వీడియో కాల్‌లో ఆత్మహత్య చేసుకున్న యువతి
చెన్నై: సోషల్ మీడియాలో ఒకరికొకరు పరిచయమయ్యారు, తర్వాత ప్రేమించుకున్నారు. ఇంతలో ప్రియుడికి ఇదివరకే పెళ్లైందన్న విషయం బయటపడింది. అతడు చేసిన మోసానికి 24 ఏళ్ల యువతి అర్ధాంతరంగా తనువు చాలించింది. ఆమె ప్రాణాలను కాపాడాల్సిన ప్రియుడే చచ్చిపొమ్మని సలహా ఇవ్వడం మరింత విషాదం. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
పెళ్లైందన్న విషయం దాచి ప్రేమరాగాలు..
తమిళనాడుకు చెందిన ముత్తు కుమారేశన్ నాగ్‌పూర్‌లో ఆర్మీ అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి వీడియో చాటింగ్ యాప్‌లో పెరంబక్కమ్‌కు చెందిన భారతి పరిచయమైంది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. తర్వాత ప్రేమలో మునిగారు. ఎప్పుడూ వీడియో కాల్స్‌లో మాట్లాడుకోవడమేనా, ఒకసారి నేరుగా కలుసుకుందామని ప్లాన్ చేసుకున్నారు. అలా నవంబర్ 18న చెన్నైలో ఇద్దరూ కలుసుకుని కబుర్లు చెప్పుకున్నారు. ప్రియుడి మాటల్లో అతడికి ఇదివరకే పెళ్లైందని తేలింది. ఇద్దరు పిల్లల తండ్రన్న విషయం బయటపడింది. దీంతో షాకైన ప్రియురాలు ఈ ప్రేమాదోమా వద్దని, దీన్ని ఇక్కడితో ఆపేద్దామని అతడికి తేల్చి చెప్పింది. (చదవండి: ప్రేమ పేరుతో నమ్మించి.. వ్యభిచారంలోకి!)
ఉరేసుకుంటే త్వరగా చస్తావు..
కానీ అతడు మాత్రం ఆమె మాటలు వినిపించుకోలేదు. పెళ్లి చేసుకుందామని వెంటపడ్డాడు. లేదంటే చచ్చిపోతానని బెదిరించాడు. ఈ వేధింపులు తట్టుకోలేని భారతి డిసెంబర్ 2న చివరిసారి అతడికి వార్నింగ్ ఇద్దామని వీడియో కాల్ చేసింది. నన్ను వేధించడం ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని చేతిలో కత్తి పట్టుకుని బెదిరించింది. ఈ సమయంలో ఆమెకు నచ్చజెప్పాల్సిన ప్రియుడు రాక్షసంగా ప్రవర్తించాడు. గొంతు కోసుకోవడం కన్నా ఉరేసుకుంటే త్వరగా చస్తావని సలహా ఇచ్చాడు. చివరికి వీడియో కాల్‌లోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇదంతా ఆమె ఫోన్‌లో రికార్డైంది. దీని ఆధారంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు శనివారం అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. (చదవండి: నాన్నా... నీ వద్దకే వస్తున్నాం! )
Comments
Please login to add a commentAdd a comment