nandigama govt hospital
-
ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యం!
సాక్షి, కృష్ణా : నందిగామ ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు. నందిగామ పాతబస్టాండ్ సమీపంలో ఓ బాటసారిని గుర్తుతెలియనం వాహనం డీకొట్టింది. తీవ్ర గాయాలవ్వడంతో హుటాహుటిన నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరించారు. హాస్పిటల్కి వచ్చి పదిహేను నిమిషాలు అయినప్పటికీ అక్కడి సిబ్బంది పట్టించుకోలేదు. తక్కువ సిబ్బంధి ఉందని ఏం చేయమంటారని అక్కడి డాక్టర్లు దురుసుగా సమాధానం ఇచ్చారు. చివరకు వివరణ కోరుతున్న మీడియా ప్రతినిధులపైనా దురుసుగా ప్రవర్తించారు. -
నందిగామ ప్రభుత్వాసుపత్రిలో తీవ్ర ఉద్రిక్తత
నందిగామ: బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను, బాధితులను ఓదార్చేందుకు వచ్చిన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. జగన్ ను అడ్డుకునేందుకు పచ్చ నేతలు కుటిల యత్నాలు చేశారు. బాధలో ఉన్నవారిని పరామర్శించేందుకు నందిగామ ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ప్రతిపక్ష నాయకుడికి అడ్డంకులు కల్పించేందుకు పూనుకున్నారు. విపక్ష నేతను అడ్డుకోవడం తగదని వైఎస్సార్ సీపీ నాయకులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా తమ శైలిలో దురుసుగా ప్రవర్తించారు. జగన్ రాకముందే మృతదేహాలను తరలించాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆస్పత్రిలోకి వెళ్లకుండా జగన్ ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాసేపటి తర్వాత జగన్ ఆస్పత్రిలోకి వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రమాద వివరాలను క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రిలోకి దూసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జగన్ మీడియాతో మాట్లాడుతుండగా పోలీసులు, అధికారులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా నిరసించారు. సంబంధిత వార్తలు ఇక్కడ చదవండి: ప్రమాదస్థలిని పరిశీలించిన వైఎస్ జగన్ రెండో డ్రైవర్ పారిపోయాడా, తప్పించారా? నిబంధనలు గాలికి.. ప్రాణాలు గాల్లోకి! 'కల్వర్టు ఉంటే ఇంతఘోరం జరిగేది కాదు' కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం -
రెండో డ్రైవర్ పారిపోయాడా, తప్పించారా?
నందిగామ: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ నాయకుడు కె. పార్థసారధి డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతల బస్సు కాబట్టే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తోందన్నారు. చనిపోయిన వారిని ఆదుకోవాలన్న కనీస ఆలోచన లేని దౌర్బగ్య ప్రభుత్వం ఇదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రన్న బీమాతో చేతులు దులుపుకుంటారా అని ప్రశ్నించారు. చంద్రన్న బీమా ఉన్నవారికి ఒకలా, లేనివారికి మరోలా పరిహారం ప్రకటించడడం సమంజసం కాదన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వేరే రాష్ట్రాల వారికి తక్కువ పరిహారం ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. నందిగామ ప్రభుత్వాసుపత్రి నుంచి హడావుడిగా మృతదేహాలను ఎందుకు తరలిస్తున్నారని నిలదీశారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న రెండో డ్రైవర్ పారిపోయాడని చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. రెండో డ్రైవర్ పారిపోయాడా, తప్పించారా అని సూటిగా ప్రశ్నించారు. రెండో డ్రైవర్ ను కనీసం ప్రశ్నించరా అని అడిగారు. ఎవరినో కాపాడడానికే ఇదంతా చేస్తున్నారని పార్థసారధి ఆరోపించారు. -
నందిగామ ప్రభుత్వాసుపత్రిలో దారుణం
విజయవాడ : కృష్ణాజిల్లా నందిగామ ప్రభుత్వాసుపత్రిలో శనివారం దారుణం చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన మహిళ రోగికి ఆక్సిజన్ లేదని వైద్యులు తిప్పి పంపారు. ఆ కమ్రంలో సదరు మహిళ మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణంగానే మహిళ మృతి చెందింది అని ఆమె బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులు, సిబ్బందికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొలంది. సకాలంలో వైద్యం అంది ఉంటే ఆమె బతికి ఉండేదని ఆమె బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
భార్య, అత్తమామలను చితకబాదిన అల్లుడు
కృష్ణా: ఓ అల్లుడు కట్నంకోసం తన భార్య, అత్తమామలను విచక్షణ లేకుండా చితకబాదాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం, పొక్కునూరులో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భార్య, అత్తమామలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో వారిని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.