penuganchiprolu
-
సెల్ఫీ వీడియో: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, పెనుగంచిప్రోలు (కృష్ణా): ఒక్కగానొక్క కుమారుడు.. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. పెద్ద చదువులు చదివిస్తున్నారు. కానీ ఓ పరీక్ష ఫెయిలయ్యానన్న మనస్థాపంతో ఆ కుమారుడు ఆత్మహత్య చేసుకుని కన్నవారికి కడపుకోతను మిగిల్చాడు. పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చారు. వివరాలు... పెనుగంచిప్రోలుకు చెందిన వడ్డెల్లి గోపాలరావు, తులసి దంపతుల ఏకైక కుమారుడు తిరుమలేష్(23) ఏలూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు రాసే ప్రవేశ పరీక్షలో క్వాలిఫై కాలేదని మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. (చదవండి: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం) ఈ క్రమంలో సోమవారం సెల్ఫీ వీడియో తీసుకుని కళాశాల భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. "అమ్మా... నేను ఫెయిల్యూర్‌గా మిగిలిపోయా. ఎంత ప్రయత్నించినా ముందుకు సాగలేక పోతున్నా.. చదువులో ముందుకు వెళ్లలేకపోతున్నానమ్మా. నాలాంటి ఎదవకు జన్మనిచ్చి మీరు తప్పు చేశారమ్మా.. మీ ఆశల్ని నెరవేర్చలేక పోతున్నందుకు బాధగా ఉంది. మీరు కష్టపడి పెంచిన ఈ జీవితానికి ఇక సెలవమ్మా, నన్ను క్షమించండి" అంటూ వీడియో తీసి మిత్రులకు పంపాడు. తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తిరుమలేష్‌ను విజయవాడ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడి నేత్రాలను ఆయన కుటుంబ సభ్యులు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. (చదవండి: జీవితం నాశనం అయింది, బతికింది చాలు) -
30 నిమిషాల్లోనే రేషన్‌కార్డులు
లింగగూడెం (పెనుగంచిప్రోలు) /ఎ.కొండూరు: ఏళ్లపాటు కాళ్లరిగేలా తిరిగినా మంజూరు కాని రేషన్‌కార్డులు ఇప్పుడు నిమిషాల్లోనే చేతికి అందుతున్నాయి. కృష్ణాజిల్లాలో శుక్రవారం దరఖాస్తు చేసుకున్న 30 నిమిషాల్లోనే ముగ్గురికి రేషన్ కార్డులు అందాయి. సీఎం ప్రారంభించిన గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజల సమస్యలు గంటల్లోనే పరిష్కారం అవుతున్నాయి అనడానికి ఇదే నిదర్శనమంటున్నారు. పెనుగంచిప్రోలు మండలం లింగగూడెంలో గంగదారి అరుణ, రామారావు దంపతులు, మాదిరాజు నరేష్, రమాదేవి దంపతులు గతంలో కార్డుకోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో వారు శుక్రవారం వలంటీర్‌ను కలిసి ఉదయం 10.15 గంటలకు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేశారు. అయితే 10.30 గంటలకు గ్రామ సచివాలయంలో కార్డులు ప్రింటయ్యాయి. 10.40 గంటలకల్లా తహసీల్దార్ షకీరున్నీసాబేగం, ఎంపీడీవో రాజు గ్రామానికి వచ్చి లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఎ.కొండూరు మండలం వల్లంపట్లలో బాణావత్ పాప కుటుంబం గ్రామ సచివాలయంలో రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. వెంటనే కార్డు మంజూరైంది. 30 నిమిషాల్లోనే సచివాలయ సిబ్బంది కార్డును ప్రింట్ తీసి లబ్ధిదారులకు అందజేశారు. -
టీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి
సాక్షి, కృష్ణా: జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ నుంచి ఒంగోలు వెళ్తున్న టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెనుగ్రంచిప్రోలులో సంఘీభావయాత్ర
-
బతుకు బుగ్గి
పెనుగంచిప్రోలు : వారంతా నిరుపేదలు...అమ్మ సన్నిధిలో జీవితాలు వెళ్లదీస్తున్నారు...తిరునాళ్ల సందర్భంగా చిరు వ్యాపారాలు చేసుకొని కుటుంబ పోషణకు సంపాదించుకుందామన్న వారి ఆశలు అడియాసలయ్యాయి. ప్రమాదవశాత్తూ ఆదివారం మధ్యాహ్నం చెలరేగిన మంటలు వారి జీవితాల్లో తీరని వేదనను మిగిల్చాయి. పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మవారి చిన్న తిరునాళ్ల సందర్భంగా మునేరులో పాకలు వేసుకొని పేదలు చిరు వ్యాపారాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మునేరు వెళ్లే దారిలో ఒక పక్క పాకలో పొంగళ్లు చేస్తుంటే ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు గాలి కూడా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి సుమారు 50 దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని దుకాణదారులతో పాటు, పాకల్లో ఉన్న భక్తులు పరుగులు తీశారు. పాకలు మొత్తం తాటాకు, పట్టాలతో కావడంతో ప్రమాద తీవ్రత బాగా ఉంది. తిరునాళ్లకు వ్యాపారులు ఒకొక్కరు రూ.5 నుంచి రూ.10లకు వడ్డీలకు తెచ్చి సరుకు పాకల్లో ఉంచారు. అది కాస్తా బుగ్గి కావడంతో వ్యాపారులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ప్రమాదంలో కోళ్లు, కొబ్బరికాయలు, బొమ్మలు, కుండలు, గుడ్లతో పాటు రెండు రోజుల వ్యాపారంలో వచ్చిన డబ్బులు కూడా బూడిదయ్యాయి. తిరునాళ్ల ఐదు రోజుల పాటు అయితే పసుపు–కుంకుమల రోజు మాత్రమే ఫైర్ ఇంజన్ కావాలని ఆలయ అధికారులు కోరడం, ఆదివారం ఉదయం ఫైర్ ఇంజన్ వెళ్లడం, మధ్యాహ్నం ప్రమాదం జరిగిందని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనధికారికంగా మునేరులో పాకలకు విద్యుత్ సౌకర్యం, గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం కూడా ప్రమాదానికి కారణంగా ఉంది. ఒక్క సిలిండర్‌కు 5 నుంచి 10 పొయ్యులు ఏర్పాటు చేస్తారు. దీంతో పైప్‌లు లీకై మంటలు వ్యాపించి ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే కారణం మునేరులో జరిగిన ప్రమాదానికి దేవస్థాన అధికారులతోపాటు ఇతర శాఖల అధికారుల నిర్లక్ష్యమే కారణమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైర్ ఇంజన్ ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదన్నారు. ప్రమాద స్థలిని పరి శీలించిన జాయింట్ కలెక్టర్–2 బాబూరావుకు కూడా బాధితులు, స్థానికులు ఇదే విషయాన్ని తెలియజేశారు. దీనిపై ఆయన వెంటనే సమన్వయ సమావేశం సందర్భంగా రాసి న మినిట్స్ తీసుకు రమ్మని ఆలయ అధికారులను ఆదేశించారు. దానిలో కేవలం రెండు రోజులు మాత్రమే ఫైర్ ఇంజన్ కావాలని రాసి ఉండటంతో జేసీ ఈవో ఎం రఘునాథ్, ఇతర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయ సమావేశానికి ఆర్డీవోను ఎలా పిలవాలో తెలియదు, ఐదు రోజుల తిరునాళ్లకు ఒక్క రోజే ఫైర్ ఇంజన్ కావాలని ఎందుకు రాశారు అని ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని వైఎస్సార్సీపీ విజ యవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ ఇంటూరి చిన్నా, ఆలయ ఈవో రఘునా«థ్, చైర్మన్ కర్ల వెంకట నారాయణ, డీఈ రమ, వైఎస్సార్సీపీ పంచా యతీ విభాగపు జిల్లా అధ్యక్షుడు తన్నీరు నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఇంజం కేశవరావు, మండల కన్వీనర్లు కంచేటి రమేష్, చిలుకూరి శ్రీనివాసరావు, కాకాని హరి, ముత్యాల చలం, వేల్పుల రవికుమార్, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఇంటూరి నాగేశ్వరరావు, సీపీఎం మండల కార్యదర్శి అరుణ్‌కుమార్ సందర్శించి బాధితులతో మాట్లాడారు. బాధితులను ఆదుకుంటాం : కలెక్టర్ విజయవాడ: పెనుగంచిప్రోలులో లక్ష్మీతిరుపతమ్మ ఆలయ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. లక్ష్మీతిరుపతమ్మ ఆలయంలో ఆదివా రం భక్తులు పొంగళ్ల తయారీ సమయంలో జరిగిన అగ్ని ప్రమా ద ఘటనలో తాత్కాలిక గుడారాలకు నిప్పంటుకుని దగ్ధం కావ డం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనలో నష్టపోయిన ఒక్కొక్కరికి రూ.7వేల చొప్పున 42 మందికి పరిహారం చెక్కులను తక్షణమే అందించాలని జాయింట్ కలెక్టర్ –2 పి.బాబూ రావును ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. బాధితులకు భోజన సదుపాయాలు కల్పించాలని వా రికి అవసరమైన రుణాలు మంజూరు చేయాలని ఆదేశించానన్నారు. ప్రభుత్వ వైఫల్యం : ఉదయభాను ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని వైఎస్సార్సీపీ విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను విమర్శించారు. ప్రమాదంలో చిరు వ్యాపారులు దారుణంగా నష్ట పోయారన్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారాలు చేస్తున్నారని, వారికి ఇలా కావటంచాలా దురదృష్టకరమన్నారు. ఫైర్ ఇంజన్ కేవలం ఒక్కరోజు మాత్రమే ఉండటం వల్ల ఈప్రమాదం జరిగిందన్నారు. అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. ప్రమాదంలో నష్టపోయిన వారికి ఒకొక్కరికి రూ.1 నుంచి రూ.1.50 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంఘటనాస్థలంలో వివరాలు అడిగి తెలుసుకుంటున్న వైఎస్సార్సీపీ నేత ఉదయ భాను -
ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రేమజంట మృతి
కృష్ణా జిల్లా : పెనుగంచిప్రోలు మండలంలో లింగగూడెంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఈ నెల 27న ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికులు బుధవారం చికిత్స పొందుతూ మరణించారు. పెనుగంచి ప్రోలు మండలం శివాపురం గ్రామానికి చెందిన సాయి(20), నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఎల్బీ తండాకు చెందిన సునీత(19)లు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఏం చేయాలో తోచక ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించారు. చనిపోదామని నిర్ణయించుకుని లింగగూడెం గ్రామం వద్దకు వచ్చారు. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోవడంతో చికిత్స నిమిత్తం గ్రామ పెద్దలు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ మూడు రోజుల తర్వాత తనువు చాలించారు. ఈ ఘటనపై పోలీసులు ఇది వరకే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
కృష్ణా జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
-
అన్నదమ్ముల మృతితో జిల్లాలో విషాదం
-
అతి వేగమే బస్సు ప్రమాదానికి కారణం
-
డెత్ ట్రావెల్స్!
- కృష్ణా జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం - డివైడర్‌ను ఢీకొట్టి కాలువలో పడ్డ దివాకర్ ట్రావెల్స్ బస్సు - 10 మంది దుర్మరణం - 32 మందికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం - మృతి చెందిన వారిలో బస్సు డ్రైవర్, క్లీనర్ - భువనేశ్వర్ – హైదరాబాద్ బస్సును కాటేసిన మృత్యువు - మద్యంమత్తు, అతివేగంతో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్ పెనుగంచిప్రోలు(జగ్గయ్యపేట): నిశీధిని చీల్చు కుంటూ భానుడి కిరణాలు మరికాసేపట్లో నేలను తాకుతాయనేలోగానే... ఆ ప్రయాణి కుల జీవితాలు అర్ధాంతరంగా తెల్లారి పోయాయి. క్షేమంగా గమ్యస్థానానికి చేరుస్తుందని ఎక్కిన బస్సే మృత్యుశకటంగా మారి ప్రాణాలను బలితీసుకుంది. నుజ్జునుజ్జయిన బస్సు... అందులో ఇరుక్కుపోయి మృత్యువాతపడ్డ అభాగ్యులు... కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఆర్తనాదాలు చేస్తున్న బాధితు లు... అంతటా రోదనలు... వర్ణింపశక్యంగాని వేదన. ఇదీ.. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు గ్రామం వద్ద విజయవాడ– హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున హృదయాలను ద్రవింపజేసిన దృశ్యం. దివాకర్ ట్రావెల్స్ బస్సు(ఏపీ02 టీసీ 7146) మంగళవారం ఉదయం 5.45 గంటల ప్రాంతంలో ముండ్లపాడు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా, మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రి, ఆంధ్రా ఆసుపత్రి, హెల్ప్ ఆసుపత్రిలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. (కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కబళించిన అతివేగం దివాకర్ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఒడిశాలోని కటక్‌లో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరింది. ఈ బస్సు మంగళవారం ఉదయం 9 గంటలకు హైదరా బాద్‌కు చేరుకోవాలి. కృష్ణా జిల్లాలో విజయ వాడ దాటిన తర్వాత 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ మంగళవారం తెల్ల వారుజామున 5.45 గంటల ప్రాంతంలో ముండ్లపాడు క్రాస్‌రోడ్స్ వద్ద ప్రమాదానికి గురైంది. మద్యం మత్తు, డ్రైవర్ మితిమీరిన వేగంతో బస్సును నడుపుతుండటం ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ముండ్లపాడు సమీపంలోని మలుపు వద్ద బస్సును డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు. దీంతో మలుపు వద్ద బస్సు నేరుగా డివైడర్‌ను ఢీకొట్టింది. అత్యంత వేగంగా వస్తుండటంతో డివైడర్‌పై నుంచి అమాంతంగా గాల్లోకి ఎగిరి దాదాపు 150 అడుగుల దూరంలో ఉన్న మంగలకాలువ కల్వర్టు మధ్యలోకి దూసుకె ళ్లింది. దాదాపు 22 అడుగుల లోతున్న కల్వర్టు లోకి దూసుకెళ్తూ ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టింది. దీంతో బస్సు నుజ్జునుజ్జు అయ్యిం ది. డ్రైవర్ ఆదినారాయణ (45), క్లీనర్ పట్టం శెట్టి పృథ్వీ(30) అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రుల రోదన దివాకర్ ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టి అమాంతంగా గాల్లో ఎగురుకుంటూ 22 అడుగుల లోతులో కల్వర్టులో పడిపోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. బస్సు కల్వర్టులో నుజ్జునుజ్జై ఇరుక్కుపోయింది. దీంతో బస్సు తలుపులు తీయడం సాధ్యపడలేదు. ప్రమాదం జరిగిన తర్వాత అరగంటకు సమీపంలోని ముండ్లపాడు, నవాబుపేట గ్రామస్తులు సంఘ టనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతమంతా మృతదేహాలు, రక్తపు మడుగు లతో భీతావహంగా మారింది. తీవ్రంగా గాయ పడిన ప్రయాణికులు తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎవరు మృతి చెందారో, ఎవరు గాయపడ్డారో కొద్దిసేపు ఏమీ అర్థంకాని పరిస్థితి నెలకొంది. అప్పటికి ఇంకా చీకటిగానే ఉండటంతోపాటు, కాలువలో మురుగునీరు, బురద ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీ సులు వచ్చేలోగా బస్సులో ఉన్నవారిని బయట కు తీసేందుకు ప్రయత్నించారు. బస్సు కచ్చి తంగా కాలువ మధ్యలో ఇరుక్కుపోవడంతో క్షతగాత్రులను బయటకు తీయడం సాధ్యపడ లేదు. పోలీసులు, అగ్నిమాపక, రెస్క్యూటీమ్ సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలు ప్రారంభించారు. గ్యాస్ కట్టర్లు, క్రేన్లు, ఇతర సామగ్రితో బస్సు భాగాలను కోస్తూ ఒక్కొక్కరిగా క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చారు. బస్సు మధ్యలో ఇరుక్కుపో యిన చివరి మృతదేహాన్ని క్రేన్ల సహాయంతో బస్సును పైకి లేపి మధ్యాహ్నం 12 తరువాత బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 5.45కు ప్రమాదం జరిగితే మధ్యాహ్నం 12 గంటలకు సహాయక చర్యలు పూర్తయ్యాయి. దాదాపు 7 గంటలపాటు క్షత గాత్రులు బస్సులోనే ఆర్తనాదాలు చేస్తూ ఉండిపోయారు. బస్సులో ప్రయాణిస్తున్న కోట మధుసూదనరెడ్డి(40), నల్లబోతు శేఖర్ రెడ్డి(28), తులసమ్మ(45), బలదేవ్(39), షేక్ బాషా(34), మహ్మద్ తయ్యబ్(35), విద్యా పతి(34) సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. మరో 32 మంది ప్రయాణికులకు తీవ్ర, స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రు లను మూడు ‘108’అంబులెన్స్‌ల్లో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. తీవ్రంగా గాయపడిన నల్లబోతు కృష్ణారెడ్డి(32) నంది గామ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. సంఘటనా స్థలంలో మృతిచెందిన నల్లబోతు శేఖర్‌రెడ్డి, నందిగామ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచిన నల్లబోతు కృష్ణారెడ్డి స్వయానా అన్మదమ్ములు. వారి స్వస్థలం తెలంగాణలోని సూర్యాపేట. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 11 మంది, ఆంధ్రా హాస్సిటల్లో 13 మంది, హెల్ప్ హాస్సిటల్లో 8 మందికి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కె.చంద్రమోహన్‌రావు (ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా), కమల (శ్రీకాకుళం) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అతివేగమే కారణం: డీజీపీ ముండ్లపాడు వద్ద బస్సు ప్రమాదంలో 10 మంది మృతి చెందడం, 32 మంది గాయపడటానికి ప్రధాన కారణం అతివేగమే కారణమని ఏపీ డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. ఆయన మంగళవారం రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: కామినేని నందిగామ రూరల్ (నందిగామ): బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. బస్సు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు ఆయన మంగళవారం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియో అందజేస్తామని తెలిపారు. ప్రమాదం కలిచివేసింది: పవన్‌కల్యాణ్ సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన తనను ఎంతో కలిచివేసిందని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించినవారు నల్లబోతు కృష్ణారెడ్డి(32), సూర్యాపేట నల్లబోతు శేఖరరెడ్డి(28), సూర్యాపేట తులసమ్మ(45), శ్రీకాకుళం జిల్లా బలదేవ్(39), భువనేశ్వర్ షేక్ బాషా(34), భవానీపురం, విజయవాడ మహ్మద్ తయ్యబ్(35), ముషీరాబాద్, హైదరాబాద్ విద్యాపతి(34), ఒడిశా కోట మధుసూదనరెడ్డి(40), ఒడిశా ఆదినారాయణ(45), డ్రైవర్, తాడిపత్రి, అనంతపురం జిల్లా పట్టంశెట్టి పృథ్వీ(30), క్లీనర్, గణపవరం, గుంటూరు జిల్లా పరిస్థితి విషమంగా ఉన్నవారు కె.చంద్రమోహన్‌రావు, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా కమల, శ్రీకాకుళం క్షతగాత్రులు వీరే .. కృష్ణా జిల్లా ముండ్లపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడినవారు విజయవాడలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం. యుగంధర్(38), ఎం.కమల(61), టెక్క లికి చెందిన సీహెచ్ రేవతి(21), ఎర్రగడ్డకు చెందిన ఎ.ఎ.భాసిత్(49), కూకట్‌పల్లికి చెందిన ఎ.ప్రశాంత్ (28), భువనేశ్వర్‌కు చెందిన ఉత్తమ్(18), గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఎం.కుమార్ (37), కొండపల్లికి చెందిన పటాన్జానీ(28), విజయవాడకు చెందిన బి.ప్రవీణ్ (26), టెక్కలికి చెందిన సీహెచ్ కిరణ్ (27), శ్రీకాకుళానికి చెందిన ఎ.అచ్యుతరావు(27), లక్ష్మీనాయుడు (28), హైదరాబాద్‌కు చెందిన ఎస్. కోటేశ్వరరావు(30), భువనేశ్వర్‌కు చెందిన దీప్తిరంజన్ (27), ఎస్.గణేష్((32), విజయనగరం జిల్లాకు చెందిన భార్గవి (22), శ్రీకాకుళం జిల్లాకు చెందిన వి.శివ రామకృష్ణ(31), ఆర్.దిలీప్ కుమార్(30), దినేష్(24), హైదరాబాద్‌కు చెందిన కృష్ణవర్దన్(34), సందీప్(27), బి.వాసు దేవరావు(30), జలయం నలీమ్(35), డి.గణేష్(35), హైదరాబాద్‌కు చెందిన పెరుమాళ్ల అహ్మద్(34), శెట్టి చిత్ర(22), శ్రీకాకుళం జిల్లాకు చెందిన వంబరవల్లి వెంకటరావు(31), ఆముదాలవలసకు చెందిన కెంబూరు చంద్రమోహనరావు (37), కటక్‌కు చెందిన సిరాజ్‌ఖాన్(40), హైదరాబాద్‌కు చెందిన కోట అభిషేక్ (22), సూరత్‌కు చెందిన అనూష్పాండే (22), సాలూరుకు చెందిన జి.బాలాజీ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణం సాక్షి, అమరావతి బ్యూరో: అతివేగంతోపాటు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్లే దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైందని ఏపీ రవాణా శాఖ ప్రకటిం చింది. ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఇ.మీరాప్రసాద్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఒడిశాలోని కటక్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు (ఏపీ 02 టీసీ 7146) కృష్ణాజిల్లా ముండ్లపాడు వద్ద మంగళవారం ఉదయం 5.40కు ప్రమాదానికి గురైంది. రవాణాశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. డ్రైవర్ అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ నిద్రలోకి జోగడంతో బస్సు డివైడర్‌ను ఢీకొని కల్వర్టులో పడిందని అధికారులు చెబుతున్నారు. కల్వర్టు గోడలను రాసుకుంటూ పడటంతో డ్రైవర్‌తోపాటు కుడివైపు ప్రయాణికులు అక్కడే మృతిచెందారు. ఆ క్షణం ఊపిరాగినట్లైంది: వి.శివరామకృష్ణ, ఉద్యోగి, శ్రీకాకుళం హైటెక్ సిటీలో ఉద్యోగం చేస్తున్నా. శివరాత్రి సందర్భంగా సొంతూరు వెళ్లాను. తిరిగి హైదరాబాద్ బయలుదేరాను. నిద్రలో ఉండగా ఏదో కుదిపినట్లు అనిపించి కళ్లు తెరిచాను. చుట్టూ చీకటి.. అంతలోనే అరుపులు.. కేకలు... ఆ క్షణం ఊపిరాగినంత పనైంది. ఇప్పటికీ కళ్ల ముందే కదులుతోంది: కొల్లూరు వెంకటభరద్వాజశర్మ, విశాఖపట్నం హైదరాబాద్ విప్రోలో ఉద్యోగం చేస్తున్నా. మహాశివరాత్రి కావడంతో తల్లిదండ్రుల వద్దకు వచ్చా. తెల్లవారు జామున పెద్ద శబ్దం, రోడ్డుపై ప్రయాణించాల్సిన బస్సు కల్వర్టులో ఉంది. భయానక వాతావరణం నెలకొంది. ఇప్పటికీ కళ్లముందే కదులుతూ ఒళ్లు గగుర్పొడుస్తోంది. గత ఐదేళ్లలో ఘోర బస్సు ప్రమాదాలు 2016 సెప్టెంబర్ 16న హైదరాబాద్ నుంచి షిర్డీ వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ స్లీపర్ బస్సు కర్ణాటక దగ్గర హుమ్నాబాద్ వద్ద తగలబడి పోయింది. ఈ మంటల్లో చిక్కుకుని తణుకు ప్రాంతానికి చెందిన మూడేళ్ల చిన్నారి విహాన్ సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనలో 30 మంది క్షతగాత్రులయ్యారు. 2013 అక్టోబర్ 30న బెంగళూరు– హైదరాబాద్ జాతీయ రహదారిపై మహబూబ్‌నగర్ జిల్లా పాలెం గ్రామం వద్ద జబ్బర్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు ప్రమాదానికి గురై 45 మంది సజీవదహనమయ్యారు. 2012 జూన్ 16న షోలాపూర్–హైదరాబాద్ జాతీయ రహదారిపై షిర్డీ వెళుతున్న కాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడి 32 మంది భక్తులు మరణించారు. -
రెండో డ్రైవర్ పారిపోయాడా, తప్పించారా?
నందిగామ: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ నాయకుడు కె. పార్థసారధి డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతల బస్సు కాబట్టే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తోందన్నారు. చనిపోయిన వారిని ఆదుకోవాలన్న కనీస ఆలోచన లేని దౌర్బగ్య ప్రభుత్వం ఇదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రన్న బీమాతో చేతులు దులుపుకుంటారా అని ప్రశ్నించారు. చంద్రన్న బీమా ఉన్నవారికి ఒకలా, లేనివారికి మరోలా పరిహారం ప్రకటించడడం సమంజసం కాదన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వేరే రాష్ట్రాల వారికి తక్కువ పరిహారం ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. నందిగామ ప్రభుత్వాసుపత్రి నుంచి హడావుడిగా మృతదేహాలను ఎందుకు తరలిస్తున్నారని నిలదీశారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న రెండో డ్రైవర్ పారిపోయాడని చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. రెండో డ్రైవర్ పారిపోయాడా, తప్పించారా అని సూటిగా ప్రశ్నించారు. రెండో డ్రైవర్ ను కనీసం ప్రశ్నించరా అని అడిగారు. ఎవరినో కాపాడడానికే ఇదంతా చేస్తున్నారని పార్థసారధి ఆరోపించారు. -
ప్రమాదస్థలిని పరిశీలించిన వైఎస్ జగన్
-
ప్రమాదస్థలిని పరిశీలించిన వైఎస్ జగన్
పెనుగంచిప్రోలు: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో బస్సు ప్రమాదం జరిగిన స్థలాన్ని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ప్రమాద వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలుసుకునేందుకు అక్కడి నుంచి నందిగామకు బయలుదేరారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే వైఎస్ జగన్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి పెనుగంచిప్రోలుకు వచ్చారు. జగన్ వస్తున్నారని తెలియగానే అధికారులు హడావుడి చేశారు. ప్రమాదానికి గురైన బస్సును హుటాహుటిన బయటకు తీసి దూరంగా తరలించే యత్నం చేశారు. నందిగామలో మృతదేహాలకు హడావుడిగా పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం ఇదంతా చేస్తోందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. -
‘ప్రభుత్వంలోని పెద్దల వాహనాలతోనే ప్రమాదాలు’
విజయవాడ: ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు చెందిన వాహనాలే ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు. ప్రభుత్వంలోని పెద్దలు తమ పలుకుబడి వినియోగించి నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్నారని విమర్శించారు. మంగళవారం ఆయన గొల్లపూడి ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రవాణా రంగంలో ప్రైవేట్ ఆధిపత్యం పెరిగిపోయిందన్నారు. అంతేకాదు, ప్రైవేట్ వాహనాల వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుతున్నాయని తెలిపారు. చనిపోయిన వారికి చంద్రన్న బీమా కింద రూ.5 లక్షలు ఇస్తామనడం దారుణన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. హైవేలపై ప్రమాదాలను నివారించకుండా మొక్కుబడి చర్యలు తీసుకోవటం తగదని అన్నారు. -
బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం
అమరావతి: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ములపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. చంద్రన్న బీమా ఉన్నవారికి 5 లక్షలు, చంద్రన్న బీమా లేనివారికి 3 లక్షలు, ఇతర రాష్ట్రాల వారికి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. అతివేగమే కారణం: బస్సు ప్రమాదానికి అతివేగమే కారణమని ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు. ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు. ఈ రోజు ఉదయం బస్సు ప్రమాదంలో 11 మంది మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు. -
బస్సు ప్రమాదంపై కేంద్రమంత్రి ఆరా
ఆంధ్రప్రదేశ్‌లోని పెనుగంచిప్రోలు సమీపంలో తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంపై కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) ధర్మేంద్ర ప్రధాన్ ఆరా తీశారు. ఒడిషాలోని భువనేశ్వర్ నుంచి ఈ బస్సు బయల్దేరడంతో.. ఒడిషాకు చెందిన ప్రధాన్, తన రాష్ట్రం వారి క్షేమ సమాచారాల గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు. ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు ఒడిషా వారందరినీ గుర్తించి, వారికి తగిన చికిత్స అందించి, మళ్లీ జాగ్రత్తగా వారి స్వస్థలాలకు తిప్పి పంపాలని సూచించారు. బస్సు ప్రమాదంలో 14 మంది మరణించడానికి ప్రధాన కారణం డ్రైవర్ నిర్లక్ష్యమేనని చెబుతున్నారు. రెండు కల్వర్టులకు మధ్య ఉన్న ఎత్తయిన ప్లాట్‌ఫాం మీదకు బస్సు వెళ్లిపోతున్న విషయాన్ని గుర్తించినా, కనీసం బ్రేక్ వేసినట్లు కూడా రోడ్డు మీద గుర్తులు లేవని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తెలిపారు. ఘటనా స్థలానికి వచ్చిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. డ్రైవర్ అతివేగంగా బస్సు నడపడం, బహుశా నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందన్నారు. బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తమకు లిస్టు వచ్చిందన్నారు. Spoke over telephone to Hon'ble CM,Andhra Pradesh@ncbn; requested for identification of persons from Odisha & their treatment & safe return — Dharmendra Pradhan (@dpradhanbjp) 28 February 2017 -
పెనుగంచిప్రోలుకు బయల్దేరిన వైఎస్ జగన్
-
పెనుగంచిప్రోలుకు బయల్దేరిన వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలుకు బయల్దేరారు. పెనుగంచిప్రోలు మండలం ములపాడు వద్ద బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. బస్సు ప్రమాద బాధితులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ రోజు ఉదయం పెనుగంచిప్రోలు మండలం ములపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 11 మంది మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని నందిగామ, జగ్గయ్యపేట ఆస్పత్రులకు తరలించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా అదుపుతప్పి కల్వర్ట్‌లో పడింది. పోలీసులు దివాకర్ ట్రావెల్స్‌పై కేసు నమోదు చేశారు. -
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.
-
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
సినీ పరిశ్రమకు ఇబ్బందేమీ లేదు
పెనుగంచిప్రోలు : తెలుగు సినిమా పరిశ్రమపై పెద్దనోట్ల రద్దు ప్రభావం పెద్దగా ఏమీ ఉండదని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మ అమ్మవారిని శనివారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ కర్ల వెంకటనారాయణ ఆయనకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేసి సత్కరించారు. అనంతరం బోయపాటి శ్రీను స్థానిక విలేకరులతో మాట్లాడారు. గతంలో ‘సరైనోడు’ సినిమా షూటింగ్‌కు ముందు అమ్మవారిని దర్శించుకున్నానని, ఆ సినిమా సూపర్ హిట్ అయ్యిందన్నారు. అలాగే, ఈనెల 16వ తేదీ నుంచి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని, దానికి సంబంధించి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్, హీరోయిన్గా రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తున్నారని తెలిపారు. గతంలో భద్ర, తులసి, దమ్ము, సింహా, లెజెండ్, సరైనోడు సినిమాలు తీశానని, ఇప్పుడు తీయబోయేది ఏడో సినిమా అని పేర్కొన్నారు. ద్వారకా క్రియేషన్స్ రవీంద్రరెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. -
శాకంబరి అలంకరణలో శ్రీతిరుపతమ్మ
పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీగోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారు ¿శాకంబరీ అలంకరణలో ఈనెల 24న భక్తులకు దర్శనమివ్వనున్నారని ఆలయ ఈవో మంచనపల్లి రఘునాథ్, చైర్మన్ కర్ల వెంకటనారాయణలు తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శాకంబరీ ఉత్సవంలో భాగంగా అమ్మవారితో పాటు ఉపాలయాల్లోని సహదేవతలను, ఆలయ పరిసరాలను పలు రకాల శాకములు(కూరగాయాల)తో అలంకరిస్తామన్నారు. అదేరోజు చండీహోమం, రథంపై శాకంబరీ అలంకరణలో అమ్మవారి గ్రామోత్సవం ఉంటుందన్నారు. అలంకరణకు కావాల్సిన కూరగాయలు, పండ్లు ఇవ్వదలచిన దాతలు 23వ తేదీన ఆలయంలో అందజేయాలని కోరారు. వివరాలకు ఆలయ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డీఈ రమ, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆటో,వ్యాన్ ఢీ: ఇద్దరు విద్యార్థులకు గాయాలు
పెనుగంచిప్రోలు (కృష్ణా జిల్లా) : పెనుగంచిప్రోలు మండలం వెంగనాయపాలెం వద్ద ఆటోను వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. పదవ తరగతి పరీక్ష రాసి పెనుగంచిప్రోలు నుంచి స్వగ్రామం శనగపాడుకు వెళ్తుండగా ఈ ఘటన చోటచేసుకుంది. -
ట్రాక్టర్-ఆటో ఢీ: 8 మందికి గాయాలు
కృష్ణా: కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు సమీపంలో గురువారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ట్రాక్టర్, ఆటో ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వివాహేతర సంబంధం కారణంగానే..
పెనుగంచిప్రోలు (కృష్ణా జిల్లా) : భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో కలిసి మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన వివాహిత ప్రియుడితో పాటు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరూ మృతిచెందారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముల్లపాడు గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కంచికచర్ల మండలం మోగులూరు గ్రామానికి చెందిన సుజాత(26)కు జగ్గయ్యపేట మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వర్రావు(30)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య, భర్త తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా సుజాత అదే గ్రామానికి చెందిన నాగవేణు(20)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. కాగా.. మూడు రోజుల క్రితం సుజాత భర్త, పిల్లలను వదిలేసి నాగవేణుతో వెళ్లిపోయింది. దీంతో కుటుంబసభ్యులు కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారి ఆచూకీ కోసం వెతుకుతుండగా.. పెనుగంచిప్రోలు మండలం ముల్లపాడు గ్రామ శివారులోని సుబాబుల్ తోటల్లో ప్రాణాపాయస్థితిలో ఉన్నట్లు గుర్తించారు. అయితే అక్కడికి చేరుకునేలోపే సుజాత మృతిచెందగా.. నాగవేణు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పిడుగుపాటుకి ముగ్గురు మృతి
పెనుగంచిప్రోలు (కృష్ణా) : పిడుగుపాటుతో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని శనగపాడు గ్రామంలో వ్యవసాయ పొలంలో పిడుగుపడటంతో ఆ సమయంలో అక్కడ పనుల్లో నిమగ్నమై ఉన్న వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మృతులు రాజారత్నం, విశాక్, సత్యేశ్రావులుగా స్థానికులు గుర్తించారు. -
ఆలయ చైర్మన్ పదవికి తీవ్ర పోటీ
పెనుగంచిప్రోలు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయ పాలకవర్గ చైర్మన్ పదవికి పోటీ రసవత్తరంగా సాగుతోంది. పాలకవర్గం నియామకం కోసం ఈ నెల ఆరోతేదీన దేవాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 20 రోజుల్లో దరఖాస్తులు చేసుకోమని సూచించింది. దరఖాస్తులకు గడువు ఈ నెల 26తో పూర్తికానుంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తరువాత అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయ చైర్మన్ పదవి కోసం నాయకులు ఎవరికివారే ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్, నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకలాపాలు చూస్తున్న పాటిబండ్ల వెంకట్రావు ద్వారా నాయకులు చైర్మన్ పదవి కోసం కుస్తీలు పడుతున్నారు. పదవి కోసం యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఏలూరి శివాజీ, అయ్యప్ప సేవాసమితి అధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు వాసిరెడ్డి బెనర్జీ ప్రధానంగా పోటీలో ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గం వాసిరెడ్డికి చైర్మన్ పదవి ఇస్తే రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటామని ఎంపీ ముందు తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శివాజీ జోరుగా తన ప్రయత్నాలు చేస్తున్నారు. పదేళ్లుగా యూత్ కాంగ్రెస్‌లో ఉంటూ పలు కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా యువజన కాంగ్రెస్‌లో గుర్తింపు పొందిన తనకు చైర్మన్ పదవి తప్పక వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తనకు ఎంపీ హామీ ఇచ్చారని, తనకే చైర్మన్ పదవి వస్తుందని వాసిరెడ్డి చెబుతున్నారు. కాకాని ప్రయత్నాలు... మరోవైపు గత ంలో పాలకవర్గ చైర్మన్‌గా పనిచేసిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాకాని శ్రీనివాసరావు కూడా తనకు తిరిగి చైర్మన్ పదవి కావాలని అడుగుతున్నారు. తనకు పదవి తప్పక వస్తుందని, రెండోసారి ఇవ్వని పక్షంలో పెనుగంచిప్రోలుకు చెందినవారికే కేటాయించాలని కోరుతున్నారు. తన మద్దతుదారుల పేరును ఆయన సూచిస్తున్నారు. యువజన కాంగ్రెస్ నాయకుడు లగడపాటి శంకర్ కూడా ఎంపీ ద్వారా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మొత్తం మీద పదవిపై ఆశ పెట్టుకున్న నేతలంతా ఎవరికివారే తామే చైర్మన్ అవుతామనే ఆలోచనతో ఉన్నారు. తిరుపతమ్మ అమ్మవారి చైర్మన్ పదవి మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.