bus overturned
-
Jharkhand: పట్నా వెళుతున్న బస్సు హజారీబాగ్‌లో బోల్తా.. ఏడుగురు మృతి
హజారీబాగ్: జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీహార్‌లో పట్నా వెళుతున్న బస్సు హజారీబాగ్ జిల్లాలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మృతిచెందారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ బస్సు కోల్‌కతా నుంచి పాట్నా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. బర్కతాలోని గోర్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని గోర్హర్ పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ప్రతికూలమా? -
ప్రైవేటు బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు
కృత్తివెన్ను (పెడన) : ప్రైవేటు బస్సు, కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న 21 మంది, కారులో ఉన్న నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండల పరిధిలోని 216 జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగింది. కృత్తివెన్ను ఎస్ఐ కె. నాగరాజు తెలిపిన వివరాల మేరకు.. పశి్చమ గోదావరి జిల్లా మొగల్తూరు నుంచి ఓ ప్రైవేటు బస్సు బుధవారం హైదరాబాద్‌కు బయల్దేరింది.రాత్రి 8.30 గంటల సమయంలో కృత్తివెన్ను మండలం యండపల్లి–మునిపెడ గ్రామాల మధ్య విజయవాడ నుంచి రావులపాలెం వెళ్తున్న కారు, ఈ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బస్సు రోడ్డు మార్జిన్లో పలీ్టకొట్టింది. కారు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద సమయంలో బస్సులో 19 మంది ప్రయాణికులు, బస్సు డ్రైవరు, క్లీనరు ఉండగా వారిలో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక కారులో ఉన్న నలుగురూ గాయపడ్డారు. వీరిని మచిలీపట్నం సర్వజనాసుపత్రికి తరలించారు. బస్సు ప్రయాణికులు స్వస్థలాలకు వెళ్లిపోయారు. -
రక్తమోడిన రహదారులు
పెద్దపంజాణి: చిత్తూరు జిల్లా బసవరాజు కండ్రిగ సమీపంలో యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలు కాగా, మరో 21 మంది గాయపడ్డారు. శనివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్దపంజాణి పోలీసుల కథనం ప్రకారం.. సత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు పరిసర గ్రామాలకు చెందిన 45 మంది తమిళనాడు రాష్ట్రంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకోవాలనుకున్నారు. అనంతపురానికి చెందిన ఖాన్ ట్రావెల్స్ బస్సు మాట్లాడుకుని, ఐదుగురు టూర్ నిర్వాహకులతో శుక్రవారం రాత్రి బయలుదేరారు.అతివేగమే ప్రమాదానికి కారణంబస్సు శనివారం వేకువజామున పెద్దపంజాణి మండల పరిధి పలమనేరు–పుంగనూరు మార్గంలో బసవరాజు కండ్రిగ సమీపానికి చేరుకుంది. బస్సును డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సత్యసాయి జిల్లా రొద్దం మండలం చిన్నగువ్వలపల్లికి చెందిన తిమ్మారెడ్డి భార్య రామానుజమ్మ (58), కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లా మురారాయనపలి్లకి చెందిన నరసింహారెడ్డి (68) అక్కడిక్కడే మృతి చెందారు. బస్సులోని 21 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పెద్దపంజాణి పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం జరిపించి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.అన్నమయ్య జిల్లాలో ఘోరంరామాపురం: కర్నూలు–చిత్తూరు 40వ జాతీయ రహదారిపై అన్నమయ్య జిల్లా రామాపురం మండలం చిట్లూరు పంచాయతీ దళితవాడ సమీపంలో శనివారం తెల్లవారుఝామున ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ట్యాంకర్‌ను కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో కడప నాగరాజుపేటకు చెందిన హోంగార్డు పూజారి ఆంజనేయులునాయక్ (28), కడప రాజారెడ్డివీధికి చెందిన కారు డ్రైవర్ పఠాన్ అఫ్రోజ్‌ఖాన్ (35), కడప నాగరాజుపేటకు చెందిన మారాబత్తుల జితేంద్రకుమార్ (24), కడప ఐటీఐ సర్కిల్‌కు చెందిన షేక్ హలీమ్ (35) ఉన్నారు.కడప రవీంద్రనగర్‌కు చెందిన షేక్ ఖాదర్బాషాకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కడప పట్టణానికి చెందిన ఈ ఐదుగురూ శుక్రవారం అర్ధరాత్రి కారులో కడప నుంచి బయలుదేరి రాయచోటి వైపు కారులో వెళ్తుండగా, రామాపురం మండలం చిట్లూరు దళితవాడ సమీపంలోని వంతెన వద్ద ఆ కారు ముందు వెళ్తున్న ట్యాంకర్‌ను వెనుక వైపు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో రాయచోటి ఆస్పత్రికి తరలిస్తుండగా జితేందర్‌కుమార్ మార్గంమధ్యలో మృతి చెందాడు. లక్కిరెడ్డిపల్లె సీఐ గంగనాధబాబు, రామాపురం ఎస్ఐ వి.లక్ష్మీప్రసాద్‌రెడ్డి సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వరద ఉధృతికి బస్సు బోల్తా.. చావు అంచుల దాకా..
Floods Video viral: ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు.. కనీసం మోకాళ్ల లోతులో నీట మునిగిన ప్రాంతాల దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కళ్ల ముందే.. కొండ చరియలు విరిగిపడడం, వాహనాలు.. ఇళ్లు.. పెద్ద పెద్ద భవనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఈ క్రమంలో హర్యానా వద్ద జరిగిన ఓ రెస్క్యూ ఆపరేషన్ వార్తల్లోకి ఎక్కింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి హర్యానాకు వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు.. అంబాలా-యమునానగర్ రోడ్డు వద్ద హఠాత్తుగా వరద పోటెత్తడంతో ఆ ఉధృతికి బోల్తా పడింది. దీంతో ప్రయాణికులంతా బోల్తా పడిన బస్సు భాగంపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూశారు. వరద క్రమక్రమంగా పెరుగుతుండడంతో ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈలోపు అధికారులు ఓ భారీ క్రేన్ తీసుకొచ్చి.. దాని సాయంతో వాళ్లను కాపాడగలిగారు. మొత్తం 27 మంది ఈ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా బయటకు తీసుకొచ్చారు. #Watch | Bus Overturns In Flooded #Haryana's Ambala, 27 Rescued Using Crane pic.twitter.com/raEM2U494T — NDTV (@ndtv) July 10, 2023 అంబాలా నగర్లో వరద నీటిలో ఓ మొసలి సంచరిస్తున్న వీడియో సైతం నెట్లో కనిపిస్తోంది. ఇది అక్కడిదేనా అనేది ధృవీకరణ కావాల్సి ఉంది. ये वीडियो आपके लिए चेतावनी हो सकती है 😳😱 पानी के साथ मगर सोसाइटी में घुस गया (📍-ambala nagar, haryana)#Haryana #HaryanaNews #ambala #Heavyrainfall #RainAlert #Monsoon2023 #MonsoonDisaster #chandigarhRains #Shocking #ViralVideo #BreakingVideos pic.twitter.com/zlUdbPqgGi — BreakingVideos (@TheViralHub27) July 10, 2023 మరోవైపు ఉత్తరాఖండ్‌లోనూ ఇలాంటి దృశ్యం ఒకటి కనిపించగా.. ప్రాణాల కోసం బస్సుపైనుంచి ప్రయాణికులు కొందరు కిందకు దూకేశారు. Watch | Bus Tries To Cross River In Uttarakhand, Starts Tilting, Passengers Jump Out pic.twitter.com/anspZg5PiX — NDTV (@ndtv) July 9, 2023 -
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం
-
ఆసిఫాబాద్: ఛాతీలో నొప్పి.. దూకేసిన ఆర్టీసీ డ్రైవర్
కుమ్రం భీం ఆసిఫాబాద్: జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మార్గంలో ప్రమాదం సంభవించింది. బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో డ్రైవర్ బస్సు నుంచి బయటకు దూకేశాడు. అదుపు తప్పిన బస్సు.. బోల్తా పడింది. ప్రమాదం జరిగినప్పుడు సదరు సూపర్ లగ్జరీ బస్సులో బస్సులో ఏడుగురు ప్రయాణికులు ఉండగా.. ఒకరికి గాయాలైనట్లు సమాచారం. ప్రయాణికుడితో పాటు ఛాతీ నొప్పికి గురైన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. -
అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా
అనంతగిరి: వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు, మరో 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ధారూరు క్రిస్టియన్ జాతర నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఎన్టీఆర్ చౌరస్తాలో బస్సు ఎక్కారు. 70 మంది ప్రయాణికులతో బస్సు బయలు దేరింది. అనంతగిరి ఘాట్ రోడ్డు దిగుతున్న క్రమంలో బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో చివరి ఘాట్ వద్ద ముందు వస్తున్న వాహనాలను తప్పించబోయి కుడి వైపు ఉన్న రోడ్డు కిందికి దూసుకుపోయి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో సికింద్రాబాద్ రసూల్‌పురాకు చెందిన స్వరూప (36) అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, బస్సు బ్రేక్ ఫెయిల్ అయిన విషయాన్ని డ్రైవర్ ప్రయాణికులకు చెప్పడంతో భయాందోళనకు గురైన పలువురు బస్సులోంచి దూకేశారు. దీంతో వారికి గాయాలయ్యాయి. మరికొందరు బస్సులోనే ఉండిపోయారు. మానవత్వం చాటుకున్న ఎంపీ, ఎమ్మెల్యే ప్రమాదం జరిగిన సమయంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ క్రిస్టియన్ జాతరకువెళ్తున్నారు. విషయం తెలిసిన వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. గాయపడ్డ వారిని అంబులెన్స్‌లు, ప్రైవేటు వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. -
శ్రీకాకుళం జిల్లాలో బస్సు బోల్తా..
శ్రీకాకుళం : జిల్లాలోని మందస సమీపంలో మంగళవారం వలస కూలీలతో వెళ్తున బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 33 మంది గాయపడగా.. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. కర్ణాటకలో క్వారంటైన్ పూర్తిచేసుకున్న వీరు.. బెంగళూరు నుంచి కోల్‌కతాకు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. అయితే బస్సు మందస సమీపంలోకి చేరుకోగానే అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 42 మంది వలస కూలీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
విజయవాడ: కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం సెంటర్లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు ట్రావెల్స్ బస్సు వెళ్తుండగా ఇబ్రహీంపట్నం సమీపానికి రాగానే అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. -
బస్సు బోల్తా: ముగ్గురి మృతి
-
బస్సు బోల్తా: ముగ్గురి మృతి
విజయనగరం: విజయనగరం జిల్లాలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని రామభద్రాపురం వద్ద ఒడిషాకు చెందిన ఓ బస్సు బోల్తాపడ్డ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మృతిచెందగా, మరో 10 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతులలో మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం, నిద్రమత్తులో ఉండటం వల్లే మలుపు తిరిగే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ప్రయాణికులు చెబుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
ఆర్టీసీ బస్సు బోల్తా : ప్రయాణికులకు గాయాలు
కరీంనగర్: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులోని 23 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి మెట్పల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఇందిరానగర్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా.. కొట్టింది. దీంతో బస్సులోని 23 మంది ప్రయాణికులకు తీవ్ర గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను అంబులెన్స్‌ల సాయంతో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... రహదారిపై నుంచి బస్సును పక్కకు తొలగించి... ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ సారయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. -
బస్సు బోల్తా : ప్రయాణికులకు గాయాలు
తిరుపతి: చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం రాంభట్లపల్లెలో గురువారం స్టీరింగ్ విరిగి పల్లె వెలుగు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. 108కి సమాచారం ఇచ్చారు. అయితే ఫోన్ చేసి అరగంట అయినా 108 వాహనం రాకపోవడంపై క్షతగాత్రులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది. -
బస్సు బోల్తా : 8 మందికి గాయాలు
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్ సహా మొత్తం ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బస్సులోని వారిని బయటకు లాగి కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నారాయణపేట నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన బస్సు కొడంగల్ సమీపంలోకి రాగానే మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ మేరకు ప్రయాణికులు తెలిపారు. -
దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా : 10 మందికి గాయాలు
-
దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా : 10 మందికి గాయాలు
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగామ జాతీయ రహదారిపై శనివారం దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపించారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా: 18 మందికి గాయాలు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం చిన్ననాగంపల్లి వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఆ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు పోలీసులకు వెల్లడించారు. -
బస్సు బోల్తా: ఒకరు మృతి, 30 మందికి గాయాలు
హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆదివారం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బోయనపల్లి సమీపంలో బోల్తా పడింది. ఆ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే మరణించాడు. మరో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం ఒంగోలు తరలించారు. అయితే వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతి చెందిన మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఆ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.