బస్సు ప్రమాదం దురదృష్టకరం | tdp leaders jc brothers speaks on krishna district bus accident | Sakshi
Sakshi News home page

బస్సు ప్రమాదం దురదృష్టకరం

Published Wed, Mar 1 2017 3:11 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

బస్సు ప్రమాదం దురదృష్టకరం

బస్సు ప్రమాదం దురదృష్టకరం

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి  

అనంతపురం అర్బన్‌: బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని, ఇందుకు తాము చాలా బాధపడుతున్నామని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బస్సుకు ఏమైనా తమకు చింత లేదని, ప్రమాదంలో పలువురు మరణించడం, గాయపడడం బాధపెట్టిందని చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. బస్సుకు జీపీఎస్‌ ఉందని, ప్రమాద సమయంలో 70 నుంచి 72 కిలోమీటర్ల వేగంతోనే వెళుతోందని చెప్పారు. ఏదైనా అడ్డొచ్చి ఉంటే తప్పించే ప్రయత్నంలో గానీ, లేదా డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండి గానీ ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుకుంటున్నామన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ఇస్తామన్నారు. మృతిచెందిన డ్రైవర్, క్లీనర్‌ కుటుంబాలను  ఆదుకుంటామని చెప్పారు.
 
సంబంధిత వార్తలు చదవండి
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం  
నిబంధనలు గాలికి.. ప్రాణాలు గాల్లోకి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement