మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగామ జాతీయ రహదారిపై శనివారం దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపించారు.