన సంభవించినట్టు జిల్లా అధికారులు ప్రకటించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికుల అరుపులు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. దీంతో అటువైపు వెళ్తున్న కొందరు స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత ఒక్కొక్కరుగా చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని నందిగామ, విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న బాధిత బంధువులు ఆసుపత్రులకు చేరుకుని అయినవారి కోసం ఆరా తీశారు. ప్రమాదంలో మృతి చెందిన పదిమందిలో ఎక్కువ మంది వివాహితులే . ప్రమాదం నుంచి బయటపడిన వారు దుర్ఘటనను తలచుకుని భయభ్రాంతులకు గురయ్యారు. భువనేశ్వర్ నుంచి అతివేగంగా హైదరాబాద్ వెళ్తున్న బస్సు రహదారి డివైడర్‌ను ఢీకొట్టి..ఆ వెంటనే గాల్లోకి లేచి 150 మీటర్ల దూరంలో ఉన్న కల్వర్టులో పడిపోవటం భయం గొల్పిందన్నారు. టీడీపీ నేతల రాజకీయంపై బాధితుల ఆగ్రహం ... దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ నేతల చేస్తున్న రాజకీయం స్థానికులు, బాధితుల బంధువులకు ఆగ్రహం తెప్పించింది. వారికి కొందరు అధికారులు వంతపాడటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం కనిపించింది. బాధితులకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంఘటనా స్థలానికి తరలిరావటం వారికి మనోధైర్యాన్నిచ్చింది. మృతదేహాలకు పోస్టుమార్టం చేయకుండానే తెల్ల సంచిలో మూటగట్టి అప్పగించటంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మృతులు, క్షతగాత్రుల కోసం బంధువుల ఆర్తనాదాలు ఓ వైపు.. బాధితులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఇంకో వైపు టీడీపీ నేతల ఆరాచకాలతో నందిగామ అట్టుడికింది. ఏమి జరిగిందో తెలియదు.. గాఢనిద్రలో ఉన్నాను. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. లేచి చూసే సరికి బస్సులో అందరూ చెల్లాచెదురుగా పడి ఉన్నారు. ఏమయిందో తెలీదు. కొంత సేపటికి ప్రమాదం జరిగిందని తెలిసింది. చుట్టూ చీకటి ఉంది. స్థానికులు వచ్చి బయటకు తీశారు. వైజాగ్‌లో బస్సు ఎక్కి హైదరాబాద్ వెళుతున్నాను. సేల్స్‌మేన్‌గా పని చేస్తున్నాను. – ఏ.కృష్ణవర్ధన్, వైజాగ్, ప్రయాణికుడు ఆరు గంటల పాటు క్షతగాత్రులకు సేవలు బస్సు ప్రమాదానికి ముందు నా కారుని ఓవర్ టేక్ చేసి వెళ్లింది. కొద్ది నిముషాల్లోనే ప్రమాదానికి గురైంది. ఆసమయంలో ఎవరూ లేరు. బస్సులో ఇరుక్కున్న వారిని రక్షించేందుకు సాయం చేశాను. – శ్రీనివాసరావు, నూజివీడు కన్నీరు.. మున్నీరు ... ప్రమాదంలో మరణించిన వారి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, బంధువులు ఘటనా స్థలం, ఆసుపత్రుల వద్ద కన్నీరు మున్నీరుగా విలపించటం కనిపించింది. చనిపోయిన వారి జ్ఞాపకాలు, నివాసం నుంచి వెళ్లే సమయంలో వారి చివరి మాటలను గుర్తుచేసుకుంటూ రోదించిన తీరు చూపరుల కంట తడిపెట్టించింది. నందిగామ ఆసుపత్రి వద్ద తొమ్మిదేళ్ల చిన్నారి ‘అమ్మా.. నాన్నను చూడాలి’ అంటూ తన తల్లిని పలుమార్లు అడుగుతుండటాన్ని చూసిన బంధువులు.. ‘మీ నాన్న ఇకలేరమ్మా’ అంటూ రోదించడం కనిపించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నల్లబోతు కృష్ణారెడ్డి నందిగామ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సంఘటనా స్థలంలో మృతిచెందిన నల్లబోతు శేఖర్‌రెడ్డికి ఈయన స్వయానా సోదరుడు. ఇద్దరూ నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందినవారు. అన్నదమ్ముల మృతి గురించి తెలుసుకున్న బంధువులు, స్నేహితులు ఘటనా స్థలానికి చేరుకుని విలపించటం కనిపించింది. -
ప్రాణపాయం తప్పింది
ఉంగుటూరు : జాతీయరహదారిపై వెళ్తున్న ప్రైవేటు హైటెక్ బస్సు(వోల్వో) ఉంగుటూరు వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న రైల్వే కొలనులోకి దూసుకుపోయింది. చెట్టును ఢీకొని నిలిచిపోయింది. అందులో ఉన్న 29 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఐదు గంటలకు ఈ ఘటన జరిగింది. ప్రయాణికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ఈ ప్రైవేటు హైటెక్ బస్సు హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి 12 గంటలకు బయలుదేరింది. ఉంగుటూరు వచ్చే సరికి ఓ లారీ అడ్డురావటంతో అదుపు తప్పి రైల్వే కొలనులోకి వెళ్లిపోయింది. బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. జాతీయ రహదారి నుంచి కిందకు వేగంగా పోయిన బస్సు అక్కడ ఉన్న చెట్టును ఢీకొనటంతో ఏమి జరిగిందో తెలీక ప్రయాణికులు అరుపులు కేకలు వేశారు. చీకటిగా ఉండటంతో బయటకు రావటటానికి ఇబ్బంది పడ్డారు. బస్సు అత్యవసర ద్వారం నుంచి కొందరు, బస్సు అద్దాలు పగలుగొట్టి మరికొందరు బయటకు వచ్చారు. వారిని అదె ట్రావెల్స్‌కు చెందిన మరో బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. అందరం గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం జరిగిందని, సీట్లో ఉన్న వాళ్లం ముందుకు పడిపోయామని, ఏం జరిగిందో తెలిసేసరికే బస్సు కొలనులోకి వెళ్లిపోయిందని ప్రయాణికులు చెప్పారు. భగవంతుని దయ వల్ల బతికామని ఊపిరిపీల్చుకున్నారు. లారీ అడ్డు రావడం వల్ల బస్సు అదుపు తప్పిందని డ్రైవర్ మజూరుద్దీన్ చెప్పారు. ఇదిలా ఉంటే కొలను వద్ద కొద్దిదూరంలో విద్యుత్ హెచ్‌టీ లైన్ ఉంది. బస్సు ఏమాత్రం ఆ లైన్‌ను ఢీకొన్నా భారీ ప్రమాదం జరిగేదని స్థానికులు చెబుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పోలీసులకు గాయాలు
తాడేపల్లి: పోలీస్ గస్తీ వాహనం ప్రమాదానికి గురవడంతో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ బైపాస్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీస్ పెట్రోలింగ్ వాహనం వెళ్తుండగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడ్డ ముగ్గురు పోలీసులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
విహారయాత్రలో అపశ్రుతి
కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా 15 మంది విద్యార్థులు, టీచర్లకు గాయాలు సంఘటన స్థలం నుంచి పరారైన బస్సు డ్రైవర్ ఉద్దేహాళ్ పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల ఉపాధ్యాయులు విహారయాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలోని బెలుం గుహలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులను ఒప్పించి విహారయాత్రకు పేర్లు నమోదు చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున ప్రధానోపాధ్యాయులు ఈశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో ఉరవకొండకు చెందిన ప్రైవేట్ బస్సులో బయల్దేరారు. వీరిలో ఆరుగురు ఉపాధ్యాయులు, 66 మంది తొమ్మిదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ఉద్దేహాళ్ నుంచి బయలు దేరిన బస్సు ఉరవకొండ, గుంతకల్లు, గుత్తి, బనగానపల్లి , నంద్యాల మీదుగా మీదుగా వెళుతోంది. విద్యార్థులు సరదాగా జోకులు వేసుకుంటూ ఆనంద డోలికల్లో మునిగిపోయారు. ఉదయం 8.30 గంటల సమయంలో కర్నూలు జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి వద్దకు రాగానే మలుపు వద్ద బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ హఠాత్పరిణామంతో విద్యార్థులు హాహాకారాలు చేశారు. ప్రాణాలు అరచేత పట్టుకుని బస్సు నుంచి ఒకరి తర్వాత ఒకరు బయట పడ్డారు. ఎవరికీ ప్రాణహాని లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అతివేగం వల్లనే బస్సు అదుపు తప్పి, ప్రమాదం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. సంఘటన జరిగిన తర్వాత బస్సు డ్రైవర్ పరారయ్యాడు. 15 మందికి గాయాలు బస్సు బోల్తాపడడంతో 15 మంది గాయపడ్డారు. వీరిలో విద్యార్థులు సుధ (లింగదహాళ్), సహానా (ఉద్దేహాళ్), ఆశా (లింగదహాళ్), తెలుగు పండిట్ ప్రశాంతి, హిందీ పండిట్ రాజేశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానిక అధికారులు బాధిత విద్యార్థులను సమీపంలోని పాఠశాలకు ఆశ్రయం కల్పించి.. కాసేపటి తర్వాత స్వగ్రామానికి పంపే ఏర్పాట్లు చేశారు. పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన ప్రమాద ఘటనను తెలుసుకున్న గౌనూరు, లింగదహాళ్ , ఉద్దేహాళ్ విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. తమ పిల్లలకు జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లకుండా తక్కవ అద్దెకు దొరుకుతుందని, ఇన్సూరెన్స్ కూడా లేని ప్రైవేట్ బస్సులో తీసుకెళ్లడంలో ఆంతర్యమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విహారయాత్ర వద్దు, ఏమీ వద్దు.. తమ పిల్లలను వెంటనే వెనక్కి పిలుచుకురావాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను వెనక్కు తీసుకొస్తాం ‘అనుకోకుండా ప్రమాదం సంభవించింది. కంగారు పడవద్దు. చిన్నపాటి గాయాలు తప్ప ఎవరికీ ప్రాణహాని జరగలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, విద్యార్థులను వెనక్కి రప్పిస్తాం’ అని ఎంఈఓ భీమప్ప విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. -
చెట్టును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు..
నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. బస్సు తమిళనాడు నుంచి రాజమండ్రి వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
27 మంది జలసమాధి
బిహార్‌లో చెరువులో పడిన బస్సు మధుబని/పట్నా: బిహార్‌లో సోమవారం ఒక ప్రైవేట్ బస్సు చెరువులో పడిన దుర్ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మధుబని జిల్లా బెన్నిపట్టి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బసైతా చౌక్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 65 మంది ప్రయాణికులతో సీతామరి నుంచి మధుబనికి వెళ్తున్న బస్సు బసైతా చౌక్ వద్దకు రాగానే రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకుపోయింది. దీంతో 27 మంది జలసమాధి అయ్యారు. కొందరు ప్రయాణికులు వెంటనే తేరుకుని ఈదుకుంటూ ఒడ్డుకొచ్చారు. బస్సును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ఈ దుర్ఘటనపై రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ విచారణకు ఆదేశించారు. బాధితులకు సత్వర సాయం అందించాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఘటనాస్థలానికి చేరుకోవడంలో నిర్లక్ష్యం వహించారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులపై రాళ్లు రువ్వారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించామని, ప్రమాదానికి అసలు కారణాలు తెలియాల్సి ఉందని జిల్లా మేజిస్ట్రేట్ గిరివర్ దయాళ్ సింగ్ మీడియాతో చెప్పారు. -
ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ కొరడా
శంషాబాద్(రంగారెడ్డి): నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్- గగన్ పహాడ్ వద్ద శుక్రవారం ఉదయం బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా పర్మిట్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్గున్న ఆరు ప్రైవేట్ బస్సులు సీజ్ చేసి వాటి యజమానులపై కేసులు నమోదు చేశారు. -
చెట్టును ఢీకొన్న ప్రైవేటు బస్సు
* ప్రమాదంలో మందికి గాయాలు * బస్సులో 40 మంది ప్రయాణం * మిగతా వారంతా సురక్షితం వినుకొండ రూరల్: ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ప్రమాదవశాత్తు బస్సు చెట్టు ఢీకొని 8 మందికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని చీకటీగలపాలెం గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు గుంటూరు వసంతరాయనిపురం, శ్రీనగర్‌కు చెందిన సుమారు 40 మంది బంధువులు విహారీ ట్రావెల్స్‌కు చెందిన ప్రై వేటు బస్సులో తన బంధువు కుమారుడైన పవన్ నిశ్చితార్థానికని ప్రొద్దుటూరు చేరుకున్నారు. శుభకార్యాన్ని ముగించుకొని తిరిగి వస్తున్న నేపథ్యంలో చీకటీగలపాలెం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించేందుకు బ్రేక్ వేయడంతో అదుపు తప్పి ప్రమాదవశాత్తు బస్సు చెట్టును ఢీకొంది. ప్రమాదంలో బాలమర్తి శ్రీహరి, రాయిసల సత్యవతమ్మ, రాయిసల సూరిబాబు, సీతలపాటి చలపతిరావు, కావ్య లక్ష్మి, బి. పద్మ, బాలమర్తి బాలకష్ణ, డ్రై వర్లు కొల్లూరి సుబ్బారావు గాయాలయ్యాయి. బాధితులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి రక్షణ చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కున్న వారిని స్థానికుల సహాయంతో 108 సిబ్బంది అద్దాలను పగుల గొట్టి బయటకు తీశారు. అనంతరం ఆగమేఘాలపై విడతలవారీగా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాలమర్తి శ్రీహరి, సత్యవతమ్మ సూరిబాబు, చలపతిరావు, బాలమర్తి బాలకృష్ణను ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం గుంటూరు తీసుకెళ్లారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సీఎం ఆదేశానికే దిక్కులేదు
ప్రైవేటు బస్సుల నియంత్రణలో ఆర్టీసీ-ఆర్టీఏల మధ్య సమన్వయ లోపం సాక్షి, హైదరాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతూ ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్న ప్రైవేటు బస్సుల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేసి వందలకొద్దీ కేసులు నమోదు చేయటం, ఆ తర్వాత చల్లబడటం సాధారణమైపోయింది. ఇష్టార్యాజ్యంగా వ్యవహరిస్తున్న తీరును పూర్తిగా నిలవరించేలా రవాణా శాఖను ప్రభుత్వం అప్రమత్తం చేయటంలేదు. ఫలితంగా వరుస ప్రమాదాలతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిత్యం హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు దాదాపు 500 వరకు ప్రైవేటు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటికి కేవలం కాంట్రాక్టు క్యారేజీ పర్మిట్ మాత్రమే ఉన్నా, మూడొంతులకు పైగా బస్సులు స్టేజీ క్యారియర్లుగా తిరుగుతున్నాయి. ఏ ట్రావెల్స్ వద్ద ఎన్ని బస్సులు స్టేజీ క్యారియర్లుగా తిరుగుతున్నాయో రవాణాశాఖ అధికారుల వద్ద పూర్తి సమాచారం ఉంది. కానీ వాటిని నియంత్రించే విషయంలో ప్రభుత్వం నుంచి కచ్చితమైన ఆదేశాలు రాకపోవటంతో అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారు. ఎక్కడైనా బస్సును సీజ్ చేస్తే నిర్వాహకులు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారి నుంచి అధికారులపై ఒత్తిడి చేసి విడిపించుకుంటున్నారు. ఇటీవల విజయవాడ నుంచి మెడికోలతో నగరానికి వస్తున్న ప్రైవేటు బస్సు ఘోర ప్రమాదానికి గురికావటంతో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హడావుడి తనిఖీలతో ఠారెత్తించిన అధికారులు ఆ ఒక్క బస్సు పర్మిట్ రద్దు మినహా మరే చర్యలు తీసుకోలేకపోయారు. సోమవారం ఖమ్మం జిల్లాలో వంతెనపై నుంచి కాలువలో బస్సు పడ్డ దుర్ఘటనతో మళ్లీ హడావుడి ప్రారంభించారు. సీఎం హామీ... చర్యలేవీ?: జూన్‌లో సీఎం కేసీఆర్ ఆర్టీసీపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సమయంలో ప్రైవేటు బస్సుల నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టేలా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులను నియంత్రించేందుకు ఆర్టీసీ-రవాణా శాఖల మధ్య సమన్వయం కోసం రవాణా శాఖ జేటీసీని సమన్వయకర్తగా నియమించారు. కానీ ఇప్పటి వరకు ఆ సమన్వయం కోసం ఒక్కటంటే ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. ఒక్క బస్సుపై కూడా చర్యలు తీసుకోలేదు. -
స్కూలు బస్సు బోల్తా..9 మందికి గాయాలు
సంబెపల్లి మండలం సిద్ధారెడ్డిగారిపల్లె సమీపంలో బుధవారం ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తోన్న 9 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కంటెయినర్‌ను ఢీకొని బస్సు దగ్ధం
- ప్రయాణికులకు తప్పిన ముప్పు - ప్రకాశం జిల్లాలో ఘటన గుడ్లూరు : వేగంగా వెళ్తున్న ప్రైవేట్ బస్సు ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టడంతో ఇంజన్లో నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు బస్సులో నుంచి బయటకు దూకి ప్రాణాలను కాపాడుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని మోచర్ల-వీరేపల్లి మధ్య జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు మంగళవారం రాత్రి 11 గంటలకు 20 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి చెన్నైకు బయలుదేరింది. ఒంగోలులో ఇద్దరు దిగగా బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో బస్సు వీరేపల్లి దాటగానే నెల్లూరు వైపు వెళ్తున్న కంటైనర్ లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఇంజిన్‌లో మంటలు చెలరేగారుు. ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రాణ భయంతో అద్దాలు పగులగొట్టుకొని బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వారు బయటకు రాగానే క్షణాల్లో మంటలు వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో నుంచి దూకే సమయంలో ప్రయాణికులు రాము, వీరేశం, బస్సు డ్రైవర్ మోయిష్‌తోపాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. బస్సు ఢీకొట్టడంతో లారీ రోడ్డు పక్కనే ఉన్న గుంతలో బోల్తా కొట్టి తిరగబడింది. అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్లు ప్రాణాలతో బయటపడ్డారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. బస్సు అతివేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణమని కందుకూరు డీఎస్పీ ప్రకాశ్‌రావు చెప్పారు. -
ప్రాణాలు.. గాల్లో దీపాలు
ప్రైవేటు బస్సుల్లో రసాయనాలు,సిగరెట్ బండిళ్ల రవాణా పట్టించుకోని అధికారగణం నిబంధనలు తూచ్ తగలబడుతున్న బస్సులు బెంగళూరు : ప్రైవేటు బస్సు యాజమాన్యాలు నిబంధనలను కాలరాస్తుండటంతో ప్రయాణికుల భద్రత గాల్లో దీపంలా తయారైంది. గమ్యాలకు చేరాల్సిన ప్రయాణికులు దారి మధ్యలోనే అకాల మృత్యువాత పడుతున్నారు. దీంతో ఆయా కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. తల్లికి బిడ్డ దూరమవుతోంది. బిడ్డకు తల్లి దూరమవుతోంది. మరికొన్ని ఘటనల్లో తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. ప్రభుత్వం సైతం ఏదేని ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప శాశ్వత పరిష్కార మార్గాలను అమలు చేయడం లేదని, బుధవారం తెల్లవారుజామున హుబ్లీ సమీపంలో చోటు చేసుకున్న బస్సు ప్రమాదం ఇందుకు అద్దం పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవంగా ప్రయాణికులను తరలించే ప్రైవేటు బస్సుల్లో నిబంధనలను అనుసరించి ఎటువంటి సరుకును రవాణా చేయకూడదు. అయితే టికెట్ల రూపంలో వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండక పోవడంతో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు సరుకులను యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. బెంగళూరు నుంచి దేశంలోని చాలా చోట్లకు ప్రైవేటు వాహనాలు నడుస్తున్నాయి. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా సిగరెట్ బండిల్స్, రసాయనాలు, పెయింట్స్‌తో పాటు వివిధ రకాల చికిత్సల్లో వినియోగించే మందులు రవాణా అవుతున్నాయి. ఈ పదార్థాలకు చిన్న నిప్పురవ్వ తగిలినా ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుంది. మరోవైపు సాధారణంగా మల్టీయాక్సిల్ బస్సుల్లో డీజిల్ ట్యాంకు డ్రైవర్ వెనకే ఉంటుంది. అందులో 600 లీటర్ల దాకా డీజిల్ ఉంటుంది. ఈ ట్యాంకుకు చిన్న చిల్లుపడినా, లేదా షార్ట్ సర్క్యూట్ జరిగినా ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. ‘వరూరు’ ఘటనలో కూడా బస్సులో రసాయనాలు ఉండటం వల్లే మంటలు త్వరగా వ్యాపించాయని, వాటిని గుర్తించి తప్పించుకునేలోపే ముగ్గురు మృత్యువుపాలయ్యారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. రవాణా శాఖ అధికారులు ట్రావెల్స్ సంస్థలకు వెళ్లి వారి లెసైన్స్‌లు, బస్సులకు పర్మిట్ ఉందా లేదా వంటి కనీస విషయాలను కూడా పరిశీలించలేదని తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్న ట్రావెల్స్ యాజమాన్యం పై కేసులు కూడా బుక్ చేస్తున్న దాఖలాలు లేవు. అందువల్లే 2013లో పాలెం వద్ద జరిగిన బస్సు దగ్ధమైన ప్రమాదంలో 48 మంది చనిపోయిన తర్వాత కూడా రాష్ట్రంలో తరుచుగా బస్సుల్లో మంటలు చెలరేగడం జరుగుతూనే ఉన్నాయని రవాణా శాఖ అధికారులే పేర్కొంటుండటం గమనార్హం. ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఏదీ..? రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఉత్తర కర్ణాటక జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో ఎక్కువగా బెంగళూరుకు వచ్చి ఇక్కడే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వెదుక్కుంటున్నారు. వీరు పండుగలు, శుభకార్యాల సమయంలో స్వంత ఊళ్లకు వెళ్లడానికి అవసరమైనన్ని కేఎస్ఆర్టీసీ బస్సులు కానీ, రైళ్లు కానీ లేవు. బెంగళూరు -హైదరాబాద్ విషయమే తీసుకుంటే (ఉత్తర కర్ణాటక ప్రాంతాల మీదుగా) రాష్ట్ర రవాణాశాఖకు చెందిన ఏసీ, నాన్ఏసీలు కలిపి రోజూ సుమారు 80 బస్సులను మాత్రమే నడుపుతున్నాయి. రైళ్ల విషయానికి వస్తే రోజూ రెండు రైళ్లు మాత్రమే (ప్రత్యేక రైళ్లను తీసివేస్తే) బెంగళూరు హైదరాబాద్ మధ్య ఉన్నాయి. దీంతో ఎక్కువ సొమ్ము చెల్లించాల్సి వచ్చినా తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రభుత్వ బస్సు సర్వీసులు ఒకటే లేదా గరిష్టంగా మూడు చోట్ల మాత్రమే ప్రయాణికుల పికప్ పాయింట్లను ఏర్పాటు చేసుకొన్నాయి. అయితే ప్రైవేటు ట్రావెల్స్ మాత్రం కనిష్టంగా పదిచోట్ల కంటే ఎక్కువ పికప్ పాయింట్లు ఉండటం కూడా ప్రయాణికులు ఆ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుని ప్రభుత్వ రవాణా వ్యవస్థను పెంచితే ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలకు కళ్లెం పడుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. -
ఘోర ప్రమాదం: 8 మంది చిన్నారుల మృతి
కర్ణాటకలో ఘోర ప్రమాదం సంభవించింది. ఉడిపి జిల్లాలోని మొహాడీ క్రాస్ వద్ద స్కూలు వ్యానును బస్సు ఢీకొనడంతో 8 మంది పిల్లలు మరణించారు. వ్యాన్ డ్రైవర్, ఒక టీచర్ సహా మరో 12 మంది గాయపడ్డారు. బైండూరు నుంచి కుందాపూర్ వెళ్తున్న ప్రైవేటు బస్సు... పిల్లలను డాన్ బాస్కో స్కూలుకు తీసుకెళ్తున్న మారుతి ఓమ్ని వ్యానును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో ప్రాణాలు కోల్పోయారు. మరో పిల్లవాడు ఆస్పత్రిలో మరణించాడు. గాయపడినవాళ్లలో కొందరికి స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా మిగిలినవారిని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. మరణించిన ఎనిమిది మందిలో ఆరుగురు అమ్మాయిలు కాగా, ఇద్దరు బాలురు ఉన్నారు. వారిలో నలుగురిని నిఖిత, కెల్సిటా, అనన్య, అన్సితలుగా గుర్తించారు. జిల్లా ఎస్పీ అన్నమలై ఆస్పత్రులకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. బస్సులోని కొందరు ప్రయాణికులకు కూడా కొద్దిపాటి గాయాలయ్యాయి. దీనిపై గంగొల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.