గోడను ఢీకొట్టిన లారీ
గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ గాయపడ్డాడు. విజయవాడ వైపు వెళ్తున్న సిమెంట్ లారీ అదుపుతప్పి ఘాట్‌రోడ్డు గోడను ఢీకొట్టి రోడ్డుపైనే నిలిచిపోయింది. క్యాబిన్ నుజ్జునుజ్జు కావటంతో అందులో చిక్కుకున్న డ్రైవర్ గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో కొద్దిసేపు రాకపోకలు స్తంభించాయి. డ్రైవర్ స్వస్థలం గుంటూరు జిల్లా వేమూరు.