
ప్రతీకాత్మక చిత్రం
కృష్ణా జిల్లా : పెనుగంచిప్రోలు మండలంలో లింగగూడెంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఈ నెల 27న ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికులు బుధవారం చికిత్స పొందుతూ మరణించారు. పెనుగంచి ప్రోలు మండలం శివాపురం గ్రామానికి చెందిన సాయి(20), నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఎల్‌బీ తండాకు చెందిన సునీత(19)లు కొంతకాలంగా ప్రేమించుకున్నారు.
పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఏం చేయాలో తోచక ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించారు. చనిపోదామని నిర్ణయించుకుని లింగగూడెం గ్రామం వద్దకు వచ్చారు. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోవడంతో చికిత్స నిమిత్తం గ్రామ పెద్దలు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ మూడు రోజుల తర్వాత తనువు చాలించారు. ఈ ఘటనపై పోలీసులు ఇది వరకే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment