నందిగామ: బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను, బాధితులను ఓదార్చేందుకు వచ్చిన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. జగన్ ను అడ్డుకునేందుకు పచ్చ నేతలు కుటిల యత్నాలు చేశారు. బాధలో ఉన్నవారిని పరామర్శించేందుకు నందిగామ ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ప్రతిపక్ష నాయకుడికి అడ్డంకులు కల్పించేందుకు పూనుకున్నారు. విపక్ష నేతను అడ్డుకోవడం తగదని వైఎస్సార్ సీపీ నాయకులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా తమ శైలిలో దురుసుగా ప్రవర్తించారు.
జగన్ రాకముందే మృతదేహాలను తరలించాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆస్పత్రిలోకి వెళ్లకుండా జగన్ ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాసేపటి తర్వాత జగన్ ఆస్పత్రిలోకి వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రమాద వివరాలను క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రిలోకి దూసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జగన్ మీడియాతో మాట్లాడుతుండగా పోలీసులు, అధికారులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా నిరసించారు.
సంబంధిత వార్తలు ఇక్కడ చదవండి:
ప్రమాదస్థలిని పరిశీలించిన వైఎస్ జగన్
రెండో డ్రైవర్ పారిపోయాడా, తప్పించారా?
నిబంధనలు గాలికి.. ప్రాణాలు గాల్లోకి!
'కల్వర్టు ఉంటే ఇంతఘోరం జరిగేది కాదు'