krishna bus accident
-
'జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడడం వేస్ట్'
-
'జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడడం వేస్ట్'
విజయవాడ: కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బాధితులకు భరోసా ఇచ్చేందుకు వెళితే తనపై కేసులు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడుతూ.. బస్సులో రెండో డ్రైవర్ లేడని, డిక్కీలో పడుకున్నాడని అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. బస్సు కల్వర్టు పైనుంచి కిందకు పడినప్పుడు డిక్కీలో వ్యక్తి బతుకుతాడా అని ప్రశ్నించారు. పోస్టుమార్టం చయకుండా మృతదేహాలను తరలించే ప్రయత్నం చేశారని, నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేయకపోతే జైలుకు వెళ్తారనడం తప్పా అని అడిగారు. యాజమాన్యం నుంచి పరిహారం ఇప్పించకుండా కుయుక్తులు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి వైఎస్ జగన్ ను విలేకరులు ప్రశ్నించగా... ఆయన గురించి మాట్లాడడం అనవసరమని సమాధానమిచ్చారు. ఆయనకు మతిస్థిమితం ఉందో, లేదో తెలియదన్నారు. గజరాజు వెళ్తున్నప్పుడు కుక్కలు మొరగడం సహజమని వ్యాఖ్యానించారు. సంబంధిత కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ‘16 నెలలు బెయిల్ రాకుండా చేశారు’ మార్చితో ప్రత్యేక హోదా వెళ్లిపోతుందట: వైఎస్ జగన్ చంద్రబాబు చాలా బాగా కష్టపడ్డారు: వైఎస్ జగన్ -
మృతదేహాల తరలింపులో అంత తొందరేంటి?
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అక్రమ కేసులకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి పిలుపునిచ్చారు. డ్రైవర్ మృతదేహాన్ని పరీక్షించకుండా అక్కడినుంచి తరలించిన విషయం వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు.. ప్రజలకు ఉండదా అని అడిగారు. మృతదేహాలను త్వరగా వాళ్ల ఇళ్లకు పంపడంలో ఈ ప్రభుత్వం చాలా చొరవ చూపించిందని, దానికి కారణం ఏంటో ప్రభుత్వమే చెప్పాలని విమర్శించారు. ప్రైవేటు ట్రావెల్స్‌లో ప్రయాణించే వారి భద్రత ఈ ప్రభుత్వానికి పట్టదని, నిన్న జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆయన అన్నారు. కేవలం ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని అన్నారు. గతంలో ప్రభుత్వాలకు ప్రజాస్వామ్య విలువలు ఉండేవని, ఇలాంటి ఘటనలు జరిగితే ప్రభుత్వాలు విచారణ జరిపి చర్యలు తీసుకునేవని, కానీ ఇప్పటి ప్రభుత్వంలో అవేమీ కనిపించడం లేదని మండిపడ్డారు. డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకపోతే.. ప్రమాదానికి కారణాలు ఎలా తెలుస్తాయని మాత్రమే ఆయన అడిగారని చెప్పారు. అధికారులంటే వైఎస్ రాజశేఖరరెడ్డికి, జగన్‌కు అమితమైన గౌరవం ఉందని, రాజకీయ కుట్రలో అధికారులను టీడీపీ పావుల్లా వాడుకుంటోందని ఆయన అన్నారు. బస్సు ప్రమాదంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
మృతదేహాల తరలింపులో అంత తొందరేంటి?
-
బ్రేకుల్లేని ట్రావెల్స్ దందా..
మాఫియా మాదిరి మారిన ప్రైవేట్ ట్రావెల్స్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తిరుగుతున్న బస్సులు అధికార పార్టీ నేతలే ట్రావెల్స్ యాజమాన్యాలు అందుకే పట్టించుకోని ప్రభుత్వం, రవాణా శాఖ అరుణాచల్ ప్రదేశ్, పుదుచ్చేరిల్లో రిజిస్ట్రేషన్ సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా ఆగడాలు రోజు రోజుకూ పెచ్చుమీరిపోతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి ట్రావెల్స్ నిర్వాహకులు బస్సుల్ని తిప్పుతున్నా.. ప్రభుత్వం వారిపై చర్యలకు వెనుకాడుతోంది. ప్రైవేటు ట్రావెల్స్ నడుపుతోంది.. అధికార పార్టీకి చెందిన ఎంపీలే కావడమే దానికి కారణం. ఒకవేళ రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నా.. వారికి సర్కారు బదిలీల బహుమానం అందిస్తోంది. ఐదేళ్లుగా నిత్యం ఏదో ఒక చోట ప్రైవేటు ట్రావెల్స్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఘోర ప్రమాదం జరిగి ప్రయాణికులు దుర్మరణం పాలయితే ఓ కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప ప్రైవేటు ట్రావెల్స్ దూకుడుకు అడ్డుకట్ట వేయడం లేదు. కాంట్రాక్టు క్యారేజీ అనుమతులతో.. కాంట్రాక్టు క్యారేజీ అనుమతులతో స్టేజి క్యారియర్లుగా ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా తెలుగు రాష్ట్రాల్లో బస్సుల్ని తిప్పుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఆలిండియా పర్మిట్లు పొంది నిబంధనలకు విరుద్ధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తిప్పుతున్నారు. మొత్తం 500 ప్రైవేటు బస్సులు ఇలా తిరుగుతున్నాయనేది అంచనా. కేంద్ర మోటారు వాహన చట్టం–1989 నిబంధనలను అతిక్రమించి తిప్పుతున్న ఈ బస్సుల జోలికి వెళ్లవద్దంటూ సాక్షాత్తూ ఓ మంత్రి రవాణా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికుల భద్రతను సవాల్ చేస్తూ ప్రైవేటు ట్రావెల్స్ ఏకంగా టూ ప్లస్ వన్ బెర్తులతో తిప్పుతున్నా.. రవాణా శాఖ చోద్యం చూడటం మినహా ఏ ఒక్క బస్సును సీజ్ చేయట్లేదు. విజయవాడ బందరు రోడ్డు రవాణా శాఖ కమిషనర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో.. మెయిన్ రోడ్డు మీదే దాదాపు 200 ట్రావెల్స్ బస్సులు నిలిపి స్టేజీ క్యారియర్లుగా ప్రయాణికులను ఎక్కించుకోవడం రోజూ కనిపించే దృశ్యం. అయినా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడానికి పైనుంచి వచ్చే ఒత్తిళ్లే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. పర్యాటక రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు టూరిజాన్ని ప్రోత్సహిస్తున్న అరుణాచల్ ప్రదేశ్, పాండిచ్చేరిలలో రవాణా శాఖ ట్యాక్స్‌లు చాలా తక్కువగా ఉంటాయి. ఏడాదికి ఒక బస్సుకు రూ. 17 వేలు చెల్లించి ఆలిండియా పర్మిట్ పొందవచ్చు. అదే తెలుగు రాష్ట్రాల్లో పర్మిట్లు పొందాలంటే మూడు నెలలకోసారి బస్సులో ఒక్కో సీటుకు ఏపీలో అయితే రూ. 3,750, తెలంగాణలో రూ. 3,675 చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు ట్రావెల్స్ తమ బస్సుల్ని అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. నిజానికి అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేయించి పర్మిట్ పొందాలంటే ఆ రాష్ట్రం మీదుగాకానీ, ఆ రాష్ట్రంలోగానీ బస్సులు తిరగాలి. కానీ ప్రైవేటు ట్రావెల్స్ ఆ పర్మిట్లతో ఏపీ, హైదరాబాద్‌ల నుంచి.. షిర్డీ, బెంగళూరు, చెన్నై, భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు బస్సుల్ని తిప్పుతున్నారు. అక్రమ బస్సులపై ఎన్ఫోర్సుమెంట్ తనిఖీలు చేయాలని రవాణా శాఖను ఆదేశిస్తామని ఆశాఖ మంత్రి ప్రకటనలు దండగలా మారాయని ఆరోపణలు ఉన్నాయి. గత ఐదేళ్లులో ఘోర బస్సు ప్రమాదాలు.. 2017 ఫిబ్రవరి 28న భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు కృష్ణా జిల్లా ముండ్లపాడు వద్ద ప్రమాదానికి గురై 10 మంది మృత్యువాత పడ్డారు. 2016 సెప్టెంబర్ 16న హైదరాబాద్ నుంచి షిర్డీ వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ స్లీపర్ బస్సు కర్ణాటక దగ్గర హుమ్నాబాద్ వద్ద తగులబడి పోయింది. ఈ మంటల్లో చిక్కుకుని తణుకు ప్రాంతానికి చెందిన మూడేళ్ల చిన్నారి విహాన్ సజీవ దహనమయ్యాడు. అనుమతి లేని, సురక్షితం కాని స్లీపర్ బస్సులో ప్రయాణించడం వల్లే ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు క్షతగాత్రులయ్యారు. 2013 అక్టోబర్ 30న బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలంలోని పాలెం గ్రామం వద్ద వోల్వో బస్సు ప్రమాదానికి గురై 45 మంది సజీవదహనమయ్యారు. 2012 జూన్ 16న షోలాపూర్–హైదరాబాద్ జాతీయ రహదారిపై షిర్డీ వెళుతున్న కాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడి 32 మంది భక్తులు మరణించారు. -
బస్సు ప్రమాదం దురదృష్టకరం
