
వెల్లంపల్లి శ్రీనివాస్ సహా 20 మంది అరెస్ట్
విజయవాడ: వైఎస్ఆర్ సీపీ నేతలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద సంఘటనకు సంబంధించి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించినందుకు నిరసనగా ధర్నాకు దిగిన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ సహా 20 మందిని అరెస్ట్ చేశారు. వారిని ఈ రోజు ఉదయం నుంచి ఉంగుటూరు పోలీస్ స్టేషన్‌లో ఉంచారు.
వెల్లంపల్లి శ్రీనివాస్‌పై నాన్‌బెయిలబుల్ కేసు పెట్టామని పోలీసులు చెప్పారు. కాగా కేసుల విషయంలో పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. పోలీసుల వైఖరికి నిరసనగా ఉంగుటూరు పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.