
సాక్షి, అనంతపురం: తాడిపత్రి వైఎస్సార్‌సీపీ ఎమ్యెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ బ్రదర్స్‌కు సవాల్ విసిరారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
‘తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధిపై నేను బహిరంగ చర్చకు సిద్ధం. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధమా?. గత 35 సంవత్సరాల్లో జేసీ బ్రదర్స్ అనేక అరాచకాలు చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాకే తాడిపత్రి ప్రశాంతంగా ఉంది’ అని కేతిరెడ్డి అన్నారు.