మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్ సహా మొత్తం ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బస్సులోని వారిని బయటకు లాగి కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నారాయణపేట నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన బస్సు కొడంగల్ సమీపంలోకి రాగానే మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ మేరకు ప్రయాణికులు తెలిపారు.