
హజారీబాగ్: జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీహార్‌లో పట్నా వెళుతున్న బస్సు హజారీబాగ్ జిల్లాలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మృతిచెందారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ బస్సు కోల్‌కతా నుంచి పాట్నా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. బర్కతాలోని గోర్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని గోర్హర్ పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ప్రతికూలమా?
Comments
Please login to add a commentAdd a comment