
ప్రతీకాత్మక చిత్రం
తిరువొత్తియూరు: చదువులో తగిన ఏకాగ్రత చూపలేకపోతున్నానంటూ.. తీవ్ర ఆవేదనతో ఓ వైద్యవిద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. చెన్నై కేకేనగర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్‌లో ఉండే వరదరాసు (52). ఇతను చెన్నై విమానాశ్రయంలో వైద్య విభాగంలో పని చేస్తున్నాడు.
ఇతని కుమార్తె శక్తిప్రియా చెన్నై కీల్పాక్కం ప్రభుత్వ వైద్య కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతోంది. చదువులో ఏకాగ్రత కుదరకపోవడంతో విరక్తి చెందిన ఈమె మంగళవారం రాత్రి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేకేనగర్ పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment