కృష్ణా జిల్లా నందిగామ వద్ద జరిగిన దివాకర్ ట్రావెల్స్ ఘోర బస్సు ప్రమాద ఘటనలో దోషులను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. టీడీపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేను ప్రమాదం నుంచి బయట పడేయడానికి శతధా ప్రయత్నిస్తోంది. బస్సు ప్రమాద ఘటనపై చంద్రబాబు వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో వాటి నుంచి బయట పడటానికి పాట్లు పడుతున్నారు. ప్రమాదానికి గురైన బస్సు తన పార్టీ ఎంపీది కావడం.. ఆ బస్సుకు రెండవ డ్రైవర్ లేకపోవడం.. పోస్టుమార్టం చేయకుండానే డ్రైవర్ మృతదేహాన్ని తరలిస్తుండగా ప్రతిపక్ష నేత నిలదీయడంతో మొత్తం ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిపోయింది.