
సాక్షి, కొడంగల్ రూరల్ : బస్సు నుంచి కిందకు దూకి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రావులపల్లిలో బుధవారం చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రావులపల్లి గ్రామ స్టేజీలో దౌల్తాబాద్ మండలం గోకఫస్లాబాద్ గ్రామానికి చెందిన పొలంసాయన్నోళ్ల రాములు (50)ను ఆయన భార్య మదారమ్మ ఆర్టీసీ బస్సులో ఎక్కించింది. అయితే బస్సు ప్రయాణిస్తున్న సమయంలో రాములు బస్సు నుంచి కిందకు దూకాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థంలోనే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష్య సాక్షుల కథనం మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.