ఏప్రిల్‌లో గ్రాండ్‌గా ‘గద్దర్‌’ అవార్డులు.. దిల్‌ రాజు కీలక వ్యాఖ్యలు | Dil Raju Talk About Gaddar Awards | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌లో ‘గద్దర్‌’ అవార్డులు.. వివాదం చేయ్యొద్దు : దిల్‌ రాజు

Published Wed, Mar 12 2025 4:47 PM | Last Updated on Wed, Mar 12 2025 4:54 PM

Dil Raju Talk About Gaddar Awards

గద్దర్‌ తెలంగాణ చలనచిత్ర అవార్డులను ఏప్రిల్‌లో ఇవ్వబోతున్నట్లు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు(Dil Raju) తెలిపారు. 2014 నుంచి 2023 వరకు ఏడాదికో సినిమా చొప్పున గద్దర్‌ అవార్డు( Gaddar Awards)ను ప్రకటిస్తామని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గద్దర్ అవార్డ్స్ కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది . తెలంగాణ ఏర్పాటు  అయిన తరువాత 2014 నుంచి ప్రతి సంవత్సరం బెస్ట్ ఫిల్మ్ అవార్డు 2023 వరకు ఇవ్వనున్నాం.

నంది అవార్డ్స్ కు ఏ గైడ్ లైన్స్ ఉన్నాయో  అలాగే చిన్న చిన్న మార్పులతో గద్దర్ అవార్డ్స్ కూడా అలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి. వారం రోజుల్లో అవార్డులను జ్యూరీ ఫైనల్‌ చేస్తుంది. గద్దర్‌ అవార్డు నమునా కూడా సిద్ధం అవుతోంది. ఏప్రిల్‌లో అంగరంగ వైభవంగా సినిమా అవార్డుల వేడుక నిర్వహిస్తాం. సినిమా అవార్డుల అంశాన్ని వివాదం చేయొద్దని కోరుతున్నాను. గతంలో సింహా అవార్డుల కోసం అమౌంట్‌ పే చేసిన వారికి ఎఫ్‌డీసీ నుంచి తిరిగి చెల్లింపులు అవుతాయి. పైడి జయరాజ్‌, కాంతారావు పేర్లతో కూడా గౌరవ అవార్డులు ఇస్తాం’ అని దిల్‌ రాజు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement