flower business
-
ఆర్కిడ్ పూలు మొక్కలు బతికేందుకు కేవలం నీటి తుంపరల తడి చాలు
-
డ్రై ఫ్లవర్ టెక్నాలజీ కళాకృతులకు విశేష ఆదరణ...
-
Hoovu Fresh: పువ్వుల వ్యాపారం.. 10 లక్షల పెట్టుబడితో ఆరంభం.. కోట్లలో లాభాలు!
మన అవసరమే మనకో దారి చూపుతుంది. ఎరుకతో ముందడుగు వేస్తే విజయం సుగమమం అవుతుంది. అందుకు ఉదాహరణే ఈ బెంగళూరు సిస్టర్స్. అమ్మకు పూజ చేసుకోవడానికి సరైన పూలు దొరకడం లేదని గ్రహించిన ఈ తోబుట్టువులు ఇదే సమస్య అన్ని చోట్లా ఉందని తెలుసుకున్నారు. పది లక్షల రూపాయలతో పూల వ్యాపారాన్ని ప్రారంభించారు. కోట్లలో లాభాలను ఆర్జిస్తున్నారు. యశోద కరుటూరి, రియా కరుటూరి ఈ ఇద్దరు తోబుట్టువులు పువ్వుల లోకంలో విహరిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. కేవలం ప్రారంభించిన మూడేళ్లలోనే పూల పరిశ్రమలో పెద్ద బ్రాండ్‌గా తమ కంపెనీని నిలబెట్టారు. యశోద, రియా 14 ఫిబ్రవరి 2019న బెంగళూరులో ‘హువు’ ఫ్రెష్ని ప్రారంభించారు. 28 ఏళ్ల రియా మాట్లాడుతూ ‘హువు’ అంటే కన్నడ భాషలో పువ్వు అని చెప్పింది. కంపెనీ ప్రారంభించిన కొన్ని నెలల్లోనే కోవిడ్ కారణంగా వ్యాపారం నిలిచిపోయిందంటూ తాము ఎదుర్కొన్న సమస్యనూ వివరించింది. తల్లి ప్రేరణ కంపెనీ తొలినాళ్ల గురించి ఈ తోబుట్టువులు ప్రస్తావిస్తూ –‘దేశ పుష్పాల రాజధాని బెంగళూరు లో నివాసముంటున్నా సరైన పూలు దొరకడం లేదని, ఆ పువ్వులు కూడా తాజాగా లేవని మా అమ్మ ఆవేదన చెందేది. అప్పుడే పువ్వుల వ్యాపారం ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది..’ అంటూండగానే రియా అక్క యశోద అందుకుని మాట్లాడుతూ ‘మా చిన్నతనంలో మా నాన్న ఇథియోపియా, కెన్యాలో గులాబీ తోట సాగు చేసేవారు. విదేశాలకు కూడా ఎగుమతి చేసేవారు. కొన్ని కారణాల వల్ల ఆ వ్యాపారం తగ్గిపోయింది. మేం స్వదేశానికి వచ్చేశాం. మహిళలకు ఉపాధి ‘భారతదేశంలో సాధారణంగా పూజా పుష్పాలను దేవాలయాల చుట్టూ మాత్రమే విక్రయిస్తుంటారు. అలాగే, బండిపైనో, రోడ్డు పక్కనో కూర్చొని మహిళలు పూజాపుష్పాలను అమ్ముతుంటారు. ఈ విధానం అస్తవ్యస్తంగా ఉందని గ్రహించాం. మేము ఈ పూలవ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు, పరిశ్రమలో చేరడానికి మహిళలు చాలా ఆసక్తి చూపారు. కంపెనీ మొదలైనప్పుడు పాతిక మంది మహిళలు ఉండగా నేడు వారి సంఖ్య వందల్లో పెరిగింది. ఉపాధి వల్ల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. వారి పిల్లలు మంచి పాఠశాలల్లో చదువుతున్నారు. నెలకు లక్షన్నర ఆర్డర్లు ప్రతి నెలా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, మైసూర్, పూణె, ముంబై, గురుగ్రామ్, నోయిడా తదితర ప్రాంతాల నుంచి... ఒకటిన్నర లక్ష ఆర్డర్లు అందుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది నెలవారీ సబ్స్క్రిప్షన్ ఉన్న కస్టమర్లే కావడం విశేషం. ఇది కనిష్టంగా రూపాయి నుండి ప్రారంభమవుతుంది. 25 రూపాయల పూల ప్యాక్‌లో వివిధ రకాల పూలు ఉంటాయి. పువ్వులు రెండు వారాల పాటు తాజాగా ఉండే విధంగా ప్యాక్ చేస్తాం. దీన్ని తాజాగా ఉంచడానికి ఇథిలీన్ బ్లాకర్స్, ఇతర టెక్నాలజీని ఉపయోగిస్తాం. ప్యాకేజింగ్‌లో జీరో టచ్ ఫ్లవర్ టెక్నిక్ కూడా ఉంది. ఈ ప్యాకెట్లు పర్యావరణ అనుకూలమైనవి, ఇవి సులభంగా మట్టిలో కలిసిపోతాయి. మా కంపెనీ వాడినపూలతో అగరుబత్తులను కూడా తయారు చేస్తుంది. ఇవి పూర్తిగా సేంద్రీయమైనవి. బొగ్గు, రసాయనాలు ఏ మాత్రమూ ఉండవు. రైతులతో అనుసంధానం గతంలో రైతులు మండీలో పూలు విక్రయించేవారు, అక్కడ తరచుగా నష్టపోయేవారు. అక్కడ పూలకు సరైన ధర లభించేది కాదు. సకాలంలో పూలు అమ్మకపోతే సగానికిపైగా వృథా అయ్యేవి. పూలకు సరైన ధర రైతులకు అందేలా వందలాది మంది రైతులను కంపెనీతో అనుసంధానం చేశాం. ఈ విధానంలో పూలు కూడా వృథా కావు. మా కంపెనీకి వివిధ రాష్ట్రాల్లోని వందలాది మంది రైతులతో టై అప్లు ఉన్నాయి. దీనితోపాటు, డెలివరీ చైన్ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేశాం. ఆర్డర్లు వచ్చిన కస్టమర్లకు సకాలంలో డెలివరీ ఇస్తున్నాం. కొన్ని ఇ–కామర్స్ కంపెనీల ప్లాట్‌ఫారమ్‌లోనూ మా ఉత్పత్తులు లభిస్తున్నాయి’ అని వివరించారు ఈ తోబుట్టువులు. -
పూల వ్యాపారి స్మార్ట్ ఆలోచన.. ఫిదా అవుతున్న వధూవరులు
సాక్షి, చెన్నై: కరోనా కష్టకాలంలో తప్పనిసరిగా ధరించాల్సిన ఫేస్ మాస్క్‌ల కష్టాలగురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఊపిరాడదని కొందరు, కరోనా వచ్చాక ఏమో గానీ, మాస్క్ పెట్టుకుంటే ఊపిరి అందక ముందే చచ్చిపోతామంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు కోకొల్లలు. అయినా కోవిడ్-19 మహమ్మారి ఉధృతిని అడ్డుకోవాలంటే మాస్క్ ధరించడం తప్పనిసరి. ముఖ్యంగా పెళ్లి పీటల మధ్య ముసి ముసి నవ్వులతో మురిసిపోవాల్సిన వధూవరులకు కూడా ఇది తప్పదు. అందుకే తమిళనాడుకు చెందిన ఒక పూల వ్యాపారి చాలా స్మార్ట్‌గా ఆలోచించి చక్కటి మాస్క్‌లను రూపొందించారు. ఈ ఫోటోలు ఇపుడు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. చక్కటి పరిమళాలు వెదజల్లుతూ ఇదేదో బాగుందే.. అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా స్మార్ట్‌గా ఆలోచించడం కొంతమందికే సాధ్యం. తమిళనాడులోని పూల వ్యాపారి ఈ విషయాన్ని నిరూపించారు. రకరకాల పూలతో చక్కటి నైపుణ్యంతో సరికొత్త మాస్క్‌లను తయారు చేసి, ప్రత్యేకతను చాటుకున్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో పట్టుచీరకు మ్యాచింగ్‌గా వధువు పట్టు, వెండి, బంగారం, వజ్రాల మాస్క్‌లను ధరించడం చూశాం. కానీ ఖరీదైనవి. అందుకే మదురై స్వామికన్నిగైకు చెందిన పూల వ్యాపారి మోహన్ తన ఆలోచనకు పదుపెట్టారు. ముఖ్యంగా వధూవరులకోసం ప్రత్యేకంగా తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. మూడు పొరలతో మల్లె , లిల్లీ, గులాబీ పూలతో ఫేస్ మాస్క్ తయారు చేశారు. వివాహ కార్యక్రమాల్లో కరోనాపై అవగాహన కల్పించేలా వధూవరులకు పూలతో మాస్కు తయారుచేశానని మోహన్ వెల్లడించారు. ఫ్లవర్ మాస్క్ ఆర్డర్లు ఇప్పుడు చాలా వస్తున్నాయని దీంతో ఒకవైపు వ్యాపారం, మరోవైపు కరోనాపై అవగాహన పెంచడానికి తమ వంతు కృషి చేస్తున్నందుకు సంతోషంగా కూడా ఉందని పేర్కొన్నారు. అంతేకాదు పూల మాస్క్ ధరించిన వధువును చూడటానికి అందంగా ఉంటుందనీ, ఫోటోలు కూడా కరోనా కాలానికి సంబంధించిన అందమైన జ్ఞాపకంగా ఉంటాయంటున్నారు. Tamil Nadu | Mohan, a flower vendor in Madurai makes floral masks exclusively for brides, grooms to raise awareness about COVID-19 "Despite govt orders, people don't wear masks at weddings. I make these floral masks to encourage brides, grooms to wear them," he said (10.08) pic.twitter.com/1gJKK3S68p — ANI (@ANI) August 11, 2021 -
‘మేరీ గోల్డ్’ కేజీ రూ.800
కొత్తగూడెంటౌన్: దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు లక్ష్మీపూజ చేస్తారు. దీంతో పూల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. కిలో మేరీ గోల్డ్ చామంతి ఏకంగా రూ.800 ధర పలకడంతో అవాక్కవుతున్నారు. వారం కిందట వంగ రంగు చామంతి కిలో రూ.400 ఉంటే ఇప్పుడు రూ.650 పలుకుతోంది. కొత్తగూడెంలోని సూపర్‌బజార్, గణేశ్‌టెంపుల్ ఏరియా, రామవరం, త్రీటౌన్ సెంటర్, విద్యానగర్‌కాలనీ, పాలకేంద్రం, రుద్రంపూర్, గౌతంపూర్, ధన్‌బాద్‌లతోపాటు పలు ప్రాంతాల్లో పూల కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లన్నీ సందడిగా మారాయి. కూసుమంచి మండలంలో.. కూసుమంచి: మండలంలోని చేగొమ్మ క్రాస్‌రోడ్ లో బంతిపూల తోటలను పలువురు గిరిజనులు సాగుచేశారు. వారు అక్కడే పూలను విక్రయిస్తున్నారు. కిలో పూలు రూ.60 నుంచి రూ.70 వరకు అమ్ముతున్నారు. మూడు రోజుల కిందట రూ.40 వరకే పూలను అమ్మగా పండుగ సందర్భంగా ఆదాయం పెరిగింది. ఖమ్మం–సూర్యాపేట రా్రïÙ్టయ రహదారి పక్కన ఈ తోటలు ఉండటంతో వచ్చిపోయే వాహనదారులు పూలను కొంటున్నారు. వైరాలో.. వైరా: రెండు రోజుల కిందట కిలో రూ.35 నుంచి రూ.40 ఉన్న బంతి పూల ధర ఒక్కసారిగా రూ.80 నుంచి రూ.100కు పెరిగింది. వైరా–ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిపై పల్లిపాడు సమీపంలో బంతిపూల సాగు సుమారు 20 ఎకరాల్లో ఉంది. ఇక్కడి నుంచి విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. హైవే మీద ఉండటంతో పూలను మార్కెట్‌కు తీసుకుపోయే ఖర్చు కూడా తగ్గింది. వాహనదారులు వాహనాలు నిలిపి విరివిగా బంతిపూలు కొనుగోలు చేస్తుండటంతో డిమాండ్ ఉంది. -
‘పూల’ సందడి
మార్కెట్ రంగులమయం కుప్పలుగా బతుకమ్మపూలు తంగెడు, గునక పూలకు డిమాండ్ కరీంనగర్ బిజినెస్ : లె లంగాణ సంస్కృతి సాంప్రదాయలకు ప్రతీక బతుకమ్మ..రంగురంగుల పూలతో చూడముచ్చటగొలిపేది బతుకమ్మ..బంగారు బతుకును ఇవ్వాలని కోరుతూ చేసేది బతుకమ్మ.. బతుకమ్మ ఆరంభంతో మార్కెట్ అంతా రంగులమయమైంది. పూలవ్యాపారులతో సందడిగా మారింది. గ్రామాల్లో రంగురంగుల పూలు సేకరించి నగరంలోని మార్కెట్లో చాలా మంది విక్రయిస్తున్నారు. ఈ తొమ్మిది రోజులు మార్కెట్ పూలతో సందడిగా మారనుంది. మార్కెట్ రంగులమయం బతుకమ్మ పండుగ మెుదలుకావడంతో మార్కెట్ మొత్తం రంగు రంగుల పూలతో నిండుగా కనిపిస్తుంది. తంగెడు, గునుకపూలు, బంతి, చామంతి, గులాబీలు, కట్లపూలు, మందార, తామర, పట్టుకుచ్చుల పూలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. బతుకమ్మ పేర్చేందకు కావాల్సిన గుమ్మడి ఆకులు, గౌరమ్మను చే సేందకు గుమ్మడి పూలు అందుబాటులో ఉన్నాయి. పల్లెల నుంచి.. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పలువురు వ్యాపారులు నగరానికి వచ్చి మార్కెట్లో పూలు విక్రయిస్తున్నారు. అల్గునూర్, శ్రీరాములపల్లి, సైదాపూర్, చల్లూరు, కోహెడ, మానకొండూర్, కేశవపట్నం, తిమ్మాపూర్, బెజ్జంకి, కరీంనగర్, హుస్నాబాద్, హుజూరాబాద్, రామడుగు, గంగాధర మండలాల్లోని పలు గ్రామాలు, శనిగరం, కొత్తపల్లి నుంచి సైతం వ్యాపారులు వస్తున్నారు. గుట్టలు, చెలక ప్రాంతాల్లో సేకరించిన పూలను నగరానికి తరలించి అమ్ముకుంటామని వ్యాపారులు పేర్కొంటున్నారు. మొదటి, చివరి రోజు గిరాకీ బతుకమ్మ ప్రారంభం నుంచి తొలి రోజు, చివరి రోజు చాలా గిరాకీ ఉంటుందని వ్యాపారులు తెలిపారు. మధ్యరోజుల్లో కొంచెం తక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు. గిరాకీ ఉంటది బతుకమ్మ పండుగంటే అందరికి సంబుర మే. పొద్దుగాలనే పూలు కొసుకొని అమ్ముకుందామని ఇక్కడికి వచ్చినా. గిరాకీ బాగానే ఉంటది. తంగెడుపూలు, గునుక పూలు ఎక్కువగా అమ్ముడుపోతయి. మా ఊరు నుంచి బాగానే మంది వచ్చిండ్రు. యాడాదికోసారచ్చే పండుగ కాబట్టి పొద్దగాలటి నుంచి∙అందరు వచ్చి పూలు కొనుక్కపోతుండ్రు. మేం కూడా ఏటా వచ్చి పూలమ్ముకుంటాం. – రాజవ్వ, అల్గునూర్ రెండు రోజులు గిరాకీ బతుకమ్మ మొదలైన రోజు, చివరి రోజు రెండు రోజులు చాలా గిరాకీ ఉంటుంది. ఏటా వచ్చి పూలు అమ్ముతాము. ఉదయం నుంచే గిరాకీ ఉంటుంది. చాలా మంది పూలు కొనుక్కోవడానికి మార్కెట్‌కు వస్తున్నారు. పొద్దుపొడవక ముందు 4 గంటలకు గుట్ట ప్రాంతాలకు పోయి పూలు కోసుకుని వచ్చి..ఇక్కడ అమ్ముతాం. – కుమార్, సైదాపూర్ పూల ధరలు(సుమారుగా రూపాయలలో) తంగెడు కట్ట 10–15 గునుగు కట్ట 10–15 బంతిపూలు 50 గ్రాములు 20 చామంతి 50 గ్రాములు 20 గులాబీ 50గ్రాములు 20–30 చామంతి ఒకటి 5–10 పట్టుకుచ్చులు కట్ట 10–15 గుమ్మడిపూలు ఒకటి 5–10 -
‘పూల’ సందడి
మార్కెట్ రంగులమయం కుప్పలుగా బతుకమ్మపూలు తంగెడు, గునక పూలకు డిమాండ్ కరీంనగర్ బిజినెస్ : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయలకు ప్రతీక బతుకమ్మ..రంగురంగుల పూలతో చూడముచ్చటగొలిపేది బతుకమ్మ..బంగారు బతుకును ఇవ్వాలని కోరుతూ చేసేది బతుకమ్మ.. బతుకమ్మ ఆరంభంతో మార్కెట్ అంతా రంగులమయమైంది. పూలవ్యాపారులతో సందడిగా మారింది. గ్రామాల్లో రంగురంగుల పూలు సేకరించి నగరంలోని మార్కెట్లో చాలా మంది విక్రయిస్తున్నారు. ఈ తొమ్మిది రోజులు మార్కెట్ పూలతో సందడిగా మారనుంది. మార్కెట్ రంగులమయం బతుకమ్మ పండుగ మెుదలుకావడంతో మార్కెట్ మొత్తం రంగు రంగుల పూలతో నిండుగా కనిపిస్తుంది. తంగెడు, గునుకపూలు, బంతి, చామంతి, గులాబీలు, కట్లపూలు, మందార, తామర, పట్టుకుచ్చుల పూలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. బతుకమ్మ పేర్చేందకు కావాల్సిన గుమ్మడి ఆకులు, గౌరమ్మను చే సేందకు గుమ్మడి పూలు అందుబాటులో ఉన్నాయి. పల్లెల నుంచి.. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పలువురు వ్యాపారులు నగరానికి వచ్చి మార్కెట్లో పూలు విక్రయిస్తున్నారు. అల్గునూర్, శ్రీరాములపల్లి, సైదాపూర్, చల్లూరు, కోహెడ, మానకొండూర్, కేశవపట్నం, తిమ్మాపూర్, బెజ్జంకి, కరీంనగర్, హుస్నాబాద్, హుజూరాబాద్, రామడుగు, గంగాధర మండలాల్లోని పలు గ్రామాలు, శనిగరం, కొత్తపల్లి నుంచి సైతం వ్యాపారులు వస్తున్నారు. గుట్టలు, చెలక ప్రాంతాల్లో సేకరించిన పూలను నగరానికి తరలించి అమ్ముకుంటామని వ్యాపారులు పేర్కొంటున్నారు. మొదటి, చివరి రోజు గిరాకీ బతుకమ్మ ప్రారంభం నుంచి తొలి రోజు, చివరి రోజు చాలా గిరాకీ ఉంటుందని వ్యాపారులు తెలిపారు. మధ్యరోజుల్లో కొంచెం తక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు. గిరాకీ ఉంటది బతుకమ్మ పండుగంటే అందరికి సంబుర మే. పొద్దుగాలనే పూలు కొసుకొని అమ్ముకుందామని ఇక్కడికి వచ్చినా. గిరాకీ బాగానే ఉంటది. తంగెడుపూలు, గునుక పూలు ఎక్కువగా అమ్ముడుపోతయి. మా ఊరు నుంచి బాగానే మంది వచ్చిండ్రు. యాడాదికోసారచ్చే పండుగ కాబట్టి పొద్దగాలటి నుంచి∙అందరు వచ్చి పూలు కొనుక్కపోతుండ్రు. మేం కూడా ఏటా వచ్చి పూలమ్ముకుంటాం. – రాజవ్వ, అల్గునూర్ రెండు రోజులు గిరాకీ బతుకమ్మ మొదలైన రోజు, చివరి రోజు రెండు రోజులు చాలా గిరాకీ ఉంటుంది. ఏటా వచ్చి పూలు అమ్ముతాము. ఉదయం నుంచే గిరాకీ ఉంటుంది. చాలా మంది పూలు కొనుక్కోవడానికి మార్కెట్‌కు వస్తున్నారు. పొద్దుపొడవక ముందు 4 గంటలకు గుట్ట ప్రాంతాలకు పోయి పూలు కోసుకుని వచ్చి..ఇక్కడ అమ్ముతాం. – కుమార్, సైదాపూర్ పూల ధరలు(సుమారుగా రూపాయలలో) తంగెడు కట్ట 10–15 గునుగు కట్ట 10–15 బంతిపూలు 50 గ్రాములు 20 చామంతి 50 గ్రాములు 20 గులాబీ 50గ్రాములు 20–30 చామంతి ఒకటి 5–10 పట్టుకుచ్చులు కట్ట 10–15 గుమ్మడిపూలు ఒకటి 5–10