ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ కొరడా
శంషాబాద్(రంగారెడ్డి): నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్- గగన్ పహాడ్ వద్ద శుక్రవారం ఉదయం బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా పర్మిట్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్గున్న ఆరు ప్రైవేట్ బస్సులు సీజ్ చేసి వాటి యజమానులపై కేసులు నమోదు చేశారు.