కలిసి బతకలేమని అర్థమైంది.. అందుకే ఇద్దరు కలిసి.. | Love Failure: Young Couple Ends Their Life Orissa | Sakshi
Sakshi News home page

కలిసి బతకలేమని అర్థమైంది.. అందుకే ఇద్దరు కలిసి..

Published Sun, Jan 23 2022 9:21 AM | Last Updated on Sun, Jan 23 2022 9:36 AM

Love Failure: Young Couple Ends Their Life Orissa - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కొరాపుట్‌/నవరంగపూర్‌: ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నవరంగపూర్‌ జిల్లాలోని రాయిఘర్‌ సమితి, తురు(యువీ) గ్రామంలో శనివారం కలకలం రేపింది. తురు గ్రామానికి చెందిన దర్బార్‌ గోండో(20), కంగ గ్రామానికి చెందిన సునీత గోండో(18) గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల పెద్దలు వారి ప్రేమను నిరాకరించారు.

దీంతో తాము జీవితంలో కలిసి ఉండలేమని భావించిన వారు చనిపోయేందుకు నిర్ణయించుకున్నారు. తురు గ్రామంలోని దర్బారు నివాసానికి 200 మీటర్ల దూరంలో ఓ చెట్టుకు ఇద్దరూ ఉరేసుకుని చనిపోయారు. దీనిపై రాయిఘర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement