
'నిబంధనలు పాటించకనే బస్సు ప్రమాదం'
ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు నిబంధనలు గాలికొదిలేయడం మూలంగానే మూలపాడు బస్సు ప్రమాదం చోటు చేసుకుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి అన్నారు.
పెనుగంచిప్రోలు: ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు నిబంధనలు గాలికొదిలేయడం మూలంగానే మూలపాడు బస్సు ప్రమాదం చోటు చేసుకుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి అన్నారు. రోడ్డుపై కట్టుదిట్టమైన కాంక్రీటు అడ్డుగోడలు ఉన్నా.. బస్సు కల్వర్టులో పడిందంటే.. బస్సులు ఎలా నడుపుతున్నారో అర్థమౌతుందన్నారు. మంగళవారం ప్రమాదస్థలాన్ని సందర్శించిన ఆయన.. ఘటన తరువాత ప్రభుత్వం వేగంగా స్పందించలేదని విమర్శించారు.
ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సహాయం అందించాలని పార్థసారధి కోరారు. మృతులు, క్షతగాత్రులకు నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పార్థసారధి డిమాండ్ చేశారు. రాజధానికి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో.. సహాయ కార్యక్రమాలు ఆలస్యం కావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.