tadipatri constituency
-
ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడి.. తాడిపత్రిలో పోలీసుల ఓవరాక్షన్
అనంతపురం, సాక్షి: జిల్లాలో పోలింగ్ వేళ నుంచి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. తాజాగా.. తాడిపత్రి నియోజకవర్గంలో పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి చొరబడిన పోలీసులు వీరంగం సృష్టించారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు.. పని మనుషుల్ని బెదిరించారు. అంతేకాదు.. సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు హార్డ్ డిస్క్, సీపీయూలను పోలీసులు మాయం చేశారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇంతటితో ఆగలేదు.తాడిపత్రివ్యాప్తంగా 30 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదంటూ హెచ్చరించారాయన.ఏఎస్పీ రామకృష్ణ సహకారంతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి రౌడీయిజం చేస్తున్నారని, పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెబుతున్నారు. శాంతి భద్రతలకు సహకరించాలనే ఉద్దేశంతోనే తాము తాడిపత్రిని వీడి బయటకు వచ్చామని, అయితే పోలీసులు మాత్రం మరోలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడుతున్నారు. -
బాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
సాక్షి, తాడిపత్రి: టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టినట్టేనని గుర్తు పెట్టుకోవాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అలాగే, చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపినట్టేనని సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు.కాగా, సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడిపత్రి సభలో మాట్లాడుతూ.. ఎన్నికల యుద్ధానికి మీరు సిద్ధమేనా? తాడిపత్రి సిద్ధమేనా?. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు. జెండాలు జతకట్టుకుని వారంతా వస్తున్నారు. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టినట్టేనని గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపినట్టే. జగన్‌కు ఓటు వేస్తే.. పథకాలన్నీ కొనసాగింపు.పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలకు ముగింపే. చంద్రబాబు సాధ్యం కానీ హామీలిస్తున్నారు.నా మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాను. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం. రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ ఖాతాల్లో జమ చేశాం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. 58 నెలల కాలంలో 2.31లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. పౌరసేవల్లో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. ప్రతీ గ్రామం, పట్టణంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. రైతు భరోసా కేంద్రం.. గ్రామాల్లోనే కనిపిస్తుంది. ఇంటి వద్దకే రేషన్ వస్తోంది. పెన్షన్లు నేరుగా మీ ఇంటి వద్దకే వస్తున్నాయి. మీ బిడ్డ పాలనలో ఇంటి వద్దకే వైద్య సేవలు అందుతున్నాయి. మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే వస్తే మీ జీవితాలు ఎంతగా బాగుపడతాయో ఊహించండి. నాడు-నేడుతో స్కూళ్ల రూపరేఖలను మార్చాం. టాప్ యూనివర్సిటీలతో మన డిగ్రీ కాలేజీలను అనుసంధానం చేశాం. ప్రభుత్వ స్కూల్స్‌లో హక్కుగా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. మరో 10, 15 ఏళ్లలో ఇలాంటి పాలనే ఉంటే ప్రజల జీవితాలు ఎంతగా బాగుపడతాయో ఊహించండి. గతంలో ఎప్పుడైనా మహిళా సాధికారత చూశారా?.చట్టం చేసి 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి నామినేటెడ్ పదవులు ఇచ్చాం. గతంలో ఎప్పుడైనా 31 లక్షల ఇళ్ల పట్టాలు చూశారా?.రైతు భరోసా పథకాన్ని ఎప్పుడైనా చూశారా?.80 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో సగం స్థానాలు కేటాయించాం. మోసాలు, కుట్రలను నమ్ముకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా?. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి ఇదే కూటమి గతంలో ప్రజలను మోసం చేసింది.రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశాడు. ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు. ఆడపిల్ల పుట్టగానే బ్యాంకుల్లో రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్న చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారా?. అర్హుందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు అన్న చంద్రబాబు ఎవరికైనా ఇచ్చారా?. ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల పేరుతో మరో డ్రామా ఆడుతున్నారుసంక్షేమ పాలన కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలితాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణను అఖండ మెజారిటీతో గెలిపించాలిహామీలు నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీస్సులు కోరతున్నాడు. ప్రజలకు మంచి చేశాకే మీ బిడ్డ మీ దీవెనలు కోరుతున్నాడు అని కామెంట్స్ చేశారు. -
జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
సాక్షి, అనంతపురం: తాడిపత్రి వైఎస్సార్సీపీ ఎమ్యెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ బ్రదర్స్‌కు సవాల్ విసిరారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధిపై నేను బహిరంగ చర్చకు సిద్ధం. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధమా?. గత 35 సంవత్సరాల్లో జేసీ బ్రదర్స్ అనేక అరాచకాలు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే తాడిపత్రి ప్రశాంతంగా ఉంది’ అని కేతిరెడ్డి అన్నారు. -
జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి సవాల్..
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. ఒక రోజంతా మనమిద్దరం ఒక గదిలో ఉందాం.. దమ్ముంటే నన్ను చంపుతావా? అని సవాల్ చేశారు. ప్రభాకర్ రెడ్డి బెదిరింపు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కాగా, ఎమ్మెత్యే కేతిరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నన్ను చంపేస్తానని ప్రతీరోజు ప్రభాకర్ రెడ్డి అరుస్తున్నారు. నువ్వు-నేను ఒక గదిలో ఉందాం. రోజంతా టైమ్ ఇస్తాను. నన్ను చంపుతావా?. అడుగు తీసి అడుగు వేయలేని ప్రభాకర్ రెడ్డి బెదిరింపు హాస్యాస్పదం. తాడిపత్రిలో టీడీపీ లీడర్ ఎవరో అర్థం కాక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. తాడిపత్రి టీడీపీ ఇంఛార్జ్ జేసీ అస్మిత్ రెడ్డి వీకెండ్ పొలిటీషియన్. ఉనికి కోసమే ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో హడావుడి చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబం గద్వాల్లో దొంగతనాలు చేసి తాడిపత్రికి వలస వచ్చారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ వ్యవహారం తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా ఉంది. త్వరలో ఆయా రాష్ట్రాల్లో కేసులు వేస్తాం. బీఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి నాగాలాండ్‌లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన నీచ చరిత్ర ప్రభాకర్ రెడ్డిది. నన్ను పదే పదే ఆయన రెచ్చగొడుతున్నారు. సానుభూతిలో తన కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకుందామన్న ఆలోచనలో జేసీ ఉన్నారు. జేసీ బ్రదర్స్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే త్రిశూల్ సిమెంట్ వ్యవహారంలో ప్రభుత్వం విధించిన వంద కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలి అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: నన్ను పిలవకపోవడం దుర్మార్గం.. అసలు విలన్ పురంధరేశ్వరి: లక్ష్మీపార్వతి -
తాడిపత్రిలో ‘జేసీ’కి వ్యతిరేక పవనాలు..
సాక్షి, తాడిపత్రి : తాడిపత్రినియోజకవర్గం.. అనంతపురం జిల్లాలోని ఈ సిగ్మెంట్లో జేసీ కుటుంబీకులదే హవా..జేసీ కుటుంబసభ్యులే ఏడుసార్లు ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి మాత్రం తాడిపత్రి ఓటర్లు జేసీ కుటుంబానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వనున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ దివాకర్‌రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో దివాకర్‌రెడ్డి సోదరుడు ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. దివాకర్‌రెడ్డి అనంతపురం ఎంపీగా గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ ప్రత్యక్షరాజకీయాల నుంచి విశ్రమించారు. వారి వారసులను బరిలోకి దించారు. తాడిపత్రి నుంచి ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా, జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నుండి తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీచేస్తున్నారు. జేసీ బ్రదర్స్‌కు వ్యతిరేకంగా.. స్థానికంగా జేసీ దివాకర్ రెడ్డి ఎదురులేని నాయకుడిగా ఎదిగారు. అయితే ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తాడిపత్రిలో అరాచకం ఎక్కువైంది. ‘లగాన్’ బ్యాచ్ పేరుతో ఒక బృందం జేసీ కనుసన్నల్లో గ్రానైట్ పరిశ్రమను పీల్చిపిప్పి చేసింది. గెర్డావ్ పరిశ్రమలో కూడా ఉద్యోగాలు, వాహనాలు, ఇతరత్రా వ్యవహారాలన్నీ జేసీ కనుసన్నల్లో సాగుతున్నాయి. చివరకు మునిసిపల్ కాంప్లెక్స్‌లు కూడా జేసీ చెప్పిన వారికే అధికారులు కేటాయిస్తున్నారు. ఇన్నేళ్లుగా వారికి ఎదురు చెప్పలేకపోయిన తాడిపత్రి వాసులు ఇప్పుడు గళం విప్పుతున్నారు. తాడిపత్రిలో పాత టీడీపీ ఖాళీ! జేసీ బ్రదర్స్ సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరినప్పుడు వారితో కేడర్ టీడీపీలోకి రాలేదు. కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు మొత్తం వైఎస్సార్సీపీలో చేరారు. అప్పటి వరకూ జేసీపై పోటీ చేస్తూ వచ్చిన పేరం నాగిరెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గుత్తా వెంకటనాయుడు, జగదీశ్వరరెడ్డి, కాకర్ల రంగనాథ్, ఫయాజ్, జయచంద్రారెడ్డి, జేసీ చిత్తరంజన్‌రెడ్డి తదితరలు జేసీకి అండగా నిలిచి టీడీపీని గెలిపించారు. ఆ తర్వాత వారిని జేసీ బ్రదర్స్ దూరం పెట్టారు. ఇది తట్టుకోలేక వారంతా జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఇది జేసీ బ్రదర్స్‌కు కోలుకోలేని దెబ్బ. ఇక అన్ని రకాలుగా అండగా ఉన్న భోగాతి నారాయణరెడ్డి కుటుంబం కూడా జేసీ బ్రదర్స్‌ను వీడి వైఎస్సార్సీపీలో చేరింది. ఇలా అందరూ వెళ్లిపోవడంతో బ్రదర్స్, వారి వారసులు మినహా చెప్పుకోదగ్గ ద్వితీయ శ్రేణి నేతలు ఒక్కరూ కూడా జేసీతో ప్రస్తుతం లేరు. అస్మిత్‌కు అంతా వ్యతిరేకం.. రాజకీయ ఆరంగేట్రం చేస్తున్న జేసీ అస్మిత్‌రెడ్డి, బలమైన పెద్దారెడ్డిని ఢీకొట్టబోతున్నారు. ప్రస్తుత పరిస్థితులు జేసీ బ్రదర్స్‌కు అనుకూలంగా లేవు. అందరిపై నోరు పారేసుకోవడం, తాడిపత్రి తమ సొత్తు అనేలా ప్రవర్తిస్తుండటతో జేసీ బ్రదర్స్ అంటే తాడిపత్రి ప్రజలకు మింగుడుపడని పరిస్థితి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అస్మిత్‌రెడ్డి నెగ్గుకురావడం కష్టమే అనే చర్చ సాగుతోంది. ఆత్మవిశ్వాసంతో పెద్దారెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో వైఎస్సార్సీపీ బాధ్యతలు తీసుకున్న తర్వాత జేసీ బ్రదర్స్‌ను గట్టిగా నిలువరించారు. దీంతో భారీగా పార్టీలో చేరారు. పెద్దారెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు కదనోత్సాహంతో ఉన్నాయి. తాను గెలిస్తే తాడిపత్రికి వాక్స్వాతంత్య్రం తీసుకొస్తానని పెద్దారెడ్డి చెబుతూ ప్రజలను ఆకర్షిస్తోంది. మొత్తం ఓటర్లు: 2,20,678 పురుషులు : 1,10,923 మహిళలు : 1,09,745 – మొగిలి రవివర్మ, సాక్షిప్రతినిధి, అనంతపురం -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పలు నియామకాలు జరిగాయి. నియోజకవర్గ సమన్వయకర్తలు వీఆర్ రామిరెడ్డి, కె రమేష్ రెడ్డిలను పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా.. తాడిపత్రి నియోజక వర్గ సమన్వయకర్తగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ని నియమించారు. అలాగే రాష్ర్ట యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా కె ధనుంజయ యాదవ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా సాంబశివారెడ్డిలు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.