బస్సు ఢీకొని నలుగురు దుర్మరణం | Four killed in bus collide | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని నలుగురు దుర్మరణం

Published Fri, Feb 14 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM

Four killed in bus collide

చిత్రదుర్గం, న్యూస్‌లైన్ : నగర శివారులోని సీబార వద్ద గురువారం ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బైక్‌ను ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఉదయం 10 గంటల సమయంలో చిత్రదుర్గం నుంచి బైకుపై నలుగురు బెడివళ్లి గ్రామానికి వెళుతుండగా వెనుక నుంచి వస్తున్న ఓ ప్రైవేట్ (రిపబ్లిక్) బస్సు ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే నలుగురూ మృతి చెందారు.

బెడివళ్లి గ్రామానికి చెందిన  హనుమంతప్ప (40), అతడి భార్య మంజుళ (30), ఇద్దరు కుమార్తెలు సహన (4), పూర్ణిమ (3) చిత్రదుర్గంకు పనిమీద వచ్చి తిరిగి బైక్‌పై వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో  సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై చిత్రదుర్గం రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement