నిశీధిని చీల్చు కుంటూ భానుడి కిరణాలు మరికాసేపట్లో నేలను తాకుతాయనేలోగానే... ఆ ప్రయాణి కుల జీవితాలు అర్ధాంతరంగా తెల్లారి పోయాయి. క్షేమంగా గమ్యస్థానానికి చేరుస్తుందని ఎక్కిన బస్సే మృత్యుశకటంగా మారి ప్రాణాలను బలితీసుకుంది. నుజ్జునుజ్జయిన బస్సు... అందులో ఇరుక్కుపోయి మృత్యువాతపడ్డ అభాగ్యులు... కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఆర్తనాదాలు చేస్తున్న బాధితు లు... అంతటా రోదనలు... వర్ణింపశక్యంగాని వేదన.