![MLA Kethireddy Pedda Reddy Warning To Lokesh Over JC Brothers - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/9/Kethireddy%20Pedda%20Reddy_01.jpg.webp?itok=AdnrqyTH)
సాక్షి, అనంతపురం: నారా లోకేష్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అల్టిమేటం జారీచేశారు. తనపై లోకేష్ లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. నిరాధార ఆరోపణలు చేస్తే లోకేష్ వద్దే నేరుగా తేల్చుకుంటానని పేర్కొన్నారు.. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ చదివితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జేసీ బ్రదర్స్ అరాచకాలపై తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయిని, తాడిపత్రి టీడీపీ కార్యకర్తలను చంపింది జేసీ బ్రదర్స్ కాదా అని ప్రశ్నించారు
‘టీడీపీ కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేసిన జేసీకి లోకేష్ ఎందుకు మద్దతు ఇస్తున్నారు?. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 154 వాహనాలను జేసీ ట్రావెల్స్ అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించింది. ప్రబోధానందస్వామి ఆశ్రమంపై జేసీ దివాకర్ రెడ్డి దాడి చేయించారు. జేసీ బ్రదర్స్ అక్రమాలపై టీడీపీ నేతలు పోరాడిన సంగతి గుర్తు లేదా’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అని పేర్కొన్నారు.
చదవండి: టీడీపీ సీనియర్ నేతకు షాక్.. బాబు వద్దకు పంచాయితీ!
Comments
Please login to add a commentAdd a comment