
సాక్షి, అనంతపురం: దివాకర్ రోడ్‌లైన్స్, బీఎస్ 3 వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలను వన్‌టౌన్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఆదివారం వన్‌టౌన్‌లో సీఐ ప్రతాప్‌రెడ్డి దాదాపుగా 40 వాహనాలకు సంబంధిన రిజిస్ట్రేషన్‌లపై లోతుగా విచారణ చేపట్టారు.
వాహనాలను ఎక్కడ కొనుగోలు చేశారు? నాగాలాండ్‌లో ట్రక్కు వాహనాల కొనుగోలు, రిజిస్ట్రేషన్లు, తదితరాలపై తండ్రీకొడుకులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం మెజిస్ట్రేట్ ముందు మరోసారి వీరిద్దరినీ వన్‌టౌన్ పోలీసులు హాజరుపర్చనున్నారు. కస్టడీని పొడిగించాలని కోరనున్నట్లు సమాచారం.
చదవండి: కస్టడీకి జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment