
లక్నో : ఏయ్.. నాకే ఎదురు చెబుతావా? నేను ఎవరినో తెలుసా? నా బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా? అంటూ ఓ మంత్రి మేనల్లుడు వీధిలో వీరంగం సృష్టించాడు. చిరువ్యాపారులపై దాడికి దిగాడు. ప్రస్తుతం ఆ ఘటన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లో మంత్రి సోమేంద్ర తోమర్ మేనల్లుడు ఓ వీధిలో తన స్కార్పియోలో వెళుతున్నాడు. రద్దీగా ఉన్న వీధిలో స్కార్పియోకి ఎదురుగా ఓ రిక్షావాలా అడ్డొచ్చాడు. దీంతో అటు స్కార్పియో, ఇటు ఆటో ముందుకు కదల్లేని పరిస్థితి.
ఆ సమయంలో అక్కడే పూలవ్యాపారం చేస్తున్న ఇద్దరు దంపతులు మంత్రి మేనల్లుడి స్కార్పియోను ముందుకు పోనివ్వాలని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న అతని సహాయకుడికి సూచించాడు. సహాయకుడు ముందు ఆటో పోనివ్వండి. ఆ తర్వాత స్కార్పియో ముందుకు కదులుతుందని వాదించాడు. దీంతో ఇరువురి మధ్య మాట మాట పెరిగింది.
స్కార్పియోలో డ్రైవింగ్ సీట్లో ఉన్న మంత్రి మేనల్లుడు పూల వ్యాపారుల్ని అసభ్యంగా దూషించాడు. కారు దిగి దాడికి దిగాడు. పూల వ్యాపారిని కిందకి నెట్టి పిడిగుద్దులు గుద్దాడు.
ఘర్షణపై సమాచారం అందుకు పూల వ్యాపారి బంధువులు సైతం మంత్రి మేనల్లుడిని రాడ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇలా ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ..చిలికి చిలికి గాలివానగా మారింది. గొడవపై సమాచారం అందుకున‍్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘర్షణకు దిగిన ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
UP BJP minister @isomendratomar’s nephew seen beating a poor flower vendor over a free bouquet.
Ram Rajya! pic.twitter.com/UfWVjDtfmj— Manish RJ (@mrjethwani_) February 23, 2025