రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సులపై కొరడా ఝుళిపించారు. శంషాబాద్ మండలం తొండుపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం పలు బస్సులను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించని 6 బస్సులను సీజ్ చేశారు. మరో 23 బస్సులపై కేసులు నమోదు చేశారు.