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి అనంతపురం అర్బన్: బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని, ఇందుకు తాము చాలా బాధపడుతున్నామని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బస్సుకు ఏమైనా తమకు చింత లేదని, ప్రమాదంలో పలువురు మరణించడం, గాయపడడం బాధపెట్టిందని చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. బస్సుకు జీపీఎస్ ఉందని, ప్రమాద సమయంలో 70 నుంచి 72 కిలోమీటర్ల వేగంతోనే వెళుతోందని చెప్పారు. ఏదైనా అడ్డొచ్చి ఉంటే తప్పించే ప్రయత్నంలో గానీ, లేదా డ్రైవర్ నిద్రమత్తులో ఉండి గానీ ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుకుంటున్నామన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ఇస్తామన్నారు. మృతిచెందిన డ్రైవర్, క్లీనర్ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. సంబంధిత వార్తలు చదవండి కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం నిబంధనలు గాలికి.. ప్రాణాలు గాల్లోకి! -
నందిగామ ప్రభుత్వాసుపత్రిలో తీవ్ర ఉద్రిక్తత
-
నందిగామ ప్రభుత్వాసుపత్రిలో తీవ్ర ఉద్రిక్తత
నందిగామ: బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను, బాధితులను ఓదార్చేందుకు వచ్చిన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. జగన్ ను అడ్డుకునేందుకు పచ్చ నేతలు కుటిల యత్నాలు చేశారు. బాధలో ఉన్నవారిని పరామర్శించేందుకు నందిగామ ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ప్రతిపక్ష నాయకుడికి అడ్డంకులు కల్పించేందుకు పూనుకున్నారు. విపక్ష నేతను అడ్డుకోవడం తగదని వైఎస్సార్ సీపీ నాయకులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా తమ శైలిలో దురుసుగా ప్రవర్తించారు. జగన్ రాకముందే మృతదేహాలను తరలించాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆస్పత్రిలోకి వెళ్లకుండా జగన్ ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాసేపటి తర్వాత జగన్ ఆస్పత్రిలోకి వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రమాద వివరాలను క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రిలోకి దూసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జగన్ మీడియాతో మాట్లాడుతుండగా పోలీసులు, అధికారులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా నిరసించారు. సంబంధిత వార్తలు ఇక్కడ చదవండి: ప్రమాదస్థలిని పరిశీలించిన వైఎస్ జగన్ రెండో డ్రైవర్ పారిపోయాడా, తప్పించారా? నిబంధనలు గాలికి.. ప్రాణాలు గాల్లోకి! 'కల్వర్టు ఉంటే ఇంతఘోరం జరిగేది కాదు' కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం -
రెండో డ్రైవర్ పారిపోయాడా, తప్పించారా?
నందిగామ: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ నాయకుడు కె. పార్థసారధి డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతల బస్సు కాబట్టే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తోందన్నారు. చనిపోయిన వారిని ఆదుకోవాలన్న కనీస ఆలోచన లేని దౌర్బగ్య ప్రభుత్వం ఇదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రన్న బీమాతో చేతులు దులుపుకుంటారా అని ప్రశ్నించారు. చంద్రన్న బీమా ఉన్నవారికి ఒకలా, లేనివారికి మరోలా పరిహారం ప్రకటించడడం సమంజసం కాదన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వేరే రాష్ట్రాల వారికి తక్కువ పరిహారం ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. నందిగామ ప్రభుత్వాసుపత్రి నుంచి హడావుడిగా మృతదేహాలను ఎందుకు తరలిస్తున్నారని నిలదీశారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న రెండో డ్రైవర్ పారిపోయాడని చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. రెండో డ్రైవర్ పారిపోయాడా, తప్పించారా అని సూటిగా ప్రశ్నించారు. రెండో డ్రైవర్ ను కనీసం ప్రశ్నించరా అని అడిగారు. ఎవరినో కాపాడడానికే ఇదంతా చేస్తున్నారని పార్థసారధి ఆరోపించారు. -
ప్రమాదస్థలిని పరిశీలించిన వైఎస్ జగన్
-
ప్రమాదస్థలిని పరిశీలించిన వైఎస్ జగన్
పెనుగంచిప్రోలు: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో బస్సు ప్రమాదం జరిగిన స్థలాన్ని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ప్రమాద వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలుసుకునేందుకు అక్కడి నుంచి నందిగామకు బయలుదేరారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే వైఎస్ జగన్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి పెనుగంచిప్రోలుకు వచ్చారు. జగన్ వస్తున్నారని తెలియగానే అధికారులు హడావుడి చేశారు. ప్రమాదానికి గురైన బస్సును హుటాహుటిన బయటకు తీసి దూరంగా తరలించే యత్నం చేశారు. నందిగామలో మృతదేహాలకు హడావుడిగా పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం ఇదంతా చేస్తోందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. -
నిబంధనలు గాలికి.. ప్రాణాలు గాల్లోకి!
-
నిబంధనలు గాలికి.. ప్రాణాలు గాల్లోకి!
నిబంధనలు పాటించకుండా, లాభార్జనే ధ్యేయంగా కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు వ్యవహరించడం వల్ల ప్రమాదాలు సంభవించి విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్ బస్సు కూడా వాస్తవానికి కాంట్రాక్ట్ క్యారియర్‌గానే వెళ్లాలి. అంటే బస్సు బయల్దేరిన చోట మాత్రమే మొత్తం ఎంతమంది ప్రయాణికులుంటే అందరినీ ఎక్కించుకుని, వారందరినీ గమ్యస్థానాల వద్ద దించాలి. అంతే తప్ప మధ్యదారిలో మాత్రం ఎవరినీ ఎక్కించుకోకూడదు. అలా ఎక్కించుకునేవాటిని స్టేజి క్యారియర్లు అంటారు. ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్ బస్సు కాంట్రాక్టు క్యారియర్. ఈ విషయాన్ని బస్సు రిజిస్ట్రేషన్ సమయంలోనే పేర్కొన్నారు. కానీ ఇష్టం వచ్చినట్లు ఎక్కడపడితే అక్కడ ప్రయాణికులను ఎక్కించుకున్నారు. ప్రయాణించిన వారు ఇలా.. శ్రీకాకుళం-హైదరాబాద్ 15 మంది, విశాఖపట్నం -హైదరాబాద్ 14 మంది, విశాఖపట్నం - విజయవాడ ఒకరు, భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ 9 మంది, భువనేశ్వర్ నుంచి విజయవాడ నలుగురు, భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం ఒకరు, టెక్కలి నుంచి హైదరాబాద్ ముగ్గురు, టెక్కలి నుంచి విజయవాడ ఒకరు, బెర్హంపూర్ నుంచి హైదరాబాద్ ఇద్దరు చొప్పున టికెట్లు తీసుకున్నారు. మొత్తం 50 సీట్లు ఉండగా ఒక్కటి కూడా ఖాళీ లేకుండా అన్నీ భర్తీ అయ్యాయి. గతంలోనూ అతివేగం ఇదే బస్సు ఇంతకుముందు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేటప్పుడు కూడా అతి వేగంగా, ప్రమాదకరంగా వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో జనవరి 12వ తేదీన ఇదే ఏపీ02టీసీ7146 నంబరు బస్సును.. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి చెక్‌పోస్టు వద్ద అధికారులు పట్టుకున్నారు. అప్పుడు డ్రైవర్ అత్యంత ప్రమాదకరంగా నడుపుతున్నట్లు గుర్తించి, అతడికి 2వేల రూపాయల జరిమానా విధించారు. డ్రైవర్ కూడా తాను తప్పు చేసినట్లు అంగీకరించి, జరిమానా చెల్లించాడు. ఈ విషయాన్ని కత్తిపూడి చెక్‌పోస్టులో పనిచేసిన అధికారి శ్రీకాంత్ బాబు ధ్రువీకరించారు. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం -
బస్సు ప్రమాదంపై కేంద్రమంత్రి ఆరా
ఆంధ్రప్రదేశ్‌లోని పెనుగంచిప్రోలు సమీపంలో తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంపై కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) ధర్మేంద్ర ప్రధాన్ ఆరా తీశారు. ఒడిషాలోని భువనేశ్వర్ నుంచి ఈ బస్సు బయల్దేరడంతో.. ఒడిషాకు చెందిన ప్రధాన్, తన రాష్ట్రం వారి క్షేమ సమాచారాల గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు. ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు ఒడిషా వారందరినీ గుర్తించి, వారికి తగిన చికిత్స అందించి, మళ్లీ జాగ్రత్తగా వారి స్వస్థలాలకు తిప్పి పంపాలని సూచించారు. బస్సు ప్రమాదంలో 14 మంది మరణించడానికి ప్రధాన కారణం డ్రైవర్ నిర్లక్ష్యమేనని చెబుతున్నారు. రెండు కల్వర్టులకు మధ్య ఉన్న ఎత్తయిన ప్లాట్‌ఫాం మీదకు బస్సు వెళ్లిపోతున్న విషయాన్ని గుర్తించినా, కనీసం బ్రేక్ వేసినట్లు కూడా రోడ్డు మీద గుర్తులు లేవని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తెలిపారు. ఘటనా స్థలానికి వచ్చిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. డ్రైవర్ అతివేగంగా బస్సు నడపడం, బహుశా నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందన్నారు. బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తమకు లిస్టు వచ్చిందన్నారు. Spoke over telephone to Hon'ble CM,Andhra Pradesh@ncbn; requested for identification of persons from Odisha & their treatment & safe return — Dharmendra Pradhan (@dpradhanbjp) 28 February 2017