టికెట్‌ దొరక్క బతికి బయటపడ్డ భార్య | Penuganchiprolu bus accident: family tragedy | Sakshi
Sakshi News home page

టికెట్‌ దొరక్క బతికి బయటపడ్డ భార్య

Published Thu, Mar 2 2017 4:57 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

టికెట్‌ దొరక్క బతికి బయటపడ్డ భార్య - Sakshi

టికెట్‌ దొరక్క బతికి బయటపడ్డ భార్య

దివాకర్‌ ట్రావెల్స్‌ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భర్త
హైదరాబాద్‌: బస్‌ టికెట్‌ దొరక్క ఏపీలోని దివాకర్‌ ట్రావెల్స్‌ ఘోర ప్రమాదం నుంచి బతికి బయట పడ్డారు నగరానికి చెందిన లావణ్య. అయితే అదే బస్సులో ప్రయాణించిన ఆమె భర్త మధుసూదన్‌ రెడ్డి మృతి చెందారు. కుమారుడికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. జీడిమెట్ల పారిశ్రా మికవాడలోని ఓ పరిశ్రమలో సైట్‌ ఇంజనీర్‌గా పనిచేసే మధుసూదన్‌రెడ్డి 15 రోజుల క్రితం కంపెనీ పనిపై భువ నేశ్వర్‌ వెళ్లారు.

అక్కడ అతనికి  జ్వరం రావడంతో భార్య లావణ్య, కుమారుడు అభిలాష్‌రెడ్డి అక్కడకు వెళ్లి మధుసూదన్‌రెడ్డిని తీసుకుని హైదరా బాద్‌కు పయనమయ్యారు. అయితే రెండు టికెట్లే లభించడంతో కుమారు డితో కలసి మధుసూదన్‌రెడ్డి దివాకర్‌ ట్రావెల్స్‌లో, భార్య రైలులో హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఇంతలో కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం జరగడంతో మధుసూ దన్‌రెడ్డి మృతి చెందగా.. అభిలాష్‌రెడ్డి స్వల్ప గాయాలతో బయట పడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement