ప్రేమిస్తున్నానంటూ యువతికి పెళ్లైన వ్యక్తి ప్రపోజ్‌  | Man commits Suicide after young woman rejects his proposal | Sakshi
Sakshi News home page

ప్రేమిస్తున్నానంటూ యువతికి పెళ్లైన వ్యక్తి ప్రపోజ్‌ 

Published Sat, Nov 19 2022 3:01 PM | Last Updated on Sat, Nov 19 2022 3:01 PM

Man commits Suicide after young woman rejects his proposal - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, హైదరాబాద్‌ (జీడిమెట్ల): పెళ్లయిన వ్యక్తి వేరే యువతిని ప్రేమించగా ఆమె అతడి ప్రేమను తిరస్కరించడంతో ఎలుకల మందు సేవించి చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతిచెందిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సతీష్‌రెడ్డి వివరాల ప్రకారం.. చింతల్‌ చంద్రానగర్‌కు చెందిన మలిన్‌(28), మమత భార్యాభర్తలు. వీరికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది.

మలిన్‌ బాలానగర్‌లోని ఓ రబ్బర్‌ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అదే పరిశ్రమలో పనిచేసే ఓ యువతిని మలిన్‌ ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని సదరు యువతి ముందు వ్యక్తపరచగా ఆమె తిరస్కరించింది. దీంతో మలిన్‌ ఈ నెల 13వ తేదీన ఇంట్లో ఎలుకల మందు సేవించి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దీంతో మలిన్‌ భార్య మమత చికిత్స నిమిత్తం అతడిని 108లో గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం మలిన్‌ను గురువారం వైద్యులు డిశ్చార్జి చేశారు.

అదేరోజు మలిన్‌కు చాతిలో నొప్పి రావడంతో మమత అతడిని మళ్లీ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండగానే మలిన్‌ మృతిచెందాడు. మలిన్‌ భార్య మమత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  

చదవండి: (నన్ను వాడుకొని వదిలేశాడు.. అన్యాయం జరిగిందంటూ సినీనటి నిరసన)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement