
సాక్షి, అన్నమయ్య జిల్లా: ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. అన్నమయ్య జిల్లా కలికిరి మండలం సొరకాయలపేటకు చెందిన హేసానుల్లా, దిల్‌షాద్, వల్లి, సదుం మండలం, నెల్లిమంద గ్రామానికి చెందిన బుజ్జమ్మ, పకీర్, ఖాదర్‌వల్లిలు రాయచోటిలో వారి బంధువు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
అనంతరం తిరుగు ప్రయాణంలో ఆటోలో స్వగ్రామానికి వస్తుండగా.. చిత్తూరు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో వల్లి, బుజ్జమ్మ, పకీర్, ఖాదర్‌వల్లిలు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ హేసానుల్లా, దిల్‌షాద్, సారాలను పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. బస్సు డ్రైవర్ పరార్ కాగా, ప్రమాదస్థలాన్ని రాయచోటి డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment