కృత్తివెన్ను (పెడన) : ప్రైవేటు బస్సు, కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న 21 మంది, కారులో ఉన్న నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండల పరిధిలోని 216 జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగింది. కృత్తివెన్ను ఎస్‌ఐ కె. నాగరాజు తెలిపిన వివరాల మేరకు.. పశి్చమ గోదావరి జిల్లా మొగల్తూరు నుంచి ఓ ప్రైవేటు బస్సు బుధవారం హైదరాబాద్‌కు బయల్దేరింది.
రాత్రి 8.30 గంటల సమయంలో కృత్తివెన్ను మండలం యండపల్లి–మునిపెడ గ్రామాల మధ్య విజయవాడ నుంచి రావులపాలెం వెళ్తున్న కారు, ఈ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బస్సు రోడ్డు మార్జిన్‌లో పలీ్టకొట్టింది. కారు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద సమయంలో బస్సులో 19 మంది ప్రయాణికులు, బస్సు డ్రైవరు, క్లీనరు ఉండగా వారిలో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక కారులో ఉన్న నలుగురూ గాయపడ్డారు. వీరిని మచిలీపట్నం సర్వజనాసుపత్రికి తరలించారు. బస్సు ప్రయాణికులు స్వస్థలాలకు వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment