married man
-
పెళ్లయి పిల్లలు ఉన్న తండ్రి.. మరో వివాహిత వెంటపడి.. భర్త ఎదుటే..
చిక్కబళ్లాపురం(కర్ణాటక): పెళ్లయి పిల్లలు ఉన్న ఓ వ్యక్తి ప్రేమ పేరుతో మరో వివాహిత వెంటపడి ఆమె నిరాకరించడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటుచేసుకుంది. వివరాలు...నగరంలోని కోటె ప్రాంతంలో నివాసం ఉంటున్న నవీన్ (27) వివాహితుడు. కార్పెంటర్ వృత్తితో జీవనం సాగిస్తున్నాడు. జీవితం సజావుగా సాగుతుండగా దుర్బద్ది పుట్టింది. తన ఇంటి సమీపంలోని ఓ వివాహితురాలిని ప్రేమించాలని వేధించేవాడు. ఏకంగా సదరు మహిళ ఇంటికి వచ్చి భర్త ఎదుటే తనను ప్రేమించాలని ఒత్తిడి చేసేవాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ప్రేమను అంగీకరించపోతే చనిపోతా: ఇటీవల నవీన్ సదరు వివాహిత ఇంటికి వచ్చి తనను ప్రేమించకపోతే చనిపోతానని బెదిరించాడు. ఆమె ఎదుటే బాటిల్‌తో తలపై కొట్టుకున్నాడు, ఆమె పేరును కూడా చెక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే నవీన్ తల్లి కాశీ యాత్రకు వెళ్లింది. ఈ క్రమంలో తల్లి ఇంటిలో ఉరి వేసుకున్నాడు. నగర పోలీసులు అనుమానాస్పద మృతి కేసును నమెదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఏఎస్ఐ కుమార్తె ఆత్మహత్య.. కారణం అదేనా? -
ప్రేమిస్తున్నానంటూ యువతికి పెళ్లైన వ్యక్తి ప్రపోజ్
సాక్షి, హైదరాబాద్ (జీడిమెట్ల): పెళ్లయిన వ్యక్తి వేరే యువతిని ప్రేమించగా ఆమె అతడి ప్రేమను తిరస్కరించడంతో ఎలుకల మందు సేవించి చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతిచెందిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సతీష్‌రెడ్డి వివరాల ప్రకారం.. చింతల్ చంద్రానగర్‌కు చెందిన మలిన్(28), మమత భార్యాభర్తలు. వీరికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. మలిన్ బాలానగర్‌లోని ఓ రబ్బర్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అదే పరిశ్రమలో పనిచేసే ఓ యువతిని మలిన్ ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని సదరు యువతి ముందు వ్యక్తపరచగా ఆమె తిరస్కరించింది. దీంతో మలిన్ ఈ నెల 13వ తేదీన ఇంట్లో ఎలుకల మందు సేవించి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దీంతో మలిన్ భార్య మమత చికిత్స నిమిత్తం అతడిని 108లో గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం మలిన్‌ను గురువారం వైద్యులు డిశ్చార్జి చేశారు. అదేరోజు మలిన్‌కు చాతిలో నొప్పి రావడంతో మమత అతడిని మళ్లీ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండగానే మలిన్ మృతిచెందాడు. మలిన్ భార్య మమత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: (నన్ను వాడుకొని వదిలేశాడు.. అన్యాయం జరిగిందంటూ సినీనటి నిరసన) -
వివాహితుడితో ప్రేమ.. సరిగ్గా ఎంగేజ్మెంట్కు ముందు!
అతనికే ఇదివరకే పెళ్లి అయ్యింది. అది తెలిసి కూడా ఆమె అతన్నే ప్రేమించింది. రెండో భార్యగా అయినా సరే అతనితో జీవితం పంచుకునేందుకు సిద్ధపడింది. ఇష్టపడ్డ వ్యక్తి సహా సమాజం అందుకు ఒప్పుకోలేదు. మరో వ్యక్తితో మూడు ముళ్లు వేయించుకునేందుకు సిద్ధపడింది. సరిగ్గా నిశ్చితార్థం ముందు.. ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేక, మనసు చంపుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ‘‘నేను నా ఇష్టపూర్వకంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నా... ఐ లవ్ యూ దీపక్. బతికుండగా నీదానిని కాలేకపోయా. ఎందుకంటే.. మీకు ఇప్పటికే పెళ్లయ్యి పోయింది. ఎవరూ అందుకు ఒప్పుకోలేదు. నా తల్లిదండ్రులు చాలా మంచివారు. మా తమ్ముడు ధీరజ్ అంటే నాకు చాలా ఇష్టం. నన్ను మరోలా అర్థం చేసుకోకండి.. ఐ లవ్ యూ దీపక్’’ అంటూ రక్తంతో సూసైడ్ లేఖ రాసి ప్రాణం తీసుకుంది 23 ఏళ్ల శివాని. మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని నాగిన్ నగర్లో ఉంటోంది శివాని కుటుంబం. స్థానిక ఓ ప్రైవేట్ కాలేజీలో ఆమె పీజీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆ ఏరియాలోనే దీపక్‌కు శానిటరీ షాపు ఉంది. ఆయన వివాహితుడు. అది తెలిసి కూడా శివాని ప్రేమ పేరుతో ఆయన వెంటపడింది. ఈ విషయంపై దీపక్ భార్య, శివాని ఇంటికి వచ్చి గొడవ పడింది కూడా. ఆ సమయంలో.. దీపక్‌కు రెండో భార్యగా ఉంటానంటూ శివాని చెప్పగా, పెద్ద పంచాయితీయే జరిగింది. ఈ గొడవ తర్వాత కుటుంబ సభ్యులు శివానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆపై శివానికి విజయ్ నగర్ ఏరియాకు చెందిన ఓ వ్యక్తితో పెళ్లి నిర్ణయించారు. మరికొన్ని రోజుల్లో ఎంగేజ్మెంట్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం.. ఇంట్లో ఎవరూ లేని టైంలో శివాని బలవన్మరణానికి పాల్పడింది. ముందు బ్లేడ్‌తో చేతులు, కాళ్లు కోసుకున్న శివాని.. ఆ రక్తంతో సూసైడ్ నోట్ రాసింది. ఆపై ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, దీపక్ లేని జీవితం ఊహించుకోలేక చనిపోతున్నట్లు ఆమె అందులో పేర్కొంది. ఈ మేరకు పోలీస్ అధికారి సంజయ్ శుక్లా కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. -
గతేడాది వివాహం.. అత్తవారింటికి వెళ్లి ఎవరూ లేని సమయం చూసి..
రాయగడ(భువనేశ్వర్): జిల్లాలోని కాసీపూర్ సమితి ఒండ్రాకంచ్ పోలీస్ స్టేషన్ పరిధి కంటాలి గ్రామంలో యువకుడు గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు తొలొజొరి గ్రామానికి చెందిన నందొ మజ్జి(18)గా పోలీసులు గుర్తించారు. ఒండ్రాకంచ్ ఐఐసీ తపన్‌కుమార్ మహాలి తెలిపిన వివరాల ప్రకారం.. కటాలి గ్రామానికి చెందిన శివమజ్జి పెద్ద కుమార్తెతో నందొ మజ్జికి గతేడాది వివాహం నిశ్చయమయ్యింది. (చదవండి: సీఎం దృష్టికి వెళ్లకుండా చూస్తాం.. రూ.25లక్షలు ఇవ్వు.. డీఎంకే ఎమ్మెల్యేలకు బెదిరింపులు ) ఈ క్రమంలో నందొ అప్పుడప్పుడు అత్తవారింటికి వెళ్లి, వస్తుండేవాడు. బుధవారం కూడా అదే విధంగా వెళ్లిన యువకుడు.. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడు సాయంతో ఉరి వేసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఘటన హత్యా లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించాలని ‘యువతి’ వేధింపులు..
సాక్షి, జగిత్యాల (కరీంనగర్): తనను ప్రేమించాలని ఓ యువతి వేధింపులకు గురిచేస్తుండటంతో పెళ్లయిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మల్యాల మండలంలోని లంబాడిపల్లికి చెందిన వేముల గణేశ్ జీవనోపాధి కోసం ట్యాక్సీ నడుపుతున్నాడు. అతనికి భార్య గోదావరి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇదే మండలంలోని తాటిపల్లికి చెందిన ఓ యువతి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆమె నిత్యం గణేశ్ ట్యాక్సీలోనే స్వగ్రామం వెళ్లేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడగా సదరు యువతి గణేశ్‌ను ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టింది. అతను నిరాకరించడంతో రెండు రోజులుగా ఇతరులతో ఫోన్ చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతోంది. దీంతో మనస్తాపానికి గురై బుధవారం మధ్యాహ్నం పురుగు మందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి, జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం గణేశ్ చికిత్స పొందుతున్నాడు. ఆ యువతి నుంచి తనను ఎలాగైనా కాపాడాలని వేడుకుంటున్నాడు. చదవండి: హెచ్సీయు విద్యార్థి: వీడని విద్యార్థిని ఆత్మహత్య మిస్టరీ! -
నిత్య పెళ్లికొడుకు.. మైనర్ బాలిక హత్య
పాపన్నపేట (మెదక్): ఇద్దరు భార్యల మొగుడు అతడు.. ముచ్చటగా మూడోసారి మైనర్ గిరిజన విద్యార్థిని ముగ్గులోకి దించాడు. నెలల తరబడి బాలికను వాడుకున్నాడు. హైదరాబాద్‌లోని వట్టి నాగులపల్లిలో కాపురం పెట్టాడు. ఆపై పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో మంజీరనదిలో తోసేసి బాలికను జల సమాధి చేశాడు. ఆపై దర్జాగా సభ్య సమాజంలో తిరుగుతున్నాడు. ఫోన్ కాల్‌డేటా ఆధారంగా నిత్య పెళ్లికొడుకు పాపం పండింది. నాలుగు నెలల అనంతరం అతడు చేసిన ఘోరం వెలుగుచూసింది. బాధితుల కథనం ప్రకారం.. పాపన్నపేట మండలం సోమ్లా తండాకు చెందిన ఓ బాలిక పాపన్నపేట కేజీబీవీలో 9వ తరగతి వరకు చదివించారు. 2020లో టీసీ తీసుకొని ఎల్లుపేట ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో చేర్పించారు. ఈ క్రమంలో ఎల్లుపేటకు చెందిన ఓ ఆటో డ్రైవర్ పరిచయమయ్యాడు. రోజు ఉచితంగా ఆటోలో పాఠశాలకు తీసుకెళ్తూ.. ప్రేమలోకి దించాడు. అప్పటికే అతనికి అల్లాదుర్గంకు చెందిన ఓ మహిళతో వివాహం కాగా ఆమే అనుమానాస్పదస్థితిలో మరణించింది. ఆపై న్యాల్కల్ మండలం ఇబ్రహీంపూర్‌కు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. తాజాగా బాలికతో ప్రేమాయణం కొనసాగించి హైదరాబాద్‌లోని వట్టి నాగులపల్లిలో రూం తీసుకొని కాపురం కొనసాగించాడు. అనంతరం తనను పెళ్లి చేసుకోవాలని బాలిక నిలదీయడంతో పాపన్నపేట మండలం గాజులగూడెం శివారులోకి తీసుకొచ్చి మంజీరా నదిపై ఉన్న బ్రిడ్జిపై నుంచి ఆమెను తోసేసి జల సమాధి చేశాడు. అదే క్రమంలో 31అక్టోబర్ 2020న ఏడుపాయల్లోని మంజీరా నదిలో పోలీసులు గుర్తు తెలియని అమ్మాయి శవాన్ని గుర్తించి కేసు నమోదు చేశారు. అప్పటి వరకు బాలిక వెతికిన తల్లిదండ్రులు నవంబర్‌లో పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు ఆటో డ్రైవర్‌పై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అతని ఫోన్ కాల్‌డేటాను పరిశీలించి ఆరా తీసి అనుమానాస్పద వ్యక్తిని విచారించగా అతడే హతమార్చినట్లు తెలిసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బంజారా సంఘం నాయకులు రమేష్, పూల్‌సింగ్ డిమాండ్ చేశారు. ఈ విషయమై పాపన్నపేట ఎస్ఐని వివరణ కోరగా పోలీస్ అధికారులు అందుబాటులో లేనందున ఆదివారం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
వీడియో కాల్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డ యువతి
చెన్నై: సోషల్ మీడియాలో ఒకరికొకరు పరిచయమయ్యారు, తర్వాత ప్రేమించుకున్నారు. ఇంతలో ప్రియుడికి ఇదివరకే పెళ్లైందన్న విషయం బయటపడింది. అతడు చేసిన మోసానికి 24 ఏళ్ల యువతి అర్ధాంతరంగా తనువు చాలించింది. ఆమె ప్రాణాలను కాపాడాల్సిన ప్రియుడే చచ్చిపొమ్మని సలహా ఇవ్వడం మరింత విషాదం. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పెళ్లైందన్న విషయం దాచి ప్రేమరాగాలు.. తమిళనాడుకు చెందిన ముత్తు కుమారేశన్ నాగ్‌పూర్‌లో ఆర్మీ అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి వీడియో చాటింగ్ యాప్‌లో పెరంబక్కమ్కు చెందిన భారతి పరిచయమైంది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. తర్వాత ప్రేమలో మునిగారు. ఎప్పుడూ వీడియో కాల్స్‌లో మాట్లాడుకోవడమేనా, ఒకసారి నేరుగా కలుసుకుందామని ప్లాన్ చేసుకున్నారు. అలా నవంబర్ 18న చెన్నైలో ఇద్దరూ కలుసుకుని కబుర్లు చెప్పుకున్నారు. ప్రియుడి మాటల్లో అతడికి ఇదివరకే పెళ్లైందని తేలింది. ఇద్దరు పిల్లల తండ్రన్న విషయం బయటపడింది. దీంతో షాకైన ప్రియురాలు ఈ ప్రేమాదోమా వద్దని, దీన్ని ఇక్కడితో ఆపేద్దామని అతడికి తేల్చి చెప్పింది. (చదవండి: ప్రేమ పేరుతో నమ్మించి.. వ్యభిచారంలోకి!) ఉరేసుకుంటే త్వరగా చస్తావు.. కానీ అతడు మాత్రం ఆమె మాటలు వినిపించుకోలేదు. పెళ్లి చేసుకుందామని వెంటపడ్డాడు. లేదంటే చచ్చిపోతానని బెదిరించాడు. ఈ వేధింపులు తట్టుకోలేని భారతి డిసెంబర్ 2న చివరిసారి అతడికి వార్నింగ్ ఇద్దామని వీడియో కాల్ చేసింది. నన్ను వేధించడం ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని చేతిలో కత్తి పట్టుకుని బెదిరించింది. ఈ సమయంలో ఆమెకు నచ్చజెప్పాల్సిన ప్రియుడు రాక్షసంగా ప్రవర్తించాడు. గొంతు కోసుకోవడం కన్నా ఉరేసుకుంటే త్వరగా చస్తావని సలహా ఇచ్చాడు. చివరికి వీడియో కాల్‌లోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇదంతా ఆమె ఫోన్లో రికార్డైంది. దీని ఆధారంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు శనివారం అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. (చదవండి: నాన్నా... నీ వద్దకే వస్తున్నాం! ) -
ప్రేమ పేరుతో వంచించాడు..
సాక్షి, గుంటూరు: ‘హాయ్ అంటూ ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. మొదట స్నేహంగా.. ఆపై ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు.. పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అతనికి ముందే పెళ్లయిందని తెలిసి నిలదీస్తే కుటుంబ సభ్యులతో కలసి నాపై దాడి చేశారు’ అంటూ కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన ఓ వివాహిత సోమవారం స్పందన కార్యక్రమంలో గుంటూరు రూరల్ ఏఎస్పీ ఎస్.వరదరాజుకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... పిడుగురాళ్లకు చెందిన రావిపాటి వీరయ్య అలియాస్ వినయ్ ఫేస్బుక్లో ఓ మహిళను పరిచయం చేసుకున్నాడు. ఆపై ఆమెతో స్నేహంగా ఉంటూ ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఓ రోజు హడావుడిగా ఆమెను తిరుపతి తీసుకెళ్లి వివాహం చేసుకొని ఇంటికి తీసుకువెళ్లాడు. భర్త మరో వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న వినయ్ మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వినయ్‌కు ముందుగా వివాహం జరిగిందని, ఇద్దరు సంతానం ఉన్నారని తెలుసుకుంది. నమ్మించి తనను మోసం చేశావంటూ దీనిపై వినయ్‌ను నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతున్న క్రమంలో అత్తమామలు కల్పించుకొని వివాహితపై దాడికి యత్నించారు. జరిగిన మోసాన్ని గుర్తించిన వివాహిత నేరుగా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ఇచ్చిన ఫిర్యాదును కూడా పోలీసులు తీసుకోకపోవడంతో న్యాయం చేయాలని బాధితురాలు ఏఎస్పీని వేడుకుంది. -
బాలికను ప్రేమ పేరుతో మభ్యపెట్టి ..
నిజామాబాద్, నవీపేట(బోధన్): నవీపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక (17)ను గర్భవతిని చేసిన నిందితుడిపై పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు ... ప్రేమ పేరుతో మభ్యపెట్టి బాలికను వివాహిత యువకుడు మహేష్ లొంగదీసుకున్నాడు. బాలిక మూడు నెలల గర్భవతిగా ఉన్న సమయంలోనే గమనించిన ఇరుగు పొరుగు సదరు యువకుడిని నిలదీశారు. పెళ్లి చేసుకంటానని హామీ ఇవ్వడంతో మహిళ సంఘాలు అంగీకరించాయి. ఇప్పుడు బాలిక ఏడు నెలల గర్భవతి. పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా రేపు మాపు అంటూ కాలం వెళ్లదీయడంతో బంధువులు మహేష్‌ను నిలదీశారు. మహేష్ తీరులో మార్పు రాకపోవడంతో పరిస్థితి విషమిస్తుందని గమనించిన బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.నిందితుడు పరారీలో ఉన్నాడు. -
నయవంచకుడిపై కేసు
బంజారాహిల్స్: పెళ్లై పిల్లలు ఉన్న ఓ వ్యక్తి తనకు ఇంకా పెళ్లి కాలేదని ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం. 11లోని గౌరిశంకర్ కాలనీకి యువతి(26) మాదాపూర్‌లోని ఓ సంస్థలో పని చేస్తోంది. ఆమెకు అదేసంస్థలో పని చేస్తున్న రవి అనే యువకుడు 2007లో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నట్లు చెప్పడంతో ఇద్దరూ కలిసి తిరిగారు. ఇటీవల పెళ్లి ప్రస్తావన చేయడంతో పెద్దలను ఒప్పిస్తానని చెప్పి వెళ్లిన అతను తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు అతడి బావకు ఫోన్ చేయగా ఆయన భార్య లిఫ్ట్ చేసింది. జరిగిన విషయాన్ని యువతి చెప్పడంతో తన తమ్ముడికి ఎప్పుడో పెళ్లయిందని పిల్లలు కూడా ఉన్నారని చెప్పడంతో ఆమె షాక్‌కు గురైంది. దీనిపై రవిని నిలదీయగా ప్రేమ విషయాన్ని తన భార్యతో చెప్పానని ఆమె పెళ్ళికి అంగీకరించిందని త్వరలోనే పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు. అయితే తనను వదిలేయాలని మరో పెళ్ళి చేసుకుంటానని చెప్పడంతో ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను ఫేస్బుక్లో షేర్ చేశాడు. రెండు రోజుల క్రితం ఆమె ఇంటికి వచ్చి దాడి చేయడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యాపారవేత్తనంటూ మహిళలకు టోకరా
న్యూఢిల్లీ: విజయవంతమైన వ్యాపారవేత్తనంటూ వధూవరుల పరిచయ వెబ్సైట్ల ద్వారా మహిళలను మోసం చేస్తున్న ఢిల్లీకి చెందిన ఓ వివాహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన నుంచి 75 వేల రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో అశోక్ విహార్‌కు చెందిన మనీశ్ గుప్తా (36).. వెబ్సైట్ల ద్వారా ఆకర్షితమైన బయోడేటాతో మహిళలకు వల వేసేవాడు. తాను విడాకులు తీసుకున్నానని, విజయవంతమైన వ్యాపారవేత్తనని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఈ వివరాలు తెలుసుకున్న ఓ మహిళ మనీశ్‌ను సంప్రదించింది. కొంతకాలం తర్వాత మనీశ్ ఆమెను డబ్బు అడిగాడు. ఆయనపై నమ్మకం కలగడంతో 75 వేల రూపాయలు బ్యాంక్ ఎకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసింది. డబ్బులు అందాక మనీశ్ ఆమెతో మాట్లాడటం మానేశాడు. ఆమెకు అనుమానం వచ్చి ఆరా తీయగా, మనీశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, విడాకులు తీసుకోలేదని తెలిసింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. వాట్సప్ ద్వారా అతను తరచూ మహిళలను మోసం చేస్తున్నాడని, ఈ జాబితాలో 30 మంది మహిళలు ఉన్నట్టు పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు. -
పోలీసుల అదుపులో లైంగికదాడి నిందితుడు !
తణుకు : పట్టణంలోని సజ్జాపురం ప్రాంతానికి చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సజ్జాపురంలోని నాలుగో తరగతి చదువుతున్న పదేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన మంగం విజయకుమార్ గత పదిహేను రోజులుగా లైంగిక దాడి చేస్తున్న విషయం తెలిసిందే. బాలికకు రక్తస్రావం కావడంతో తల్లి నిలదీయడంతో ఆదివారం విషయం బయటపడింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు విజయకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్చార్జి ఎస్సై బి.జగదీశ్వరరావు కేసు నమోదు చేయగా విచారణ నిమిత్తం కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు సోమవారం తణుకు వచ్చారు. సజ్జాపురం ప్రాంతంలోని సొసైటీ వెనుక ఒక అపార్టుమెంటులో బాలిక తల్లిదండ్రులు పని చేస్తున్నారు. బాలికను ఆదివారం ఉదయం తల్లి లేని సమయంలో తన ఇంటింకి తీసుకెళ్లి విజయ్‌కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. గతంలోనూ ఇదే తరహాలో లైంగికదాడి చేశాడు. విషయం బయట చెబితే చంపేస్తానని ఆమెను భయపెట్టాడు. దీంతో బాలిక ఇంతకాలం ఎవరికీ చెప్పలేదు. అయితే ఆదివారం ఆమెకు రక్తస్రావం కావడంతో విషయం వెలుగు చూసింది. నిందితుడు విజయకుమార్ రెండు నెలల క్రితం తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇక్కడకు వచ్చి తాపీ పనులు చేసుకుంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలికకు తణుకు ప్రభుత్వాస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.