అడ్డగుట్ట: మైనర్‌బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాయమాటలు చెప్పి చివరకు గర్భవతిని చేశాడో ప్రబుద్ధుడు. తీరా పెళ్లి గురించి అడిగేసరికి ముఖంచాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తుకారాంగేట్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపిన మేరకు..అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక(17) మహేంద్రాహిల్స్ ధనలక్ష్మి కాలనీలోని ఓ ఇంట్లో కేర్ టేకర్‌గా పని చేస్తుంది. బాలిక తల్లి ఇళ్లల్లో పని చేస్తూ కుటుంబాన్ని ట్టుకొస్తుంది. బాలిక తల్లికి స్థానికంగా ఉన్న మంజులతో పరిచయం ఏర్పడింది.
ఆమె ప్రతీరోజు వీరి ఇంటికొచ్చి మైనర్ బాలికను తన కుమారుడు వెంకటేష్‌తో వివాహం జరిపించాలని కోరేది. ఒకరోజు వెంకటేష్ బాలికను మాయమాటలు చెప్పిబైక్‌పై తీసుకెళ్లాడు. అలా పలుసార్లు చేశాడు. ఓ రోజు మహేంద్రాహిల్స్‌లోని ఓ ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి మత్తు మాత్రలు కలిపి తాపించి చేతులు, కాళ్లు కట్టేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం చెబితే మీ ఇంట్లో వారిని చంపేస్తానని బెదిరించాడు. తరువాత కూడా ఇలాగే లైంగిక దాడి చేశాడు. ఇటీవల బాలిక ఆరోగ్యం దెబ్బతినడంతో తల్లిదండ్రులు వైద్యులకు చూపించారు. ఆమె గర్భవతి అని తేలింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment