మహిళలకు ఫ్రెష్‌బస్‌ ఫ్రీ కార్డులు | Fresh Bus offers for Women this Womens Day with Free Fresh Cards | Sakshi
Sakshi News home page

మహిళలకు ఫ్రెష్‌బస్‌ ఫ్రీ కార్డులు

Mar 8 2025 8:47 AM | Updated on Mar 8 2025 9:00 AM

Fresh Bus offers for Women this Womens Day with Free Fresh Cards

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న తమ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు రూ. 500 వరకు పొదుపు చేసే ఫ్రెష్‌ కార్డులను ఉచితంగా ఇస్తున్నట్లు ఫ్రెష్‌బస్‌ తెలిపింది. వీటిని తదుపరి 10 రైడ్స్‌ కోసం ఉపయోగించుకోవచ్చని, ఒక్కో రైడ్‌పై రూ. 50 ఆదా చేసుకోవచ్చని వివరించింది.

తమ వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో బుక్‌ చేసుకున్న వారికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. హైదరాబాద్, తిరుపతి, గుంటూరు, విజయవాడ, బెంగళూరు తదితర రూట్లలో సర్వీసులు నడిపిస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు సుధాకర్‌ రెడ్డి చిర్రా తెలిపారు. 

సంస్థను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ తమ బస్సుల్లో 6.5 లక్షల మంది ప్రయాణించగా ఇందులో 30 శాతం అంటే 1.94 లక్షల మంది మహిళలు ప్రయాణించారని ఆయన తెలిపారు. మహిళలకు తమ సంస్థపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement