అనంతపురం జిల్లాలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ కుటుంబం ఒకటుంది. ఆ కుటుంబ పెద్ద ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆయనకో తమ్ముడున్నాడు. అన్నదమ్ములు ఇద్దరికీ నోటి తీట, దుడుకుతనం కూడా ఎక్కువే. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్నదమ్ముల రాజకీయ ప్రభ మసకబారింది. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తుండటంతో ఉనికి కోసం నానా తంటాలు పడుతున్నారు.
జేసీ దివాకరరెడ్డి, జేసీ ప్రభాకరరెడ్డి పేర్లు అనంతపురం జిల్లాలో అందరికీ పరిచయమైనవే. 1985 నుంచి వరుసగా ఆరుసార్లు తాడిపత్రి అసెంబ్లీ సీటు నుంచి విజయం సాధించిన దివాకరరెడ్డి నలుగురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని ముందుగానే ఊహించి హస్తానికి హ్యాండిచ్చి కుటుంబం అంతా సైకిల్ సవారీ స్టార్ట్ చేసింది.
తాడిపత్రి అసెంబ్లీ సీటు తమ్ముడు ప్రభాకరరెడ్డికి ఇచ్చి.. తాను అనంతపురం ఎంపీగా పోటీ చేశారు దివాకరరెడ్డి. ఇద్దరూ విజయం సాధించారు. ఇక 2019లో తాను తప్పుకుని కొడుకు పవన్‌రెడ్డిని అనంతపురం నుంచీ ఎంపీ సీటుకు పోటీ చేయించారు. అయితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభంజనంతో జేసీ బ్రదర్స్ రాజకీయాలు ముగిసిపోయాయి. నాలుగు దశాబ్దాల రాజకీయానుభవం వైఎస్ జగన్ జైత్రయాత్ర ముందు తుడిచిపెట్టుకుపోయింది. ఆ షాక్ నుంచి జేసీ కుటుంబం ఇంకా తేరుకోలేదు. ఓటమి తర్వాత పవన్‌రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
మరో ఏడాదిలో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు జేసీ దివాకరరెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో జేసీ కుటుంబానికి ఒక టిక్కెట్ మాత్రమే ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ జేసీ ప్రభాకర్‌రెడ్డి లేదా ఆయన కుమారుడికి ఇస్తే తమ పరిస్థితి ఏంటని జేసీ దివాకర్‌రెడ్డి డైలమాలో పడ్డారు
చదవండి: చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపై మంత్రి అంబటి ట్వీట్
అందుకే రాయల తెలంగాణా పేరుతో మరోసారి వార్తల్లోకి ఎక్కి.. రాజకీయంగా గందరగోళం సృష్టించి..లబ్ది పొందాలని జేసీ దివాకర్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే పలువురు రాజకీయ నిరుద్యోగులను జేసీ దివాకర్ రెడ్డి కలుస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ను ఇటీవలే జేసీ దివాకర్ రెడ్డి కలిసి చర్చించారు. రాయల తెలంగాణ అంశంతో పాటు శింగనమల అసెంబ్లీ స్థానంపై జేసీతో శైలజానాథ్ చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు తాడిపత్రి నియోజకవర్గంలో రోజు రోజుకూ బలహీన పడుతున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం.. రెచ్చగొట్టే కార్యక్రమాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
చదవండి: రజినీకాంత్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన లక్ష్మీపార్వతి
పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదు. నోటి దురుసుతో అధికారులు, ప్రత్యర్థులపై తిట్లు లంకించుకోవడం, దాడులకు దిగడం ద్వారానే ఎప్పుడూ వార్తల్లో వ్యక్తులుగా ఉండే జేసీ బ్రదర్స్ ఇప్పుడు రాజకీయంగా ఉనికి నిలబెట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రజల్ని రెచ్చగొట్టే రాజకీయాలకు కూడా దిగుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment