
ప్రతీకాత్మక చిత్రం
రాయగడ(భువనేశ్వర్): జిల్లాలోని కాసీపూర్ సమితి ఒండ్రాకంచ్ పోలీస్ స్టేషన్ పరిధి కంటాలి గ్రామంలో యువకుడు గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు తొలొజొరి గ్రామానికి చెందిన నందొ మజ్జి(18)గా పోలీసులు గుర్తించారు. ఒండ్రాకంచ్ ఐఐసీ తపన్‌కుమార్ మహాలి తెలిపిన వివరాల ప్రకారం.. కటాలి గ్రామానికి చెందిన శివమజ్జి పెద్ద కుమార్తెతో నందొ మజ్జికి గతేడాది వివాహం నిశ్చయమయ్యింది. (చదవండి: సీఎం దృష్టికి వెళ్లకుండా చూస్తాం.. రూ.25లక్షలు ఇవ్వు.. డీఎంకే ఎమ్మెల్యేలకు బెదిరింపులు )
ఈ క్రమంలో నందొ అప్పుడప్పుడు అత్తవారింటికి వెళ్లి, వస్తుండేవాడు. బుధవారం కూడా అదే విధంగా వెళ్లిన యువకుడు.. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడు సాయంతో ఉరి వేసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఘటన హత్యా లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment