రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | One killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Published Fri, Oct 31 2014 10:49 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

One killed in road accident

 న్యూఢిల్లీ: ప్రైవేటు బస్సు అదుపుత ప్పి తిరగబడిన ఘటనలో ఒకరు చనిపోగా, మరో 13 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ఆగ్నేయ ఢిల్లీలో శుక్రవారం చోటుచేసుకుంది.  ఉదయం 9.15 గంటల సమయంంలో 25 మందితో బయల్దేరిన రోడ్ టాక్స్‌డ్ వాహనం (ఆర్‌టీవీ) డిఫెన్స్ కాలనీ ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే ముందరిభాగంలోని చక్రాలు ఊడిపోయాయి. దీంతో ఈ వాహనం తిరగబడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న మదన్‌గిరి ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల ధర్మేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతనిని ఎయిమ్స్ ట్రామా కేంద్రానికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఇంకా ఈ ఘటనలో మరో 13 మంది గాయపడ్డారు. వీరిని ఎయిమ్స్‌తోపాటు రాంమనోహర్‌లోహియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన విషయంలో డ్రైవర్ తప్పిదం ఏమయినా ఉందా అనే దిశగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement