విజయవాడ : కృష్ణాజిల్లా నందిగామ ప్రభుత్వాసుపత్రిలో శనివారం దారుణం చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన మహిళ రోగికి ఆక్సిజన్ లేదని వైద్యులు తిప్పి పంపారు. ఆ కమ్రంలో సదరు మహిళ మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణంగానే మహిళ మృతి చెందింది అని ఆమె బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
వైద్యులు, సిబ్బందికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొలంది. సకాలంలో వైద్యం అంది ఉంటే ఆమె బతికి ఉండేదని ఆమె బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.