నిజామాబాద్, నవీపేట(బోధన్): నవీపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక (17)ను గర్భవతిని చేసిన నిందితుడిపై పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు ... ప్రేమ పేరుతో మభ్యపెట్టి బాలికను వివాహిత యువకుడు మహేష్ లొంగదీసుకున్నాడు. బాలిక మూడు నెలల గర్భవతిగా ఉన్న సమయంలోనే గమనించిన ఇరుగు పొరుగు సదరు యువకుడిని నిలదీశారు.
పెళ్లి చేసుకంటానని హామీ ఇవ్వడంతో మహిళ సంఘాలు అంగీకరించాయి. ఇప్పుడు బాలిక ఏడు నెలల గర్భవతి. పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా రేపు మాపు అంటూ కాలం వెళ్లదీయడంతో బంధువులు మహేష్‌ను నిలదీశారు. మహేష్ తీరులో మార్పు రాకపోవడంతో పరిస్థితి విషమిస్తుందని గమనించిన బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.నిందితుడు పరారీలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment