
‘‘బాగా నిద్రపోవాలని ఫిక్స్ అయినప్పుడు కడుపులో ఉన్న బిడ్డ డ్యాన్స్ పార్టీ పెట్టుకోవాలని ఫిక్స్ అయితే.. ఇక నిద్ర ఎలా పోతాం’’ అంటూ చిరనవ్వులు చిందిస్తూ తన ప్రెగ్నెన్సీ తాలూకు ఆనందాన్ని ఇటీవల ఇలియానా పంచుకున్న విషయం తెలిసిందే. ‘‘నేను తల్లిని కాబోతున్నా’’ అని ఇలియానా ప్రకటించినప్పటి నుంచి తండ్రి వివరాలు తెలుసుకోవాలని చాలామంది ఆసక్తిగా ఉన్నారు.
ఆ మధ్య ఓ వ్యక్తి ముఖాన్ని బ్లర్ చేసి, ఇలియానా ఆ ఫొటోను షేర్ చేశారు. సోమవారం స్పష్టంగా ఉన్న ఫొటోను షేర్ చేసి, ‘డేట్ నైట్’ అంటూ ఆ వ్యక్తితో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే అతని పేరు, ఇతర వివరాలేమీ ఇలియానా బయటపెట్టలేదు. ‘డేట్ నైట్’ అన్నారు కాబట్టి అతను ఇలియానా బాయ్‌ఫ్రెండ్ అని స్పష్టమవుతోంది. మరి.. రహస్య వివాహం ఏమైనా చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment