Pregnent
-
బుల్లితెర నటిపై ప్రెగ్నెన్సీ రూమర్స్.. కానీ!
బాలీవుడ్ బుల్లితెర భామ దీపికా కక్కర్ బీటౌన్‌లో సుపరిచితమే. ససురాల్ సిమర్ కాలో సిమార్, కహాన్ హమ్ కహాన్ తుమ్ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్- 12లో కంటెస్టెంట్‌గా పాల్గొని విజేతగా నిలిచింది. అయితే 2018లో రెండో పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ గతేడాది జూన్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ఇదిలా ఉండగా దీపికా మరోసారి ప్రెగ్నెన్సీతో ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నారంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే ఆమె ఇటీవలే తన బిడ్డ రుహాన్‌ను తన చేతుల్లో పట్టుకుని వీడియోలో కనిపించింది. అందులో దీపికా వదులుగా ఉన్న తెల్లటి సూట్ ధరించి కనిపించింది. ఇది చూసిన చాలా మంది నెటిజన్స్ 'బేబీ బంప్' దుపట్టాతో దాచి ఉంచారంటూ కామెంట్స్ చేశారు. అయితే దీపికా కక్కర్ తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించలేదు. కాగా.. దీపికకు ఇప్పటికే రౌనక్ సామ్సన్ అనే వ్యక్తితో మొదటి పెళ్లి కాగా.. అతనితో 2015లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2018లో షోయబ్ ఇబ్రహీంను పెళ్లాడింది. -
పురుడు పోశారు.. పునర్జన్మనిచ్చారు
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): కొండపైకి 150 మెట్లెక్కి వెళ్లి మరీ ఓ గర్భిణికి పురుడు పోసి పునర్జన్మనిచ్చి స్థానికుల ప్రశంసలు 108 సిబ్బంది అందుకున్న ఘటన విజయవాడలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే... బతుకుతెరువు కోసం కాశీ నుంచి నగరానికి వచ్చి న రోహిత్, హారతి కుటుంబం విజయవాడ భవానీపురం పరిధిలోని కుమ్మరిపాలెం కొండ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. నెలలు నిండిన హారతికి నొప్పులు రావడంతో దిక్కుతోచని స్థితిలో రోహిత్ 108 అంబులెన్స్‌కు కాల్ చేశాడు. కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న 108 సిబ్బంది ఆగమేఘాలపై అక్కడకు చేరుకున్నారు. కొండపైన 150 మెట్లు ఎక్కి ఆమె వద్దకు చేరుకున్నారు. నొప్పులు తీవ్రం కావడంతో అల్లాడుతున్న భార్యను చూసి భర్త కన్నీరుమున్నీరుగా విలపించసాగాడు. అక్కడి పరిస్థితిని చూసి చలించిపోయిన 108 అంబులెన్స్ ఈఎంటీ విజయ్, పైలెట్ సందీప్‌కుమార్ తీవ్రంగా శ్రమించి ఆమెకు కాన్పు చేశారు. మగ బిడ్డ జన్మించాడు. క్షేమంగా ఉన్న తల్లీబిడ్డను మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదంతా గమనించిన స్థానికులు శెభాష్ అంటూ 108 సిబ్బందిని అభినందించారు. -
కోట్లు పెట్టి భవనాలు, లక్షలు పోసి పరికరాలు.. కాని ఏం లాభం..!
నారాయణ్‌పేట్: ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న’ చందంగా తయారైంది మద్దూరు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ) పరిస్థితి. రూ.కోట్లు వెచ్చించి ఆస్పత్రి భవనం, రూ.లక్షలు వెచ్చించి అధునాతన యంత్రాలు, సౌకర్యాలు కల్పించినా చివరికి వైద్యులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది జూన్ 16న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు 30 సీహెచ్‌సీని ప్రారంభించారు. అప్పటి నుంచి వైద్యారోగ్యశాఖ అధికారులు ఈ భవనాన్ని వైద్యవిధాన పరిషత్‌కు అప్పగించారు. దీంతో జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రి కిందకు ఈ సీహెచ్‌సీ వెళ్లింది. జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక డాక్టర్‌తో పాటు పీహెచ్‌సీలోని స్టాఫ్ నర్స్‌లతో ఇక్కడ వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఉదయం సయమంలో పీహెచ్సీలో పనిచేస్తున్న ఓ డాక్టర్ ఓపీ చూస్తున్నారు. అత్యవసర సమయంలో వైద్యం కావాలంటే గతంలో మాదిరిగానే జిల్లా కేంద్రానికి లేదా మహబూబ్‌నగర్‌కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఎనిమిది మంది డాక్టర్లకు ఒక్కరే..? సీహెచ్‌సీ అసుపత్రిలో గైనిక్ సేవలు, జనరల్ సర్జన్, చిన్నపిల్లలకు వైద్య నిపుణుడు, మత్తు వైద్యుడు, దంత, అత్యవసర సేవలకు ఇలా మొత్తం ఎనిమిది మంది డాక్టర్లు, ఒక సూపరింన్డెంట్, ఇద్దరు ఫార్మసిస్టులు, ఒక అయూష్ మెడికల్ అధికారి, ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ, అఫ్తాలమిక్ అసిస్టెంట్, డెంటల్ అసిస్టెంట్, ఓటి టెక్నీషియన్ 10 మంది నర్సులు, ఇతర సిబ్బందితో పాటు మరో 20 మంది పనిచేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నారు. పీహెచ్సీలో, జిల్లా అసుపత్రిలో పనిచేసే స్టాఫ్‌నర్స్‌లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలాఉండగా, ఈ సీహెచ్‌సీకి ఎలాంటి పోస్టులు ఇంకా మంజూరు కాకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అసుపత్రిలో పనిచేస్తున్న వారిని ఇక్కడి పంపించినట్లు అధికారులు తెలిపారు. అన్నీ ఉన్నా.. రూ.3.67 కోట్లతో సీహెచ్‌సీ భవన నిర్మాణం చేపట్టారు. ఈ ఆస్పత్రిలో అప్పటి కలెక్టర్ హరిచందన చొరవతో 2022 డిసెంబర్ 27న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(యూఎస్ఏ) సంస్థ సహకారంతో రూ. 10లక్షల వ్యయంతో 10 బెడ్లకడ్లాక్సిజన్ అందించేందుకు వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఈసీజీ, స్కానింగ్, తదితర వైద్య పరీక్షల సామగ్రి కూడా అందుబాటులో ఉంది. అన్నీ ఉన్నా డాక్టర్లే లేకపోవడం గమనార్హం. వైద్యం అందింటే నా భార్య బతికేది.. నెలలు నిండిన నా భార్య కాన్పు కోసం మద్దూరు సీహెచ్‌సీకి వచ్చింది. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన నర్సులు కాన్పు చేస్తామన్నారు. తీరా డెలవరీ సమయంలో రక్తస్రావాన్ని అరికట్ట లేకపోవడంతో నా భార్య, బిడ్డ ఇద్దరూ చనిపోయారు. ఒకవేళ డాక్టర్లు అందుబాటులో ఉండి ఉండే నా భార్య, పాప చనిపోయి ఉండేవారు కాదు. – కృష్ణ, తిమ్మారెడ్డిపల్లి, మద్దూరు, మండలం పోస్టులు మంజూరు కాలే.. వైద్యవిధాన పరిషత్ నుంచి మద్దూరు, కోస్గి ఆస్పత్రులకు పోస్టులు మంజూరు కాలేదు. జిల్లా ఆస్పపత్రి నుంచి ఒక డాక్టర్‌ను డిప్యూటేషన్‌పై ఓపీ చూడడానికి అక్కడికి పంపిస్తున్నాం. జిల్లా ఆస్పత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు వెళ్లిపోయారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పోస్టులు మంజూరు అవ్వొచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. – రంజిత్‌కుమార్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, నారాయణపేట అత్యవసర వైద్యం అందక.. గతేడాది ఆగస్టు 5న మండలంలోని తిమ్మారెడ్డిపల్లి చెందిన నిండు గర్భిణి కృష్ణవేణి(26) పురుటినొప్పులు రావడంతో ఇదే సీహెచ్‌సీ రాగా... వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్స్‌లు కాన్పు చేసేందుకు యత్నించారు. శిశువు పురిటిలోనే మృతి చెందగా.. శిశువు మృతదేహాన్ని బయటకు తీసే క్రమంలో తీవ్ర రక్తస్రావం కావడంతో గర్భిణిని హుటాహుటీనా 108లో జిల్లా అసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్త స్రావం కావడంతో ఆమె సైతం మృతి చెందింది. ఒకవేళా అందుబాటులో వైద్యులు ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని మృతురాలి భర్త కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సీహెచ్‌సీ.. మద్దూరు, దామరగిద్ద, దౌల్తాబాద్, మండలాల నుంచి దాదాపు 80 గ్రామాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. -
టైరును తెప్పలా చేసి.. గర్భిణిని వాగు దాటించి..
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగా రం మండలం ఎలిశెట్టిపల్లి వద్ద ఏటా వర్షాకాలంలో జంపన్నవాగు ప్రవాహంతో బానాజీబంధం, ఎలిశెట్టిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతు న్నాయి. ఎలిశెట్టిపల్లికి చెందిన దబ్బకట్ల సునీత ఏడు నెలల గర్భిణి. ఆమెకు శుక్రవారం నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అక్కడే ఉన్న కొందరు గజ ఈతగాళ్లు, స్థానికుల సహాయంతో ట్రాక్టర్ వెనుక టైరును తెప్పలా మార్చారు. దానిపై గర్భిణిని కూర్చోబెట్టి వాగు దాటించి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు పరీక్షలు చేసి సాధారణమైన నొప్పులేనని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వాగుపై వంతెన నిర్మిస్తే తమ కష్టాలు తొలగిపోతాయని, ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో తాత్కాలిక బోటు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
డేట్ నైట్
‘‘బాగా నిద్రపోవాలని ఫిక్స్ అయినప్పుడు కడుపులో ఉన్న బిడ్డ డ్యాన్స్ పార్టీ పెట్టుకోవాలని ఫిక్స్ అయితే.. ఇక నిద్ర ఎలా పోతాం’’ అంటూ చిరనవ్వులు చిందిస్తూ తన ప్రెగ్నెన్సీ తాలూకు ఆనందాన్ని ఇటీవల ఇలియానా పంచుకున్న విషయం తెలిసిందే. ‘‘నేను తల్లిని కాబోతున్నా’’ అని ఇలియానా ప్రకటించినప్పటి నుంచి తండ్రి వివరాలు తెలుసుకోవాలని చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఆ మధ్య ఓ వ్యక్తి ముఖాన్ని బ్లర్ చేసి, ఇలియానా ఆ ఫొటోను షేర్ చేశారు. సోమవారం స్పష్టంగా ఉన్న ఫొటోను షేర్ చేసి, ‘డేట్ నైట్’ అంటూ ఆ వ్యక్తితో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే అతని పేరు, ఇతర వివరాలేమీ ఇలియానా బయటపెట్టలేదు. ‘డేట్ నైట్’ అన్నారు కాబట్టి అతను ఇలియానా బాయ్‌ఫ్రెండ్ అని స్పష్టమవుతోంది. మరి.. రహస్య వివాహం ఏమైనా చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది. -
పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలు...క్రేజీ కపుల్
-
ఆపద్బాంధవి 108
చౌడేపల్లె: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైద్య స్వరూపమే మారిపోయింది. పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగానే 108 వ్యవస్థను మరింతగా బలోపేతం చేసింది. ఫోన్ వస్తే చాలు నిమిషాల్లో ఘటనా స్థలానికి సిబ్బంది చేరిపోతున్నారు. రోగులకు కావాల్సిన సహాయం అందించి మన్ననలు అందుకుంటున్నారు. ఇలాంటిదే చిత్తూరు జిల్లాలో జరిగింది. చౌడేపల్లె మండలం, పందిళ్లపల్లె పంచాయతీ, ముదిరెడ్డిపల్లెకు చెందిన రాజశేఖర్, వసంత దంపతులు సోమల మండలం, పెద్ద ఉప్పరపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న మామిడితోటలో కాపలా ఉన్నారు. ఇక్కడకు ఎలాంటి దారి వసతి లేదు. సెల్‌ఫోన్ సిగ్నల్ కూడా అందదు. వసంత నిండు గర్భిణి కావడంతో ఆదివారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. రాజశేఖర్ సెల్ సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వచ్చి 108కు ఫోన్ చేశారు. సమాచారం అందుకొన్న 108 సిబ్బంది గణేష్, ప్రసాద్ అతికష్టం మీద మామిడి తోటకు చేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గానికి కిలోమీటరు దూరం ఉండటంతో స్ట్రెచర్‌పైనే గర్భిణిని మోసుకువచ్చారు. మార్గమధ్యంలో పురిటి నొప్పులు అధికమవడంతో మామిడితోటలోనే సుఖ ప్రసవం చేశారు. వసంత మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను అటవీ ప్రాంతం నుంచి చౌడేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సిబ్బంది సేవలను గ్రామస్తులు, అధికారులు అభినందించారు. -
గర్భిణులు కాఫీ తాగడం మంచిదేనా?
ఇటీవల కాలంలో తరచు వినవస్తున్న మాట ‘గర్భిణులు కాఫీ తాగకూడదు!’ అని. బహుశా అది వాట్సప్ లేదా సోషల్ మీడియాలో వ్యాపించిన సందేశాల వల్ల కావచ్చు. ఇంతకీ ఇది నిజమేనా? వైద్య నిపుణులు ఏమంటున్నారు? చూద్దాం.. కాఫీని కొకోవా, కాఫీ చెట్ల గింజల నుంచి తీసిన పొడితో తయారు చేస్తారనే విషయం తెలిసిందే. ఈ గింజల్లో కెఫీన్ అధికంగా ఉంటుంది. ఇది నాడీవ్యవస్థ చురుగ్గా వ్యవహరించడంలో తోడ్పడుతుంది. అందువల్లే కాఫీని తక్షణ శక్తిని అందించే ఉత్తేజపరిచేషధంగా భావిస్తారు. కాఫీలోని కెఫీన్ మన ఆహారనాళంలో త్వరగా జీర్ణమై కలసి΄ోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు వైద్య నిపుణులు కనుగొన్నారు. అయితే, గర్భిణులు కాఫీ తాగినప్పుడు వారిలో కెఫీన్ జీర్ణమవడానికి చాలా సమయం పడుతుంది. అంతకుమించి గర్భంపై కెఫీన్ వ్యతిరేక ఫలితాలు చూపడానికి ఇతమిత్ధంగా ఇప్పటికీ కారణాలు తెలియదు. అలాగే దీని ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండడమూ వైద్యనిపుణులు గమనించారు. మోతాదు మించక΄ోతే ముప్పు లేదు గర్భిణులు కాఫీ తాగొద్దా అంటే మాత్రం నిస్సందేహంగా తాగొచ్చంటున్నారు ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్ట్రెస్టీషియన్ ్స అండ్ గైనకాలజిస్ట్స్(ఏసీఓజీ) వైద్యులు. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ రోజువారీ కెఫెన్ పరిమాణం 200 మిల్లీగ్రాములకు మించకూడదని చెబుతున్నారు. ఆ స్థాయిని మించితే మాత్రం గర్భంలోని శిశువుపై దుష్పరిణామాలు చూపించే ప్రమాదముందంటున్నారు. సాధారణంగా కప్పు (240 ఎం.ఎల్) కాఫీలో 96 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. దీని ప్రకారం ఎక్కువ నివేదికలు చెప్పేదేంటంటే గర్భిణులు రోజుకు రెండు కప్పులకు మించి కాఫీ తాగకూడదు. -
కత్రీనా ప్రెగ్నెంటా? క్లారిటీ ఇచ్చిన ఆమె టీం!
Katrina Kaif Team Clarifies Her Pregnant Rumours: గతడాది హీరో విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న కత్రీనా కైఫ్ ప్రస్తుతం గర్భవతి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో కత్రీనా నడుచుకుంటూ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పింక్ కలర్ చుడిదార్‌లో దర్శనమించిన ఆమె కాస్తా బొద్దుగా, పొట్ట ముందుకు వచ్చినట్లు కనిపించింది. దీంతో అది చూసి అంతా ఆమో ప్రెగ్నెంట్ అయ్యింటుందని అనుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో కత్రీనా-వీక్కీలు త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పబోతున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చదవండి: ‘సర్కారు వారి పాట’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే.. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై తాజాగా కత్రీనా టీం స్పదించింది. ఈ సందర్భంగా కత్రీనా ప్రెగ్నెంట్? వార్తలను ఖండించింది. ప్రస్తుతానికి ఎలాంటి గుడ్‌న్యూస్ లేదని, కత్రీనా పూర్తిగా తన కెరీర్‌పై దృష్టి పెట్టిందని క్లారిటీ ఇచ్చారు. కాగా ప్రస్తుతం కత్రీనా-విక్కీలు అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ గ్లోబల్ స్టార్, హీరోయిన్ ప్రియాంక చోప్రా రెస్టారెంట్‌కు వెళ్లిన ఫొటోలను కత్రీనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చదవండి: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్ ఫిక్స్ కాగా గతేడాది డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో కత్రినా, విక్కీల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ ప్రస్తుతం గోవిందా నామ్ మేరా, లక్ష్మణ్ ఉటెకర్ దర్శకత్వంతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక కత్రీనా సల్మాన్ ఖాన్‌తో నటించిన టైగర్ 3తో పాటు విజయ్ సేతుపతితో ‘మేరీ క్రిస్టమస్’, ‘జీ లే జరా’ మూవీలతో బీజీగా ఉంది. -
బావ వరసయ్యే వ్యక్తితో ప్రేమ.. గర్భం దాల్చిన ఇంటర్ విద్యార్థిని
సాక్షి, శ్రీకాకుళం(ఎచ్చెర్ల క్యాంపస్): పొన్నాడ కేజీబీవీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చింది. ఈ విషయం బయట పడటంతో అధికారులు అవాక్కయ్యారు. విద్యార్థినిది ఎచ్చెర్ల మండలం పొన్నాడ సరిహద్దు ధర్మవరం గ్రామం. ఈమె గర్భిణి అనే విషయం గోప్యంగా పాఠశాల యాజమాన్యం ఉంచింది. అయితే ప్రిన్సిపాల్ శిరీషకు పడనివారు విద్యార్థిని గర్భం దాల్చిన విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను ప్రాధమికంగా విధుల నుంచి తొలగిస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై అధికారులు మంగళవారం పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. చదవండి: (విషాదం: అమ్మానాన్నల కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలకు..) ఈ మధ్య కరోనా సెలవుల్లో విద్యార్థిని ఇంటికి వెళ్లడంతోపాటు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన క్రీడా పోటీల్లో పాల్గొంది. ఆ సమయంలో విద్యార్థిని గ్రామానికి చెందిన బావ వరసయ్యే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. యువతిపై లైంగిక వేధింపుల విషయాన్ని రహస్యంగా ఉంచినప్పటికీ.. ఆమె గర్భిణిగా తేలడం పాఠశాల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాఠశాల వసతి గృహంలో వాంతులు చేసుకోగా సిబ్బంది గమనించి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి గర్భం దాల్చినట్టు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా ప్రిన్సిపాల్ జాప్యం చేసినప్పటికీ ఫిర్యాదు రూపంలో విషయం బయట పడింది. విద్యార్థిని తండ్రి మృతి చెందగా, తల్లి వలస కూలీగా పని చేస్తోంది. ఈ విషయాన్ని ఎచ్చెర్ల ఎస్సై రాము వద్ద ప్రస్తావించగా.. పోలీస్‌స్టేషన్‌కు ఎటువంటి ఫిర్యాదు రాలేదన్నారు. -
రెండున్నర నెలల వరకు గర్భవతిని అనే విషయం తెలియదు: నటి
ప్రముఖ బాలీవుడ్ హాస్య నటి భారతీ సింగ్ త్వరలో తల్లి కాబోతోంది. ఏప్రిల్‌లో తొలి బిడ్డకు జన్మినివ్వబోతోంది. ఈ క్రమంలో తన బేబీ బంప్ ఫొటోషూట్లను షేర్ చేస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపింది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న భారతీ తన ప్రగ్నెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దాదాపు రెండున్నర నెలల వరకు తాను గర్భవతిని అనే విషయం తెలియదని చెప్పి ఆశ్చర్యపరిచింది. చదవండి: ఫుడ్ డెలివరి బాయ్‌గా మారిన ప్రముఖ హాస్య నటుడు ‘నేను గర్భవతిని అని తెలియక సాధారణంగా ఎలా ఉంటానో అలా ఉన్నాను. రోజువారి కార్యకలాపాలను చేస్తూ షూటింగ్‌లకు హజరయ్యాను. రెండున్నర నెలలు పాటు నేను గర్భవతిని అనే విషయాన్నే గ్రహించలేకపోయాను. దీంతో రోజు ఏం తింటానే అదే ఆహారం తీసుకున్నాను, రన్నింగ్ చేశాను, షూటింగ్‌లకు వెళ్లాను. డాన్స్ దివానె షోలో డాన్స్ కూడా చేశాను. ఈ క్రమంలో ఓ రోజు నాకు అనుమానం వచ్చి పరీక్షించుకోగా పాజిటివ్ వచ్చింది. అప్పుడే నేను గర్భవతిని అని రియలైజ్ అయ్యా. ఇదే విషయాన్ని హర్ష్‌కు చెప్పగా.. చాలా సంతోషంగా పడ్డారు. అలా మా జీవితంలో అద్భుతం జరిగింది. త్వరలోనే మేము మా తొలి బిడ్డను ఆహ్వానించబోతున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: నిన్ను గర్వపడేలా చేస్తా నాన్న: సితార అదే విధంగా నార్మల్ డెలివరి కోసం తన డాక్టర్ల సలహా మేరకు రోజు యోగా, వ్యాయమాలు చేస్తున్నానని, అలాగే దాదాపు గంట పాటు వాకింగ్ చేస్తున్నట్లు భారతీ పేర్కొంది. కాగా భారతీ సింగ్ ప్రముఖ హాస్య నటుడు కపిల్ శర్మ కామెడీ షోతో పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఆమె పలు సినిమాలతో పాటు, టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. తన చిరకాల ప్రేమికుడు హర్ష్ లింబాచియాను డిసెంబర్ 3, 2017లో గోవాలో పెళ్లి చేసుకుంది భారతీ. View this post on Instagram A post shared by Bharti Singh (@bharti.laughterqueen) -
ఎవరిదీ పాపం..? ఏడాదిలో 15 మంది.. ప్రేమ పేరుతో కోరికలు తీర్చుకుని..
సాక్షి, వరంగల్: ‘పరకాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక హైదరాబాద్‌లో తల్లిదండ్రులతో కలిసి నివాసముంటోంది. అక్కడ పరిచయమైన ఓ వ్యక్తి ఆమెను మాటలతో లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత శారీరక సంబంధం ఏర్పర్చుకున్నాడు. ఈ విషయం ఆరు నెలలయ్యాక బాధితురాలి తల్లిదండ్రులకు తెలిసింది. అబార్షన్ చేయిద్దామంటే వీలు లేకపోవడంతో తొమ్మిది నెలలు చూసి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఇటీవల ప్రసవం చేయించారు. ఆ తర్వాత పాపను ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లారు’. ‘నెక్కొండ మండలంలోని ఓ తండాకు చెందిన 24 ఏళ్ల వివాహిత తొలి సంతానంలో బిడ్డకు జన్మనిచ్చింది. భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. అతడు కూడా ఆమెను నమ్మించి గర్భం చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. దీంతో ఆమె ఓ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపను చూడనని, తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఆమె వదిలించుకుంది’. ఇలా ఓ బాలిక, ఓ మహిళ తప్పుదారి పట్టడంతో వారికి పుట్టిన బిడ్డలు పేగుబంధానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషయం తెలిస్తే ఎవరూ పెళ్లి చేసుకోరని బాలిక, భర్త చనిపోయినా రెండో బిడ్డకు ఎలా జన్మనిచ్చిందని మరొకావిడ కన్న బిడ్డలను దూరం చేసుకున్నారు. వారికి జన్మించిన పసికూనలిద్దరూ ఇప్పుడు వరంగల్ జిల్లాలోని హనుమకొండ శిశు విహార్‌లో పెరుగుతున్నారు. ఆ పసిబిడ్డలిద్దరూ ఏ పాపం చేయకున్నా పేగుబంధానికి దూరం కావడం కన్నీళ్లు పెట్టిస్తోంది. వీరిద్దరే కాదు.. ఇలా వివాహం చేసుకోకుండా ఎనిమిది మందికి జన్మించిన పిల్లలు, వివాహేతర సంబంధం, ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం, మూడో కాన్పులోనూ ఆడపిల్ల తదితర కారణాలతో జన్మించిన మరో ఏడుగురు.. ఇలా మొత్తం 15 మంది పసికూనలు కన్నవారి ఆప్యాయతానురాగాలు లేక శిశు విహార్ పాలయ్యారు. చదవండి: (జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం.. ఫైళ్లు దగ్ధం) తప్పే శాపమాయె.. ఇటు పోలీసులు, అటు షీటీం బృందాలు ఎంత అవగాహన కలిగిస్తున్నా.. తెలిసీ తెలియని వయసులో అమ్మాయిలు దారి తప్పుతున్నారు. కుటుంబ పోషణకు తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు, ఇతర పనులకు వెళ్తుండటంతో వీరిపై పర్యవేక్షణ కరువవడం.. పిల్లలు ఏమి చేస్తున్నారనే విషయం కూడా వీరికి తెలియకపోవడంతో ఇటువంటి పరిణామాలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ఇటు మగ, అటు ఆడపిల్లలు ఎవరి దారుల్లో వారు వెళ్తున్నారు. ప్రేమ పేరుతో మైనర్లకు లొంగదీసుకుని లైంగిక దాడులకు పాల్పడుతుండటంతో చివరకు తల్లులవుతున్న ఘటనలు చూస్తున్నాం. తొలినాళ్లలో తెలిస్తే తల్లిదండ్రులు అబార్షన్ చేయించి పెళ్లిళ్లు చేసేస్తున్నారు. కాస్త ఆలస్యంగా తెలిస్తే డెలివరీ చేయించి ఆ ఆస్పత్రిలోనే పాపను వదిలేసి వెళ్తున్నారు. ఈ విషయం వైద్య సిబ్బంది ద్వారా జిల్లా బాలల సంరక్షణ విభాగాధికారులకు తెలియడంతో వారు బాలల సంరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పసికూనలకు శిశు విహార్‌కు తరలిస్తున్నారు. ఇలా శిశు విహార్‌లో ఉన్న పిల్లలను చట్టప్రకారంగా ముందుకొచ్చే దంపతులకు దత్తత ఇస్తున్నారు. ‘అసలు తల్లిదండ్రులెవరో తెలియకుండానే వారి జీవితం ముందుకెళ్తోంది. ప్రేమ పేరుతో శారీరక సంబంధాల వరకు వెళ్లొద్దు. వివాహేతర సంబంధాలు పెట్టుకోవద్దు. మీరు వేసే తప్పటడుగులు పిల్లలకు శాపంగా మారొద్దు. ఇప్పటికైనా సమాజంలోని ప్రతి ఒక్కరూ దీనిని గమనించాలి’ అని ఓ ప్రభుత్వ విభాగాధికారి అంటున్నారు. -
అషూరెడ్డి ప్రెగ్నెంటా?! షాక్‌లో ఫ్యాన్స్, ఇంతగా దిగజారిపోయావా!
జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన అషూ రెడ్డి బిగ్‌బాస్‌తో పాపులారిటి తెచ్చుకుంది. ఈ రియాలిటీ షోతో సెలబ్రిటీ హోదా తెచ్చుకున్న అషూ అప్పటి నుంచి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఈ మధ్యే రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్య్వూలో పాల్గొని బోల్డ్ బ్యూటీగా కూడా పేరు తెచ్చుకుంది. ఇక అందాల ఆరబోతతో తరచూ ఫొటోషూట్లకు ఫోజుల ఇచ్చి.. వాటిని తన ఇన్స్టాగ్రామ్ షేర్ చేస్తూ కుర్రకారు మతిపోగోట్టే ఈ భామకు సంబంధించిన ఓ సంచలన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్రేజ్ కోసం అషూ వీడియో చేసి తన యూట్యూబ్ చానల్లో షేర్ చేసింది. చదవండి: ఆ విషయంలో ఇంప్రెస్ అయిన బన్నీ, పుష్ప టీంకు స్పెషల్ గిఫ్ట్స్ దీంతో వ్యూస్ కోసం, క్రేజ్ కోసం ఇంతగా దిగజారిపోతావా? అంటూ నెటిజన్లు ఆమెను తిట్టి పోస్తున్నారు. ఇంతకి ఆ వీడియో ఏంటంటే.. అషూ తన తల్లిని ఫ్రాంక్ చేసేందుకు ఓ పిచ్చి ఐడియాతో వీడియో చేసింది. ఈ నేపథ్యంలో అషూ సోఫాలో కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఉంది. దీంతో ఆమె తల్లి కంగారుగా వచ్చి ఏమైందని ప్రశ్నించగా.. ‘‘నాకు పిరియడ్స్ రాలేదు మమ్మీ. టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ వచ్చింది’’ అంటూ ఓపెన్ అయింది. ఈ విషయాన్ని ముందు తల్లి నమ్మలేదు కాని అషూ అదే పనిగా ఏడుస్తూ ఉండడంతో నిజమే అనుకుంది. దీంతో కోపంతో రగిలిపోయిన ఆమె తల్లి అషుని కొట్టడమే కాకుండా కాలితో తన్నడం కూడా చేసింది. చదవండి: చిరు సినిమాలో రష్మీ స్పెషల్ సాంగ్‌కు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఆ తర్వాత అషూ తల్లి కాళ్లు పట్టుకుని నాన్నకు చెప్పొద్దమ్మా అని బ్రతిమిలాడుతూ తల్లిని మరింత ఆందోళనకు గురి చేసింది. ఇలా కాసేపటి వరకు తల్లిని భయపెట్టిన అషూ చివరకు ఇది ప్రాంక్ అంటూ అసలు విషయం చెప్పేసింది. ఇది నిజం కాదంటూ రూమ్‌లో పెట్టిన కెమెరాలను కూడా చూపించింది. దీంతో అషూ తల్లికి మరింత కోపం వచ్చింది. రెండు మొట్టికాయలు వేస్తూ.. ‘హార్ట్ ఎటాక్ తెప్పించినంత పని చేశావు’ అంటూ సీరియస్‌గా వెళ్లిపోయింది ఆమె. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. -
ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ విషయంపై స్పందించిన కాజల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ వివాహం జరిగి ఏడాది పూర్తయింది. తన చిరకాల మిత్రుడు, ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను గతేడాది అక్టోబర్ 30న కాజల్ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం కాజల్ సినిమా షూటింగ్స్‌తో బిజీ అయిపోయింది. ఈ క్రమంలో తనకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త కొత్తకాలంగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాజల్ గర్భం దాల్చిందని, త్వరలోనే ఆమె సినిమాలకు బ్రేక్ చెప్పనుందంటూ కథనాలు వెలువడ్డాయి. చదవండి: విడాకులపై పూనమ్ సంచలన వ్యాఖ్యలు, కాసేపటికే ట్వీట్ డిలీట్ అయితే ఇప్పటికీ ఈ వార్తలపై ఆమె స్పందించకపోవడం అదే నిజం అనుకుంటున్నారంతా. ఈ నేపథ్యంలో తాజాగా కాజల్ తన ప్రెగ్నెంట్ విషయంపై స్పందించింది. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనపై వస్తున్న వార్తలకు స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు కాజల్ మాట్లాడుతూ.. ‘నా ప్రెగ్నెన్సీ విషయంపై ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. సమయం వచ్చినప్పుడు క్లారిటీ ఇస్తా. మాతృత్వం అనేది ఓ అద్భుతమైన అనుభూతి. నా చెల్లెలు(నిషా అగర్వాల్) తల్లి కాబోతున్నప్పుడు తను ఎలాంటి ఫీలింగ్స్ ఫేస్ చేసింది.. ఇప్పుడు తల్లి అయ్యాక ఎలా ఫీల్ అవుతుందో దగ్గరుండి గమనించాను’ అని పేర్కొంది. చదవండి: ప్రభాస్ గురించి ట్వీట్ చేసిన సన్నీ సింగ్, ‘డార్లింగ్’ ఫ్యాన్స్ ఫైర్ ఇక ‘నిషా కుమారుడు ఇషాన్‌తో ఎక్కువ సమయం గడుపుతుంటా. అప్పుడు నేను తనకి తల్లిని అనే భావనతో గడుపుతాను. నా విషయానికి వచ్చేసరికి భిన్నమైన భావన కలుగుతోంది. ఒక్కోసారి తల్లి అవ్వాలనే భావనే నాలో భయాన్ని కలిగిస్తోంది. కానీ నాకంటూ ఓ బిడ్డ ఉంటే జీవితం ఎంతో అందంగా మారిపోతుందని అనుకుంటున్నాను’ అంటూ కాజల్ చెప్పుకొచ్చింది. ఆమె మాటలు విన్న ఫ్యాన్స్ అంతా త్వరలోనే కాజల్ శుభావార్త చెప్పనుందా? అంటూ అభిప్రాయ పడుతున్నారు. ఇక ఆమె సినిమాల విషయానికోస్తే.. ఇటీవల ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న కాజల్ ప్రస్తుతం ఉమ అనే సినిమా చేస్తోంది. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం
-
గర్భిణి మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
సాక్షి, నర్సంపేట (వరంగల్): వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఏడు నెలల గర్భిణి లావణ్య(24) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. దీంతో ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళనకు దిగారు. దుగ్గొండి మండలం మదిర గ్రామానికి చెందిన పెరుమాండ్ల మల్లారెడ్డి– నీలమ్మ దంపతుల కుమార్తె లావణ్యను నెక్కొండ మండలానికి చెందిన అనుముల నర్సింహారెడ్డి– రేణుక దంపతుల కుమారుడు రాకేష్‌రెడ్డికి ఇచ్చి సంవత్సరం క్రితం వివాహం జరిపించారు. కొద్ది రోజుల తర్వాత భార్యాభర్తలు హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ క్రమంలో లావణ్య గర్భం దాల్చడంతో పుట్టింటికి వచ్చి ఉంటుంది. శనివారం సాయంత్రం ఆమెకు నొప్పులు రాగా, నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రాత్రి నొప్పులు ఎక్కువ కావడంతో ఆస్పత్రి సిబ్బంది ఇంజక్షన్ వేయడంతో తగ్గాయి. తిరిగి ఆదివారం ఉదయం నొప్పులు ఎక్కువ కావడంతో మళ్లీ ఇంజక్షన్ వేయగా, కొద్ది సేపటికే లావణ్య మృతి చెందినట్లు ఆమె అత్త రేణుక తెలిపారు. దీంతో ఆగ్రహించిన మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. చదవండి: పెట్రోల్ బంకులో పనిచేసే యువతి.. మైనర్ బాలుడిని ట్రాప్ చేసి.. -
12 ఏళ్ల బాలికకు మాయమాటలు .. 7 నెలల గర్భవతి
సాక్షి, సత్తుపల్లిరూరల్: మండలంలోని ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన అదే గ్రామానికి చెందిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సత్తుపల్లి సీఐ రమాకాంత్ శుక్రవారం తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. బాలిక ఏడు నెలల గర్భిణి అని తెలియడంతో సీఐ ప్రత్యేక చొరవతో వైద్య పరీక్షలు చేయించి ఆమెకు మూడు నెలలకు సరిపడా నిత్యావసరాలు, దుస్తులు, డ్రైఫ్రూట్స్ అందించారు. -
ఏడు నెలల గర్భం దాల్చిన బాలిక.. ఆలస్యంగా వెలుగులోకి !
సాక్షి, నవీపేట : ఓ బాలిక(16) ఏడు నెలల గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఎల్‌కె ఫారమ్ గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చిన సదరు బాలికను అంగన్వాడీ టీచర్ అనుమానంతో పరీక్షించగా ఈ విషయం బయటకు వచ్చింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ పాఠశాలలో ఆ బాలిక చదువుతోంది. ఆమె తల్లి గతంలోనే మృతి చెందింది. తండ్రి ఉపాధి కోసం మండలంలోని ఎల్‌కె ఫారమ్ గ్రామానికి వచ్చి పాలేరుగా పని చేస్తున్నాడు. నాలుగు నెలల కిందట తండ్రి దగ్గరకు వచ్చిన బాలిక ఇక్కడే ఉంటుంది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి సైతం మృతి చెందగా.. బంధువుల ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలో బాలికను గమనించిన అంగన్వాడీ టీచర్ అనుమానం వచ్చి పరీక్షించగా ఏడు నెలల గర్భం దాల్చినట్లు తేలింది. ఎల్లారెడ్డిలో ఉండగానే ఈ ఘోరం జరిగినట్లు, కారకుడు ఎల్లారెడ్డి వాసిగా అనుమానిస్తున్నారు. సఖి కేంద్రం నిర్వాహకులు బాలికను తమ వెంట తీసుకెళ్లారు. ఈ విషయమై ఎస్సై యాకుబ్‌ను వివరణ కోరగా సంఘటన ఎల్లారెడ్డిలో జరిగిందని, తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. -
గర్భవతితో సహజీవనం.. దారుణ హత్య
గాంధీనగర్ : అక్రమ సంబంధం ఓ నిండు గర్భిణీ ప్రాణాన్ని బలితీసుకుంది. భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళను అండగా ఉంటానని లొంగదీసుకుని చివరకు అతి దారుణంగా కడతేర్చాడు. నమ్మి వచ్చినందుకు ఐదు నెలల గర్భవతిని హత్యచేశాడు. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని బర్దోలీలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్దోలీకి చెందిన స్థానిక మహిళ రష్మీ కటారియా గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె గర్భవతి, మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఒంటరిగా ఉంటున్న రష్మీపై ఆమె ఇంటి సమీపంలోనే ఉండే చిరాగ్ పటేల్ కన్నేశాడు. భర్తకు దూరంగా ఉంటోందని తెలుసుకుని కష్ట సమయంలో అండగా ఉంటానని మాటిచ్చాడు. నమ్మిన రష్మీ అతనితో ప్రయాణం సాగించింది. ఈ క్రమంలోనే గత ఆదివారం రాత్రి మూడేళ్ల కుమారుడిని తన తల్లి ఇంటి వద్ద ఉంచి వెళ్లిపోయింది. అలా వెళ్లిన రష్మీ సోమవారం వరకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో.. చిరాగ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. తన కుమార్తె అతనితో గతకొంత కాలంగా సహజీవనం చేస్తోందని, రష్మీ అతని వద్ద ఉండే అవకాశం ఉందని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. వారి ఫిర్యాదు మేరకు స్పందిచిన అధికారులు.. చిరాగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించగా.. సంచలన విషయాలను వెల్లడించారు. రష్మీని హత్య చేసి జేసీబీ సహాయంతో తన తండ్రి ఫాంహౌస్‌లో పూడ్చివేశానని చెప్పాడు. ఇద్దరి మధ్య విభేదాల కారణంగానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే చిరాగ్ భార్యపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆమె రష్మీపై దాడికి పాల్పడ్డారని, ఈ హత్యలో ఆమె పాత్ర కూడా ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఘటనాస్థలిలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. పోస్ట్‌మార్టం నిమిత్తం సమీపంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మరో పరువు హత్య కలకలం!
లక్నో : హత్రాస్ జిల్లాలో దళిత యువతి హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. గర్భవతి అయిన 16 ఏళ్ల దళిత బాలిక పరువు హత్య కలకలం రేపింది. షహజన్‌పూర్ జిల్లాలో బాలికను స్వయంగా ఆమె తండ్రి, సోదరుడు కిరాతకంగా హత్య చేశారు. బాలిక తీరుతో కుటుంబం పరువు మంటగలిసిందనే ఆక్రోశంతో ఆమెను తండ్రి, సోదరుడు దారుణంగా కొట్టి చంపారు. సెప్టెంబర్ 23న బాలిక అదృశ్యం కాగా, మంగళవారం ఆమె మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబ సభ్యులు ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. బాలికను తీవ్రంగా హింసించి గొంతు కోసి చంపినట్టు నివేదికలు వెల్లడించాయి. ఆపై బాలిక తలను శరీరం నుంచి వేరుచేసి నది ఒడ్డున ఖననం చేశారని పోలీసులు వెల్లడించారు. కాగా దళిత బాలిక తండ్రి నేరాన్ని అంగీకరించగా సోదరుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. బాలిక గర్భం దాల్చడంతో ప్రజలు తనను అవమానిస్తున్నారని, ఈ ఆక్రోశంతోనే కన్నబిడ్డను చంపుకున్నానని తండ్రి తన నేరాన్ని అంగీకరించాడు. హత్యలో పాలుపంచుకున్న బాలిక సోదరుడు పరారీలో ఉన్నాడని ఇద్దరిపై హత్యా నేరం మోపి దర్యాప్తు చేపట్టామని షహజన్‌పూర్ ఎస్ఎస్పీ ఎస్.ఆనంద్ వెల్లడించారు. బాలిక హత్యలో తల్లి, ఇతర బంధువులనూ ప్రశ్నించామని ఈ ఘటనలో వారి ప్రమేయం నిర్ధారణ కాలేదని చెప్పారు. బాలిక ఎన్నడూ స్కూలుకు వెళ్లలేదని, ఓ బంధువు వద్ద ఉండేదని కుటుంబ సభ్యలు తెలిపారని పోలీసులు చెప్పారు. మైనర్ బాలికతో లైంగిక సంబంధాలు నేరమని దీనికి కారకులెవరైనా విడిచిపెట్టమని పోలీసులు పేర్కొన్నారు. చదవండి : హథ్రాస్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు -
నా ప్రేయసి ప్రెగ్నెంట్ : హర్దిక్
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా అభిమానులకు శుభవార్తను తెలిపాడు. తన ప్రేయసి నటాషా స్టాన్కోవిచ్ ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ మేరకు నటాషాతో దిగిన తాజా ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆదివారం సాయంత్రం పోస్ట్ చేశాడు. తనతో జీవన ప్రయాణంలో కొత్త అనుభూతిని పొందున్నా అని, ఈ సంతోషకరమైన వార్తను పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. కాగా ముంబైలో స్థిరపడ్డ సెర్బియా నటి, మోడల్ నటాషా స్టాన్కోవిచ్ను హార్దిక్ వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో వీరిద్దరు తమ నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోనున్నారు. ఇక హర్దిక్ పోస్ట్‌కు స్పందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రీతో పలువురు క్రికెటర్లు వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. -
తొమ్మది నెలల గర్భిణీకి కరోనా
సాక్షి, న్యూఢిల్లీ : మహ్మమారి కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదడంలేదు. చిన్న పిల్లల నుంచి వందేళ్ల వృద్ధులనూ మృత్యు ఒడిలోకి చేర్చుకుంటోంది. అయితే కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు కూడా వైరస్ సోకడం దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఓ వైద్యుడుతో పాటు తొమ్మిది నెలల గర్భవతి అయిన తన భార్యకూ వైరస్ సోకింది. తొలుత వైద్యుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ముందస్తు జాగ్రత్తగా ఆయన భార్యకు వైద్యు పరీక్షలు నిర్వహించారు. దీంతో తొమ్మిది నెలల గర్భవతి అయిన ఆమెకు కూడా పాజిటివ్ అని తేలడంతో వైద్యులు అప్రమత్తం అయ్యారు. (500 కిమీ నడక.. హైదరాబాద్‌లో మృతి) ఆమెకు డెలివరీ సమయం దగ్గర పడుతుండంతో ఎయిమ్స్‌లోని ప్రత్యేక వార్డుకు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రాణానికి ఎలాంటి ముప్పులేదని వైద్యులు తెలిపారు. కాగా ఢిల్లీలో ఇప్పటికే ఆరుగురు వైద్యులకు కరోనా పాజిటివ్‌ను అని తేలిన విషయం తెలిసిందే. దీంతో వారందరినీ ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం నాటికి కరోనా బాధితుల సంఖ్య రెండువేలకు దాటింది. మృతుల సంఖ్య 72 దాటింది. (ప్రధాని మోదీ వీడియో సందేశం) -
తుపాకీ చేతపట్టిన 8 నెలల గర్భవతి
రాయ్‌పూర్ : నక్సల్ ఏరివేతలో భాగంగా ఎనిమిది నెలల గర్భవతి విధులు నిర్వర్తిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. నక్సల్ కార్యక్రమాలను అరికట్టడంలో భాగంగా చత్తీస్‌గఢ్ ప్రభుత్వం నక్సల్ ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా ఎనిమిది నెలల గర్భంతో ఉన్న సునైనా పటేల్ అనే మహిళా కమాండర్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటోంది. నక్సల్స్‌లో పోరు అంటేనే ఎంతో ప్రమాదకరమైనది అయినా ఏమాత్ర భయం లేకుండా దట్టమైన అడవిలో బంధుకు చేతబూని దూసుకుపోతోంది. దీనిపై సునైనా మాట్లాడుతూ.. తాను విధుల్లో చేరినప్పుడు రెండు నెలల గర్భవతి అని చెప్పారు. తాను పరిస్థితుల్లో ఉన్నా.. తనకు అప్పగించిన విధిని నిర్వర్తించడమే దన అంతిమ లక్ష్యమన్నారు. ప్రమాదకరమైన ఈ వృత్తిలో కొనసాగడానికి తనకు ఏమాత్రం భయం లేదన్నారు. కాగా విధిపై తనకున్న అంకితభావానికి పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఆమె దంతెవాడ జిల్లా రిజర్వ్ గార్డుగా విధుల్లో ఉన్నారు. -
గర్భం దాల్చిన ఆశ్రమ పాఠశాల బాలిక
జి.మాడుగుల (పాడేరు): ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో చదువుతున్న మైనార్టీ తెగకు చెందిన బాలిక గర్భం దాల్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం నుర్మతి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బీసీ (మైనార్టీ) విద్యార్థిని గర్భం దాల్చినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. నుర్మతిలో పాఠశాల లేక పోవడంతో ఆ బాలికకు గ్రామస్తుల వినతి మేరకు ఆశ్రమ పాఠశాలలో గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు ప్రవేశం కల్పించారు. ఆశ్రమ పాఠశాలకు దగ్గరలో ఇంటి నుంచి పాఠశాలకు రాకపోకలు సాగిస్తూ చదువుతోంది. బాలికకు మలేరియా, టైఫాయిడ్ జ్వరం రావటంతో మందులు వాడేందుకు రోజూ ఇంటి నుంచి పాఠశాలకు రాకపోకలు సాగించడానికి ఆగస్టు 18న తల్లి అనుమతిపత్రం అందించటంతో ఒప్పుకున్నట్టు హెచ్ఎం సింహాచలం తెలిపారు. పాఠశాలకు చదువు నిమిత్తం వస్తున్న బాలిక శరీర ఆకృతిలో తేడా గమనించి పీహెచ్సీలో వైద్య పరీక్షలు చేయంచడంతో గర్భం దాల్చినట్టు నిర్ధారణ అయ్యిందని పాఠశాల ఏఎన్ఎం చెప్పారు. బాలిక తల్లిదండ్రులను పాఠశాలకు రప్పించి విషయాన్ని తెలియజేయడంతో బాలికను నిలదీయగా అదే గ్రామానికి చెందిన గిరిజన యువకుడితో ప్రేమలో పడినట్టు, అది శారీరక సంబంధానికి దారితీసినట్టు తేలిందని హెచ్ఎం తెలిపారు. మహిళా కమిషన్ సభ్యురాలి విచారణ పాఠశాలను మాజీ మంత్రి, మహిళా కమిషన్ సభ్యురాలు మత్స్యరాస మణికుమారి సందర్శించారు. హెచ్ఎం సింహాచలం, డిప్యూటీ వార్డెన్ రాజేశ్వరిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినికి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆమె చెప్పారు. బాలిక గర్భం దాల్చిన ఘటనపై సోమవారం పాడేరు గిరిజన సంక్షేమ డీడీ విజయ్‌కుమార్ విచారణ చేపట్టారు. నుర్మతి ఆశ్రమోన్నత పాఠశాలలో విచారణ చేస్తున్న పాడేరు డీడీ విజయ్‌కుమార్ -
డోలీపై నిండు గర్భిణి తరలింపు
విశాఖపట్నం, పాడేరు రూరల్: గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విశాఖ ఏజెన్సీలో మారుమూల గ్రామాలకు రోడ్డు, రవాణా సౌకర్యాలు మృగ్యంగా మారాయి. దీంతో గిరిజనుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గర్భిణులు ప్రసవం కోసం, రోగులు చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించాలంటే డోలీ మోతలు తప్పడం లేదు. తాజాగా పాడేరు మండలం మారుమూల బడిమెల పంచాయతీ వల్లాయి గ్రామంలో ఓ గర్భిణిని కాన్పు కోసం ఆస్పత్రికి డోలీపై తరలించిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వల్లాయి గ్రామానికి చెందిన సోమెలి సూర్యకుమారి అనే గిరిజన మహిళ తొమ్మిది నెలల గర్భిణి. బుధవారం ఉదయం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలించడం అనివార్యమైంది. గ్రామానికి అంబులెన్స్ వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేదు. చేసేది లేక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ఆశ కార్యకర్త, ఏఎన్ఎం పద్మ సహకారంతో డోలీపై మోస్తూ అడవి మార్గం గుండా సుమారు 7 కిలోమీటర్ల మేర ఉన్న బడిమెల వరకు తీసుకొ చ్చారు. అక్కడి నుంచి మినుములూరు పీహెచ్సీ వైద్యాధికారి ప్రవీణ్ కుమార్, అంబులెన్స్ పైలెట్ బి.కొండబాబు సూర్యకుమారిని అంబులెన్స్‌లో మినుములూరు పీహెచ్‌సీకి తరలించి వైద్య సేవలు అందించారు. దీంతో ఆమెకు ప్రాణపాయం తప్పింది. బుధవారం సాయంత్రం ఆమె మినుములూరు పీహెచ్సీలో పండంటి ఆడ శిశువును ప్రసవించింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.