సాక్షి, అమరావతి బ్యూరో: రోడ్డు ప్రమాద ఘటనను నీరుగార్చేందుకు అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మృతదేహాలను ఆసుపత్రి నుంచి హడావుడిగా తరలించేందుకు ప్రయత్నిం చారు. మృతుల కుటుంబ సభ్యులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉండనివ్వలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చేసరికి అక్కడంతా సాధారణ పరిస్థితి ఉందనే భ్రమ కల్పించేందుకు ప్రయత్నించారు. ట్రావెల్స్ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం సాక్షాత్తూ కృష్ణా జిల్లా కలెక్టర్‌నే రంగంలోకి దించింది. పోస్టుమార్టం చేయకుండా శవాలను బంధువులకు అప్పగించడానికి డాక్టర్లు, పోలీసులు, అధికారులు అంగీకరిం చరు కాబట్టి కలెక్టర్‌ను పంపించింది.
ప్రమాదంలో మరణించిన వారిని అధికారులు మధ్యాహ్నం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. అదే సమయంలో మంత్రి కామినేని ఆసుపత్రికి చేరుకుని అధికారులతో రహస్యంగా చర్చలు జరిపారు. అనంతరం కొంత సమయానికే మృతదేహాలకు పోస్టుమార్టం చేయకుండానే హడావుడిగా తెల్లటి సంచుల్లో చుట్టి బంధువులకు అప్పగించే ప్రయత్నం ప్రారంభించారు. దీన్ని వైఎస్సార్‌సీపీ నేతలు వ్యతిరేకించారు.
టీడీపీ నేతల తిట్లపురాణం..
మృతుల కుటుంబాలతో వైఎస్ జగన్ మాట్లాడుతుండగా స్థానిక టీడీపీ నేతలు ఆసుపత్రిలోకి చొరబడ్డారు. ‘‘వైఎస్సార్‌సీపీ నేతలు ఆసుపత్రి నుంచి వెళ్లిపోవాలి’’ అని కేకలు వేశారు. తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసును నెట్టివేశారు. రాయలేని పదజాలంతో దూషించారు.
టీడీపీ ‘శవ’ రాజకీయం
Published Wed, Mar 1 2017 3:04 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
Advertisement