diwakar travels
-
దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్
-
దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, అనంతపురం : దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై కర్ణాటక లోకాయుక్తను ఆశ్రయించారు. జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డి ఫోర్జరీలపై లోకాయుక్తకు ఆధారాలు సమర్పించారు. జేసీకి సహకరించిన కర్ణాటక రవాణా శాఖ అధికారుల పాత్రపైనా ఫిర్యాదు చేశారు. ( డబ్బు తీసుకుంటే ఆస్పత్రి సీజ్ చేస్తా ) కర్ణాటక డీజీపీ, పలువురు మంత్రులకు వీరిపై ఫిర్యాదు చేశారు. కాగా, 2017లో బీఎస్-3 వాహనాలను సుప్రీంకోర్టు నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే దివాకర్ ట్రావెల్స్ నిషేధిత వాహనాలను నకిలీ పత్రాలతో రిజిస్టర్ చేయించింది. స్ర్కాప్ కింద కొనుగోలు చేసిన 33 బస్సులు, లారీలను కర్ణాటకలో నడుపుతోంది. -
దురుసు ప్రవర్తన, జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్
సాక్షి, అనంతపురం: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, లాక్డౌన్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. వైద్య పరీక్షల కోసం జేసీ ప్రభాకర్‌రెడ్డిని జీజీహెచ్‌కు తరలించారు. కాసేపట్లో గుత్తి కోర్టులో ఆయనను హాజరుపర్చనున్నారు. కాగా, వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డి కండీషన్ బెయిల్‌పై గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, జేసీ విడుదల సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్ద ఆయన వర్గీయులు నానా హంగామా చేస్తూ కోవిడ్ నిబంధనలు కాలరాశారు. దీంతో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కింద జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్, పవన్‌కుమార్ సహా 31 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: విడుదలైన 24 గంటల్లోపే జేసీపై మరో కేసు) మరోవైపు జేసీ, అస్మిత్‌లు కడప సెంట్రల్ జైలు నుంచి తాడిపత్రి వరకు అనుచరగణంతో ర్యాలీగా వచ్చారు. ఈ క్రమంలో జేసీ దళిత సీఐ దేవేంద్రను పబ్లిక్‌గా బెదిరించారు. దీంతో సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించిన జేసీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కడప నుంచి తాడిపత్రి వరకు లాక్డౌన్ నిబంధనలు జేసీ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు తెలిపారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై 506, 189, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. వీటితోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ 52 కింద కూడా జేసీపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ('పోలీసులంటే జేసీ బ్రదర్స్ కు ఎందుకంత చులకన') -
దళిత సీఐని పబ్లిక్‌గా బెదిరించిన జేసీ
సాక్షి, అనంతపురం: అక్రమ వాహనాల కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలు గురువారం జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఇది జరిగిన 24 గంటల్లోపే వాళ్లిద్దరిపై మరో కేసు నమోదైంది. జేసీ విడుదల సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్ద ఆయన వర్గీయులు నానా హంగామా చేస్తూ కోవిడ్ నిబంధనలు కాలరాశారు. దీంతో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కింద జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్, పవన్‌కుమార్ సహా 31 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు జేసీ, అస్మిత్‌లు కడప సెంట్రల్ జైలు నుంచి తాడిపత్రి వరకు అనుచరగణంతో ర్యాలీగా వచ్చారు. (వాహనాల కుంభకోణం; జేసీ కొత్త నాటకం ) ఈ క్రమంలో జేసీ దళిత సీఐ దేవేంద్రను పబ్లిక్‌గా బెదిరించారు. దీంతో సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించిన జేసీపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. కాగా కండీషన్ బెయిల్లో భాగంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌లు శుక్రవారం అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఐతో దురుసుగా ప్రవర్తించడంపై జేసీని పోలీసులు విచారిస్తున్నారు. ఆయనపై మరో నాలుగు కేసులు నమోదయ్యే అవకాశాలున్నందున ఎలాంటి అవాంచనీయ ఘర్షణలు చోటు చేసుకోకుండా తాడిపత్రి పరిసరాల్లో భారీగా పోలీసులు మెహరించారు. (జేసీ వర్గీయుల హంగామా.. నిలిచిన 108 అంబులెన్సు) -
దళిత సీఐని పబ్లిక్‌గా బెదిరించిన జేసీ
-
దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై లోతుగా విచారణ
సాక్షి, అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై లోతుగా విచారణ చేస్తున్నట్లు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శివరాంప్రసాద్ తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 154 వాహనాలను అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు. అందుకు సంబంధించిన 62 బస్సులు, లారీలను అనంతపురం జిల్లాలో ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాం. మిగిలిన వాహనాలను ఎక్కడ దాచారన్న సమాచారంపై విచారణ కొనసాగిస్తున్నాం. నకిలీ ఇన్వాయిస్, ఫేక్ ఇన్సూరెన్స్‌లపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. (కర్నూల్ పీఎస్‌లో ముగిసిన జేసీ విచారణ) కరోనా కట్టడికి చర్యలు రవాణాశాఖలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నాము. అందులో భాగంగానే బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేశాము. ఎక్కువ మంది బయోమెట్రిక్ తాకటం వల్ల కరోనా సోకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఓటీపీ ద్వారా రవాణాశాఖ సేవలు పొందవచ్చు. అందుకోసమే ఓటీపీ విధానాన్ని అమల్లోకి తెచ్చిన ఆర్టీఏ అధికారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్లు,పర్మిట్లు జారీ వంటి 18 రకాల సేవలను ఓటీపీ ద్వారా అందించున్నట్లు శివరాంప్రసాద్ తెలిపారు. (నేరం అంగీకరించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి!) -
నేరం అంగీకరించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి!
