
బాలీవుడ్ భామ, లైగర్ బ్యూటీ అనన్య పాండే చివరిసారిగా ఖో గయే హమ్ కహాన్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ తన తొలి వెబ్ సిరీస్ కాల్ మీ బేలో కనిపించనుంది. తాజాగా అనన్య ముంబయిలో జరిగిన అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లిలో సందడి చేసింది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకల్లో అనంత్ బారాత్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ కనిపించింది.
అయితే గతంలో హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్ కొనసాగించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ముద్దుగమ్మ ఆదిత్య రాయ్ కపూర్‌తో మార్చి 2024లో బ్రేకప్ చేసుకుంది. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. ఇద్దరు కూడా ఈ విషయంపై ఎక్కడా మాట్లాడలేదు. కానీ మార్చి నుంచి ఈ జంట దూరంగానే ఉంటున్నారు.
తాజాగా అనంత్ అంబానీ పెళ్లిలో మరొకరితో అనన్యపాండే కనిపించింది. దీంతో అందరిదృష్టి అతనిపైనే పడింది. ఎవరా మిస్టరీ మ్యాన్? అంటూ తెగ ఆరా తీస్తున్నారు నెటిజన్స్. తీరా చూస్తే అతని పేరు వాకర్ బ్లాంకో అని.. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఒకరినొకరు ఫాలో అవుతున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. దీంతో అనన్య అతనితో డేటింగ్‌లో ఉందా? అంటూ ఫ్యాన్స్ డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment