ప్రైవేటు బస్సును ఢీకొన్న లారీ
Published Sun, Sep 29 2013 2:08 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
కోటపాడు(రంగంపేట), న్యూస్‌లైన్ : మండలంలో కోటపాడు వద్ద ఏడీబీ రోడ్డుపై శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, పలువురు స్వల్పంగా గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి కాకినాడలోని వివాహ వేడుకకు పలువురు ముస్లింలు ప్రైవేటు బస్సులో వెళుతున్నారు. పెద్దాపురం వైపు నుంచి రాజమండ్రి వైపునకు వెళుతున్న కోడిగుడ్ల లారీ కోటపాడు సమీపంలోని అంబేద్కర్ కోళ్ల ఫారం వద్ద ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ, బస్సు డ్రైవర్లు ఆకుల అన్నవరం, కె.శ్రీనివాస్‌పాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
లారీలోని 8 మంది, బస్సులోని 20 మందికి స్వల్ప గాయాల య్యాయి. కొవ్వూరుకు చెందిన మహమ్మద్ నజీముద్దీన్ సోదరుని కుమారుని వివాహానికి వారు కాకినాడ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని రంగంపేట ఎస్సై టి. గణేష్ చెప్పారు. లారీ పెద్దాపురంలోని విజయలక్ష్మి పౌల్రీఫారంనకు చెందిన దన్నారు. రంగంపేటలో సల్మా, నసీమాబేగం, ఉస్మాన్, హసీఫ్ ఉన్నీసాలు చికిత్స పొందారు. చికిత్స కోసం కొంత మందిని పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి, మరి కొందరిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. నసీముద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గణేష్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
Advertisement
Advertisement