సాక్షి, అనంతపురం : జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డి పోలీసు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. కస్టడీలో వారు వెల్లడించిన వివరాలు సంచలనంగా మారాయి. ఇందుకు సంబంధించి నేర అంగీకారపత్రం.. ‘సాక్షి’ చేతికి చిక్కింది. అందులో ఏముదంటే.. స్క్రాప్ వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ప్రభాకర్‌రెడ్డి చెన్నైకి చెందిన ముత్తుకుమార్‌ను సంప్రదించారు. నాగాలాండ్ ఆర్టీఏ బ్రోకర్ సంజయ్ ద్వారా వీరు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించారు. నాగాలాండ్‌కు తీసుకెళ్లకుండానే అక్కడ మొత్తం 154 వాహనాల రిజిస్ట్రేషన్ చేయించారు.(మాకేం తెలీదప్పా..అంతా బ్రోకర్లే జేసినారు..) ఇలా బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా నమోదు చేయించారు. ఇందుకోసం ముత్తుకుమార్, సంజయ్‌లకు ప్రభాకర్‌రెడ్డిలకు భారీగా డబ్బులు చెల్లించారు. ఆ తర్వాత జేసీ అనుచరుడు నాగేంద్ర నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేశారు. వీటితోనే ఎన్ఓసీ తీసకున్నారు. ఈ మేరకు జేసీ ప్రభాకర్ నేరం అంగీకరించారు. ఇలా ఫోర్జరీ చేసిన పత్రాలతో తెలంగాణ, కర్ణాటకలలో 8 వోల్వో బస్సులు, లారీలు విక్రయించారు. మొత్తం అశోక్ లేలాండ్‌కు చెందిన 154 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి.. వాటిని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు మార్చిన తీరు విస్మయం కలిగిస్తోంది.(మాజీ మంత్రి పితాని కుమారుడికి హైకోర్టు షాక్) ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి బెయిల్ పిటిషన్లు తిరస్కరణ.. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. వారి బెయిల్ పిటిషన్లపై న్యాయమూర్తి సోమవారం వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారణ చేపట్టారు. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన ఆయన.. వారి రిమాండ్‌ను ఈ నెల 27 దాకా పొడిగించారు. కాగా, ప్రస్తుతం ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలు కడప సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కూడా న్యాయమూర్తి తిరస్కరించారు. -
వాహనాల కుంభకోణం; జేసీ కొత్త నాటకం
‘జేసీ’....తన బస్సులాగే రూట్ మార్చాడు. తుక్కు వాహనాల కొనుగోలులో నకిలీలు జేసి జైలులో ఉన్న తండ్రీ, తనయులు జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డిలు కేసు నుంచి తప్పించుకునేందుకు కొత్త నాటకానికి తెరలేపారు. ఈ కేసులో తమకేం తెలియదని.. బ్రోకర్ ద్వారా వాహనాలు కొనుగోలు చేశామని బుకాయిస్తున్నారు. అయితే తప్పుడు వ్యవహారంలో వారిద్దరూ తప్పించుకోలేరని..తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని అధికారులు చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: తుక్కు వాహనాల కొనుగోలు కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డిలు కేసుల నుంచి తప్పించుకునేందుకు కొత్త నాటకానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ఈ కేసుతో తమకు సంబంధం లేదని.. కేవలం బ్రోకర్ ద్వారా వాహనాలను కొనుగోలు చేశామని బుకాయిస్తున్నట్లు సమాచారం. మొత్తం 154 బీఎస్–3 వాహనాలను తప్పుడు రిజి్రస్టేషన్లతో బీఎస్–4 వాహనాలుగా రిజి్రస్టేషన్ చేయించడంతో పాటు పలువురికి విక్రయించిన కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డిలతో పాటు మరో నలుగురిపై 27 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై విచారణ సమయంలోనే జేసీ కొత్త నాటకానికి తెరతీసినట్లు తెలుస్తోంది. స్క్రాబ్ వాహనాల కుంభకోణంలో తమకేమీ తెలియదని బుకాయించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా తాము నమ్మిన బ్రోకర్లే ఈ వ్యవహారం నడిపారని కేసు నుంచి తప్పించుకునే యత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే నాగాలాండ్ కేంద్రంగా బీఎస్–3 వాహనాలను తప్పుడు సరి్టఫికెట్లతో బీఎస్–4గా మార్చడంతో పాటు ఏకంగా పోలీసు అధికారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేశారు. అయితే, ఈ తప్పంతా తాము జేసీ ఆదేశాలతోనే చేసినట్లు ఇతర నిందితులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి తప్పించుకునే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులో ఏ–1గా జేసీ ఉమారెడ్డి (జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి), ఏ–2గా జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఏ–3గా నాగేంద్ర, ఏ–4గా బాబయ్య, ఏ–5గా జేసీ విజయ (జేసీ దివాకర్‌రెడ్డి సతీమణి), ఏ–6గా జేసీ అస్మిత్ రెడ్డి (జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు)పై అనంతపురం, తాడిపత్రి స్టేషన్లల్లో మొత్తం 27 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ తప్పుడు రిజిస్ట్రేషన్ వ్యవహారంలో వీరి పాత్రకు తగిన ఆధారాలతో పాటు సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయని...బుకాయింపులతో కేసు నుంచి తప్పించునే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఇదీ జరిగింది..! వాతావరణాన్ని కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా 2017 ఏప్రిల్ 1 నుంచి బీఎస్–3 వాహనాల రిజి్రస్టేషన్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో బీఎస్–3 వాహనాలను విక్రయించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కాలం చెల్లిన బీఎస్–3 వాహనాలను...నాగాలాండ్‌లో జేసీ ట్రావెల్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. మొత్తం 157 రవాణా వాహనాలను స్క్రాప్ కింద విక్రయించేందుకు ముందుకు రాగా... వీటిని తక్కువ ధరకు దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. ఈ విధంగా కొనుగోలు చేసిన వాహనాలను బీఎస్–4గా పేర్కొంటూ నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత వీటిని అనంతపురం రవాణాశాఖ కార్యాలయం ద్వారా ఎన్ఓసీ తీసుకుని దర్జాగా జిల్లాలో ఇష్టారాజ్యంగా తిప్పారు. కొద్ది మందికి కూడా కొత్త బీఎస్–4 వాహనాల కంటే కొంచెం తక్కువ ధరకు విక్రయించారు. అయితే, వీటిపై రవాణాశాఖ ఉన్నతాధికారులకు కాస్తా అనుమానాలు, ఫిర్యాదులు రావడంతో నాగాలాండ్‌కు వెళ్లి విచారణ ప్రారంభించారు. తీగలాగితే డొంక కదలగా... అక్రమంగా తిరుగుతున్న ఈ వాహనాలను ఎక్కడికక్కడ పట్టుకుని సీజ్ చేశారు. ఈ క్రమంలోనే జేసీ మరో ఎత్తుగడ వేశారు. విలువైన సామానులను తీసేసి.. కేవలం ఛాసీస్ మాత్రమే ఉంచి వాహనాలు అప్పగిస్తున్నారు. మరోవైపు తమను మోసం చేసి వాహనాలను విక్రయించారని పలువురు తాడిపత్రిలో ధర్నా చేయడంతో పాటు జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసులు కూడా పెట్టారు. పక్కాగా ఆధారాలు ! వాస్తవానికి ఈ విధంగా బీఎస్–3 వాహనాలను...బీఎస్–4 వాహనాలుగా పేర్కొంటూ తప్పుడు రిజి్రస్టేషన్ జరిగిన వాహనాలకు ఎన్ఓసీ ఇవ్వడం సాధ్యం కాదని రవాణాశాఖ అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ వాహనాలను తాము రిజి్రస్టేషన్ చేస్తే తమకు ఇబ్బందులు తప్పవని, అందువల్ల తాము ఈ పనిచేయలేమని తేలి్చచెప్పినట్లు సమాచారం. అయితే, నాగాలాండ్‌లో రిజి్రస్టేషన్ చేసిన తర్వాత ఆర్సీలో బీఎస్–4 వాహనాలు అని పేర్కొన్నారని.. మీకేమీ ఇబ్బంది ఉండదంటూ వివిధ రకాలుగా రవాణాశాఖ అధికారులకు ఆశపెట్టి, బెదిరించి ఎన్ఓసీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మాత్రం ఎన్ఓసీ ఇచ్చిన రవాణాశాఖ అధికారులది తప్పంటూ జేసీ బ్రదర్స్ వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. అంతేకాకుండా తాము నేరుగా ఈ వాహనాలను కొనుగోలు చేయలేదని.. తప్పంతా బ్రోకర్లదేనని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, మొత్తం వ్యవహారంలో వీరి పాత్ర స్పష్టంగా ఉండటంతో ఎన్ని నాటకాలు ఆడినా తప్పించుకునే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
జేసీ ప్రభాకర్‌రెడ్డికి పీటీ వారెంట్లు జారీ
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డికి రెండు కేసుల్లో జిల్లా కోర్టు శనివారం పీటీ వారెంట్లు జారీ చేసింది. తాడిపత్రి కేసుల్లో వారిద్దరికీ కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. కడప సెంట్రల్ జైల్లో ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు.మరోవైపు నిషేధిత వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లు, మోసపూరిత విక్రయాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. తాడిపత్రిలో రవికుమార్ అనే ఆర్టీఏ బ్రోకర్‌ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఇన్వాయిస్, ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ల తయారీపై పోలీసులు అతన్ని ఆరా తీస్తున్నారు. నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ల చెలామణిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, జేసీ ట్రావెల్స్ ఫొర్జరీ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డికి అనంతపురం కోర్టు జూలై 1 దాకా రిమాండ్ పొడిగిస్తూ శుక్రవారం ఆదేశించింది. (చదవండి: జేసీ ప్రభాకర్‌రెడ్డికి రిమాండ్ పొడిగింపు) -
జేసీ ప్రభాకర్‌రెడ్డికి రిమాండ్ పొడిగింపు
సాక్షి, అనంతపురం : జేసీ ట్రావెల్స్ ఫొర్జరీ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిలకు అనంతపురం కోర్టు జూలై 1 దాకా రిమాండ్ పొడిగించింది. ప్రస్తుతం కడప జైలులో ఉన్న ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు విచారణకు హాజరుపరిచారు. దీంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. రిమాండ్ పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.(చదవండి : జేసీ ట్రావెల్స్ కేసు.. కీలక విషయాలు) మరోవైపు ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలకు బెయిల్ ఇవ్వాలని అనంతపురం జిల్లా కోర్టులో వారి తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేశారు. అలాగే ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను తమ కస్టడీకి అప్పగించాలని తాడిపర్తి పోలీసులు గుత్తి కోర్టులో పిటిషన్లో దాఖలు చేశారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లు, మోసపూరిత విక్రయాలపై జేసీ వారి నుంచి వివరాలు సేకరించేందుకు అనుమతివ్వాలని పోలీసులు ఈ పిటిషన్లో కోరారు. -
నేడు మెజిస్ట్రేట్ ముందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి
సాక్షి, అనంతపురం: దివాకర్ రోడ్‌లైన్స్, బీఎస్ 3 వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలను వన్‌టౌన్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఆదివారం వన్‌టౌన్‌లో సీఐ ప్రతాప్‌రెడ్డి దాదాపుగా 40 వాహనాలకు సంబంధిన రిజిస్ట్రేషన్లపై లోతుగా విచారణ చేపట్టారు. వాహనాలను ఎక్కడ కొనుగోలు చేశారు? నాగాలాండ్‌లో ట్రక్కు వాహనాల కొనుగోలు, రిజిస్ట్రేషన్లు, తదితరాలపై తండ్రీకొడుకులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం మెజిస్ట్రేట్ ముందు మరోసారి వీరిద్దరినీ వన్‌టౌన్ పోలీసులు హాజరుపర్చనున్నారు. కస్టడీని పొడిగించాలని కోరనున్నట్లు సమాచారం. చదవండి: కస్టడీకి జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి -
జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌లకు షాకిచ్చిన కోర్టు!
సాక్షి, అనంతపురం : జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌ల బెయిల్ పిటిషన్‌ను గురువారం కోర్టు తిరస్కరించింది. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌లను రెండు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ ఇద్దరిపై మరో ఐదు కేసుల్లో పీటీ వారెంట్లు జారీ అయ్యాయి. 154 బస్సులు, లారీల అక్రమ రిజిస్ట్రేషన్‌పై.. జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డిని పోలీసులు విచారించారు. ( జేసీ ట్రావెల్స్ అక్రమాలపై లోతుగా విచారణ ) కాగా, రెండు బస్సులకు సంబంధించి నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్తో ఎన్ఓసీ పొందిన కేసులో ఈ నెల 13న ఏ2 జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏ6 జేసీ అస్మిత్ రెడ్డిలకు మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారిని వన్‌టౌన్ పోలీసులు వారిని కడప కారాగారానికి తరలించారు. గత సోమవారం జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిల బెయిల్‌కు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు దాఖలైంది. నేడు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరష్కరించింది. ( మరో వివాదంలో జేసీ దివాకర్ రెడ్డి) -
జేసీ ప్రభాకర్ రెడ్డిపై పీటీ వారెంట్
సాక్షి, అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ అక్రమాల్లో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. అనంతపురం వన్‌టౌన్ పోలీసులు మూడు కేసులకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలపై సోమవారం కోర్టులో పీటీ వారెంట్(క్రైం నెంబర్ 33) వేశారు. గతేడాది జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ తుక్కు కింద బీఎస్ 3 వాహనాలను కొనుగోలు చేశారు. తప్పుడు ఇన్వాయిస్లతో తుక్కు కింద కొనుగోలు చేసిన ఆ వాహనాలను నాగాలాండ్ రాజధాని కొహిమా.. అనంతపురం, ఇతర రాష్ట్రాల్లో బీఎస్ 4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతపురంలో రిజిస్ట్రేషన్ చేయించిన 80 వాహనాలపై రవాణాశాఖాధికారులు వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ కేసులకు సంబంధించి వన్‌టౌన్ పోలీసులు కోర్టులో పీటీ వారెంట్‌ను వేశారు. తండ్రీ, కొడుకులు కడప కారాగారంలో ఉండగానే పోలీసులు పీటీ వారెంట్ నమోదు చేయడం చర్చనీయాంశమైంది. మెజిస్ట్రేట్ పీటీ వారెంట్‌పై విచారణ నేటికి(మంగళవారం) వాయిదా వేశారు. చదవండి: ‘జేసీ బ్రదర్స్’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు బెయిల్ దాఖలు.. జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిల బెయిల్‌కు సంబంధించి సోమవారం ఆన్లైన్లో దరఖాస్తు దాఖలైంది. రెండు బస్సులకు సంబంధించి నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్తో ఎన్ఓసీ పొందిన కేసులో ఈ నెల 13న ఏ2 జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏ6 జేసీ అస్మిత్ రెడ్డిలకు మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ క్రమంలో వన్‌టౌన్ పోలీసులు వారిని కడప కారాగారానికి తరలించారు. ఈ కేసుకు సంబంధించి బెయిల్ దరఖాస్తుపై విచారణను మెజిస్ట్రేట్ నేటికి వాయిదా వేశారు. చదవండి: జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పరీక్షలు -
అంతులేని అవినీతి..
-
40 ఏళ్ల నుంచి అక్రమంగా దివాకర్ ట్రావెల్స్ నిర్వహణ
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన జేసీ బ్రదర్స్ (జేసీ దివాకర్‌రెడ్డి– జేసీ ప్రభాకర్‌రెడ్డి) వ్యాపార సామ్రాజ్యమంతా అవినీతి, అక్రమమేనని తేలింది. గత తెలుగుదేశం పాలనలో మరీ చెలరేగిపోయారు. ట్రావెల్స్, ట్రాన్స్పోర్ట్, అసాంఘిక కార్యకలాపాలు, మాన్యం భూముల ఆక్రమణ తదితర వాటి ద్వారా గత ఐదేళ్లలో రూ.2900 కోట్ల మేర దోపిడీ సాగించారు. తాడిపత్రి: దివాకర్ ట్రావెల్స్ అక్రమాలు 2012లో వెలుగులోకి వచ్చాయి. అప్పటి రవాణా శాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య మహబుబ్‌నగర్ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఓ మహిళా ప్రయాణికురాలు ఇచ్చిన సమాచారం మేరకు రవాణా శాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య స్వయంగా అధికారులతో కలిసి కర్నూలు – హైదరాబాద్ జాతీయ రహదారిలో తనిఖీలు నిర్వహించారు. దివాకర్ ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సులో మొబైల్ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి.. ఆ బస్సును కూడా సీజ్ చేశారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్‌పై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించి అనుమతులు లేని బస్సులను పదుల సంఖ్యలో సీజ్ చేశారు. ఆదర్శ మున్సిపాలిటీలోనూఅంతులేని అవినీతి తాడిపత్రి మున్సిపాలిటీ పేరుకే ఆదర్శం.. కానీ ఆ ఆదర్శం మాటున అంతులేని అవినీతి చోటు చేసుకుంది. జేసీ సోదరులే కాకుండా వారి అనుచరులు సైతం తాడిపత్రి మున్సిపాలిటీని అడ్డుపెట్టుకొని రూ.200 కోట్లకు పైగా దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డి బినామీగా వ్యవహరించిన ప్రధాన అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి పట్టణంలోని జేసీ నాగిరెడ్డి మున్సిపల్ కాంప్లెక్స్‌లో మొదటి అంతస్తు టెండర్ దక్కించుకున్నాడు. మొదటి అంతస్తుకు సంబంధించి రూ.2.73కోట్లు బకాయిలు మున్సిపాలిటీకి చెల్లించాలి. ఈ మొత్తం కాంప్లెక్స్‌ను వ్యాపారులకు సబ్లీజుకు ఇచ్చేశాడు. ఒక్కో వ్యాపారి నుంచి రూ.20 వేల నుంచి రూ.30 వేలు చొప్పున అద్దె వసూలు చేశాడు. ఈ కాంప్లెక్స్‌లో కనీసం 50 మంది వ్యాపారులు ఉంటారు. ఈ లెక్క ప్రకారం నెలకు రూ.10 లక్షలు నుంచి రూ.15 లక్షల ఆదాయం వచ్చేది. ఇదే కాంప్లెక్స్‌లో 64, 68 నంబర్ షాపులు కూడా ఎస్వీ రవీంద్రారెడ్డి దక్కించుకున్నారు. వీటికి రూ.3.52 లక్షలు గుడ్‌విల్, రూ.3.33 లక్షలు బాడుగల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో ఈ దుకాణాల లీజును మున్సిపల్ అధికారులు రద్దు చేశారు. అయినా ఈ దుకాణాలు లీజుకు ఇచ్చి ప్రతినెలా భారీగా అద్దె వసూలు చేశాడు. గత ఐదేళ్లుగా ఇదే తంతు కొనసాగించాడు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో 64, 76, 68, 62 నంబర్ షాపులను కూడా ఎస్వీ రవీంద్రారెడ్డి దక్కించుకున్నాడు. వీటికి రూ.2 వేల చొప్పున మాత్రమే అద్దె చెల్లిస్తున్నారు. వ్యాపారులకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సబ్లీజుకు ఇచ్చారు. రెండు కాంప్లెక్స్‌లోని అద్దెలు రవీంద్రారెడ్డి వసూలు చేసినా, ఈ డబ్బులు తిరిగి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి చేరినట్లు సొంత పార్టీ నేతలే చెబుతుండడం గమనార్హం. నిజాయతీ అధికారికి బదిలీనే బహుమానం మైనింగ్ విజిలెన్స్ ఏడీగా ప్రతాప్‌రెడ్డి 2015 ఆగస్టు 21న బాధ్యతలు స్వీకరించారు. తాడిపత్రిలో జరుగుతున్న గ్రానైట్ మాఫియా అక్రమాలు చూసి ఆయన షాక్‌కు గురయ్యారు. గ్రానైట్ దందాపై ఉక్కుపాదం మోపారు. 2015కు ముందు ఏటా కోటి రూపాయలు కూడా ఫెనాల్టీ రూపంలో వచ్చేవి కావు. కానీ 2015–16లో రూ.5.40 కోట్లు, 2016–17లో రూ.5.55 కోట్లు రాబట్టారు. ఈ జరిమానాలను బట్టి అక్కడ దందా ఏ స్థాయిలో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. తమకు ప్రతిబంధకంగా మారుతున్న ప్రతాప్‌రెడ్డిని బదిలీ చేయించాలని చూశారు. చివరకు చంపుతామంటూ బెదిరింపులకు కూడా దిగారు. దీంతో గ్రానైట్ మాఫియాతో తనకు ముప్పు ఉందంటూ మైనింగ్ విజిలెన్స్ డైరెక్టర్‌కు ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. అప్పటి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పీఏ రవీంద్రారెడ్డితో పాటు గ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరెడ్డి, బిల్లుల బాబు, నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత ప్రతాప్‌రెడ్డిని ఇక్కడి నుంచి ఆ మాఫియానే బదిలీ చేయించి తమ అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగించింది. అధికారాన్నీ అడ్డుపెట్టుకుని గ్రానైట్ మాఫియా ద్వారా రూ. 200 కోట్లకు పైగా ఆర్జించారన్న ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. మాఫియా జోక్యం లేక ముందు ఈ ప్రాంత గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు ప్రతి నెలా రూ.9.5 కోట్ల మేర విద్యుత్ బిల్లులు చెల్లించేవారు. అంటే పరిశ్రమలు ఎంత బాగా నడిచాయో ఈ బిల్లులను చూస్తే తెలిసేది. మాఫియా జోక్యంతో పరిశ్రమలు కాస్తా చీమకుర్తి, మాటూరు, చిత్తూరు, కర్నూలు, ఒంగోలు తదితర ప్రాంతాలకు తరలిపోయాయి. దీంతో ప్రస్తుతం రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్లు మాత్రమే కరెంటు బిల్లులు వస్తున్నాయి. అంటే గ్రానైట్ పరిశ్రమలు భారీగా మూతపడ్డాయి. తద్వారా రూ.2,500 కోట్లు గ్రానైట్ పరిశ్రమకు నష్టం వాటిల్లింది. ట్రాన్స్పోర్ట్ ద్వారా రూ.300 కోట్లు ఆర్జాస్ స్టీల్‌ప్లాంట్ కోసం హుసేన్‌పురం, జంబులపాడు, చల్లవారిపల్లి, వీరాపురం గ్రామాల ప్రజలు దాదాపు రెండు వేల ఎకరాల వరకు తమ భూములను స్వాధీనం చేశారు. వీరు లారీలు, ఇతర మార్గాల ద్వారా ఈ ప్లాంటుపై ఆధారపడి జీవించే వారు. అయితే దివాకర్ రోడ్‌లైన్స్, ట్రాన్స్ ఇండియా పేరుతో జేసీ బ్రదర్స్ సొంతంగా ట్రాన్స్‌పోర్టు ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జేసీ బ్రదర్స్ ట్రాన్స్‌పోర్ట్‌ను కాదనే ధైర్యం ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఉండేది కాదు. దీంతో తొలి ప్రాధాన్యత జేసీ వారికే ఇస్తూ వచ్చేవారు. అయితే ఇందుకు సంబంధించిన బిల్లులను జేసీ బ్రదర్స్ ట్రాన్స్‌పోర్టు పేరు మీద కాకుండా తాడిపత్రి లారీ అసోసియేషన్ పేరుపై చేయిస్తూ ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొడుతున్నట్లు సమాచారం. లారీలపై జేసీపీఆర్ అని ఉంటుంది. బిల్లులు మాత్రం ఆయన పేరుతో ఉండవు. మొత్తం బినామీ లెక్కలే. ఈ లారీలు మినహా ఇతర లారీలు స్టీల్‌ప్లాంట్‌లోకి వెళ్లేందుకు వీల్లేదు. ఇలా ఐదేళ్లలో ట్రాన్స్పోర్ట్ ద్వారా రూ.300 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. డ్రై స్లాగ్ ద్వారా నెలకురూ.15కోట్ల ఆదాయం ఆర్జాస్ స్టీల్ ప్లాంట్‌లో డ్రై స్లాగ్‌ను టన్ను రూ.10తో ఇక్కడి టీడీపీ నేతలు కొనుగోలు చేసేవారు. దీనిని అల్ట్రాటెక్ సిమెంట్, సాగర్ సిమెంట్ పరిశ్రమలకు తరలించి టన్ను రూ.850 చొప్పున విక్రయిస్తారు. ట్రాన్స్‌పోర్టు, ఇతర ఖర్చుల కింద రూ.250 పోగా రూ.600 మేర మిగులుతుండేది. ప్రతి నెలా 25వేల టన్నులకు పైగా డ్రైస్లాగ్‌ను ఈ స్థాయిలో తరలించే వారు. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.750 కోట్లకు పైగా ఆదాయం గడించినట్లు తెలుస్తోంది. అన్ని రూట్లకూ ఒకటే పర్మిట్ జేసీ సోదరులు అధికార బలంతో రవాణా శాఖ అధికారులను గుప్పిట్లో పెట్టుకొని ఒక పర్మిట్ నంబర్‌పైనే పలు రూట్లలో అనధికారికంగా బస్సులు నడుపుతూ వచ్చారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్‌ల నిర్వహణపై నిఘా అధికమైంది. దీనికి తోడు దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు తరచూ ప్రమాదాలకు గురయ్యేవి. ఈ ట్రావెల్స్ అక్రమాలపైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. రంగంలోకి దిగిన రవాణా శాఖ అధికారులు అనుమతులు లేకుండా తిరుగుతున్న బస్సులన్నింటినీ ఎక్కడికక్కడ సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. రాజకీయ అవసరాలకు మట్కా డాన్ సహకారం తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ రాజకీయ అవసరాలకు మట్కా డాన్ రషీద్ స్పాన్సర్‌గా వ్యవహరించేవాడు. నియోజకవర్గంలోని నేతలకు పెద్ద మొత్తంలో కానుకలను ఆయన అందజేసేవాడు. ప్రజాప్రతినిధులు కార్లు కొనుగోలు చేస్తే వాటికి నెలవారీ కంతులు కూడా రషీద్ చెల్లించేవాడని తెలిసింది. మట్కా నిర్వహణకు పోలీసుల నుంచి ఇబ్బందులు రాకుండా కప్పం రూపంలో స్థానిక నేతలకు రషీద్ నజరానాలు ఇచ్చేవాడు. 2018 డిసెంబర్ 30న వైఎస్సార్ జిల్లాకు చెందిన సీఐ హమీద్‌ఖాన్‌తో పాటు పోలీసులపై దాడి చేసి వారి వాహనాన్నే తగులబెట్టి సవాల్ విసిరే స్థాయికి ఎదిగాడంటే అతని వెనుక ఉన్న వ్యక్తి ఎవరనేది తాడిపత్రిలోని ఏఒక్కరినీ అడిగినా తెలుస్తుంది. మాన్యాన్నీ వదలని జేసీ సోదరులు పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరులో పప్పూరమ్మ ఆలయానికి దాదాపు 19 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. ఈ భూముల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఆలయంలో ధూపదీప నైవేద్యాలు, నిత్య కైంకర్యాలు చేస్తుండేవారు. అయితే తాడిపత్రి – పెద్దపప్పూరు ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ భూములను మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కబ్జా చేసి పంట సాగు చేపట్టారు. రెండు పెద్ద ఫారంపాండ్లు ఏర్పాటు చేయించి బోరుబావుల నీటితో వాటిని నింపారు. ఈ నీటితో మాన్యం భూముల్లో కరివేపాకు, అరటి సాగు చేశారు. పంట దిగుబడుల ద్వారా రూ.లక్షలు ఆర్జిస్తున్నా ఆలయంలో పూజలకు కనీసం ఒక్క పైసా కూడా చెల్లించలేదనే ఆరోపణలున్నాయి. ఏడాది క్రితం ఈ విషయంపై విచారణకు వచ్చిన దేవదాయ శాఖ అధికారలు ఆ భూములన్నీ జేసీ దివాకర్‌రెడ్డి అధీనంలో ఉన్నాయని తెలుసుకుని నోరు మెదపకుండా వెళ్లిపోయారు. మూడు నెలల క్రితం అధికారులు వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. గ్రానైట్ మాఫియా తాడిపత్రిలో 850 వరకు గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి 70 లారీలతో 20 నుంచి 30 మంది ట్రాన్స్పోర్టర్లు గ్రానైట్ రాళ్లను చిత్తూరు, మడకశిర, కర్నూలు ప్రాంతాల నుంచి తీసుకువస్తుంటారు. ఒక లోడు గ్రానైట్‌ను క్వారీ నుంచి తాడిపత్రికి చేరాలంటే రూ.45 వేల నుంచి రూ.50 వేలు రాయల్టీ చెల్లించాలి. అయితే రాయల్టీ లేకుండా క్వారీ నుంచి తాడిపత్రికి గ్రానైట్ చేర్చేలా క్వారీ యాజమాన్యం తాడిపత్రి పాలిష్ మిషన్ వ్యాపారుల మధ్య కుదిరిన ఒప్పందం మాఫియాను తలపించింది. లారీలో ఉన్న గ్రానైట్ పరిమాణాన్ని తగ్గించి బిల్లులో చూపించి రవాణా చేసేవారు. ఒకే బిల్లుతో 5 – 6 లోడ్లు రవాణా చేస్తుండేవారు. ఈ డబ్బులు మొత్తం మాఫియాను నడిపే ఓ పెద్దమనిషి ఇంటికి చేరవేసేవారు. అక్కడ వాటాల పంపకం జరుగుతుండేది. -
ఎన్ఓసీల కోసం బరితెగించిన దివాకర్ ట్రావెల్స్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అక్రమాలే పెట్టుబడిగా.. అధికారమే అరాచకంగా ఇన్ని రోజులుగా వ్యవహరిస్తున్న జేసీ బ్రదర్స్ పాపాలపుట్ట ఒక్కొక్కటిగా పగిలిపోతోంది. ఇప్పటికే పర్మిట్లు లేకుండా బస్సులను ఇష్టారాజ్యంగా తిప్పిన దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం.. ఏకంగా పోలీసు సంతకాలనే ఫోర్జరీ చేసి నిరంభ్యంతర సర్టిఫికెట్(ఎన్ఓసీ) పత్రాలు సృష్టించింది. వీటితో లారీలను విక్రయించిన ఘటన బయటపడి 24 గంటలు కూడా గడవకముందే మరో ఫోర్జరీ బాగోతం వెలుగులోకి వచ్చింది. తాజాగా తాడిపత్రి ఎస్ఐ సంతాకాన్ని ఫోర్జరీ చేసి.. రవాణా శాఖకు దరఖాస్తు చేసుకుని ఎన్ఓసీ తీసుకోవడం ద్వారా తెలంగాణలో రెండు బస్సులను విక్రయించారు. ఈ వ్యవహారాన్ని గుర్తించిన రవాణాశాఖ అధికారులు సదరు యాజమాన్యంపై అనంతపురం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. దీంతో దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కథ నడిపించారిలా.. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన లారీలు, బస్సులకు సంబంధించిన రికార్డుల్లో అక్రమాలు భారీగా జరిగినట్టు తెలుస్తోంది. దీంతో వీటి విక్రయానికి దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం అడ్డదారులు తొక్కినట్టు అర్థమవుతోంది. ఈ ట్రావెల్స్‌కు చెందిన ఆరు లారీలను బెంగళూరులో విక్రయించారు. ఇందుకోసం స్థానిక పోలీసుల నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, రికార్డులన్నీ నకిలీవి కావడంతో అడ్డదారుల్లో పోలీసు సంతకాలను ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ స్టాంపులను తయారుచేసి పోలీసుల నుంచి ఎన్ఓసీ తీసుకున్నారు. తద్వారా ఎన్ఓసీ ఉన్నట్టు చూపించి లారీలను బెంగళూరులో విక్రయించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. అయితే, లారీలతోపాటు రెండు బస్సులను(ఏపీ02టీసీ9666, టీఎస్09యుబీ7034) కూడా ఇదే విధంగా పోలీసు సంతకాలను ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ స్టాంపులతో రవాణా శాఖకు ఎన్ఓసీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. అనంతరం వీటిని తెలంగాణలో దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం విక్రయించింది. అయితే, తమకు దరఖాస్తు చేసింది ఫోర్జరీ డాక్యుమెంట్లు అని గుర్తించిన రవాణాశాఖ అధికారులు అనంతపురం 1వ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు మొత్తం దివాకర్ ట్రావెల్స్‌కు సంబంధించిన వాహనాల రికార్డుల్లో అక్రమాలు జరిగాయని.. వీటిపై లోతైన విచారణ జరపాలంటూ ఉన్నతాధికారులకు కొందరు ఆధారాలతో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఆ మేరకు రవాణాశాఖ ఉన్నతాధికారులు అక్రమాలను వెలికితీసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరింత లోతుగా.. ఇప్పటికే పర్మిట్లు లేని వ్యవహారంతో పాటు ఫోర్జరీ డాక్యుమెంట్ల తయారీలో దివాకర్ ట్రావెల్స్ వ్యవహారం బయటపడింది. ఇక ఏకంగా అసలు రవాణాశాఖ నుంచి ఉన్న బస్సులకు కూడా పర్మిట్లు తీసుకున్న వ్యవహారంలో మొత్తం ఫోర్జరీ డాక్యుమెంట్లను సమర్పించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కూడా రవాణాశాఖ ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం ట్రావ్సెల్ బస్సులకు సమర్పించిన వివిధ డాక్యుమెంట్లన్నీ కూడా నకిలీవేనన్న ఫిర్యాదులు రవాణాశాఖ ఉన్నతాధికారులకు చేరాయి. దీంతో ప్రధాన కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారులు జిల్లాకు విచ్చేసి మొత్తం అక్రమ వ్యవహారాలను లాగే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అక్రమాల మొత్తం లోగుట్టును ఒకటి రెండు రోజుల్లో రవాణాశాఖ అధికారులు బయటపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే దివాకర్ ట్రావెల్స్‌పై సీరియస్ చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ అక్రమ వ్యవహారాల్లో వెనుక నుంచి ఇన్నాళ్లుగా కథ నడిపించిన జేసీ బ్రదర్స్ దోషులుగా చట్టం ముందు నిలవాల్సిన పరిస్థితి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం వేధిస్తోందన్న వ్యాఖ్యలను జేసీ చేస్తున్నట్టు తాజా ఘటనలతో అర్థమవుతోంది. -
జేసీపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్
సాక్షి, తాడిపత్రి : గడిచిన సార్వత్రిక ఎన్నికలలో ఘోర ఓటమిని చవిచూసిన మాజీ ఎంపీ జేసి దివాకర్‌రెడి మతిస్థిమితం కోల్పోయి పోలీసు వ్యవస్థ, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. గన్నెవారిపల్లెకాలనీలో ఆదివారం వైఎస్సార్సీపీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసు వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ అనంతపురం రూరల్ స్టేషన్లో కొన్ని గంటల పాటు వేచి ఉన్నందుకే పోలీసులు, ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో హత్యా రాజకీయాలు చేసి నియోజకవర్గ ప్రజలు, రైతు కుటుంబాలకు చెందిన పలువురిని అదే పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని స్టేషన్లు, జైలుకు పంపి కక్ష తీర్చుకున్న గత చరిత్రను మరచిపోయావా జేసి అని ప్రశ్నించారు. చదవండి: బీజేపీ మన పార్టీయే అంటున్న జేసీ పోలీసు వ్యవస్థను అతి నీచంగా మాట్లాడి, తప్పు చేసిన నీపై కేసు నమోదు చేయడం అందుకు సంబంధించి విధులు నిర్వర్తించటం పోలీసుల బాధ్యతని తెలియకపోవడం విచారకరమన్నారు. చట్టం అందరికీ సమానమేనని, తప్పు చేసిన వారిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందే తప్ప, అందులో ఎలాంటి కక్షపూరిత చర్యలకు తావుండదన్నారు. మీ హయాంలో పోలీసులు మీకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఇప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అలానే వ్యవహరిస్తారనుకుంటున్నారని, అలాంటి ఆటలు ఇక సాగవన్నారు. వైఎస్సార్సీపీలోకి తనను ఆహ్వానిస్తున్నారు. అని జేసీ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని, నీలాంటి నీచ రాజకీయ నాయకులకు ఎన్నటికీ తమ పార్టీలో చోటు దక్కదన్నారు. ప్రజల సంక్షేమం కోసం తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి నిత్యం పాటు పడుతున్నాడని, అందులో భాగంగానే నాయకులదరం ప్రజల కోసం పని చేస్తున్నామని తెలిపారు. కక్ష సాధింపెలా అవుతుంది? అక్రమంగా బస్సులను తిప్పుతున్న నీ ట్రావెల్స్‌పై ట్రాన్స్ పోర్ట్ అధికారులు చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు చర్యలు అని ఏ విధంగా చెప్పగలగుతావు. అన్ని ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా ఉంటే అధికారులు బస్సులపై ఎందుకు చర్యలు తీసుకుంటారు. అక్రమంగా బస్సులను తిప్పుతున్నావు కనుకే బస్సులను అధికారులు సీజ్ చేస్తున్నారన్నారు. బస్సులకు ఇన్సూరెన్సు సైతం చెల్లించకుండా ఉన్నది వాస్తవం కాదా అన్నది బహిర్గతం చేయాలన్నారు. ఈ విషయమై తాను బహిరంగ చర్చకు సిద్ధమేనని ఎమ్మెల్యే మాజీ ఎంపీ జేసీకి సవాల్ విసిరారు. పోలీసులు ఆలోచించాలి ప్రబోధానంద ఆశ్రమం పైదాడి చేసేందుకు దాదాపు 500 మంది కార్యకర్తలను వెంటబెట్టుకొని వెళ్లి అల్లర్లు సృష్టించిన కేసులో ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదో పోలీసులు ఆలోచించాలన్నారు. పట్టణ పోలీస్‌స్టేషన్ గేటుకు తాళాలు వేసి ఓ సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీ స్థాయి అధికారిని దూషించిన ఈ విషయమై జేసీపై పోలీసులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. -
మాజీ ఎంపీ జేసీకి మరో ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రవాణా శాఖ అధికారులు మంగళవారం జరిపిన తనిఖీల్లో ఐదు జేసీ ట్రావెల్స్ బస్సులు పట్టుబడ్డాయి. ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లు లేకపోవడంతో అధికారులు ఈ బస్సులను సీజ్ చేశారు. అనంతపురం డీటీసీ శివరాంప్రసాద్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. తాజా దాడులతో ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లలో అక్రమాలు కారణంగా మొత్తం 36 బస్సులు.. 18 కాంట్రాక్టు బస్సులను అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించిన జేసీ బ్రదర్స్ సరైన పర్మిట్లు లేకుండా బస్సులు నడపటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
దివాకర్ ట్రావెల్స్..రాంగ్రూట్లో రైట్‌రైట్
ఆయనో పెద్ద మనిషి. మైకు దొరికితే నీతులు చెబుతుంటారు. ముఖ్యమంత్రులు, ప్రధానులకు సైతం సలహా ఇచ్చే రీతిలో వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ ఆయన బిజనెస్ మొత్తం అడ్డదారిలో సాగుతోంది. కొన్నేళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ ట్రావెల్స్ బస్సుల ద్వారా రూ. కోట్లు కొల్లగొట్టారు. అన్నాతమ్ముడు ఏకమై పాతికేళ్లుగా ప్రైవేటు ట్రావెల్స్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతూ ఎన్నో ప్రాణాలు తీశారు. మరెంతో మందిని క్షతగాత్రులుగా మిగిల్చారు. అందుకే ఆ బస్సు చూస్తే చాలు జనం మృత్యుశకటమొచ్చనంటూ పరుగులు తీస్తున్నారు. సాక్షి, అనంతపురం: మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిలకు చెందిన దివాకర్ ట్రావెల్స్...జిల్లాలోనే కాదు...రాష్ట్ర వ్యాప్తంగా సర్వీసులు నడుపుతోంది. కానీ అన్నీ అడ్డదారిలోనే...పర్మిట్ ఓ రూట్లో తీసుకుని...మరో రూట్లో బస్సులు నడుపుతారు. కొన్నింటికి అసలు పర్మిటే ఉండదు. ఇలా అడ్డదారిలో అడ్డంగా తిరుగుతున్న ట్రావెల్స్‌పై ఇటీవల రవాణాశాఖ అధికారులు నిఘా వేశారు. ఆకస్మిక తనిఖీలు చేయగా.. ట్రావెల్స్ గుట్టు రట్టయ్యింది. ఇటీవల రోడ్డు రవాణాశాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ప్రారంభించారు. ఈ క్రమంలో జిల్లాలోనూ ఉపరవాణా కమిషనర్ శివరామప్రసాద్ ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయిన అధికారులు ఈనెల 16న వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. తొలిరోజు 8, మరుసటి రెండు బస్సులను సీజ్ చేశారు. జిల్లాలో సీజన్ చేసిన వాటిలో 8 బస్సులు దివాకర్ ట్రావెల్స్‌వే కావడం గమనార్హం. ఇలా అనంతపురంలో 4, గుంతకల్లులో 3, పెనుకొండలో ఒక దివాకర్ బస్సును సీజ్ చేశారు. రవాణాశాఖ నిబంధనలను తుంగలోకి తొక్కి బస్సులు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అంతా అడ్డదారిలోనే... ఇంటర్‌స్టేట్ క్యారేజ్ అనుమతులు తీసుకొని జిల్లా వ్యాప్తంగా మొత్తం 196 ప్రైవేటు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. స్టేజ్ క్యారెజ్ అనుమనుతులు తీసుకున్న ప్రైవేటు ట్రావెల్స్ రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలోనే ఉండటం గమనార్హం. అనంతపురం టూ బెంగుళూరు, అనంతపురం టూ బళ్లారి, అనంతపురం టూ చెళికర, అనంతపురం టూ హైదరాబాద్ సర్వీసుల పేరుతో పలు ట్రావెల్స్‌కు చెందిన బస్సులు తిరుగుతున్నాయి. ఒక పర్మిట్‌తో రెండు, మూడు బస్సులు ఇంటర్ స్టేజ్ వ్యవహారం వెనుక భారీ అక్రమాలు జరుగుతున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ అనుమతులు తీసుకున్నది ఒక రూట్ అయితే.. మరో రూట్లో బస్సులు తిప్పితున్నారు. కొన్నింటికి గడువు మీరిపోయినా అలాగా కొనసాగిస్తున్నారు. మరికొందరు అనుమతి ఒక బస్సుపై ఉంటే.. రెండు మూడు బస్సులు అదనంగా తిప్పుతున్నారు. ఇందులో దివాకర్ ట్రావెల్స్ బస్సులు కూడా మినహాయింపేమి కాదు. ఇటీవల అధికారులు సీజ్ చేసిన 8 దివాకర్ బస్సుల్లో రెండింటికీ పూర్తిగా అనుమతి లేకపోవడం, మరికొన్నింటిలో నిబంధనలకు విరుద్ధంగా సీటింగ్ కెపాసిటీ పెంచి ప్రయాణికులను ఎక్కించుకోవడం, మరికొన్నింటిలో డ్రైవర్లు, కండెక్టర్లకు లైసెన్స్‌లు లేనట్లు అధికారులు గుర్తించారు. దీంతో (ఏపీ02టీహెచ్4220, ఏపీ02టీఈ2196, ఏపీ02టీసీ3969, ఏపీ02టీఏ6373, ఏపీ02టీఈ0135, కేఏ01ఏకే3929, కేఏ34ఏ0987, కేఏ34ఏ8874) సీజ్ చేసినట్లు రవాణాశాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వానికి రూ.కోట్లలో గండి... ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అనుమతులు లేకుండా తిరుగుతుండడంతో పాటు అనుమతి లేని రహదారులపై కూడా దర్జాగా రాకపోకలు సాగిస్తున్నాయి. తాజాగా రవాణాశాఖ అధికారుల దాడులతో బట్టబయలు అయిన వ్యవహారం జిల్లాలో కొన్నేళ్ల నుంచి జరుగుతున్నా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ట్రావెల్స్ దందా కొనసాగించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పనిచేసిన రవాణాశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారు. రహదారులపై అడ్డదారిలో తిరగడమే కాకుండా ఏపీఎస్ ఆర్టీసీకి నష్టం కలిగించేలా కొన్ని రూట్లలో అతివేగంతో రాకపోకలు సాగిస్తూ అనేక మంది ప్రజల ప్రాణాలను కూడా జేసీ ట్రావెల్స్ బస్సులు తీశాయి. ఇటీవల రవాణా శాఖ అధికారులు సీజ్ చేసిన దివాకర్ ట్రావెల్స్ బస్సులు 8 2017 నవంబర్ 3న ఆత్మకూరు సమీపంలోని వడ్డుపల్లి వద్ద వేగంగా వచ్చిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వచ్చిన బొలొరో వాహనాన్ని ఢీ కొంది. ఈ ఘటనలో ‘ఆత్మ’ డీపీడీ రమణ ప్రాణాలు కోల్పోయారు. 2017 సెప్టెంబర్‌లో ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లెకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తిని కామారుపల్లివద్ద దివాకర్ బస్సు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సదరు ట్రావెల్స్ నిర్వాహకులు ఆస్పత్రి ఖర్చులు కూడా చెల్లించకపోవడంతో బాధితుడు గ్రామస్తుల సాయంతో ధర్నా చేశాడు. ఇలా గత నాలుగేళ్లలో దివాకర్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, చాలా మంది క్షతగాత్రులుగా మిగిలి జీవచ్ఛవాల్లో బతుకుతున్నారు. ప్రమాదాలకు కారణమైన బస్సులకు అనుమతి లేనట్లు గుర్తించినా.. అప్పటి రవాణాశాఖ అధికారులు చర్యలకు వెనుకంజ వేశారు. ఫిర్యాదుల మేరకే దాడులు నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాం. ఇందులో పదిబస్సులు పట్టుబడగా దివాకర్ ట్రావెల్స్‌కు చెందినవి 8 ఉన్నాయి. అనుమతులు లేకపోవడం, డ్రైవర్, కండెక్టర్లకు లైసెన్స్ లేకపోవడం, అక్రమంగా సీటింగ్ కెపాసిటీ పెంచి ప్రయాణికులను తరలిస్తుండడం తదితర కారణాలతో వాటిని సీజ్ చేశాం. ఈ దాడులు కొనసాగుతాయి. రోజూ 20 చొప్పున ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – శివరామప్రసాద్, ఉపరవాణా కమిషనర్ -
జేసీ దివాకర్ రెడ్డికి షాక్
సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి రవాణా శాఖ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 23 బస్సులను ఆర్టీఏ అధికారులు గురువారం సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా నడస్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ కమిషనర్ సీతారామాంజనేయులు, జాయింట్ కమిషనర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలోని అధికారులు పలు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారంగా టికెట్ ధరలు వసూలు చేస్తున్న 23 బస్సులను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. అంతేకాకుండా దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 23 ఇంటర్ స్టేట్ క్యారియల్ బస్సుల పర్మిట్లను కూడా రద్దు చేశారు. అదేవిధంగా నిబంధనలను అతిక్రమించినందుకు పలు కేసులు నమోదు చేశారు. అయితే దివాకర్ ట్రావెల్స్‌పై అనేక ఫిర్యాదులు వచ్చాయని అందులో భాగంగానే తనిఖీలు చేశామని, దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని జాయింట్ కమిషనర్ ప్రసాద్ రావు వెల్లడించారు. -
అనంతపురం జిల్లాలో దివాకర్ ట్రావెల్స్‌లో చీరల తరలింపు పట్టివేత
-
దివాకర్ ట్రావెల్స్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన
సాక్షి, అమరావతి బ్యూరో : హైదరాబాద్ నుంచి విజయవాడకు టికెట్ బుక్ చేసుకున్న ఓ మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్ చేయి చేసుకున్న ఘటన మంగళవారం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఆపై దారి పొడవునా తిడుతూ.. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు గురిచేసిన వైనంపై ఆ ప్రయాణికురాలు ‘సాక్షి’కి వెల్లడించిన వివరాలు మేరకు.. విజయవాడకు చెందిన ఉప్పలపాడు లత తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె మంగళవారం విజయవాడకు వచ్చేందుకు అభీబస్ యాప్ ద్వారా దివాకర్ ట్రావెల్స్ బస్సులో టికెట్ బుక్ చేశారు. ఆ బస్సు కొండాపూర్ నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే ఆ సమయానికి బస్సు అక్కడికి చేరుకోకపోవడంతో ఆమె మరో స్టేజ్ అయిన గచ్చిబౌలికి తన మిత్రుడి సాయంతో కారులో చేరుకున్నారు. అక్కడికి కూడా బస్సు సమయానికి రాకపోవడంతో అభీబస్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో వారు బస్సు డ్రైవర్‌తో మాట్లాడించే ప్రయత్నం చేయగా.. టోలిచౌక్ దాటిందని.. లక్డీకపూల్ రావాలని డ్రైవర్ సమాధానం చెప్పి ఫోన్ పెట్టేశాడు. లక్డీకపూల్‌కు చేరుకున్న లత అక్కడ బస్సు ఆపకపోవడంతో మెహదీపట్నం వరకు కారులో ఛేజ్ చేసి బస్సుకు అడ్డంగా నిలవగా.. బస్సు డ్రైవర్ ఆమెను పత్రికలో రాయలేని భాషలో తిట్టడం ప్రారంభించాడు. ఈ మాటలు బయట ఉన్న ఆమెకు వినిపించలేదు. బస్సు ఎక్కాక ఆమెతో పాటు అతని స్నేహితుడిని సైతం ఇదే పద్ధతిన తిడుతుండటంతో ఆమె డ్రైవర్‌పై చేయి చేసుకుంది. దీంతో డ్రైవర్ సైతం ఆమెపై చేయి చేసుకుని.. బూతులు తిట్టాడు. ఇదంతా బస్సులో ప్రయాణిస్తున్న కొందరు వీడియో కూడా తీశారు. ఇదే విషయంపై ఆమె 100కు ఫోన్ చేయగా వారు సూర్యరావుపేట పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఆమెతో ఫోన్ మాట్లాడి.. ఇక్కడ బస్సు ఆపితే అందరూ ఇబ్బంది పడతారని.. కాబట్టి మీరు విజయవాడకు వెళ్లాక అక్కడే కేసు నమోదు చేయాలని సూచించారు. ఆ తర్వాత ఆమె వీడియోను.. జరిగిన విషయాన్ని లత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పగా ఆమె బంధువులంతా గవర్నరుపేటలోని మమతా హోటల్ సమీపంలో బస్సు ఆగగానే డ్రైవర్, అతని సహాయకుడిపై విరుచుకుడి దేహశుద్ధి చేశారు. అనంతరం వారిద్దరితో ఆమె కాళ్లు పట్టించి క్షమాపణలు చెప్పించారు. ఇలాగే ఎవరితోనూ వ్యవహరించకూడదని డ్రైవర్‌కు బుద్ధి చెప్పినట్లు లత తండ్రి మీడియాకు వివరించారు. -
దివాకర్ ట్రావెల్స్ బస్సులో 45 బస్తాల చిల్లర నాణేలు
-
దూసుకెళ్లిన దివాకర్ ట్రావెల్స్..
-
దూసుకెళ్లిన దివాకర్ ట్రావెల్స్..
సాక్షి, అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపటంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాలువపల్లి వద్ద సోమవారం జరిగింది. ప్రయాణికుల ప్రాణాలు అంటే ట్రావెల్స్ యాజమాన్యానికి లెక్కేలేదా అంటూ ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రమాదానికి నిరసనగా ప్రయాణికులు దివాకర్ ట్రావెల్స్ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. డ్రైవర్ మద్యం సేవించి ట్రావెల్స్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ట్రావెల్స్ యాజమాన్యం ప్రమాదంపై ఏ విధంగానూ స్పందించలేదు.